అదిరింది రివ్యూ

0Adirindhi-Movie-Reviewనటీనటులు : విజయ్, కాజల్, సమంత, నిత్యా మీనన్

దర్శకత్వం : అట్లీ

నిర్మాత : ఎన్. రామ సామి, హేమ రుక్మిణి

సంగీతం : ఏ.ఆర్. రెహమాన్

రేటింగ్ : 3/5

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’ ఈరోజు తెలుగులో ‘అదిరింది’ పేరుతొ విడుదలైంది. మరి తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగు ఆడియన్సును ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

సిటీలో వైద్య విభాగానికి చెందిన పలువురు డాక్టర్లు, ఏజెంట్లు కిడ్నాప్ కు గురవుతుంటారు. దీంతో పోలీసులు తన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఒక ప్రముఖ డాక్టర్ అయిన భార్గవ్ (విజయ్) ను అనుమానించి అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఆ కిడ్నాప్ ల వెనుక భార్గవ్ కాకుండా మరొక వ్యక్తి, మెజీషియన్ విజయ్ (విజయ్) ఉన్నాడని పోలీసులకు తెలుస్తుంది. అసలు విజయ్ ఎవరు, కిడ్నాపులు ఎందుకు చేస్తున్నాడు, అతనికి భార్గవ్ కు సంబంధమేమిటి, విజయ్ భార్గవ్ ను పోలీసుల వద్ద ఎందుకు ఇరికించాడు అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు అట్లీ కుమార్ ఎంచుకున్న కథాంశమనే చెప్పాలి. సినిమా ద్వారా ఒక సామాజిక సందేశం ఇద్దామనుకున్న అట్లీ దాన్ని స్టార్ హీరో చెప్పిస్తే మరింత ప్రభావంతంగా ఉంటుందనే ఆలోచనతో కథలోకి విజయ్ ను ప్రవేశపెట్టి చెప్పాలనుకున్న పాయింట్ ను ప్రభావంతంగా చెప్పాడు. ఇక ఆ కథకి అట్లీ కమర్షియల్ అంశాల్ని జోడించిన తీరు కూడా బాగుంది. విజయ్ ను మూడు రకాలుగా చూపిస్తూ, అభిమానులకు మంచి కిక్ ఇచ్చే ఎలివేషన్ సీన్లను పెట్టి హోరెత్తించాడు అట్లీ.

కథనంలో ప్రతి 10 నిముషాలకు హీరోని పైకెత్తే సన్నివేశం, మలుపులు వస్తూ పక్కా కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉంటుందో చూపించాడు అట్లీ. అలాగే ప్రస్తుతం వైద్య ఏ స్థాయిలో వ్యాపారంగా మారి పేదల పాలిట శాపంగా మారింది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో ఎలివేషన్, కథలోని మలుపులతో ఆసక్తికరంగా, ఉత్కంఠగా నడిపాడు అట్లీ. ఇక హీరో విజయ్ అయితే కథను, అందులోని సందేశాన్ని పూర్తిగా భుజాలకెత్తుకుని ఆడియన్స్ మెచ్చే విధంగా పెర్ఫార్మ్ చేశాడు.

మైనస్ పాయింట్స్ :

ఆరంభంలో సన్నివేశాలు బాగానే ఉన్నా సినిమా మొదలైన అరగంటకు కూడా అసలు కథేమిటనేది రివీల్ కాకపోవడం కొద్దిగా నిరుత్సాహాన్ని కలిగించింది. అలాగే కథనంలో పట్టు పెరిగే సమయంలో మధ్యలో వచ్చే పాటలు స్పీడ్ బ్రేకర్స్ లా అనిపించాయి. పైగా అవేవీ అంతగా ఇంప్రెస్ చేయలేదు కూడ. ఇక హీరోయిన్స్ కాజల్, సమంతల పాత్రలకు కథలో కానీ, కథనంలో కానీ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.

పైగా సెకండాఫ్లో రివీల్ అయ్యే అసలు కథ బాగానే ఉన్నా మరీ ఎక్కువగా సాగదీయబడింది. ఆ ట్రాక్ నుండి ఈజీగా 10 నిముషాలు కట్ చేసి సెకండాఫ్ ను ఇంకాస్త క్రిస్పీగా చెప్పుండొచ్చు. అలాగే దర్శకుడు అట్లీ ఎంచుకున్న సోషల్ ఇష్యూని పై పైనే టచ్ చేస్తూ, కేవలం కొద్దిమందికి మాత్రమే ఆపాదిస్తూ చెప్పడం, సరైన పరిష్కారం చెప్పకపోవడం కొద్దిగా లోటుగా అనిపించింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు అట్లీ మంచి సామాజిక అంశానికి కమర్షియల్ విలువల్ని జోడించి కథను చెప్పిన విధానం, ఆసక్తికరమైన మలుపులతో కథనాన్ని నడిపిన తీరు బాగున్నాయి. ఒక స్టార్ హీరోని ఆయన అభిమానులు ఏ లెవెల్లో చూడలనుకుంటారో అదే లెవల్లో చూపించి అసలు సిసలు కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుదో చూపించాడు అట్లీ. కానీ కొన్ని అనవసరమైన సన్నివేశాలు, రెండవ అర్ధభాగం కొంత సాగదీయడం, ఎత్తి చూపించిన ఇష్యూకి పరిష్కారం చూపకపోవడం కొద్దిగా నిరుత్సాహపరిచే అంశాలు.

ఇక సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ పాటలకు విభిన్నమైన సంగీతాన్ని, హుషారెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో అయితే ఎక్కువ ఇంప్రెస్ చేశారాయన. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సెకండాఫ్ ను కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘అదిరింది’ సినిమా మంచి సందేశమున్న కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. హీరో విజయ్ నటన, హీరోయిజమ్, అట్లీ కుమార్ ఎంచుకున్న కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో కూడిన కథనం, ఫస్టాఫ్ కథనం సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా సాగదీసినట్టు అనిపించే సెకండాఫ్, సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పకపోవడం నిరుత్సాహం కలిగించే అంశాలు. మొత్తం మీద మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్లను, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది.

నటీనటులు : విజయ్, కాజల్, సమంత, నిత్యా మీనన్ దర్శకత్వం : అట్లీ నిర్మాత : ఎన్. రామ సామి, హేమ రుక్మిణి సంగీతం : ఏ.ఆర్. రెహమాన్ రేటింగ్ : 3/5 తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’ ఈరోజు తెలుగులో ‘అదిరింది’ పేరుతొ విడుదలైంది. మరి తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగు ఆడియన్సును ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం… కథ : సిటీలో వైద్య విభాగానికి చెందిన పలువురు డాక్టర్లు, ఏజెంట్లు కిడ్నాప్ కు గురవుతుంటారు. దీంతో పోలీసులు తన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఒక ప్రముఖ డాక్టర్ అయిన భార్గవ్ (విజయ్) ను అనుమానించి అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఆ కిడ్నాప్ ల వెనుక భార్గవ్ కాకుండా మరొక వ్యక్తి, మెజీషియన్ విజయ్ (విజయ్) ఉన్నాడని పోలీసులకు తెలుస్తుంది. అసలు విజయ్ ఎవరు, కిడ్నాపులు ఎందుకు చేస్తున్నాడు, అతనికి భార్గవ్ కు సంబంధమేమిటి, విజయ్ భార్గవ్ ను పోలీసుల వద్ద ఎందుకు ఇరికించాడు అనేదే సినిమా కథ. ప్లస్ పాయింట్స్ : సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు అట్లీ కుమార్ ఎంచుకున్న కథాంశమనే చెప్పాలి. సినిమా ద్వారా ఒక సామాజిక సందేశం ఇద్దామనుకున్న అట్లీ దాన్ని స్టార్ హీరో చెప్పిస్తే మరింత ప్రభావంతంగా ఉంటుందనే ఆలోచనతో కథలోకి విజయ్ ను ప్రవేశపెట్టి చెప్పాలనుకున్న పాయింట్ ను ప్రభావంతంగా చెప్పాడు. ఇక ఆ కథకి అట్లీ కమర్షియల్ అంశాల్ని జోడించిన తీరు కూడా బాగుంది. విజయ్ ను మూడు రకాలుగా చూపిస్తూ, అభిమానులకు మంచి కిక్ ఇచ్చే ఎలివేషన్ సీన్లను పెట్టి హోరెత్తించాడు అట్లీ. కథనంలో ప్రతి 10 నిముషాలకు హీరోని పైకెత్తే సన్నివేశం, మలుపులు వస్తూ పక్కా కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉంటుందో చూపించాడు అట్లీ. అలాగే ప్రస్తుతం వైద్య ఏ స్థాయిలో వ్యాపారంగా మారి పేదల పాలిట శాపంగా మారింది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో ఎలివేషన్, కథలోని మలుపులతో ఆసక్తికరంగా, ఉత్కంఠగా నడిపాడు అట్లీ. ఇక హీరో విజయ్ అయితే కథను, అందులోని సందేశాన్ని పూర్తిగా భుజాలకెత్తుకుని ఆడియన్స్ మెచ్చే విధంగా పెర్ఫార్మ్ చేశాడు. మైనస్ పాయింట్స్ : ఆరంభంలో సన్నివేశాలు బాగానే ఉన్నా సినిమా మొదలైన అరగంటకు కూడా అసలు కథేమిటనేది రివీల్ కాకపోవడం కొద్దిగా నిరుత్సాహాన్ని కలిగించింది. అలాగే కథనంలో పట్టు పెరిగే సమయంలో మధ్యలో వచ్చే పాటలు స్పీడ్ బ్రేకర్స్ లా అనిపించాయి. పైగా అవేవీ అంతగా ఇంప్రెస్ చేయలేదు కూడ. ఇక హీరోయిన్స్ కాజల్, సమంతల పాత్రలకు కథలో కానీ, కథనంలో కానీ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. పైగా సెకండాఫ్లో రివీల్ అయ్యే అసలు కథ బాగానే ఉన్నా మరీ ఎక్కువగా సాగదీయబడింది. ఆ ట్రాక్ నుండి ఈజీగా 10 నిముషాలు కట్ చేసి సెకండాఫ్ ను ఇంకాస్త క్రిస్పీగా చెప్పుండొచ్చు. అలాగే దర్శకుడు అట్లీ ఎంచుకున్న సోషల్ ఇష్యూని పై పైనే టచ్ చేస్తూ, కేవలం కొద్దిమందికి మాత్రమే ఆపాదిస్తూ చెప్పడం, సరైన పరిష్కారం చెప్పకపోవడం కొద్దిగా లోటుగా అనిపించింది. సాంకేతిక విభాగం : దర్శకుడు అట్లీ మంచి సామాజిక అంశానికి కమర్షియల్ విలువల్ని జోడించి కథను చెప్పిన విధానం, ఆసక్తికరమైన మలుపులతో కథనాన్ని నడిపిన తీరు బాగున్నాయి. ఒక స్టార్ హీరోని ఆయన అభిమానులు ఏ లెవెల్లో చూడలనుకుంటారో అదే లెవల్లో చూపించి అసలు సిసలు కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుదో చూపించాడు అట్లీ. కానీ కొన్ని అనవసరమైన సన్నివేశాలు, రెండవ అర్ధభాగం కొంత సాగదీయడం, ఎత్తి చూపించిన ఇష్యూకి పరిష్కారం చూపకపోవడం కొద్దిగా నిరుత్సాహపరిచే అంశాలు. ఇక సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ పాటలకు విభిన్నమైన సంగీతాన్ని, హుషారెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో అయితే ఎక్కువ ఇంప్రెస్ చేశారాయన. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ సెకండాఫ్ ను కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. తీర్పు : మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘అదిరింది’ సినిమా మంచి సందేశమున్న కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. హీరో విజయ్ నటన, హీరోయిజమ్, అట్లీ కుమార్ ఎంచుకున్న కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో కూడిన కథనం, ఫస్టాఫ్ కథనం సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా సాగదీసినట్టు అనిపించే సెకండాఫ్, సమస్యకు పూర్తి పరిష్కారం చెప్పకపోవడం నిరుత్సాహం కలిగించే అంశాలు. మొత్తం మీద మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్లను, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది.

అదిరింది రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవిభాగం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.2

అదిరింది రివ్యూ

అదిరింది రివ్యూ

User Rating: 3.4 ( 1 votes)
3