ఈ పద్ధతులను పాటిస్తే గర్భంరాకుండా నిరోధించొచ్చు

0

ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవంగా జరుపబడుతుంది. 2007 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, యువతలో జనన నియంత్రణలలో విభిన్న పద్ధతుల గురించిన అవగాహన పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. కేవలం ప్రపంచ జనాభాని దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా, పరిస్థితుల కారణంగా పిల్లలు తాత్కాలికంగా వద్దు అనుకునే వారిని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ రోజును ప్రారంభించడం జరిగింది.

ఈ సంవత్సరం ప్రపంచ గర్భ నిరోధక దినం యుక్క నినాదం (థీమ్) “ఇది మీ జీవితం, ఇది మీ బాధ్యత”. హిందూస్తాన్ టైమ్స్ గణాంకాల నివేదిక ప్రకారం, భారతదేశంలో 47.8% మంది మహిళలు గర్భ నిరోధక పద్దతులను వినియోగిస్తున్నారని వెల్లడించింది. కానీ వారికి పూర్తి స్థాయిలో ఇతర గర్భ నిరోధక పద్దతుల గురించిన వివరాలు తెలియవని, మరియు అనేకమందికి ఉత్తమమైన గర్భ నిరోధక పద్దతుల గురించిన అవగాహన లేదని కూడా చెప్పడం జరిగింది.

మీ ప్రాధాన్యత మరియు ఆరోగ్య స్థితిని అనుసరించి మాత్రమే గర్భనిరోధక పద్ధతులు ఎంపిక చేయబడతాయి. వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఈ జనన నియంత్రణ పద్దతులు మారుతూ ఉంటాయి. ఈ వ్యాసంలో, వివిధ రకాలైన తాత్కాలిక జనన నియంత్రణ పద్ధతుల గురించిన పూర్తి వివరాలను పొందుపరచడం జరిగింది. మరియు ఇవి మహిళలకు ఏవిధమైన ఫలితాలను ఇస్తాయో కూడా చర్చించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు వ్యాసం చూడండి. ఇక్కడ వివిధ రకాల జనన నియంత్రణ పద్ధతులు ఉన్నాయి:

1. కండోమ్ : నిజానికి వాడకం తెలిస్తే దీనంత ఉత్తమమైన పద్దతి లేదు అని చెప్పవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాల జోలికి వెళ్ళని ఆరోగ్యకర మార్గంగా సూచించబడుతుంది. కండోమ్ గర్భధారణను నివారించడానికి వినియోగించే సాధారణమైన పద్ధతిగా ఉండడమే కాకుండా, జంటను లైంగిక సంక్రమణ వ్యాధులు(STDs) మరియు ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది మరియు సురక్షితమైన లైంగిక సంభోగాన్ని ప్రోత్సహిస్తుంది. కండోమ్ వాడకం, మహిళల యోనిలోకి వీర్య కణాలను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. క్రమంగా గర్భం రాకుండా అడ్డుకోగలుగుతుంది. ఏదిఏమైనా మిగిలిన అన్ని పద్దతుల కన్నా కండోం వాడకం శ్రేయస్కరం అని వైద్యులు సైతం సూచిస్తుంటారు.

2. గర్భ నిరోధక మాత్రలు : నిజానికి ఈ గర్భ నిరోధక మాత్రలు, అండోత్సర్గ ప్రక్రియను ఆపి గర్భం రాకుండా నిరోధించగలుగుతాయి. ఈ మాత్రలు గర్భాశయంలో, గర్భవతికి సమానమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అనగా స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు అండం విడుదల కాని విధంగా. ఇటువంటి వాతావరణాన్ని గర్భాశయంలో సృష్టించడం ద్వారా, గర్భనిరోధక మాత్రలు గర్భం నివారించడంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి. గర్భనిరోధక మాత్రల వాడకం అనేకరకాల దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. కావున వైద్యుని సూచనలు అవసరమని మరువకండి. మరియు దీర్ఘకాలికంగా వాడడం అనేక ఇతర తీవ్ర దుష్పరిమాణాలకు దారితీస్తుంది.

గర్భాశయంలో సృష్టించడం ద్వారా, గర్భనిరోధక మాత్రలు గర్భం నివారించడంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి. గర్భనిరోధక మాత్రల వాడకం అనేకరకాల దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. కావున వైద్యుని సూచనలు అవసరమని మరువకండి. మరియు దీర్ఘకాలికంగా వాడడం అనేక ఇతర తీవ్ర దుష్పరిమాణాలకు దారితీస్తుంది. ఈ దుష్ప్రభావాలలో కొన్ని, వికారం, తలనొప్పి, కడుపు ఉబ్బరం, తీవ్ర రక్తస్రావం, రొమ్ముల సున్నితత్వం, శరీరంలో నీరు చేరడం మొదలైనవిగా ఉంటాయి. ఈ మాత్రలు మహిళల హార్మోన్లను సైతం ప్రభావితం చేస్తాయి, మరియు హార్మోనుల అసమతుల్యానికి దారితీస్తుంది. కావున వారు తీసుకునే మందులు శరీరతత్వం మీద ఆధారపడి వైద్యులు ధృవీకరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

3. గర్భ నిరోధక ఇంజెక్షన్ : ఇది మరొక ఉత్తమ గర్భ నిరోధక పద్ధతిగా చెప్పబడుతుంది. గర్భం నిరోధించడానికి హార్మోన్ షాట్లను మహిళలకు ఇస్తారు. గర్భ నిరోధక పద్దతులలో మాత్రల కన్నా, తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ షాట్స్ ప్రోజెస్టోజెన్ అని పిలువబడే హార్మోన్ను కలిగి ఉంటాయి. ఈ సూది మందులు ఎటువంటి ఈస్ట్రోజెన్ హార్మోనులను కలిగి లేనందున, మహిళలు ఎదుర్కొనే దుష్ప్రభావాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఇది వరకే హార్మోన్ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న వారు మాత్రం వైద్యుని సూచనల ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది.

4. అంతర్గత గర్భాశయ పరికరాలు (IUD) : గర్భనిరోధక మాత్రలు మరియు ఇంజెక్షన్ రూపంలో కాకుండా, ఈ అంతర్గత గర్భాశయ పరికరాల వాడకం, హార్మోనులతో సంబంధంలేని సురక్షిత మార్గంగా చెప్పబడుతుంది కూడా. IUD అనేది ప్రాథమికంగా ఒక T – ఆకారపు పరికరంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యుల ద్వారా మాత్రమే గర్భాశయంలోకి చొప్పించబడుతుంది. ఇది 5 నుండి 10 సంవత్సరాల వరకు గర్భాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. మరియు అత్యంత సమర్థవంతమైన జనన నియంత్రణ పద్ధతిగా కూడా చెప్పబడింది. అయినా కూడా కొన్ని ప్రతికూల ప్రభావాల కారణంగా ప్రజలు దీనిపట్ల ఆసక్తిని కనపరచడం లేదు. ఈ పరికరంతో కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. పరికరం గర్భాశయంలోకి చొచ్చుకుని పోవడం, లేదా మీ శరీరంలో కొన్ని ప్రతికూల లక్షణాలను ప్రేరేపించడం వంటివి. క్రమంగా శస్త్రచికిత్స ద్వారా దీనిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది.

5. వెజైనల్ (యోని) రింగ్ : ఇది హార్మోన్స్ నిండిన రింగ్ వలె ఉంటుంది. ఇది గర్భ నిరోధకంగానే కాకుండా, మహిళలకు ఇతర దుష్ప్రభావాలు లేకుండా రక్షణ అందించేదిగా కూడా ఉంటుంది. ఈ రింగ్ మహిళ యొక్క యోనిలోకి మానవీయంగా చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఈ కారణం చేత అనేకమంది మహిళలు, ఈ పద్ధతి పట్ల అసౌకర్యానికి గురవుతుంటారు. గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించినప్పుడు, అవి కాలేయం ద్వారా ప్రేగులలోనికి శోషించబడి, ఆ తర్వాత గర్భ నిరోధకంగా పనిచేస్తాయి. కానీ ఒక వెజైనల్ రింగ్ ఉపయోగించినప్పుడు, నేరుగా రక్త ప్రవాహంలోకి శోషించబడతాయి. క్రమంగా గర్భ నిరోధక మాత్రలు, ఇంజెక్షన్లతో పోల్చినప్పుడు హార్మోన్ అసమతుల్యత అనేది తక్కువగా ఉంటుంది. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.