Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> వయస్సుతో పాటు పురుషాంగం సైజు పెరుగుతుందా?

వయస్సుతో పాటు పురుషాంగం సైజు పెరుగుతుందా?


పుట్టిన సమయంలో పురుషాంగం చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. 4-5ఏళ్లు వచ్చినా దానిలో పెద్దగా మార్పు ఉండదు. 12-20 ఏళ్ల వయస్సు మధ్య పురుషాంగం సైజులో భారీ పెరుగుదల ఉంటుంది. పురుషుడిలో ఉండే గ్రోత్ హార్మోన్ పరిమాణాన్ని బట్టే దాని ఎదుదుదల ఆధారపడి ఉంటుంది.

మనిషికి 20ఏళ్ల దాటాక ఎదుగుదల నిలిచిపోతుంది. ఆ వయసులో ఎంత ఎత్తు ఉన్నామో.. దాన్ని మించి ఇంక పెరగరు. పురుషాంగం విషయంలోనూ అంతే. 20ఏళ్ల వయస్సులో అంగం ఎంత పరిమాణంలో ఉందో చివరి వరకు అంతే ఉంటుంది తప్ప సైజులో ఎలాంటి మార్పు ఉండదు.

పురుషుడికి 50-60 ఏళ్లు వచ్చేటప్పటికి అంగంలోని ఎలస్టిక్ టిష్యూస్ సాగిపోతాయి. అందువల్ల అంగం చిన్నగా మారినట్లు కనిపిస్తుంది. 20ఏళ్ల వయస్సులో గట్టిపడిన అంగం 6 అంగుళాలుంటే… 60ఏళ్ల వయస్సులో అదే అంగం 5 అంగుళాలు మాత్రమే కనిపిస్తుంది. దీనిపై ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వయసుతో పాటు అంగం పరిమాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదు.