Templates by BIGtheme NET
Home >> REVIEWS >> అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ


ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఎదురుచూసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ విడుదలైంది. నిన్న అర్ధ రాత్రి నుంచే దేశవ్యాప్తంగా చాలా మల్టీ ప్లెక్సుల్లో ఫ్యాన్స్ కోసం మిడ్ నైట్ ప్రీమియర్ షోలు వేశారు. సూపర్ హీరోస్ సిరీస్ లో ఇది చివరి సినిమా కాబట్టి ఈసారి ఉత్సాహంతో పాటు ఉద్వేగం కూడా తోడైంది. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎండ్ గేమ్ టికెట్ల కోసం క్యు కడుతున్నారు. ఇండియాలో ఇప్పటిదాకా ఏ హాలీవుడ్ మూవీకి దక్కని రికార్డు ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం పదండి

ఇది ఇన్ఫినిటీ వార్ కు ఖచ్చితమైన కొనసాగింపు. ఇన్ఫినిటీ స్టోన్స్ ని దక్కించుకున్నాను కాబట్టి అప్పటికే తన వల్ల సగం నాశనం అయిపోయిన ప్రపంచంతో తనకు సంబంధం లేదని భావించిన తానోస్ ఎవరికి దొరక్కుండా వేరే గ్రహానికి వెళ్లి అక్కడ ఉంటాడు. కాని తమ బృందంలో సభ్యులను పోగొట్టుకున్న అవెంజర్స్ ఎలాగైనా వాళ్ళను వెనక్కు తీసుకురావాలన్న లక్ష్యంతో అన్వేషణ సాగిస్తూ ఉంటారు.

కొంత కాలం తర్వాత బయటికి వచ్చిన యాంట్ మ్యాన్ ధూళిగా మారిన జనంతో పాటు తమ సహచరులను తీసుకురావాలంటే టైం ట్రావెల్ చేయాలనీ చెబుతాడు. దీంతో అందరు కలిసి ఆ ప్రయాణం మొదలుపెట్టి స్టోన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఇది తెలుసుకున్న తానోస్ భూమి మీదకు వచ్చి అవెంజర్స్ తో తలపడతాడు. ఈ భీకర భయానక యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ప్రాణ త్యాగం చేశారు తానోస్ ఎలా మట్టికరిచాడు అనే ప్రశ్నలకు సమాదానం త్రీడి స్క్రీన్ మీదే చూడాలి

నటీనటుల గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఇన్ఫినిటీ వార్ కి మించిన ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్టు లో ప్రతి ఒక్కరు పాత్రలకు జీవం పోశారు. అందరికంటే ఎక్కువగా ఆకట్టుకునేది మాత్రం తానోస్ గా నటించిన జోష్ బ్రోలిన్. రానా తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. సూపర్ హీరోస్ గా నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్-క్రిస్ ఎవాన్స్-క్రిస్ ఎమ్స్వర్త్-మార్క్ రఫెలో-స్కార్లెట్ జాన్సన్- బ్రై లాంసర్- జెరెమీ రన్నర్-డాన్ చేడేల్-పాల్ రాడ్-కరెన్ గిల్లెన్ ఇలా ఒకరు ఇద్దరని కాదు మొత్తం 22 పైగా సూపర్ హీరోస్ నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడ్డారు

సాంకేతికంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ అన్నింటి కన్నా ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. నాలుగు టైం పీరియడ్స్ లో సాగే కథగా చూపించిడంతో మూడు గంటల నిడివి బోర్ కొట్టకుండా సాగుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్ అభిమానులు గూస్ బంప్స్ తో ఊగిపోవడం ఖాయం. ఒక్కసారి చూడటంతో వాళ్ళు సంతృప్తి పడటం కష్టమే. ముఖ్యంగా తానోస్ భూమికి వచ్చాక జరిగే రచ్చను వర్ణించడం అసాధ్యం అనిపిస్తుంది.

విజువల్ ఎఫెక్ట్స్ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతాయి. టేకాఫ్ కాస్త స్లోగా అనిపించినా సబ్ ప్లాట్స్ ని లింక్ చేసిన తీరు ఎక్కడికక్కడ త్రిల్ ఇచ్చే సన్నివేశాలు కూర్చిన వైనం కుర్చీలకు కట్టిపడేస్తాయి. అందుకే చాలా మటుకు లోపాలు ఈ బ్రిలియన్స్ వల్ల కవరైపోయాయి. ఎమోషన్స్ కూడా సమపాళ్లలో మిక్స్ చేయడంతో వీరాభిమానులు కన్నీళ్ళు పెట్టుకునే ఎపిసోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్ మ్యాన్ ఫేర్ వెల్ కు బాధ పడని ప్రేక్షకుడు లేడేమో.

ఫైనల్ గా చెప్పాలంటే సిరీస్ లో చివరి సినిమాగా మార్వెల్ సంస్థ తీసుకొచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ తన మీద పెట్టుకున్న అంచనాలను పూర్తిగా అందుకుంది. ఆశించిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఇచ్చి అభిమానుల మనసులను గెలుచుకుంది. హాలీవుడ్ సినిమాల్లో ఇప్పటిదాకా దేనికీ రానంత హైప్ తెచ్చుకున్న ఎండ్ గేమ్ యాక్షన్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా త్రీడి పరంగా ఇలా అన్ని కోణాల్లో పెట్టిన టికెట్ డబ్బులకు అంచనాలతో ధియేటర్లో అడుగు పెట్టిన ప్రేక్షకులకు పూర్తి పైసా వసూల్ గా నిలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఎదురుచూసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ విడుదలైంది. నిన్న అర్ధ రాత్రి నుంచే దేశవ్యాప్తంగా చాలా మల్టీ ప్లెక్సుల్లో ఫ్యాన్స్ కోసం మిడ్ నైట్ ప్రీమియర్ షోలు వేశారు. సూపర్ హీరోస్ సిరీస్ లో ఇది చివరి సినిమా కాబట్టి ఈసారి ఉత్సాహంతో పాటు ఉద్వేగం కూడా తోడైంది. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎండ్ గేమ్ టికెట్ల కోసం క్యు కడుతున్నారు. ఇండియాలో ఇప్పటిదాకా ఏ హాలీవుడ్ మూవీకి దక్కని రికార్డు ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూసేద్దాం పదండి ఇది ఇన్ఫినిటీ వార్ కు ఖచ్చితమైన కొనసాగింపు. ఇన్ఫినిటీ స్టోన్స్ ని దక్కించుకున్నాను కాబట్టి అప్పటికే తన వల్ల సగం నాశనం అయిపోయిన ప్రపంచంతో తనకు సంబంధం లేదని భావించిన తానోస్ ఎవరికి దొరక్కుండా వేరే గ్రహానికి వెళ్లి అక్కడ ఉంటాడు. కాని తమ బృందంలో సభ్యులను పోగొట్టుకున్న అవెంజర్స్ ఎలాగైనా వాళ్ళను వెనక్కు తీసుకురావాలన్న లక్ష్యంతో అన్వేషణ సాగిస్తూ ఉంటారు. కొంత కాలం తర్వాత బయటికి వచ్చిన యాంట్ మ్యాన్ ధూళిగా మారిన జనంతో పాటు తమ సహచరులను తీసుకురావాలంటే టైం ట్రావెల్ చేయాలనీ చెబుతాడు. దీంతో అందరు కలిసి ఆ ప్రయాణం మొదలుపెట్టి స్టోన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఇది తెలుసుకున్న తానోస్ భూమి మీదకు వచ్చి అవెంజర్స్ తో తలపడతాడు. ఈ భీకర భయానక యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ప్రాణ త్యాగం చేశారు తానోస్ ఎలా మట్టికరిచాడు అనే ప్రశ్నలకు సమాదానం త్రీడి స్క్రీన్ మీదే చూడాలి నటీనటుల గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఇన్ఫినిటీ వార్ కి మించిన ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్టు లో ప్రతి ఒక్కరు పాత్రలకు జీవం పోశారు. అందరికంటే ఎక్కువగా ఆకట్టుకునేది మాత్రం తానోస్ గా నటించిన జోష్ బ్రోలిన్. రానా తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. సూపర్ హీరోస్ గా నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్-క్రిస్ ఎవాన్స్-క్రిస్ ఎమ్స్వర్త్-మార్క్ రఫెలో-స్కార్లెట్ జాన్సన్- బ్రై లాంసర్- జెరెమీ రన్నర్-డాన్ చేడేల్-పాల్ రాడ్-కరెన్ గిల్లెన్ ఇలా ఒకరు ఇద్దరని కాదు మొత్తం 22 పైగా సూపర్ హీరోస్ నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడ్డారు సాంకేతికంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ అన్నింటి కన్నా ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. నాలుగు టైం పీరియడ్స్ లో సాగే కథగా చూపించిడంతో మూడు గంటల నిడివి బోర్ కొట్టకుండా సాగుతుంది. ముఖ్యంగా ఈ సిరీస్ అభిమానులు గూస్ బంప్స్ తో ఊగిపోవడం ఖాయం. ఒక్కసారి చూడటంతో వాళ్ళు సంతృప్తి పడటం కష్టమే. ముఖ్యంగా తానోస్ భూమికి వచ్చాక జరిగే రచ్చను వర్ణించడం అసాధ్యం అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతాయి. టేకాఫ్ కాస్త స్లోగా అనిపించినా సబ్ ప్లాట్స్ ని లింక్ చేసిన తీరు ఎక్కడికక్కడ త్రిల్ ఇచ్చే సన్నివేశాలు కూర్చిన వైనం కుర్చీలకు కట్టిపడేస్తాయి. అందుకే చాలా మటుకు లోపాలు ఈ బ్రిలియన్స్ వల్ల కవరైపోయాయి. ఎమోషన్స్ కూడా సమపాళ్లలో మిక్స్ చేయడంతో వీరాభిమానులు కన్నీళ్ళు పెట్టుకునే ఎపిసోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్ మ్యాన్ ఫేర్ వెల్ కు బాధ పడని ప్రేక్షకుడు లేడేమో. ఫైనల్ గా చెప్పాలంటే సిరీస్ లో చివరి సినిమాగా మార్వెల్ సంస్థ తీసుకొచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ తన మీద పెట్టుకున్న అంచనాలను పూర్తిగా అందుకుంది. ఆశించిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఇచ్చి అభిమానుల మనసులను గెలుచుకుంది. హాలీవుడ్ సినిమాల్లో ఇప్పటిదాకా దేనికీ రానంత హైప్ తెచ్చుకున్న ఎండ్ గేమ్ యాక్షన్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా త్రీడి పరంగా ఇలా అన్ని కోణాల్లో పెట్టిన టికెట్ డబ్బులకు అంచనాలతో ధియేటర్లో అడుగు పెట్టిన ప్రేక్షకులకు పూర్తి పైసా వసూల్ గా నిలుస్తుంది.

అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3.5
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 4
దర్శకత్వ ప్రతిభ - 4

3.8

అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

User Rating: 3.25 ( 1 votes)
4