అజ్ఞాతవాసి రివ్యూ

0



Agnathavasi-Movie-Review

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని భారీ అంచనాలు నడుమ ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అయిన విందా (బోమన్ ఇరానీ), అతని కొడుకును చైర్మన్ పదవి కోసం కొందరు హత్య చేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని వెనక్కి పిలుస్తుంది.

అలా తండ్రి, తమ్ముడి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు బయటికొచ్చిన అభిషిక్త్ భార్గవ్ నేరస్తుల్ని ఎలా కనిపెడతాడు, వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడు, అసలు అభిషిక్త్ భార్గవ్ అజ్ఞాతంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అనే అంశాల సమాహారమే ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్. ఆయన కనిపించే సన్నివేశాలు చాలా వరకు అభిమానుల్ని అలరిస్తాయి. ఫుల్ ఎనర్జీతో, తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పవర్ స్టార్ సినిమాను నెట్టుకురావడానికి చాలానే ప్రయత్నించాడు. ఇక హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ఆరంభం నార్మల్ గానే ఉన్న ఇంటర్వెల్ సమయంలో రివీల్ అయ్యే ట్విస్ట్ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది.

ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) లా పాత్రల పై నడిచే కామెడీ చాలా చోట్ల సఫలమై బోర్ కొట్టించే కథనం నుండి కొంతలో కొంత రిలీఫ్ కలిగించింది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర యొక్క డైలాగులు త్రివిక్రమ్ స్టైల్లో ఉండి అలరించాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే కొడకా కోటేశ్వర్ రావ్ పాటలో మాత్రమే పవన్ కొద్దిగా మాస్ స్టెప్పులు వేయడంతో హుషారు కలిగింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు, ఫైట్స్ పర్వాలేదనిపించాయి.

ఇక కుష్బు, పవన్ ల మధ్య ఉండే తల్లి, కొడుకుల రిలేషన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, వాటిలో ఇద్దరి నటన మెప్పించాయి. చిత్ర నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొత్తంలో త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడకపోవడం పెద్ద బలహీనత. చూస్తున్నంతసేపు అసలిది త్రివిక్రమ్ సినిమానేనా అనిపిస్తుంది. ఎంత పాత కథనైనా ఆసక్తికరమైన కథనం, బలమైన పాత్రలు, పదునైన మాటలతో రక్తికట్టించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తయారుచేయగల త్రివిక్రమ్ ఈ సినిమాలో పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యమైన హీరో పాత్ర దగ్గర్నుంచి కీలకమనిపించే అన్ని పాత్రల్ని ఊహించలేనంత తక్కువ స్థాయిలో రాసి ఎక్కువ భాగం సినిమాను బోర్ కొట్టించేశాడు. ఈ బలహీనత ముందు పవన్ ఛరీష్మా కూడా సినిమాను కాపాడలేకపోయింది.

ఇక తన ప్రతి కథలో కూడా హీరోయిన్లకు ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించి ఆసక్తికరంగా చూపించే త్రివిక్రమ్ ఇందులో మటుకు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కథనంలో, కామెడీలో బలవంతంగా ఇరికిస్తూ చిరాకు తెప్పించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్లు ఉన్నా కూడా వారిని సరిగా వాడకపోవడంతో ఎంటర్టైన్మెంట్ పెద్దగా పండలేదు.

ఇక కథకు కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కూడా బలహీనంగా ఉండటంతో కథనంలో బలం లోపించడమేగాక పవన్ పాత్ర అనవసరమైన హాస్యానికి తప్ప అసలు సరైన లక్ష్యమనేదే లేక తేలిపోయింది. దీంతో అభిమానులు సైతం చాలా చోట్ల నీరసానికి, అసహనానికి లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటన్నింటికీ తోడు హీరో విలన్ ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఎక్కడా ఎగ్జైట్మెంట్, సీరియస్నెస్ లేకపోవడంతో సినిమా మొత్తం చప్పగా తయారైంది.

సాంకేతిక విభాగం :

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా, దర్శకుడిగా తన వంతు భాద్యతను సక్రమంగా నిర్వహించలేదు. ఒక్క ముక్కలో చెప్పదగిన స్టోరీ లైన్ ను తీసుకుని సరైన కథనం, పాత్రలు, సన్నివేశాలు రాసుకోకుండా అలసత్వం ప్రదర్శించి ఏదో కొన్ని చోట్ల మినహా అభిమానులు కూడా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయదగిన విధంగా లేకుండా సినిమాను తయారుచేశారు. కనీసం మాటల్లో కూడా తన మ్యాజిక్ ను చూపలేకపోయారు.

ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం క్లాస్ గానే ఉన్నా ఊపు తెప్పించే విధంగా లేకపోవడంతో సినిమాకది పెద్దగా ఉపయోగపడలేకపోయింది. వి. మణికంధన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా కనిపించింది. కోటగిరి వెంకటేశ్వరరావ్ గారి ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగానే ఉన్నాయి. నిర్మాత ఎస్.రాధా క్రిష్ణగారు నిర్మాతగా ఒక సినిమాకు ఎంత చేయాలో అంతా చేసి సాంకేతికంగా మంచి నాణ్యత గల సినిమాను అందించారు.

తీర్పు :

ఈ ‘అజ్ఞాతవాసి’ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడవంలో చాలా వరకు విఫలమైంది. త్రివిక్రమ్ కథా కథనాల రచనలో, టేకింగ్లో, పాత్ర చిత్రీకరణలో, కనీసం మాటల్లో కూడా తన సహజమైన మార్కును చూపించలేదు. దీంతో సినిమా స్థాయి చాలా వరకు పడిపోయింది. అక్కడక్కడా పవన్ పెర్ఫార్మెన్స్, కొంత కామెడీ, కొంతమేర పర్వాలేదనిపించిన పాటలు, ఫైట్స్, చిన్నపాటి ఇంటర్వెల్ ఎలిమెంట్, తల్లి, కొడుకుల సెంటిమెంట్ మినహా ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి, ఎగ్జైట్ ఫీలవ్వడానికి ఏమీ దొరకదు. మొత్తం మీద చెప్పాలంటే పవన్, త్రివిక్రమ్ ల హార్డ్ కోర్ అభిమానులకు ఈ చిత్రం పర్వాలేదనిపింవచ్చు కానీ మిగతా వాళ్లను పెద్దగా మెప్పించదు.

అజ్ఞాతవాసి లైవ్ అప్ డేట్స్ :

  • చిత్రం హ్యాపీ ఎండింగ్ అయింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూ ఉండండి.

  • ప్రస్తుతం ఫైట్ వస్తోంది. పవన్ కళ్యాణ్, ఆది ముఖాముఖీ తలపడుతున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది.

  • చిత్రంలో చిన్న ట్విస్ట్ వచ్చింది. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.

  • పవన్ కళ్యాణ్ కి ఆది గ్యాంగ్ కి మధ్య ఫైట్ సీన్ వస్తోంది. ఫైట్ చాలా బావుంది.

  • ప్రస్తుతం ఆసక్తికరమైన ఛేజింగ్ సన్నివేశం వస్తోంది. విజువల్స్ బావున్నాయి.

  • ‘ఏబీ ఎవరో నీ బేబీ’ సాంగ్ లోనే ఈ సన్నివేశాలని చూపిస్తున్నారు.

  • చిత్రం ఇప్పుడు బల్గెరియాకు మారింది. పవన్ కళ్యాణ్ తన తండ్రి సంకల్పం ఏంటో తెలుసుకునేందుకు మిషన్ మొదలుపెట్టాడు.

  • ఎట్టకేలకు పవన్ కళ్యాణ్, ఆది పేస్ టూ పేస్ వచ్చారు.

  • ప్రస్తుతం కొడకా కోటేశ్వర్ రావు సాంగ్ వస్తోంది. ఆడియన్స్ లో ఉత్సాహం కనిపిస్తోంది.

  • చిత్రంలో జోరు పెరిగింది. ప్రస్తుతం చిన్న ఫైట్ సీన్ వస్తోంది.

  • చిత్రంలో మరికొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. రావు రమేష్, మురళి శర్మల కామెడీ బావుంది.

  • ప్రస్తుతం ఫన్నీ ఆఫీస్ సన్నివేశాలు వస్తున్నాయి. పోస్టర్ లో చూపించిన బెల్ట్ సన్నివేశం వస్తోంది.

  • చిత్రం ప్రజెంట్ డే కి వచ్చింది. పేమస్ హెలికాఫ్టర్ సన్నివేశాన్ని చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని అభిషిఖ్త్ భార్గవ్ గా పరిచయం చేస్తున్నారు.

  • ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ నేపథ్యాన్ని వివరిస్తున్నారు.

  • చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. బొమన్ ఇరానీ కథని చూపిస్తున్నారు.

  • నటుడు సంపత్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, ఖుష్బు లతో అతడి సన్నివేశాలు వస్తున్నాయి.

  • సెకండ్ హాఫ్ ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్, ఆది మధ్య ఛాలెంజ్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తోంది. ఎలివేషన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ ని హై లెవెల్ లో చూపిస్తున్నారు. మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది.

  • చిత్రంలో ట్విస్ట్ వచ్చింది. ఖుష్బు ని కాపాడడానికి పోరాట సన్నివేశం వస్తోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

  • పాండవ వనవాసంలో నకుల ధర్మం ఆధారంగా చేసుకుని చిన్న ఫైట్ వస్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది.

  • కీర్తి సురేష్, పవన్ మధ్య ఫన్ సీన్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ‘గాలివాలుగా’ సాంగ్ వస్తోంది. లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి.

  • చిత్రంలో ప్రధాన విలన్ ఆది పినిశెట్టి ఎంట్రీ ఇచ్చాడు. చాలా సాఫ్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

  • ప్రస్తుతం రఘుబాబు మరియు ఇతర నటుల మధ్య ఆఫీస్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య రొమాంటిక్ సాంగ్ ‘బైటికొచ్చి చూస్తే’ వస్తోంది. అను ని చాలా అందంగా చూపిస్తున్నారు.

  • పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ మధ్య ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపిస్తున్నారు.

  • ‘మధురాపురి సధన ‘ సాంగ్ తో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

  • ఖుష్బు, పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి. డైలాగ్స్ బావున్నాయి.

  • హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ సీన్ ఆసక్తికరంగా చూపించారు.

  • కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, వెన్నెల కిషోర్ మధ్య ఫన్నీ కిడ్నాప్ సీన్ వస్తోంది.

  • ట్రైలర్ లో చూపించిన కుర్చీ తిప్పే సన్నివేశం వస్తోంది. పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన డైలాగ్స్ చెబుతున్నాడు.

  • ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ ‘ధగ ధగ మనే’ వస్తోంది. వారణాసిలో చిత్రీకరించిన విజువల్స్ బావున్నాయి. స్లో మోషన్ లో పవన్ కళ్యాణ్ ని అద్భుతంగా చూపిస్తున్నారు..

  • చిత్రం ప్రస్తుతం అస్సాంకు మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరింది. అద్భుతమైన ఫస్ట్ ఫైట్ వస్తోంది.

  • బొమన్ ఇరానీ భార్యగా ఖుష్బు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెంటిమెంటల్ సీన్స్ వస్తున్నాయి.

  • బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీతో తొలి సన్నివేశం వస్తోంది. చిత్రం సీరియస్ గా మొదలైంది. ప్రస్తుతం యాక్సిడెంట్ సీన్ చూపిస్తున్నారు.

  • వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రం ప్రారంభం అయింది. చిత్ర నిడివి 158 నిమిషాలు.

  • అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం మరి కొద్ది నిమిషాల్లోనే ప్రారంభం కాబోతోంది. లైవ్ అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Summary
Review Date
Reviewed Item
అజ్ఞాతవాసి రివ్యూ
Author Rating
31star1star1stargraygray
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని భారీ అంచనాలు నడుమ ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.. కథ: ఏబి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అయిన విందా (బోమన్ ఇరానీ), అతని కొడుకును చైర్మన్ పదవి కోసం కొందరు హత్య చేస్తారు. దాంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బు) అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని వెనక్కి పిలుస్తుంది. అలా తండ్రి, తమ్ముడి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు బయటికొచ్చిన అభిషిక్త్ భార్గవ్ నేరస్తుల్ని ఎలా కనిపెడతాడు, వారి మీద పగ ఎలా తీర్చుకుంటాడు, అసలు అభిషిక్త్ భార్గవ్ అజ్ఞాతంలో ఎందుకు ఉండవలసి వస్తుంది అనే అంశాల సమాహారమే ఈ చిత్రం. ప్లస్ పాయింట్స్ : సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్. ఆయన కనిపించే సన్నివేశాలు చాలా వరకు అభిమానుల్ని అలరిస్తాయి. ఫుల్ ఎనర్జీతో, తన ట్రేడ్ మార్క్ మ్యానరిజంతో పవర్ స్టార్ సినిమాను నెట్టుకురావడానికి చాలానే ప్రయత్నించాడు. ఇక హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్, పవన్ కళ్యాణ్ ల మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ఆరంభం నార్మల్ గానే ఉన్న ఇంటర్వెల్ సమయంలో రివీల్ అయ్యే ట్విస్ట్ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది. ఆరంభం నుండి చివరి వరకు హీరోతో పాటే ఉండే శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) లా పాత్రల పై నడిచే కామెడీ చాలా చోట్ల సఫలమై బోర్ కొట్టించే కథనం నుండి కొంతలో కొంత రిలీఫ్ కలిగించింది. ముఖ్యంగా రావు రమేష్ పాత్ర యొక్క డైలాగులు త్రివిక్రమ్ స్టైల్లో ఉండి అలరించాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే కొడకా కోటేశ్వర్ రావ్ పాటలో మాత్రమే పవన్ కొద్దిగా మాస్ స్టెప్పులు వేయడంతో హుషారు కలిగింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు, ఫైట్స్ పర్వాలేదనిపించాయి. ఇక కుష్బు, పవన్ ల మధ్య ఉండే తల్లి, కొడుకుల రిలేషన్ ను ఎలివేట్ చేసే సన్నివేశాలు, వాటిలో ఇద్దరి నటన మెప్పించాయి. చిత్ర నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ : సినిమా మొత్తంలో త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడకపోవడం పెద్ద బలహీనత. చూస్తున్నంతసేపు అసలిది త్రివిక్రమ్ సినిమానేనా అనిపిస్తుంది. ఎంత పాత కథనైనా ఆసక్తికరమైన కథనం, బలమైన పాత్రలు, పదునైన మాటలతో రక్తికట్టించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తయారుచేయగల త్రివిక్రమ్ ఈ సినిమాలో పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యమైన హీరో పాత్ర దగ్గర్నుంచి కీలకమనిపించే అన్ని పాత్రల్ని ఊహించలేనంత తక్కువ స్థాయిలో రాసి ఎక్కువ భాగం సినిమాను బోర్ కొట్టించేశాడు. ఈ బలహీనత ముందు పవన్ ఛరీష్మా కూడా సినిమాను కాపాడలేకపోయింది. ఇక తన ప్రతి కథలో కూడా హీరోయిన్లకు ఏదో ఒక ప్రత్యేకతను ఆపాదించి ఆసక్తికరంగా చూపించే త్రివిక్రమ్ ఇందులో మటుకు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ కథలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా కథనంలో, కామెడీలో బలవంతంగా ఇరికిస్తూ చిరాకు తెప్పించారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్ వంటి స్టార్ కమెడియన్లు ఉన్నా కూడా వారిని సరిగా వాడకపోవడంతో ఎంటర్టైన్మెంట్ పెద్దగా పండలేదు. ఇక కథకు కీలకమైన ప్రతినాయకుడి పాత్ర కూడా బలహీనంగా ఉండటంతో కథనంలో బలం లోపించడమేగాక పవన్ పాత్ర అనవసరమైన హాస్యానికి తప్ప అసలు సరైన లక్ష్యమనేదే లేక తేలిపోయింది. దీంతో అభిమానులు సైతం చాలా చోట్ల నీరసానికి, అసహనానికి లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటన్నింటికీ తోడు హీరో విలన్ ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఎక్కడా ఎగ్జైట్మెంట్, సీరియస్నెస్ లేకపోవడంతో సినిమా మొత్తం చప్పగా తయారైంది. సాంకేతిక విభాగం : త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా, దర్శకుడిగా తన వంతు భాద్యతను సక్రమంగా నిర్వహించలేదు. ఒక్క ముక్కలో చెప్పదగిన స్టోరీ లైన్ ను తీసుకుని సరైన కథనం, పాత్రలు, సన్నివేశాలు రాసుకోకుండా అలసత్వం ప్రదర్శించి ఏదో కొన్ని చోట్ల మినహా అభిమానులు కూడా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయదగిన విధంగా లేకుండా సినిమాను తయారుచేశారు. కనీసం మాటల్లో కూడా తన మ్యాజిక్ ను చూపలేకపోయారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం క్లాస్ గానే ఉన్నా ఊపు తెప్పించే విధంగా లేకపోవడంతో సినిమాకది పెద్దగా ఉపయోగపడలేకపోయింది. వి. మణికంధన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా కనిపించింది. కోటగిరి వెంకటేశ్వరరావ్ గారి ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ బాగానే ఉన్నాయి. నిర్మాత ఎస్.రాధా క్రిష్ణగారు నిర్మాతగా ఒక…

అజ్ఞాతవాసి రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవిభాగం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 3

2.9

అజ్ఞాతవాసి రివ్యూ

అజ్ఞాతవాసి రివ్యూ

User Rating: 3.6 ( 8 votes)
3