మగువల్లో సెక్స్ ప్రేరణ కలిగించేవి ఇవేనట!

0

సెక్స్.. దీని ఆలోచన వస్తేనే స్త్రీ, పురుషుల్లో కోరికలు గుర్రాలై పరుగు పెడతాయి. శృంగారం అనేది రెండు దేహాల మధ్య సాగే యుద్ధం. అయితే మగవాళ్ల కంటే మహిళలకే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లలో సెక్స్ ప్రేరణకు కేవలం రెండు మూడు కారణాలు ఉంటే.. ఆడవాళ్లలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని గుర్తించారు. ఎలాంటి ఆలోచ‌న క‌లిగిన‌ప్పుడు స్త్రీలు శృంగారంలో పాల్గొంటారన్న దానిపై విస్తుపోయే విషయాలు తెలుసుకున్నారు. వాటిలో ఐదింటిని తెలుసుకుందాం..

శారీర‌క ఆక‌ర్షణ
రెండు భిన్న ధ్రువాల మధ్య ఆకర్షణ అన్నది కొత్త విషయమేమీ కాదు. స్త్రీకి పురుషుడి మీద ఆశ, కోరిక పెరగడానికి ఇదే ప్రధానం. తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు తమలోని సెక్స్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయని ఎక్కువ మంది స్త్రీలు చెబుతున్నారు. కాబట్టి సెక్స్ ప్రేరణ పొందడానికి ఆకర్షణే ప్రధానమని చెబుతున్నారు.

ప్రేమ‌
పురుషుడు ఎంత అందంగా ఉన్నా అతడి మీద ప్రేమ ఉంటేనే సెక్స్‌కు ఆసక్తి చూపుతామని ఎక్కువమంది మహిళలు చెబుతున్నారు. ప్రేమను ప్రదర్శించడానికి కూడా శృంగారం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట.

లైంగిక తృప్తి
శృంగారంలో కలిగే మధురానుభూతే తమను రతికి ప్రేరేపిస్తుందని చాలామంది మహిళలు చెప్పారట. లైంగిక తృప్తే శృంగారంలో అల్టిమేట్ అని మ‌గువ‌లు కితాబిచ్చేస్తున్నారు.

ఆనందం
సెక్స్ చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుందని, దీనిద్వారా కలిగే ఆనందంతోనే రతిలో పాల్గొనాలన్న ఆసక్తి కలుగుతుందని ఎక్కువ మంది స్త్రీలు తెలిపారు.

సెక్స్ ను ఆట‌గా భావించడం
సెక్స్‌ను మంచి కిక్కిచ్చే ఆటగా మహిళలు పరిగణిస్తారట. సెక్స్ చేస్తున్న సమయంలో ప్రేమలో ఉన్నామనే భావన ఎక్కువగా ఉంటుందని మగువలు చెప్పుకొచ్చారు.

ఈ సర్వేలో సెక్స్ ద్వారా పిల్లలు కనాలనే ఆలోచనకు 72శాతం మంది ఓటేశారు. పిల్లల కోసమే సెక్స్ చేసుకుంటే ఆనందం దొరకదని 12శాతం మంది చెప్పినట్లు వెల్లడైంది.
Please Read Disclaimer