Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> గర్భిణిలలో థైరాయిడ్ వల్ల ఎదురయ్యే సమస్యలు

గర్భిణిలలో థైరాయిడ్ వల్ల ఎదురయ్యే సమస్యలు


కొంత మందిలో గర్భసమయంలో మాత్రమే థైరాయిడ్ వ్యాధి కలుగుతుంది, ఫలితంగా అబార్షన్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. గర్భ సమయంలో కలిగే థైరాయిడ్ వలన కలిగే సమస్యల గురించి ఇక్కడ తెలుపబడింది.
1గర్భిణిలలో థైరాయిడ్ సమస్యలు
గర్భ సమయంలో కలిగే థైరాయిడ్ పెరిగిన లేదా తగ్గినా చాలా సమస్యలు కలగవచ్చు. కొంత మందిలో గర్భసమయంలో మాత్రమే థైరాయిడ్ వ్యాధి కలుగుతుంది, ఫలితంగా అబార్షన్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కావున థైరాయిడ్ సమస్యలు కలిగి ఉంటే గర్భ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పని సరి

2అబార్షన్
గర్భం దాల్చిన తరువాత మొదటి త్రైమాసికాంలో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా అబార్షన్ కు గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, మందులు వాడటం ద్వారా ఈ పరిస్థితిని అరికట్టవచ్చు. గర్భం పొందిన తరువాత వెంటనే వైద్యుడిని కలిసి, థైరాయిడ్ పరీక్ష తప్పక చేపించుకోండి.

3నాడీ వ్యవస్థ అభివృద్ధిలో లోపాలు
గర్భిణి శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తగ్గితే, శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిలో సమయాలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి పుట్టబోయే శిశువు, మానసిక సమస్యలతో జన్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

4గడువుకి ముందే ప్రసవం
గర్భసమయంలో థైరాయిడ్ గ్రంధి చైతన్యంగా లేకపోతే, అధిక రక్త పోటు కలిగి, శిశివుపై వ్యతిరేక ప్రభావాలు చూపుతుంది. కొన్ని సందర్భాలలో ప్లాసేంటా దెబ్బతినటం లేదా అనుకున్న సమయానికి కంటే ముందు ప్రసవం అవటం వంటివి కలుగుతాయి.

5శిశువు థైరాయిడ్ గ్రంధిలో సమస్యలు
థైరాయిడ్ మందులలో రేడియో యాక్టివ్ ఐయోడిన్ ఉంటుంది. దీని వలన గర్భాశయంలో ఉండే శిశువు యొక్క థైరాయిడ్ గ్రంధి కూడా సమస్యలకు గురవుతుంది. కావున ఈ మందుల పట్ల పూర్తిగా వైద్యుడితో చర్చించాలి మరియు పూర్తి అవగాహన కలిగి ఉండాలి.