Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరో రామ్ ఇంట్లో పార్టీ.. యంగ్ డైరెక్టర్స్ సందడి

హీరో రామ్ ఇంట్లో పార్టీ.. యంగ్ డైరెక్టర్స్ సందడి


ఎనర్జిటిక్ హీరో రామ్ ఇంట్లో తాజాగా ఓ చిన్న పార్టీ జరిగింది. గెట్ టుగెదర్ మాాదిరిగా జరిగిన ఈ కార్యక్రమానికి యువ దర్శకులను ఆహ్వానించాడు రామ్. ఈ సందర్భంగా వారంతా కలిసి విందు చేశారు. అనంతరం వారు ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చారు. హీరో రామ్తో పాటు – కిషోర్ తిరుమల – గోపిచంద్ మలినేని – అనిల్ రావిపుడి – సంతోష్ శ్రీనివాస్ – వెంకి కుడుములను ఈ చిత్రంలో చూడవచ్చు. వీరిలో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్.. రామ్ నటించిన రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గోపిచంద్ మలినేని ఒక చిత్రంలో రామ్ ను డైరెక్ట్ చేశాడు.

ఇక అనిల్ రావిపుడి రామ్ నటించిన మూడు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. కాగా.. రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన ‘రెడ్’ త్వరలో విడుదల కానుంది. ఇక వెంకి కుడుములతో హీరో రామ్ కు సన్నిహిత సంబంధం ఉంది. ఈ విధంగా యువ డైరెక్టర్లంతా ఒక్కచోట చేరి సందడి చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ తమ స్టార్ హీరో – డైరెక్టర్లను ఒకే ఫ్రేమ్ లో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.