Templates by BIGtheme NET
Home >> REVIEWS >> అంతరిక్షం రివ్యూ

అంతరిక్షం రివ్యూ


విడుదల తేదీ : డిసెంబర్ 21, 2018

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు.

దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి

నిర్మాత : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

సంగీతం : ప్రశాంత్ విహారి

సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వి.యస్

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వరుణ్ తేజ్(దేవ్) ఐదు సంవత్సరాల క్రితం చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ లో అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థుతుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కోల్పోవడంతో పాటు, తన విప్రయాన్ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ మిషన్ ను పూర్తి చెయ్యడానికి వరుణ్ దేవ్ (వరుణ్ తేజ్) అవసరం ఏర్పడుతుంది.

ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో దేవ్ కి కొన్ని సమస్యలను ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని దేవ్ వాటిని ఎలా పరిష్కరించాడు ? అలాగే తన విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? రెండు మెషన్ లను దేవ్ తన బృందంతో ఎలా విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పేస్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పైగా ఇంతవరకు తెలుగులో అంతరిక్షం బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా కూడా రాకపోవడంతో ఈ ‘అంతరిక్షం’ తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది.

దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అతిథిరావ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

ఇక సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కథ అంతరిక్షంలోనే జరుగుతోందనే నమ్మకాన్ని కలిగించాయి. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పేస్ తాలూకు సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్ :

‘అంతరిక్షం’ నేపథ్యంలో కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్నిమాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు.

ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందుకి వరకు కథనం నెమ్మదిగానే సాగుతుంది. పైగా స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కూడా ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినీమాటిక్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా మిషన్ కిన్నెరలో వరుణ్ సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి.

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్నితీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతవరకు ఏ తెలుగు దర్శకుడు టచ్ చేయని స్పేస్ జానర్ ను తీసుకునందుకు ఆయన్ని మెచ్చుకొని తీరాల్సిందే.

సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి సంగీతం బాగుంది. జ్ఞాన శేఖర్ వి.యస్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. వాళ్ళ నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో మొట్టమొదటి సారిగా స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం పూర్తిస్థాయిలో ఆసక్తికరంగా సాగకపోయిన, ప్రేక్షకులకు మాత్రం కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. ఇప్పటి వరకు ఏ తెలుగు దర్శకుడు ప్రయత్నించని అంతరిక్ష నేపథ్యాన్ని తీసుకుని సంకల్ప్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోతగినది.

ముఖ్యంగా ఆయన రాసిన కథ, అంతరిక్షంలోని సాగే సన్నివేశాలు అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ ఆకట్టుకునే అంశాలు కాగా… నెమ్మదిగా సాగిన కథనం, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు, స్పెస్ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో సీరియస్ నెస్ కొంత లోపించడం వంటి అంశాలు బలహీనతలుగా నిలుస్తాయి.

ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అయితే ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తోందో చూడాలి.

  • మొత్తానికి “ధీమాగా” అనే పాటతో సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

  • సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.వరుణ్ టీమ్ మళ్ళీ భూమి మీదకు వచ్చేందుకు తిరుగు ప్రయాణం చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.

  • శాటిలైట్ లలో కోల్పోయిన సమాచారాన్ని సేకరించడానికి వరుణ్ చంద్రుని మీదకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.

  • వారు చేపట్టిన మిషన్ లో కొన్ని అనుకోని సమస్యలు వస్తున్నాయి.

  • ఇప్పుడు మిషన్ “కిన్నెర” కు రంగం సిద్ధమయ్యింది.ఈ మిషన్ చంద్రుని మీద మొదలవుతుంది.

  • ఇప్పుడే ఊహించని విధంగా ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది.వరుణ్ మరియు రెహమాన్ ల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.శంకర్ కు మరియు అతని కూతురికి మధ్య కొన్ని భావోద్వేగ పూరిత సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు వరుణ్ మరియు అదితి స్పేస్ వాక్ చేస్తూ మిషన్ ను విజయవంతం చేసారు.ఇప్పుడు వరుణ్ తన సొంత మిషన్ ను తయారు చేస్తున్నారు,దానికి గాను శ్రీనివాస్ అవసరాల మంచి సపోర్ట్ ఇస్తున్నారు.

  • విరామం ముగిసింది,అదితి రావ్ అంతరిక్షం లో స్పేస్ వాక్ చేస్తున్న సన్నివేశంతో మొదలయ్యింది. వారు చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది,టీజర్లో డైలాగ్ “ఇండియా ఈస్ నాట్ గాన లాస్” ఇప్పుడు వస్తుంది.

  • ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా అంతా సజావుగా పర్వాలేదనిపించే స్థాయిలో సాగింది.ఇంటర్వెల్ సన్నివేశం కూడా బాగానే ఇచ్చారు.దీన్ని బట్టి సెకండాఫ్ కొంచెం ప్రధాన పాత్ర పోషించేందుకు అవకాశం ఉంది అని చెప్పొచ్చు.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో,ఏం జరగబోతుందో వేచి చూద్దాం.

  • ఇప్పుడు హీరో వరుణ్ తేజ్(దేవ్), హీరోయిన్ అదితి(రియా) మరియు సత్యదేవ్,శంకర్(సిరివెన్నెల సీతారామ శాస్త్రి)లు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు.ఇప్పుడు విరామం.

  • వరుణ్ తేజ్ మిహరా శాటిలైట్ ను ఫిక్స్ చేసేందుకు అంతరిక్షం లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి..

  • ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.ఇప్పుడు మరో పాట “పలుకవే” వస్తుంది.

  • ఇప్పుడు కొన్ని గతానికి మరియు ప్రస్తుతానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.ఫ్లాష్ బ్యాక్ లోకి చిత్రం ఇప్పుడు వెళ్ళింది.వరుణ్ లాంచ్ చేసిన శాటిలైట్ విప్రయాన్ ఇప్పుడు వెళ్తుంది.

  • ఇప్పుడే రెహామన్ యొక్క కుమార్తెగా మరియు వరుణ్ తేజ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ గా లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు మొదటి పాట “సమయమా”కు వేళయింది.

  • హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ అదితి రావ్ హైదరీ ఇప్పుడు పరిచయం కాబడ్డారు.వరుణ్ ఒక శాస్త్రవేత్తగా మరియు అదితి ఒక వ్యోమగామిగా కనిపిస్తున్నారు.ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చూపిస్తున్నారు.ఇప్పుడు మళ్ళీ అంతరిక్షం లోకి సీన్స్ వచ్చాయి.

  • 5 ఏళ్ల తర్వాత..భూమి మీద శ్రీనివాస్ అవసరాల మిహరా శాటిలైట్ లో లోపాలను పరిష్కరించే వ్యక్తిగా కనిపిస్తాడు.ప్రముఖ నటుడు రెహమాన్ అతని యొక్క బాస్ గా ఎంట్రీ ఇచ్చారు.

  • సినిమా ప్రారంభం అంతరిక్షంలో చంద్రుడు మరియు శాటిలైట్ లను చూపిస్తూనే ఆసక్తికరంగా మొదలయ్యింది.ఈ విజువల్స్ చూడడానికి చాలా గ్రాండ్ గా, అద్భుతంగా ఉన్నాయి.

  • హాయ్ 130 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది…

విడుదల తేదీ : డిసెంబర్ 21, 2018 నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిధి రావ్, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు. దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి నిర్మాత : రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంగీతం : ప్రశాంత్ విహారి సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వి.యస్ ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్ ‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : వరుణ్ తేజ్(దేవ్) ఐదు సంవత్సరాల క్రితం చంద్రుని పై విప్రయాన్ శాటిలైట్ ను పంపే ప్రాసెస్ లో అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందికర పరిస్థుతుల వల్ల తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి)ని కోల్పోవడంతో పాటు, తన విప్రయాన్ మిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఓ మిషన్ ను పూర్తి చెయ్యడానికి వరుణ్ దేవ్ (వరుణ్ తేజ్) అవసరం ఏర్పడుతుంది. ఆ మిషన్ ను పూర్తి చేసే క్రమంలో దేవ్ కి కొన్ని సమస్యలను ఎదురవుతాయి. ఆ సమస్యలను ఎదుర్కొని దేవ్ వాటిని ఎలా పరిష్కరించాడు ? అలాగే తన విప్రయాన్ మిషన్ ని ఎలా పూర్తి చేశాడు ? రెండు మెషన్ లను దేవ్ తన బృందంతో ఎలా విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పేస్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పైగా ఇంతవరకు తెలుగులో అంతరిక్షం బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా కూడా రాకపోవడంతో ఈ ‘అంతరిక్షం’ తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది. దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అతిథిరావ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కథ అంతరిక్షంలోనే జరుగుతోందనే నమ్మకాన్ని కలిగించాయి. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి స్పేస్ తాలూకు సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు. మైనస్ పాయింట్స్ : ‘అంతరిక్షం’ నేపథ్యంలో కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్నిమాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందుకి వరకు కథనం నెమ్మదిగానే సాగుతుంది. పైగా స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కూడా ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినీమాటిక్ గా అనిపిస్తోంది. ముఖ్యంగా మిషన్ కిన్నెరలో వరుణ్ సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి. సాంకేతిక విభాగం : మంచి కథా నేపధ్యాన్నితీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతవరకు ఏ తెలుగు దర్శకుడు టచ్ చేయని స్పేస్ జానర్ ను తీసుకునందుకు ఆయన్ని మెచ్చుకొని తీరాల్సిందే. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి సంగీతం బాగుంది. జ్ఞాన శేఖర్ వి.యస్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. వాళ్ళ నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి. తీర్పు : సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో మొట్టమొదటి సారిగా స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన…

అంతరిక్షం రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.4

అంతరిక్షం రివ్యూ

అంతరిక్షం రివ్యూ

User Rating: 4.65 ( 1 votes)
3