Templates by BIGtheme NET
Home >> Cinema News >> మన్మథుడు బర్త్ డే నాడు వెరైటీ ట్వీట్ చేసిన ‘మన్మథుడు 2’ డైరెక్టర్…!

మన్మథుడు బర్త్ డే నాడు వెరైటీ ట్వీట్ చేసిన ‘మన్మథుడు 2’ డైరెక్టర్…!


నేడు ‘కింగ్’ నాగార్జున 61వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న అక్కినేని నాగార్జున జన్మదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. రాజకీయ ప్రముఖులు హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు నటీనటులతో పాటు పలువురు ఇతర రంగాల వారు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో ‘చి.ల.సౌ’ ‘మన్మథుడు 2’ చిత్రాల దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ట్విట్టర్ వేదికగా ఓ వెరటీ పోస్ట్ పెట్టాడు. ”అతనికి స్క్రీన్ ప్లే ఫస్ట్ డ్రాఫ్ట్ ఇవ్వడానికి ఈ బుక్ మార్క్స్ రూపొందించబడ్డాయి. మీకు నచ్చిన విధంగా ఈ ట్వీట్ పై ట్రోల్స్ కి దిగవచ్చు. కానీ నేను అతనితో గడిపిన ప్రతి నిమిషం ఎప్పుడూ ఆస్వాదించాను. అతన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవడం నాకు నేర్పిన జీవిత అనుభవం” అని ట్వీట్ చేసాడు రాహుల్. దీనికి నాగార్జునకు స్క్రిప్ట్ వినిపించడానికి రెడీ చేసుకున్న స్క్రీన్ ప్లే బుక్ మార్క్స్ ని షేర్ చేశాడు. ఆ బుక్ మార్క్ లో ‘శివ’ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ పట్టుకున్న ఇమేజ్ ఉంది. వాటిలో ఒకదానిపై ‘మాస్ డిస్ట్రక్షన్ వెపన్’ అని రాసి ఉండగా మరోదానిపై ‘హుంబుల్ సైకిల్ చెయిన్ మళ్ళీ మళ్ళీ రాదు’ అని ఉంది. దీనికి నెటిజన్స్ ‘మన్మథుడు 3’ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘మన్మథుడు’కు సీక్వెల్ గా తెరకెక్కిన ‘మన్మథుడు 2’ ఘోర పరాజయాన్ని చవి చూసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రంలో అక్కినేని కోడలు సమంత.. మరో హీరోయిన్ కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ‘చి.ల.సౌ’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘మన్మథుడు 2’ ఫ్రెంచ్ చిత్రానికి ప్రేరణగా రూపొందింది. అయితే ఈ సినిమా నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాప్స్ లో ఒకటిగా నిలిచింది. దీనిపై అక్కినేని అభిమానులు డైరెక్టర్ రాహుల్ ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేసారు. అందుకే ఈ రోజు నాగ్ కి బర్త్ డే విషెస్ చెప్పకుండా తన ఓల్డ్ మెమొరీస్ ని చేసుకుంటూ ట్రోల్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు రాహుల్.