Templates by BIGtheme NET
Home >> Cinema News >> షాకిస్తున్న బాలీవుడ్ వయ్యారి! ‘గ్రాఫిక్స్’తో ప్రమోషన్స్ కానిచ్చేస్తుంది..

షాకిస్తున్న బాలీవుడ్ వయ్యారి! ‘గ్రాఫిక్స్’తో ప్రమోషన్స్ కానిచ్చేస్తుంది..


బాలీవుడ్ వయ్యారి ఐషా శర్మ సోషల్ మీడియాలో వెరీ పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీ. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా సోషల్ మీడియా యూసర్లకు మాత్రం ఏదొక ప్లాట్ ఫామ్ లో తారసపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అమ్మడికి మోడలింగ్ అంటే పిచ్చితో టాప్ మోడల్ గా వెలుగుతోంది. ఇక ఎలాగో మోడలింగ్ ఉందిగా ఆ విధంగానే అవకాశాలు పొందుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ‘సత్యమేవ జయతే’ సినిమాతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ సినిమా నిరాశపరచడంతో తిరిగి మోడలింగ్ వైపు వెళ్ళిపోయింది. హీరోయిన్ నేహాశర్మ చెల్లెలిగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఐషా.. సినిమాలైన వదులుకుంది కానీ మోడలింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. గతంలో టాలీవుడ్ ఆఫర్స్ కూడా వదులుకుందట. నేహాను పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ ఐషాను కూడా ఓ సినిమా కోసం సంప్రదిస్తే ఛాన్స్ మిస్ చేసుకుందట అమ్మడు.

ఈ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. నెటిజన్లను గ్లామరస్ ఒంపుసొంపులతో ఓ రేంజిలో అల్లాడిస్తుంది. ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే ఐషా.. ఈమధ్య ఇంస్టాగ్రామ్ వేదికగా వాహనాల ప్రమోషన్స్ కూడా ప్రారంభించినట్లుంది. తాజాగా షేర్ చేసిన ఓ పిక్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఎందుకంటే అమ్మడు నిలబడిన పక్కన సఫారి కారు కనిపిస్తుంది కదా.. అది ఒరిజినల్ కాదు. గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన ఆ కారును ఐషా ప్రమోట్ చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఫోటో పోస్ట్ చేయగానే తన సోదరి నేహా కూడా ‘ఆ కారు ఫిల్టర్ కదా!’ అంటూ అడిగితే.. అది కంపెనీ వారి (ఏఆర్ ఫిల్టర్) కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్ వర్క్ అని చెప్పుకొచ్చింది. కానీ కారు ఫిల్టర్ సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఈ విధంగా కూడా ప్రమోషన్స్ చేసుకోవచ్చా.. అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఐషా. నిజంగా ఐషా ప్రమోషన్స్ చూస్తూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు షాక్ అవుతున్నారట. అయితే టెక్నాలజీని మాత్రం ఎంతగా వాడుకుంటున్నారో ఈజీగా అర్ధమవుతుంది. ప్రస్తుతం అమ్మడి టాటా సఫారి ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి సినిమాలలో ఎప్పుడు దర్శనమిస్తుందో చూడాలి!