అ! రివ్యూ

0



Awe-Movie-Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018

నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని

సంగీతం : మార్క్.కె. రాబిన్

సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని

ఎడిటర్ : గౌతమ్ నెరుసు

నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మొదటి నుండి ఇది కమర్షియల్ సినిమా కాదు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమని నాని చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు రాధ ( ఈషా రెబ్బ ), క్రిష్ (నిత్యా మీనన్), శివ (శ్రీనివాస్ అవసరాల), మీర (రెజినా), నలభీమ (ప్రియదర్శి) అందరూ ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు బిజీగా, సతమవుతూ ఉంటారు.

వాళ్ళ మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, విముక్తి కోసం మాస్ మర్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు రాధ, క్రిష్, నలభీమ.. వీళ్లంతా ఎవరు, ఒకరికొకరికి మధ్యన సంబంధం ఏంటి, కాలి ఎవర్ని చంపాలనుకుంది, చివరికి వీళ్లందరి కథ ఎలా ముగిసింది అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. అవును ఆరంభం నుండి చూపించిన అనేక పాత్రలకి, వాటి చర్యలకి, సన్నివేశాలకి, మాటలకి జస్టిఫై చేసేలా ఉన్న ఈ ముగింపు చాలా థ్రిల్లింగా ఉంటుంది. ఏమాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాక సినిమా అర్థమైన ప్రేక్షకుడు ఎవరైనా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండడు.

మొదటి అర్థ భాగం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడుకున్న దర్శకుడు ముఖ్యమైన నిత్యా మీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజినా వంటి పాత్రల్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశాడు. ముఖ్యంగా కాజల్, రెజినా పాత్రలు తీవ్రంగా, మురళీ శర్మ, ప్రియదర్శి పాత్రల్లో మంచి ఫన్ మూమెంట్స్ దొరుకుతాయి. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవితేజ)ల మధ్యన జరిగే సంభాషణలు నవ్వించాయి.

ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని భలేగా ఉంది అనేలా ఇచ్చి సెకండాఫ్లో ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు మీగుంపుని మాత్రం ఊహించని రీతిలో ఇచ్చాడు. మార్క్.కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరొక పెద్ద బలం. కీలకమైన ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా తయారుచేశారాయన.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి సగ భాగంలో పాత్రల పరిచయం బాగున్నా అసలు కథేమిటి అనేది రివీల్ కాకపోవడంతో అన్ని పాత్రలు ఎందుకనే సందేహం కలుగుతుంది. శ్రీనివాస్ అవసరాల పాత్ర మీద నడిచే కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉంటాయి. పైగా అతని ట్రాక్ కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది కూడ.

ద్వితీయార్థంలో ముంగింపుకు ముందు జరిగే కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫలితంతో సంబంధం లేకుండా ఒకడుగు ముందుకేసి నాని చేసిన ఈ సినిమా కొత్తదనాన్ని కోరుకునే వారికి నచ్చినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కాన్సెప్ట్ ఆధారంగా తీయడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అంతగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన, ఎగ్జిక్యూషన్ ను మెచ్చుకుని తీరవలసిందే. పేపర్ మీదే తికమకగా అనిపించే ఈ కథను కొన్ని చిన్న చిన్న లోపాలున్నా తెర మీద సాద్యమైనంత వరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నం బాగుంది.

కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తని సింగిల్ లొకేషన్లో తీసినా ఎక్కడా సన్నివేశాలు బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు. మార్క్.కె. రాబిన్ నైపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశాలకు అదనపు బలాన్ని చేకూర్చింది. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ బాగానే ఉన్నా సెకండాఫ్లో ఇంకాస్త క్లారిటీ మైంటైన్ చేసుండాల్సింది. నిర్మాతగా నాని ఒక ప్రయోగాత్మక చిత్రానికి కావల్సిన మంచి నటీనటుల్ని, మంచి బడ్జెట్ ను కేటాయించి తన వంతు న్యాయం చేసి కొత్తదనానికి సరైన పోరుత్సాహన్ని అందించారు.

తీర్పు :

ఈ ‘అ !’ చిత్రం మొదటి నుండి నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్ వర్మలు చెబుతున్నట్టే రెగ్యులర్ సినిమాల కోణం నుండి చూడాల్సిన సినిమా కాదు. దర్శకుడు సింపుల్ లైన్ కు తెలివైన కథనాన్ని, బలమైన పాత్రల్ని, సన్నివేశాల్ని, థ్రిల్ చేసే ఇంటర్వెల్, ఆశ్చర్యపరిచే ముగింపును జోడించడంతో సినిమా కొత్తగా, ఆశ్చర్యపోయే విధంగా తయారైంది. కానీ ద్వితీయార్థంలోనే కొన్ని సీన్స్ తికమకపెట్టాయి. మొత్తం మీద సినిమా బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకవచ్చు కానీ కొత్తదనాన్ని స్వాగతించే వారికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది.

       .చివరగా క్లైమాక్స్ లో ఒక మంచి సోషల్ మేసేజ్ తో సినిమా కథ కొనసాగింది. ఫైనల్ గా మంచి నోట్ తో సినిమా ఎండ్ అయ్యింది.. చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూ ఉండండి.

  • ఇప్పుడు రెస్టారెంట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని భయానక సన్నివేశాలు వస్తున్నాయి …

  • ఈ చిత్రం క్లైమాక్స్ వైపుకు సాగుతున్నప్పుడు మొత్తం సెటప్ వెనుక ఉన్న సస్పెన్స్ వెల్లడైంది మరియు ప్రతి పాత్ర యొక్క ఉద్దేశ్యం పై క్లారిటీ వస్తుంది.

  • రెజినా మరియు ఆమె ఫ్రెండ్ మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి… అదే సమయంలో కాజల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా వస్తున్నాయి.

  • ప్రస్తుతం ఈ చిత్రం శ్రీనివాస్ అవసరాల ఎపిసోడ్ కి మారిపోతుంది మరియు రెస్టారెంట్స్ లోని కిచెన్ లో కీలకమైన సిన్ కి దారితీస్తుంది … ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. మంచి స్క్రీన్ ప్లే.

  • మెజిషియన్ మురళీ శర్మ మరియు అతని భాగస్వామి మధ్య కొన్ని మ్యాజికల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వైపు ఇషా మరియు నిత్య మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ప్రదర్శించబడుతున్నాయి.

  • ఇప్పుడు వస్తోన్న సిన్ రెస్టారెంట్ కిచెన్ లోకి షిఫ్ట్ అయ్యింది..రెస్టారెంట్ చెఫ్, ఫిష్ అండ్ ట్రీ మధ్య కొన్ని ఉల్లాసబరితమైన సన్నివేశాలు తెరపై ఆకట్టుకుంటున్నాయి.

  • సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

  • పోస్ట్ విరామం తరువాత నిత్య మరియు ఈషా తల్లిదండ్రుల మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి … మరోవైపు ప్రియదర్శి మరియు ఫిష్ మధ్య కొన్ని కామెడీ సీన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి… మరో ప్రధాన పాత్ర ట్రీ రవి తేజ యొక్క వాయిస్ ఓవర్ తో సిన్ లో కలిసింది.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు ఈ చిత్రం చాలా డిఫెరెంట్ గా కొనసాగింది. చిత్రంలోని అన్ని పాత్రలు ఒక ఆసక్తికరమైన రీతిలో పరిచయం చేయబడ్డాయి. మరియు సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.

  • కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల అనంతరం సినిమా సగానికి పూర్తయ్యింది.. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.

  • ఎంతగానో ఎదురుచూస్తోన్న రెజీనా క్యారెక్టర్ పరిచయం చేయబడింది..ఆమె సరికొత్త లుక్ లో కనిపిస్తోంది.. కొన్ని ఆశ్చర్యకరమైన పరిచయ సన్నివేశాలు అలరిస్తున్నాయి..

  • మరో మెయిన్ క్యారెక్టర్ మురళీ శర్మ ఒక చిన్న అమ్మాయితో కలిసి ఒక మ్యాజిషియన్ గా ఎంట్రీ ఇచ్చాడు … కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి

  • ఇప్పుడు ఈ చిత్రం అవసరాల శ్రీనివాస్ సైడ్ కి షిఫ్ట్ అయ్యింది, అతను ఒక శాస్త్రవేత్తగా కనిపిస్తున్నాడు … శ్రీనివాస్ మరియు ఒక చిన్న అమ్మాయి మధ్య కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు వస్తున్నాయి.

  • కాజల్ సిన్ లోకి తిరిగి వచ్చింది … ఆమె పాత్ర యొక్క నిజమైన ఉద్దేశ్యం ఇంకా వెల్లడించలేదు …

  • హాస్యనటుడు ప్రియాధర్షి రెస్టారెంట్లో చెఫ్ గా పరిచయం చేయబడ్డాడు, అలాగే నాని వాయిస్ తో ఉన్న ఒక చేప కూడా ఎంట్రీ ఇచ్చింది.. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

  • టాలెంటెడ్ యాక్టర్ నిత్య మీనన్ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఎంట్రీ ఇచ్చింది … కొన్ని పరిచయ సన్నివేశాలు జరుగుతున్నాయి

  • ఇంకొక హీరోయిన్ ఈషా రెబ్బా ఒక రెస్టారెంట్ లో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది … ఆమె తల్లిదండ్రులతో కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..

  • ఈ చిత్రం కాజల్ అగర్వాల్ పరిచయ సన్నివేశం ద్వారా ప్రారంభమైంది … ఆసక్తికరమైన థీమ్ సాంగ్ తో టైటిల్స్ పడుతున్నాయి.

  • హాయ్..115 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.

విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018 నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని సంగీతం : మార్క్.కె. రాబిన్ సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్ : గౌతమ్ నెరుసు నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మొదటి నుండి ఇది కమర్షియల్ సినిమా కాదు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమని నాని చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… కథ: రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు రాధ ( ఈషా రెబ్బ ), క్రిష్ (నిత్యా మీనన్), శివ (శ్రీనివాస్ అవసరాల), మీర (రెజినా), నలభీమ (ప్రియదర్శి) అందరూ ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు బిజీగా, సతమవుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, విముక్తి కోసం మాస్ మర్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు రాధ, క్రిష్, నలభీమ.. వీళ్లంతా ఎవరు, ఒకరికొకరికి మధ్యన సంబంధం ఏంటి, కాలి ఎవర్ని చంపాలనుకుంది, చివరికి వీళ్లందరి కథ ఎలా ముగిసింది అనేదే తెరపై నడిచే సినిమా. ప్లస్ పాయింట్స్ : సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. అవును ఆరంభం నుండి చూపించిన అనేక పాత్రలకి, వాటి చర్యలకి, సన్నివేశాలకి, మాటలకి జస్టిఫై చేసేలా ఉన్న ఈ ముగింపు చాలా థ్రిల్లింగా ఉంటుంది. ఏమాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాక సినిమా అర్థమైన ప్రేక్షకుడు ఎవరైనా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండడు. మొదటి అర్థ భాగం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడుకున్న దర్శకుడు ముఖ్యమైన నిత్యా మీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజినా వంటి పాత్రల్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశాడు. ముఖ్యంగా కాజల్, రెజినా పాత్రలు తీవ్రంగా, మురళీ శర్మ, ప్రియదర్శి పాత్రల్లో మంచి ఫన్ మూమెంట్స్ దొరుకుతాయి. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవితేజ)ల మధ్యన జరిగే సంభాషణలు నవ్వించాయి. ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని భలేగా ఉంది అనేలా ఇచ్చి సెకండాఫ్లో ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు మీగుంపుని మాత్రం ఊహించని రీతిలో ఇచ్చాడు. మార్క్.కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరొక పెద్ద బలం. కీలకమైన ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా తయారుచేశారాయన. మైనస్ పాయింట్స్ : సినిమా మొదటి సగ భాగంలో పాత్రల పరిచయం బాగున్నా అసలు కథేమిటి అనేది రివీల్ కాకపోవడంతో అన్ని పాత్రలు ఎందుకనే సందేహం కలుగుతుంది. శ్రీనివాస్ అవసరాల పాత్ర మీద నడిచే కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉంటాయి. పైగా అతని ట్రాక్ కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది కూడ. ద్వితీయార్థంలో ముంగింపుకు ముందు జరిగే కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫలితంతో సంబంధం లేకుండా ఒకడుగు ముందుకేసి నాని చేసిన ఈ సినిమా కొత్తదనాన్ని కోరుకునే వారికి నచ్చినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కాన్సెప్ట్ ఆధారంగా తీయడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అంతగా నచ్చకపోవచ్చు. సాంకేతిక విభాగం : దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన, ఎగ్జిక్యూషన్ ను మెచ్చుకుని తీరవలసిందే. పేపర్ మీదే తికమకగా అనిపించే ఈ కథను కొన్ని చిన్న చిన్న లోపాలున్నా తెర మీద సాద్యమైనంత వరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తని సింగిల్ లొకేషన్లో తీసినా ఎక్కడా సన్నివేశాలు బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు. మార్క్.కె. రాబిన్ నైపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశాలకు అదనపు బలాన్ని చేకూర్చింది. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ బాగానే ఉన్నా సెకండాఫ్లో ఇంకాస్త క్లారిటీ మైంటైన్ చేసుండాల్సింది. నిర్మాతగా నాని ఒక ప్రయోగాత్మక చిత్రానికి కావల్సిన మంచి నటీనటుల్ని, మంచి బడ్జెట్ ను కేటాయించి తన వంతు న్యాయం చేసి కొత్తదనానికి సరైన పోరుత్సాహన్ని అందించారు. తీర్పు : ఈ ‘అ !’ చిత్రం మొదటి నుండి నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్ వర్మలు చెబుతున్నట్టే రెగ్యులర్ సినిమాల కోణం నుండి చూడాల్సిన సినిమా కాదు. దర్శకుడు సింపుల్ లైన్ కు తెలివైన కథనాన్ని, బలమైన పాత్రల్ని, సన్నివేశాల్ని, థ్రిల్ చేసే ఇంటర్వెల్, ఆశ్చర్యపరిచే ముగింపును జోడించడంతో సినిమా కొత్తగా, ఆశ్చర్యపోయే విధంగా తయారైంది. కానీ ద్వితీయార్థంలోనే కొన్ని సీన్స్ తికమకపెట్టాయి. మొత్తం మీద సినిమా బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకవచ్చు కానీ కొత్తదనాన్ని స్వాగతించే వారికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది.        .చివరగా క్లైమాక్స్ లో ఒక మంచి సోషల్ మేసేజ్ తో…

అ! రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవిభాగం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.2

అ! రివ్యూ

అ! రివ్యూ

User Rating: 3.98 ( 2 votes)
3