జై సింహ రివ్యూ

0jaisimha-review

నటీనట వర్గం : బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం : కె.ఎస్ రవికుమార్

నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ భారీ అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది. కె.ఎస్. రవికుమర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

నరసింహ (బాలక్రిష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంకు చేరుకుంటాడు. అలా అక్కడే డ్రైవర్ గా పని చేసుకుంటున్న అతనికి ఒక ఇన్సిడెంట్ ద్వారా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి గౌరి (నయనతార) ఎదురవుతుంది.

కానీ అప్పటికే ఆమె అతనిపై ద్వేషం పెంచుకుని, అసహ్యించుకునే స్థాయిలో ఉంటుంది. అసలు నరసింహ కొడుకుతో సహా వైజాగ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ? ప్రాణంగా ప్రేమించిన గౌరి అతన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది ? అతని గతమేమిటి ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ నట సింహ బాలక్రిష్ణే. సినిమా ఆద్యంతం అభిమానించే వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని నరసింహ పాత్రలో బాలయ్య జీవించారు. ఎక్కడా అభినయాన్ని వేరే కోణంలోకి తీసుకెళ్లకుండా ఒకేలా నటించి మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన నటనకు చప్పట్లు కొట్టాల్సిందే. ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్సుల్లో కూడా తన మాస్ మార్క్ ప్రదర్శించి అక్కడ కూడా ఆకట్టుకుని హీరోగా సినిమాకు ఎంత చేయాలో అంతా చేశారు బాలయ్య.

ఇక సినిమా విషయానికొస్తే ఆరంభం బాగానే ఉంది. ఫస్టాఫ్ కుంభకోణం బ్యాక్ డ్రాప్లో వచ్చే బ్రహ్మాణుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించే సన్నివేశం చాలా బాగుంది. అందులో కట్ లేకుండా బాలయ్య చెప్పిన డైలాగ్ ఔరా అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది.

ద్వితియార్థంలో బాలయ్య గత జీవితం తాలూకు ముఖ్యమైన ఘటనలు, అతనెందుకు వైజాగ్ వదిలి వచ్చేశాడనే అంశం కొంత బాగానే ఉంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశమైతే గుండెల్ని కొంత బరువెక్కించి బయటికిపంపుతుంది. పైన చెప్పినట్టు అందులో బాలయ్య నటన, సన్నివేశం తాలూకు దర్శకుడు సృష్టించిన పరిస్థితులు బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొత్త కథంటూ ఏముండదు. బాలక్రిష్ణ గత హిట్ సినిమాల తాలూకు ఛాయలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటాయి. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి పెద్దగా ఎగ్జైట్ ఫీలయ్యే ఛాన్స్ దొరకదు. అంతేగాక కె.ఎస్. రవికుమార్ స్క్రీన్ ప్లే కూడా పాత తరహాలోనే ముందు హీరో ప్రస్తుతం, ఆ తర్వాత అతని గతం, చివర్లో మళ్ళీ ప్రస్తుతం అన్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా కొత్త పోకడ, వేగం కనిపించదు.

అలాగే ఫస్టాఫ్లో వచ్చే బ్రహ్మానందం తాలూకు కామెడీ ఓల్డ్ ఫార్మాట్లోనే ఉంటూ ఒకానొక దశలో ఇక చాలు అనే ఫీలింగ్ ను కూడా కలిగిస్తుంది. కథానానికి ముఖ్యమైన ప్రతినాయకులు, హీరో మధ్య వైరం చాలా బలహీనంగా ఉండటంతో బాలయ్య పాత్రలో కూడా తీవ్రత కొంత లోపించింది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది.

సెకండాఫ్లో వచ్చే ముఖ్యమైన బాలయ్య గత జీవితం చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది కానీ చూడటానికి అంత ఆసక్తికరంగా, ఎగ్రెసివ్ గా లేదు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర స్వభావాన్ని, అతని లవ్ ట్రాక్ ను వివరించడానికి తీసిన సన్నివేశాలు మరీ రొటీన్ గా ఉండి కొంత బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. కొందరు ముఖ్యమైన నటుల నటన అస్సలు బాగోలేదు.

సాంకేతిక విభాగం :

రచయిత ఏ.ఎం.రత్నం సినిమాకు అందించిన కథ పాతదే కానీ అందులోని కీలకమైన మలుపులు, సన్నివేశాలు బాగున్నాయి. బాలయ్య పాత్రకు ఆయన రాసిన డైలాగ్స్ కనెక్టయ్యాయి. అలాగే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ గారి స్క్రీన్ ప్లే, టేకింగ్లో కూడా కొత్తదనం, వేగం పెద్దగా కనబడక జస్ట్ ఓకే అనే స్థాయిలోనే ఉంది.

చిరంతన్ భట్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ యావరేజ్ గానే ఉన్నాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పద్దతిగానే ఉన్నా కొంత పాతబడిన సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. నిర్మాత సి.కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఈ సంక్రాంతికి ‘జై సింహ’ తో బరిలోకి దిగిన బాలక్రిష్ణ పర్వాలేదనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. అభిమానులు గర్వపడే స్థాయిలో ఉండే బాలక్రిష్ణ నటన, ఇంటర్వెల్ బ్లాక్, హృదయాలను హత్తుకునే ఎమోషనల్ క్లైమాక్స్, కొన్ని బలమైన సన్నివేశాలు ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా పాత తరహా కథ, నెమ్మదిగా సాగే కథనం, తేలిపోయిన ప్రతినాయకుల పాత్రలు వంటి బలహీనతలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. మొత్తం మీద కొంత పాతగా, రొటీన్ గా ఉన్న ఈ ‘జై సింహ’ చిత్రం అభిమానులను మెప్పించేలా సాధారణ ప్రేక్షకులకు పర్వాలేదనిపించేలా ఉంది.

 

 

భారీ ఫైట్ తరువాత చిత్రం ఎమోషనల్ గా ముగిసింది. చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 07:20 AM January 12, 2018
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. విలన్స్ అశుతోష్ రానా, కాలకేయ ప్రభాకర్ ఇద్దరూ చేతులు కలిపి నయనతారని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:12 AM January 12, 2018
భారీ యాక్సిడెంట్ జరగడంతో ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. ప్రారంభంలో చూపిన హాస్పిటల్ సన్నివేశం ఇప్పుడు చూపిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ప్రధాన విలన్ అశుతోష్ రానా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.
Date & Time : 07:03 AM January 12, 2018
చిత్రంలో మరో ట్విస్ట్ వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో బాలకృష్ణ హరిప్రియని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘ఏవేవో ఏవేవో’ సాంగ్ వస్తోంది.
Date & Time : 06:53 AM January 12, 2018
బాలయ్య, హరిప్రియ మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. మరోవైపు నయనతార, ప్రకాష్ రాజ్ మధ్య కూడా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది.
Date & Time : 06:43 AM January 12, 2018
హరిప్రియ జీవితంతో ముడిపడి ఉన్న కొని కీలకమైన సన్నివేశాలని చూపిస్తున్నారు.
Date & Time : 06:33 AM January 12, 2018
చిత్రంలో మరో హీరోయిన్ హరిప్రియ ఎంట్రీ ఇచ్చింది. బాలయ్య మెకానిక్ షాప్ లో అసిస్టెంట్ మెకానిక్ గా కనిపిస్తోంది.
Date & Time : 06:25 AM January 12, 2018
నయనతార, బాలయ్య మధ్య మంచి మెలోడీ సాంగ్ ‘ప్రియం జగమే’ వస్తోంది.
Date & Time : 06:18 AM January 12, 2018
బాలయ్య, అశుతోష్ రానా మధ్య ఉత్కంఠ భరితమైన సన్నివేశం వస్తోంది.
Date & Time : 06:13 AM January 12, 2018
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభం అయింది. ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లిన చిత్ర కథ వైజాగ్ లో మొదలైంది. బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.
Date & Time : 06:09 AM January 12, 2018
మంచి ట్విస్ట్ తో చిత్రం సగభాగం ముగిసింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 05:59 AM January 12, 2018
భారీ యాక్షన్ సీన్ కు అంతా సిద్ధం అయింది. కాలకేయ ప్రభాకర్ గ్యాంగ్ నుంచి తన కొడుకుని రక్షించుకోవడానికి బాలకృష్ణ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Date & Time : 05:53 AM January 12, 2018
కథ ప్రజెంట్ కి వచ్చింది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 05:45 AM January 12, 2018
కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. బాలకృష్ణ, నయనతార మధ్య చిన్న నాటి సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 05:42 AM January 12, 2018
నటుడు అశుతోష్ రానా వైజాగ్ సెంట్రల్ జైలులో ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంలో చిన్న ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 05:37 AM January 12, 2018
పూజారులకు, పోలీస్ లకు మధ్య ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి. బాలకృష్ణ సంస్కృత భాష డైలాగులతో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 05:32 AM January 12, 2018
కొన్ని ఫన్నీ సీన్స్ తరువాత హిట్ సాంగ్ ‘అమ్మ కుట్టి’ వస్తోంది. బాలయ్య డాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నాడు.
Date & Time : 05:22 AM January 12, 2018
కాలకేయ ప్రభాకర్ లోకల్ విలన్ గా కనిపిస్తున్నాడు. అతని గ్యాంగ్ మురళి మోహన్ కుటుంబంపై అటాక్ చేసింది. కొన్ని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:15 AM January 12, 2018
స్థానిక పోలీస్ కి బాలయ్యకి మధ్య హోరాహోరీ సన్నివేశాలు వస్తున్నాయి. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు సంధిస్తున్నాడు.
Date & Time : 05:10 AM January 12, 2018
సీనియర్ నటుడు మురళీ మోహన్ కుమార్తెగా హీరోయిన్ నటాషా దోషి ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:06 AM January 12, 2018
చిత్రం ఇప్పుడు తమిళనాడు కుంభకోణంకి మారింది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:00 AM January 12, 2018
బాలయ్య చివరకు ఓ చిన్న గ్రామానికి చేరుకున్నాడు. బాలయ్య హీరోయిజం ఎలివేట్ చేసేలా చిన్న ఫైట్ వస్తోంది.
Date & Time : 04:55 AM January 12, 2018
చిత్రం విజయవాడకు మారింది. రైల్వే స్టేషన్ లో బాలకృష్ణ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే తొలి సాంగ్ ‘అనగనగా అనగనగా’ మొదలయింది. బాలయ్య మరియు అతని కొడుకు పై ఈ సాంగ్ షూట్ చేశారు.
Date & Time : 04:46 AM January 12, 2018
నాయనతార, ప్రకాష్ రాజ్ పై ప్రారంభ సన్నివేశం వస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:44 AM January 12, 2018
హాయ్..165 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 04:42 AM January 12, 2018

Summary
Review Date
Reviewed Item
జై సింహ
Author Rating
41star1star1star1stargray
నటీనట వర్గం : బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు దర్శకత్వం : కె.ఎస్ రవికుమార్ నట సింహం నందమూరి బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ భారీ అంచనాల నడుమ ఈరోజే విడుదలైంది. కె.ఎస్. రవికుమర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. కథ: నరసింహ (బాలక్రిష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంకు చేరుకుంటాడు. అలా అక్కడే డ్రైవర్ గా పని చేసుకుంటున్న అతనికి ఒక ఇన్సిడెంట్ ద్వారా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి గౌరి (నయనతార) ఎదురవుతుంది. కానీ అప్పటికే ఆమె అతనిపై ద్వేషం పెంచుకుని, అసహ్యించుకునే స్థాయిలో ఉంటుంది. అసలు నరసింహ కొడుకుతో సహా వైజాగ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ? ప్రాణంగా ప్రేమించిన గౌరి అతన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది ? అతని గతమేమిటి ? అనేదే సినిమా. ప్లస్ పాయింట్స్ : సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ నట సింహ బాలక్రిష్ణే. సినిమా ఆద్యంతం అభిమానించే వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని నరసింహ పాత్రలో బాలయ్య జీవించారు. ఎక్కడా అభినయాన్ని వేరే కోణంలోకి తీసుకెళ్లకుండా ఒకేలా నటించి మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన నటనకు చప్పట్లు కొట్టాల్సిందే. ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్సుల్లో కూడా తన మాస్ మార్క్ ప్రదర్శించి అక్కడ కూడా ఆకట్టుకుని హీరోగా సినిమాకు ఎంత చేయాలో అంతా చేశారు బాలయ్య. ఇక సినిమా విషయానికొస్తే ఆరంభం బాగానే ఉంది. ఫస్టాఫ్ కుంభకోణం బ్యాక్ డ్రాప్లో వచ్చే బ్రహ్మాణుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించే సన్నివేశం చాలా బాగుంది. అందులో కట్ లేకుండా బాలయ్య చెప్పిన డైలాగ్ ఔరా అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది. ద్వితియార్థంలో బాలయ్య గత జీవితం తాలూకు ముఖ్యమైన ఘటనలు, అతనెందుకు వైజాగ్ వదిలి వచ్చేశాడనే అంశం కొంత బాగానే ఉంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశమైతే గుండెల్ని కొంత బరువెక్కించి బయటికిపంపుతుంది. పైన చెప్పినట్టు అందులో బాలయ్య నటన, సన్నివేశం తాలూకు దర్శకుడు సృష్టించిన పరిస్థితులు బాగుంటాయి. మైనస్ పాయింట్స్ : సినిమాలో కొత్త కథంటూ ఏముండదు. బాలక్రిష్ణ గత హిట్ సినిమాల తాలూకు ఛాయలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటాయి. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి పెద్దగా ఎగ్జైట్ ఫీలయ్యే ఛాన్స్ దొరకదు. అంతేగాక కె.ఎస్. రవికుమార్ స్క్రీన్ ప్లే కూడా పాత తరహాలోనే ముందు హీరో ప్రస్తుతం, ఆ తర్వాత అతని గతం, చివర్లో మళ్ళీ ప్రస్తుతం అన్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా కొత్త పోకడ, వేగం కనిపించదు. అలాగే ఫస్టాఫ్లో వచ్చే బ్రహ్మానందం తాలూకు కామెడీ ఓల్డ్ ఫార్మాట్లోనే ఉంటూ ఒకానొక దశలో ఇక చాలు అనే ఫీలింగ్ ను కూడా కలిగిస్తుంది. కథానానికి ముఖ్యమైన ప్రతినాయకులు, హీరో మధ్య వైరం చాలా బలహీనంగా ఉండటంతో బాలయ్య పాత్రలో కూడా తీవ్రత కొంత లోపించింది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది. సెకండాఫ్లో వచ్చే ముఖ్యమైన బాలయ్య గత జీవితం చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది కానీ చూడటానికి అంత ఆసక్తికరంగా, ఎగ్రెసివ్ గా లేదు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర స్వభావాన్ని, అతని లవ్ ట్రాక్ ను వివరించడానికి తీసిన సన్నివేశాలు మరీ రొటీన్ గా ఉండి కొంత బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. కొందరు ముఖ్యమైన నటుల నటన అస్సలు బాగోలేదు. సాంకేతిక విభాగం : రచయిత ఏ.ఎం.రత్నం సినిమాకు అందించిన కథ పాతదే కానీ అందులోని కీలకమైన మలుపులు, సన్నివేశాలు బాగున్నాయి. బాలయ్య పాత్రకు ఆయన రాసిన డైలాగ్స్ కనెక్టయ్యాయి. అలాగే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ గారి స్క్రీన్ ప్లే, టేకింగ్లో కూడా కొత్తదనం, వేగం పెద్దగా కనబడక జస్ట్ ఓకే అనే స్థాయిలోనే ఉంది. చిరంతన్ భట్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ యావరేజ్ గానే ఉన్నాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పద్దతిగానే ఉన్నా కొంత పాతబడిన సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. నిర్మాత సి.కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తీర్పు : ఈ సంక్రాంతికి ‘జై సింహ’ తో బరిలోకి దిగిన బాలక్రిష్ణ పర్వాలేదనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. అభిమానులు గర్వపడే స్థాయిలో ఉండే బాలక్రిష్ణ నటన, ఇంటర్వెల్ బ్లాక్, హృదయాలను హత్తుకునే ఎమోషనల్ క్లైమాక్స్, కొన్ని బలమైన సన్నివేశాలు ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా పాత తరహా కథ, నెమ్మదిగా సాగే కథనం, తేలిపోయిన ప్రతినాయకుల పాత్రలు వంటి బలహీనతలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. మొత్తం మీద కొంత పాతగా, రొటీన్ గా…

జై సింహ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 4
సాంకేతికవిభాగం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.4

జై సింహ రివ్యూ

జై సింహ రివ్యూ

User Rating: 4.18 ( 4 votes)
3