భరత్ అనే నేను రివ్యూ

0చిత్రం : భరత్ అనే నేను

నటీనటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ

దర్శకత్వం : కొరటాల శివ

నిర్మాత : డివివి.దానయ్య

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రవి.కె.చంద్రన్, తిరునవుక్కరసు

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

స్క్రీన్ ప్లే : కొరటాల శివ

విడుదల తేదీ : ఏప్రిల్ 20, 2018

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కొరటాల శివ రూపొందిన చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రిన్స్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం ఈరోజే థియేటర్లోకి వచ్చింది. మరి ముఖ్యమంత్రిగా మహేష్ పనితనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఇంగ్లాండ్ లో ఉంటూ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో వేరే వేరే డిగ్రీలు చేసే కుర్రాడు భరత్ (మహేష్ బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి (శరత్ కుమార్) మరణంతో ఇండియా తిరిగొచ్చి పెద్దల మాటతో బలవంతం మీద ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరిస్తాడు.

అలా రాజకీయాలు గురించి, రాష్ట్ర పాలన గురించి, పార్టీలోని రాజకీయ నాయకుల గురించి ఏమాత్రం అవగాహన లేని భరత్ ఎలా పరిపాలన కొనసాగించాడు ? ప్రమాణస్వీకారంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అడుగడుగునా ఎలా తపించాడు ? రాష్ట్రాన్ని బాగుచేయడంలో ఎలాంటి కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు, ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన బలం నిస్సందేహంగా మహేష్ బాబే. ముఖ్యమంత్రి పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన అద్భుతంగా పండి సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. కథ పరంగా చెప్తే సినిమా చాలా సింపుల్ గానే ఉంటుంది. కానీ దానికి మహేష్ పెర్ఫార్మెన్స్ ను యాడ్ చేసి చూస్తే మాత్రం గొప్పగా ఉంటుంది. అంతలా సినిమాను నిలబెట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహేష్. విదేశాల్లో చదువుకుంటూ, రాజకీయాల గురించి అస్సలు అవగాహన లేని ఒక మామూలు కుర్రాడు ముఖ్యమంత్రి అయితే ఎలా నడుచుకుంటాడు, పరిపాలన ఎలా సాగిస్తాడు, వ్యవస్థలో అందరికీ జవాబుదారీతనం అలవడేలా ఎలా పనిచేస్తాడు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడతాడు అనే సున్నితమైన అంశాల్ని మహేష్ తన నటనతో తెర మీద పలికించిన విధానం చాలా బాగుంది.

దర్శకుడు కొరటాల శివ ఎప్పటిలాగే బలమైన సోషల్ పాయింట్ ను చెప్పినా కమర్షియల్ విలువల్ని వదిలిపెట్టకూడదనే తన ప్రాథమిక సూత్రాన్ని పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన సినిమాను రూపొందించారు. ఒక స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్ర చేస్తున్నాడంటే అందులో రియల్ లైఫ్ రాజకీయనాయకుల ఛాయలు మొత్తంగా కాకపోయినా కొంతైనా కనబడతాయి…కానీ కొరటాల మాత్రం సిఎం భరత్ పాత్ర ఏ నాయకుడ్ని ప్రతిబింబించేలా ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ప్రజా సమస్యల్ని ఆధారం చేసుకుని ఆయన రాసిన ప్రతి సన్నివేశం, వాటికి చూపిన పరిష్కారాలు సమ్మతంగా అనిపిస్తూ ప్రేక్షకులకి బాగా కనెక్టవుతాయి.

ఇక ఫస్టాఫ్లో మహేష్ సిఎం అవ్వడం, ప్రజల సమస్యల్ని తీర్చడం, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎపిసోడ్, ఫైట్ సీన్స్ హీరో పాత్రకి గట్టి ఎలివేషన్ ఇచ్చి ప్రేక్షకులు ఆ పాత్రతో పాటే ఎమోషనల్ జర్నీ చేసేలా చేశాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలను చిత్రీకరించిన తీరు, ఫైట్స్, కొరటాల శివ రాసిన అర్థవంతమైన డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్ధభాగం హీరో పరిచయం, లవ్ ట్రాక్, కథలో కీలకమైన ముఖ్యమంత్రి పాత్రలోకి మహేష్ ప్రవేశించడం, ఉత్కంఠకు గురిచేసే రాజకీయపరమైన సన్నివేశాలు, మంచి పాటలతో అలరించగా ద్వితియార్ధం కొద్దిగా నెమ్మదించింది. కథానాయకుడి పాత్ర కష్టాల్లో పడిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కొంత బలహీనంగా, కథనం కూడ ఊహాజనితంగా అనిపిస్తాయి.

అంతేగాక రన్ టైమ్ కొద్దిగా ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. ప్రతి నాయకుడి పాత్రలో పూర్తిస్థాయి బలం కనబడలేదు. ఇక క్లైమాక్స్ ఆమోదయోగ్యమైనదే అయినా ఊహించినంత భీభత్సంగా లేకుండా సింపుల్ గా ఉండటం కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కొరటాల శివ ఒక స్టార్ హీరో నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏ స్థాయి సినిమానైతే ఆశిస్తారో అలాంటి సినిమానే అందించారు. మహేష్ ఇమేజ్ కు తగిన కథ, కథనాల్ని రాసుకున్న ఆయన ప్రతి 5 నిముషాలకి ఒక మంచి సన్నివేశంతో, మంచి డైలాగ్స్, పాటలు, ఫైట్స్ తో చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటరటైనర్ గా తీర్చిదిద్ది విజయాన్ని ఖాయం చేసుకున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సందర్భానుసారమైన పాటల సంగీతం అలరించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని తీవ్రతను రెట్టింపు చేసింది. సినిమాటోగ్రఫర్స్ రవి కె.చంద్రన్, తిరునవుక్కరసుల కెమెరా పనితనం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఫైట్స్, పాటలు, ఎలివేషన్ సన్నివేశాలను బాగా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు చాలా ఉపయోగపడింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్ వేసిన అసెంబ్లీ సెట్, దండాలయ్యా సామి పాటలో దేవాలయం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక నిర్మాత డివివి. దానయ్య అయితే ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టి గొప్ప, గౌరవప్రదమైన సినిమాను తీశారు.

తీర్పు :

మహేష్ బాబు, కొరటాల శివల కలయికపై అభిమానులు, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాల్ని ఈ సినిమా పూర్తిస్థాయిలో అందుకునేలా ఉంది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ అసామాన్య నటన, హీరోయిజం తారా స్థాయిలో పండేలా కొరటాల శివ రాసిన ఎలివేషన్ సీన్లు, ఆయన టేకింగ్, ఆసక్తిగా అనిపించే కీలకమైన సన్నివేశాలు, హెవీ యాక్షన్ సీన్స్, అదనపు బోనస్ అన్నట్టుగా ఉన్న పాటలు, రొమాంటిక్ ట్రాక్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా నెమ్మదించిన సెండాఫ్, ఊహాజనితమైన క్లైమాక్స్ కొంత నిరుత్సాహానికి గురిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకలో చెప్పిన ఈసారి అందరికీ నచ్చే సినిమాను అందిస్తాను అనే మాటను పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నాడు అనొచ్చు.

‘భరత్ అనే నేను’ : లైవ్ అప్డేట్స్

 • కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో చిత్రం పూర్తయింది. పూర్తి సమీక్ష కోసం telugunow.com చూస్తూ వుండండి.

 • చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతూ ప్రస్తుతం మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ల మధ్య బలమైన మాటల యుద్ధం సన్నివేశం నడుస్తోంది

 • ఒక అద్భుతమైన ఛేజింగ్ సన్నివేశం తరువాత ప్రస్తుతం కొరటాల మార్క్ ఫైట్ ఎపిసోడ్ వస్తోంది

 • భరత్ ప్రెస్ మీట్ కి పిలుపునిచ్చాడు, మరియు ఇప్పుడు ఒక తీవ్రమైన సన్నివేశం జరుగుతోంది. ఈ ప్రత్యేక సన్నివేశంలో మహేష్ బాబు నటన అద్భుతమని చెప్పాలి

 • హీరోయిన్ కైరా అద్వానీ పాత్ర సినిమాలో చిన్నదే అయినప్పటికీ, ఆమె పాత్ర ప్రస్తుతం కథని కీలక మలుపు తిప్పింది

 • కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు తర్వాత చిత్రం హీరో హీరోయిన్ల ప్రేమకథకు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం ఓ వసుమతి పాట వస్తోంది …

 • కొన్ని రగులుతున్న సమస్యల ప్రస్తావన తరువాత భరత్ గ్రామీణుల సమస్యల పరిష్కారం పై తన ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి

 • ప్రస్తుతం ముఖ్యమైన వచ్చాడయ్యో సామి పాట వస్తోంది. ఈ పాట అద్భుతంగా చిత్రీకరించబడింది మరియు పెద్ద తెరపై చూడటానికి మరింత అద్భుతంగా ఉంది.

 • ప్రస్తుతం సీఎం భరత్, తన పార్టీ లీడర్ రవిశంకర్ మధ్య తీవ్రమైన ఘర్షణ సన్నివేశాలు నడుస్తున్నాయి

 • ఇంటర్వెల్ తరువాత సీఎం భరత్ మరియు నటుడు రాహుల్ రామకృష్ణ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. భరత్ అసలు పొలిటికల్ గేమ్ ఇప్పుడే మొదలయింది

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇంతవరకు ఈ చిత్రం ఆసక్తికరమైన మరియు సరదా సన్నివేశాలతో బాగానే ఆకట్టుకొంది. ముఖ్యమంత్రిగా మంచి హుందాతనంతో కూడిన డైనమిక్ పాత్రలో నటించిన మహేష్ బాబు చిత్రానికి ప్రధాన హైలైట్ గా చెప్పుకోవాలి.

 • ఒక మంచి సన్నివేశంతో చిత్రం సగం పూర్తి అయింది. ప్రస్తుతం ఇంటర్వెల్

 • కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఇతర పార్టీల రాజకీయ నాయకుల మధ్య కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు వస్తున్నాయి

 • హీరో హీరోయిన్ల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాల తర్వాత ప్రస్తుతం ఇది కలలా వున్నదే పాట వస్తోంది. పాటలో ఫ్యాన్స్ కోసం ఒక చిన్న సర్ ప్రైస్ వుంది.

 • ఇప్పుడే ఆక్టర్ అజయ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి

 • ప్రజలకి సేవ చేసేందుకు ముఖ్యమంత్రి భరత్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం భరత్ అనే నేను థీమ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తోంది

 • హీరో హీరోయిన్ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాల తర్వాత సీన్ పొలిటికల్ మూడ్ కి మారింది. మనం ప్రస్తుతం మనం ఎదురుచూస్తున్న అసెంబ్లీ సన్నివేశాలు వస్తున్నాయి

 • ఒక బస్ స్టాప్ లో హీరోయిన్ కైరా అద్వానీ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని పరిచయ సన్నివేశాలు నడుస్తున్నాయి

 • భరత్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించాడు. ప్రస్తుతం తన టీం మెంబర్లు ఒక్కొక్కళ్ళుగా పరిచయం చేయబడుతున్నారు

 • ఒక పెద్ద పొలిటికల్ డ్రామా నడిచిన తరువాత భరత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా డిక్లేర్ చేయబడ్డాడు. ప్రస్తుతం భరత్ తొలి ప్రమాణ స్వీకార సన్నివేశం వస్తోంది.

 • ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ పూర్తి అయింది. యాక్టర్లు రవికుమార్, పోసాని ఇప్పుడే పార్టీ మెంబర్లుగా పరిచయం కాబడ్డారు. ప్రస్తుతం కొన్ని రాజకీయ నేపధ్య సన్నివేశాలు నడుస్తున్నాయి

 • శరత్ కుమార్ ఫ్రెండ్ గా ప్రకాష్ రాజ్ పరిచయం చేయబడ్డాడు. సీనియర్ నటి సితార ఇప్పుడే సీన్ లోకి వచ్చారు. కొన్ని ఎమోషనల్ సీన్ లు వస్తున్నాయి

 • ఒక ఎమర్జెన్సీ విషయమై భరత్ ఇండియాకి వస్తాడు. ఆమనీ, శరత్ కుమార్ మహేష్ తల్లితండ్రులుగా కనిపిస్తారు. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి

 • ఆక్సఫర్డ్ యూనివర్సిటీ లో సినిమా ప్రారంభం అయింది. ఇప్పుడే మన చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అందమైన స్పెయిన్ వీధుల్లో మొదటిపాట ఐ డోంట్ నో స్టార్ట్ అయింది.

 • ఒక వ్రాతపూర్వక మెసేజితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టార్ట్ అయింది

 • హాయ్.. 173 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

 • సూపర్ స్టార్ మహేష్ బాబు పొలిటికల్ డ్రామా, భరత్ అనే నేను లైవ్ అప్ డేట్స్ కొన్ని క్షణాల్లో మొదలవుతాయి. ఎక్స్సైట్మెంట్ కోసం చూస్తూ వుండండి.

 

Summary
Review Date
Reviewed Item
Bharat Ane Nenu Movie
Author Rating
41star1star1star1stargray
చిత్రం : భరత్ అనే నేను నటీనటులు : మహేష్ బాబు, కైరా అద్వానీ దర్శకత్వం : కొరటాల శివ నిర్మాత : డివివి.దానయ్య సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ : రవి.కె.చంద్రన్, తిరునవుక్కరసు ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ స్క్రీన్ ప్లే : కొరటాల శివ విడుదల తేదీ : ఏప్రిల్ 20, 2018 సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కొరటాల శివ రూపొందిన చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రిన్స్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం ఈరోజే థియేటర్లోకి వచ్చింది. మరి ముఖ్యమంత్రిగా మహేష్ పనితనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… కథ : ఇంగ్లాండ్ లో ఉంటూ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో వేరే వేరే డిగ్రీలు చేసే కుర్రాడు భరత్ (మహేష్ బాబు) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన తండ్రి (శరత్ కుమార్) మరణంతో ఇండియా తిరిగొచ్చి పెద్దల మాటతో బలవంతం మీద ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరిస్తాడు. అలా రాజకీయాలు గురించి, రాష్ట్ర పాలన గురించి, పార్టీలోని రాజకీయ నాయకుల గురించి ఏమాత్రం అవగాహన లేని భరత్ ఎలా పరిపాలన కొనసాగించాడు ? ప్రమాణస్వీకారంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అడుగడుగునా ఎలా తపించాడు ? రాష్ట్రాన్ని బాగుచేయడంలో ఎలాంటి కష్టాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కున్నాడు, ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ. ప్లస్ పాయింట్స్ : సినిమాకి ప్రధాన బలం నిస్సందేహంగా మహేష్ బాబే. ముఖ్యమంత్రి పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన అద్భుతంగా పండి సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. కథ పరంగా చెప్తే సినిమా చాలా సింపుల్ గానే ఉంటుంది. కానీ దానికి మహేష్ పెర్ఫార్మెన్స్ ను యాడ్ చేసి చూస్తే మాత్రం గొప్పగా ఉంటుంది. అంతలా సినిమాను నిలబెట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహేష్. విదేశాల్లో చదువుకుంటూ, రాజకీయాల గురించి అస్సలు అవగాహన లేని ఒక మామూలు కుర్రాడు ముఖ్యమంత్రి అయితే ఎలా నడుచుకుంటాడు, పరిపాలన ఎలా సాగిస్తాడు, వ్యవస్థలో అందరికీ జవాబుదారీతనం అలవడేలా ఎలా పనిచేస్తాడు, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడతాడు అనే సున్నితమైన అంశాల్ని మహేష్ తన నటనతో తెర మీద పలికించిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కొరటాల శివ ఎప్పటిలాగే బలమైన సోషల్ పాయింట్ ను చెప్పినా కమర్షియల్ విలువల్ని వదిలిపెట్టకూడదనే తన ప్రాథమిక సూత్రాన్ని పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన సినిమాను రూపొందించారు. ఒక స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్ర చేస్తున్నాడంటే అందులో రియల్ లైఫ్ రాజకీయనాయకుల ఛాయలు మొత్తంగా కాకపోయినా కొంతైనా కనబడతాయి…కానీ కొరటాల మాత్రం సిఎం భరత్ పాత్ర ఏ నాయకుడ్ని ప్రతిబింబించేలా ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ప్రజా సమస్యల్ని ఆధారం చేసుకుని ఆయన రాసిన ప్రతి సన్నివేశం, వాటికి చూపిన పరిష్కారాలు సమ్మతంగా అనిపిస్తూ ప్రేక్షకులకి బాగా కనెక్టవుతాయి. ఇక ఫస్టాఫ్లో మహేష్ సిఎం అవ్వడం, ప్రజల సమస్యల్ని తీర్చడం, సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎపిసోడ్, ఫైట్ సీన్స్ హీరో పాత్రకి గట్టి ఎలివేషన్ ఇచ్చి ప్రేక్షకులు ఆ పాత్రతో పాటే ఎమోషనల్ జర్నీ చేసేలా చేశాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలను చిత్రీకరించిన తీరు, ఫైట్స్, కొరటాల శివ రాసిన అర్థవంతమైన డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. మైనస్ పాయింట్స్ : సినిమా మొదటి అర్ధభాగం హీరో పరిచయం, లవ్ ట్రాక్, కథలో కీలకమైన ముఖ్యమంత్రి పాత్రలోకి మహేష్ ప్రవేశించడం, ఉత్కంఠకు గురిచేసే రాజకీయపరమైన సన్నివేశాలు, మంచి పాటలతో అలరించగా ద్వితియార్ధం కొద్దిగా నెమ్మదించింది. కథానాయకుడి పాత్ర కష్టాల్లో పడిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కొంత బలహీనంగా, కథనం కూడ ఊహాజనితంగా అనిపిస్తాయి. అంతేగాక రన్ టైమ్ కొద్దిగా ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. ప్రతి నాయకుడి పాత్రలో పూర్తిస్థాయి బలం కనబడలేదు. ఇక క్లైమాక్స్ ఆమోదయోగ్యమైనదే అయినా ఊహించినంత భీభత్సంగా లేకుండా సింపుల్ గా ఉండటం కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది. సాంకేతిక విభాగం : దర్శకుడు కొరటాల శివ ఒక స్టార్ హీరో నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏ స్థాయి సినిమానైతే ఆశిస్తారో అలాంటి సినిమానే అందించారు. మహేష్ ఇమేజ్ కు తగిన కథ, కథనాల్ని రాసుకున్న ఆయన ప్రతి 5 నిముషాలకి ఒక మంచి సన్నివేశంతో, మంచి డైలాగ్స్, పాటలు, ఫైట్స్ తో చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటరటైనర్ గా తీర్చిదిద్ది విజయాన్ని ఖాయం చేసుకున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సందర్భానుసారమైన పాటల సంగీతం అలరించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని తీవ్రతను రెట్టింపు చేసింది. సినిమాటోగ్రఫర్స్ రవి కె.చంద్రన్, తిరునవుక్కరసుల కెమెరా పనితనం చాలా గొప్పగా ఉంది.…

భరత్ అనే నేను రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 3
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవిభాగం పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 3.75

3.6

భరత్ అనే నేను రివ్యూ

భరత్ అనే నేను రివ్యూ

User Rating: 4.38 ( 5 votes)
4