Templates by BIGtheme NET
Home >> REVIEWS >> భాయ్‌ రివ్యూ

భాయ్‌ రివ్యూ


రివ్యూ: భాయ్‌

క్లాస్ హీరో అనుకొంటారు గానీ.. నాగార్జున‌కు మాస్ పాత్రలు అంత‌కంటే బాగా న‌ప్పుతాయి. హ‌లోబ్రద‌ర్‌, అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, మాస్.. ఇవ‌న్నీ మాస్ సినిమాలే క‌దా. శిరిడీసాయి, రాజ‌న్న సినిమాల‌తో కాస్త విభిన్నమైన పాత్రలు చేసి మాస్‌కి దూర‌మయ్యారు. ఈసారి పూర్తి స్థాయి మాస్ ఎంట‌ర్ టైన‌ర్‌ని న‌మ్ముకొన్నారు. అదే భాయ్‌. వీర‌భ‌ద్రమ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ క‌థానాయిక‌. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. భాయ్ ఎలా ఉండ‌బోతోంది..? ఈ సినిమాలోని హైలెట్స్ ఏమిటి?

* నాగార్జున పాత్ర ఈ సినిమాకి పెద్ద హైలెట్ అంటున్నారు వీర‌భ‌ద్రమ్‌. ఆయ‌న్ని మూడు కోణాల్లో చూపిస్తార‌ట‌. హాంకాంగ్‌లో ఉన్న భాయ్‌.. ఇండియాకి ఎందుకొచ్చాడు అనేదే ఈ సినిమా క‌థ‌.

* దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ఉన్న అద‌న‌పు ఆక‌ర్షణ‌. బీహెచ్ఏఐ భాయ్‌… చీక‌టిప‌డితే ప్లేబాయ్ అనే టైటిల్ సాంగ్ అద‌ర‌గొడుతోంది. మిగ‌తా పాట‌లూ మాస్‌కి న‌చ్చేవే.

* ఓ పాట‌లో న‌థాలియా కౌర్ నాగ్‌తో ఆడిపాడ‌బోతోంది. కామ్నాజెఠ్మలానీ కూడా త‌ళుక్కున మెర‌వ‌బోతోంది.

* డేవిడ్ (ఆశిష్ విద్యార్థి) అనే డాన్‌కి విజ‌య్ (నాగ్‌) రైట్ హ్యాండ్‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ భాయ్‌గా మారాల్సివ‌స్తుంది. అదెలా అనేదే ఈ సినిమా క‌థ‌. రాధిక (రిచా) పాత్ర కీల‌కం. బ్రహ్మానందం, ఎమ్మెస్‌, జ‌య‌ప్రకాష్ రెడ్డి, సోనూసూద్‌, జారా, ర‌ఘుబాబు, ప్రభాస్ శీను, కామ్నాజెఠ్మలానీ, న‌థాలియా, న‌ర్సింగ్ యాద‌వ్‌.. ఇలా బ్యాచ్ కూడా బాగానే ఉంది. ఈ సినిమాలో బ్రహ్మీ ఓ ఎన్ ఆర్ ఐగా క‌నిపిస్తారు.

* అహ‌నాపెళ్లంట‌, పూల రంగ‌డు సినిమాల‌తో విజ‌యాలు అందుకొన్నాడు వీర‌భ‌ద్రమ్‌. భాయ్‌ని కూడా బాగానే తీర్చిదిద్దాడ‌ట‌. హ‌లో బ్రద‌ర్‌లా పక్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తీర్చిదిద్దాడ‌ట‌. మ‌రి హ్యాట్రిక్ కొడ‌తాడో లేదో చూడాలి.

* భాయ్ డైలాగ్స్ ఇప్పటికే పాపుల‌ర్ అయ్యాయి. వాటిని భాయ్ బుల్లెట్స్ పేరుతో విడుద‌ల చేశారు.

* అత్తారింటికి దారేది త‌ప్ప‌.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర మ‌రో సినిమా లేదు. ఈ అవ‌కాశాన్ని నాగ్ ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకొంటాడో. అన్నట్టు భాయ్ 1000 స్ర్కీన్‌ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

 

భాయ్ – చిత్ర కథ

 

డేవిడ్(ఆశిష్ విద్యార్థి) హాంకాంగ్ లో ఉంటూ మాఫియా సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి పనినైనా చాకులా చేసెయ్యగల భాయ్(నాగార్జున) డేవిడ్ కి రైట్ హ్యాండ్ గా పనిచేస్తూ ఉంటాడు. డేవిడ్ మాఫియా సామ్రాజ్యాన్ని కూల్చేయాలని అండర్ కవర్ కాప్ గా అర్జున్(ప్రసన్న)ని రంగంలోకి దింపుతారు. అర్జున్ డేవిడ్ మనుషులని చంపేయడం మొదలుపెడతాడు. దాంతో డేవిడ్ అర్జున్ ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ పనిని భాయ్ కి అప్పగిస్తాడు.

భాయ్ హైదరాబాద్ వచ్చి అర్జున్ ని చంపేయడానికి ప్లాన్ వేస్తుంటాడు. అప్పుడే భాయ్ కి ఓ నిజం తెలుస్తుంది. ఆ నిజం తో భాయ్ కాస్తా డేవిడ్ కి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. అసలు భాయ్ డేవిడ్ కి ఎందుకు ఎదురు తిరిగాడు? అసలు భయ తెలుసుకున్న నిజం ఏంటనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

 

భాయ్ – నటీనటుల ప్రతిభ

 

నాగార్జున నటన సన్నివేశం చెప్పకుండా ఇలాంటి నటించండి అన్నట్టు నటించారు షిరిడి సాయి చిత్రంలో నటించింది నాగార్జున గారేనా అన్న అనుమానం వస్తుంది. ఈ మద్య కాలంలో నాగార్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కాని ఆయన నటన ప్రశంశలు పొందాయి కాని ఈ చిత్రం విషయంలో నాగార్జున అందులోనూ ఫెయిల్ అయ్యారు. రిచా గంగోపద్యాయ్ సినిమాలను వదిలి వెళ్ళాలన్న నిర్ణయం సరైనదే అనిపించేలా ఉంది ఈ సినిమాలో ఆమె నటన.

నాగినీడు గారి కాస్ట్యూమ్ అయినా మార్చాలి లేకపోతే ఆయన్ని అయినా మార్చాలి ఒకే రకమయిన టెంప్లెట్ తో ఆయన్ని చూసి విసుగు వచ్చేస్తుంది. ప్రసన్న నటన బాగుంది కాని పాత్రకి కావలసిన దానికన్నా ఎక్కువగా నటించారు . కాని చిత్రం లో ఆయనదే బెస్ట్ స్క్రీన్ ప్రేసేన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో చాలా మంది నాగార్జున కోసమే నటించాను అన్నట్టు గా కనిపించారు. ఇక నటీనటుల గురించి ఇంతకన్నా ఒక్క మాట ఎక్కువ చెప్పుకోడానికి లేదు.

 

భాయ్ – సాంకేతికవర్గం పనితీరు

 

ఈ చిత్రంలో కథ పాతది, కథనం నెమ్మది, దర్శకత్వం ఎక్కడున్నది?? మూడు సబ్జెక్ట్ లు రాసిన వీర భద్రమ్ మూడింటిలోనూ ఫెయిల్ అయ్యాడు. మరో అవకాశం రాదనుకున్నారేమో రచయితలు ప్రాసతో “పిచ్చి”ఎక్కించెసారు. సినిమాటోగ్రఫీ పరవాలేదు. ఎడిటర్ కి ఫుల్ పేమెంట్ ఇవ్వలేదేమో లేదా కట్ చెయ్యడానికి మొహమాట పడ్డాడో తెలియట్లేదు కాని చాలా సన్నివేశాలు ఉంచేసాడు ఒక సన్నివేశం వద్ద ఎడిటర్ కట్ చేసాడో డైరెక్టర్ రాసుకోలేదో కాని మూడు సన్నివేశాలు వస్తాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మూడింటికి కథతో సంభంధం ఉండదు.

దేవి శ్రీ ప్రసాద్ బలం లేని సన్నివేశాలకు అవసరం లేని స్థాయిలో నేపధ్య సంగీతం అందించారు. పాటలు ఒక ఎత్తయితే అందులో నాగార్జున డాన్స్ లు మరో ఎత్తు… ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం రిచ్ గా ఉంటుంది నిర్మాణ విలువల విషయంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడా రాజి పడలేదు.

 

భాయ్ – చిత్ర విశ్లేషణ:

 

ఈ సినిమాకి విశ్లేషణ రాయడం ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు. ఒక్కో డిపార్టుమెంటు తీసుకుంటే ముందుగా కెప్టెన్ దగ్గర నుండి మొదలు పెట్టాలి దర్శకుడు వీరభద్రమ్ , ఆహా నా పెళ్ళంట , పూల రంగడు చిత్రాలతో ప్రజలను ఆకట్టుకున్నాను అనుకున్నాడేమో ఇందులో నేను బాగా తీయగలను అన్న కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తుంది. కాని అవి రీమేక్ లు ఇది డైరెక్ట్ మూవీ అన్న సంగతి మరిచిపోయారు. థియేటర్ లో రకరకాల స్పందన గమనించాను కాని ఈరోజు నేను చుసిన స్పందన మాత్రం ఇదే మొదటి సారి, నాగార్జున గారు సెంటిమెంట్ సన్నివేశాలలో నటిస్తుంటే నవ్వుతున్నారు వీర భద్రం గారు..

ఇంక కథ రాసిన వీరభద్రం, పులిహోర రెసిపి లో ఏదో లోపం ఉంది మాస్టారు ఓసారి రీ-చెక్ చేసుకోండి… కథనం రాసిన వీరభద్రం , సన్నివేశాలకు తగ్గ కథ లేదా కథకు తగ్గ సన్నివేశాలు ఈ సినిమాలో ఈ రెండు కనపడవు కథ ఎక్కడనో మొదలయ్యి ఎక్కడికో వెళ్తుంటుంది అవేమి పట్టనట్టు సన్నివేశాలు మరో వైపు వెళ్తుంటుంది.. ప్రాసలో రెండు పదాలు అనేసుకొని దాని కలపడానికి డైలాగ్స్ రాసినట్టు ఉన్నాయి, ప్రాస కోసం ఎంత దూరం వెళ్ళగలరో అంత దూరం వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ లో కూడా ప్రాసని ఫాలో అయ్యారంటే వల పిచ్చి ఎక్కడి దాకా వెళ్లిందో అర్ధం అయిపోతుంది. ఇది ప్రాస కాదండి పిచ్చి….

నాగార్జున గారు అసలు ఈ చిత్రాన్ని ఎందుకు ఒప్పుకున్నారో భూతద్దంలో చూసినా ఒక్క కారణం కూడా దొరకదు. ఆయనకి ఈ వయసులో డాన్స్ చెయ్యాలన్న కోరిక ఎందుకు పుట్టిందో కాని సినిమాలో కామెడీ లేని లోటు తీర్చేస్తున్నారు. ఇక చాలు నాగార్జున గారు హెవీ డోస్ అయిపోయింది. ఇలాంటి సినిమా నుండి మిమ్మల్ని మీరే ఎలిమినేట చేసేసుకోండి సార్ …. మనకి ఇవి సూట్ కావు .. మనకంటూ ఒక మార్క్ ఉంది ఇలాంటి సినిమాలు చేసి వాటిని కూడా పోగొట్టుకోకండి..

ఒక భాషా , ఒక బాద్షా , ఒక నాయకుడు(రాజ శేకర్) , ఒక ముగ్గురు మొనగాళ్ళు, ఒక చిన్నోడు (సుమంత్) , ఒక ఘటికుడు(సూర్య) ఇవన్ని ఒక ఎత్తయితే నాగార్జున హీరోగా వచ్చిన వజ్రం షేడ్స్ కనిపించడం ఏంటో.

సినిమా చివర్లో “భాయ్ బాదితులు” అనగానే ప్రేక్షకులందరు వాళ్ళ బాధని గుర్తించినందుకు ఆనందపడతారు ఇద్దరు ముగ్గురు విజిల్స్ వేశారు కూడా ..

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చిత్రం మొదలయిన దగ్గర నుండి ఒక్క సీన్ అయినా బాగుంటుందేమో అని వెయిట్ చేసిన ప్రేక్షకుడు నిరాశతో వేణు తిరగడం ఖాయం…

ఈ సినిమా ఎందుకు చూడాలి అన్న ప్రశ్నకి నాగార్జున వేసిన స్టెప్స్ మాత్రమే జవాబు… అవి ఎంజాయ్ చెయ్యలేని వాళ్ళు ఈ చిత్రానికి వెళ్ళకపోవడమే మంచిది.

 

Nagarjuna’ Bhai Making Video:

Tags : భాయ్‌ రివ్యూ, bhai, bhai review, bhai movie review, bhai telugu movie review, nagarjuna bhai review, bhai rating, bhai movie rating, bhai live updates, bhai first day first show, bhai film review, bhai cinema review, bhai telugu movie rating, bhai 2013 review,bhai 2013 review,bhai cinema review,bhai film review,bhai first day first show,bhai live updates,bhai movie rating,bhai movie review,bhai rating,bhai review,bhai telugu movie rating,bhai telugu movie review,nagarjuna bhai review