మద్యం మత్తునే కాదు.. అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది…

0

అవును, ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమే. కానీ, ఆల్కహాల్ వలన అందం మెరుగుపడుతుందని ఎంతమందికి తెలుసు? ఇది విని నమ్మకం కలగటం లేదా? వోడ్కా, వైన్ వంటివి సౌందర్యాన్ని ఎలా పెంచుతాయో ఇక్కడ తెలుపబడింది.
1బీర్ తో పెడిక్యూర్
సగం బాటిల్ బీర్ ను గోరువెచ్చని నీటిలో కలిపి మరియు కాళ్ళను 20 నిమిషాల పాటూ ముంచండి. బీర్ సహజ యాంటీ సెప్టిక్ వలే పని చేసి, కాలి గోర్లను శుభ్రపరుస్తుంది. దీనితో పాటుగా బీర్ పాదాలను మృదువుగా మారుస్తుంది.

2మార్గరీటా తో ఎక్సోఫోలేషణ్
ఉప్పు, ఆలివ్ ఆయిల్ మరియు కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మంపై వలయాకారంలో రుద్దండి. ఇది మీ శరీరంపై ఉండే నిర్జీవ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ మిశ్రమంతో చర్మంపై రుద్దిన తరువాత 5 నిమిషాల పాటూ అలాగే ఉంచి, నీటితో చర్మాన్ని కడగండి.

3రెడ్ వైన్ తో ఫేషియల్ మాస్క్
రెడ్ వైన్ యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది మరియు ముఖంపై దీనిని అప్లై చేయటం వలన నల్లటి వలయాలు, ముడుతలు తొలగిపోతాయి. అంతేకాకుండా, రెడ్ వైన్ కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి, 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచటం వలన చర్మం పున: తాజీకరణకు లోనవుతుంది.

4జుట్టు కోసం బీర్
రోజు మన చుట్టూ ఉండే వాతావరణానికి జుట్టు బహిర్గతం అవటం వలన వెంట్రుకలు పొడిగా, అనారోగ్యానికి గురవుతాయి. ఇలాంటి సమయంలో జుట్టును షాంపూతో కడిగిన తరువాత తేలిక పాటి గాడత గల బీర్ లో ముంచండి. ఇలా చేయటం వలన మీ జుట్టు మృదువుగా మారటమే కాకుండా, తలపై చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

5షాంపైన్ తో షైన్
ఒక బకెట్ నిండా ఉన్న వేడి నీటిలో బాటిల్ షాంపైన్ ను కలిపి, దానిలో 30 నిమిషాల పాటూ మీ జుట్టును అందులో నానబెట్టి తరువాత తొలగించండి. ఇపుడు మెరిసే మీ జుట్టును చూసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు.
Please Read Disclaimer