Templates by BIGtheme NET
Home >> Cinema News >> షారూఖ్ సినిమాలో సల్మాన్.. హృతిక్..? ఫ్యాన్స్ కు పూనకాలే..

షారూఖ్ సినిమాలో సల్మాన్.. హృతిక్..? ఫ్యాన్స్ కు పూనకాలే..


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా అనౌన్స్ అయ్యిందంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇదేవిధంగా సల్లూ భాయ్ మూవీ కోసమూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటిది.. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తే..? వీరితోపాటు మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే..? చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లూ చాలవేమో. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ అద్భుతం త్వరలోనే తెరపై ఆవిష్కృతం కానుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ తన కొత్త చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించారు. ‘పఠాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం కొన్ని నెలల క్రితం బయటకు వచ్చింది. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించనున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో సంచలన వార్త కూడా బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేయబోతున్నాడనేది ఆ వార్త సారాంశం.

అయితే.. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సిది. కాగా.. ఈ ‘పఠాన్’ మూవీలో జాన్ అబ్రహం దీపికా పదుకొనే నటిస్తున్న విషయం ఇప్పటికే తెలిసిందే.