చర్మ ముడుతలను తొలగించే ఆసక్తికర విషయాలు

0

అందమైన మరియు స్పస్టమైన చర్మంపై ముడతలు రావటం ప్రారంభం అవగానే దగ్గరలో ఉండే కాస్మెటిక్ షాపుకు వెళ్లి ఖరీదైన మందులను కొనుగోలు చేస్తారు లేదా ఈ ముడుతలను తొలగించుకోవటానికి శక్తివంతమైన ఔషదాలను వాడటం ప్రారంభిస్తారు. కానీ, మేమిక్కడ తెలిపిన ఆసక్తికర మార్గాలను అనుసరించటం ద్వారా మీ డబ్బును ఆదాచేసుకోవచ్చు. వయసు మీరుతున్న కోసది చర్మంపై ముడతలు ఏర్పడటం చాలా సాధారణం. ఇక్కడ తెలిపిన పద్దతుల ద్వారా వీటిని ఆలస్య పరుచుకోవచ్చు.

సూర్యకాంతికి దూరంగా ఉండండి
మీ చర్మ ముఖంపై ముడతలు కలగటానికి గల ముఖ్య కారణం- సూర్యుడు. కావున సూర్యకాంతికి బహిర్గతం అవకుండా జాగ్రత్త పడండి. అనేక అధ్యయనాలు ఇది నిజమని నిరూపించాయి. వంశపారంపర్యంగా సంభవించే దాని కన్నా, సూర్యకాంతి వలన ఈ సమస్యలు అధికమని న్యూయార్క్ లో ఉండే ప్లాస్టిక్ సర్జన్ “డారిక్ అంటేల్” తెలిపారు.

గుడ్డు తెల్లసొన
ఇది వినటానికి ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ, ఇది ముడుతలను తోలగించుటలో సహాయపడుతుంది. జాగ్రత్తగా గుడ్డు యొక్క తెల్లసొనను పచ్చ సొన కలవకుండా వేరు చేయండి. ఈ తెల్లసొనను తీసుకొని చర్మంపై మసాజ్ చేసి, 15 నిమిషాల వరకు వేచి ఉండండి. ఎండిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేయండి. ఇలా గుడ్డు నుండి చర్మానికి లభించే సహజ విటమిన్ ‘B’ మరియు విటమిన్ ‘E’ చర్మాన్ని చైతన్యపరచి, ముడుతలను తొలగిస్తుంది.

నిమ్మరసం
చర్మంపై కలిగే ముడుతలను తొలగించుటకు అందుబాటులో ఉన్న మరొక ఔషదం- నిమ్మరసం. కత్తిరించిన నిమ్మకాయ ముక్కలో ఒక ముక్కను తీసుకొని, ముడుతలు పడ్డ ప్రాంతంలో మసాజ్ చేయండి. నిమ్మ ఆమ్ల గుణాలను ఎక్కువగా కలిగి ఉండటం వలన ముడుతలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

సరైన సమయం పాటూ నిద్ర
ముడుతలు లేని చర్మం కోసం సరైన సమయం పాటూ నిద్ర అవసరం. కావున ప్రతి ఒక్కరు కనీసం రోజులో 8 గంటల పాటూ తప్పక పడుకోవాలి. నిద్రలేమి సమస్యల వలన శరీరంలో ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది, ఫలితంగా ఇన్ఫ్లమేషన్ మరియు ఆక్సిడేషన్ వలన చర్మంపై ముడుతలు ఏర్పడతాయి. అంతేకాకుండా, మీరు పడుకునే భంగిమ కూడా చర్మంపై ముడుతలు ఏర్పడటాన్ని ప్రభావిత పరుస్తుంది. పొట్ట భూమికి తగిలే విధంగా పడుకోవటం వలన ముఖం కూడా దిండుకు తగులుతుంది. దీని వలన చర్మంపై నుదుటిపై ముడతలు మరియు చెంపలపై ముడుతలు ఏర్పడవచ్చు. కావున సరైన భంగిమలో పడుకోవటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

పండ్లు మరియు కూరగాయలు
పండ్లు, కూరగాయలు ఆరోగ్య సమస్యలను మరియు వ్యాధులను తగ్గించటమేకాకుండా, చర్మ ముడుతలను కూడా తొలగిస్తాయి. తాజా పండ్లు మరియు కూరగాయలు విటమిన్ ‘A’ మరియు ‘D’లను కలిగి ఉండి, చర్మాన్ని బొద్దుగా కనపడేలా చేయటమే కాకుండా, మెరిసేలా చేస్తుంది. ఇంట్లో లేదా భయట లభించే కూరగాయల లేదా పండ్ల రసాన్ని కూడా తాగవచ్చు. ఒకవేళ ఎవైన సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుడిని కలవండి.
Please Read Disclaimer