భీమ‌వ‌రం బుల్లోడు రివ్యూ

0


Bheemavaram Bullodu Movie Reviewహాస్య‌న‌టులు క‌థానాయ‌కులుగా మారారు గానీ…. సునీల్‌ లా ఎవ్వ‌రూ సీరియ‌స్ ఎఫెక్ట్ పెట్ట‌లేద‌నే చెప్పాలి. హీరో కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ సునీల్ అందిపుచ్చుకొన్నాడు. త‌న శ‌రీరాన్ని మార్చుకొన్నాడు. డాన్స్‌ల‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకొన్నాడు. స్టార్ హీరోల‌కు తీసిపోని విధంగా స్టెప్పులేశాడు. ఫైటింగులూ అద‌ర‌గొట్టాడు. అందుకే ఇప్పుడు సునీల్ సినిమా అంటే.. అంత క్రేజ్‌. కేవ‌లం న‌వ్వు కోవ‌డానికే సునీల్ సినిమాకి వెళ్ల‌డం లేదు. డాన్సులు, ఫైటింగులూ ఆశిస్తున్నాం. అవ‌న్నీ మేళ‌వించి ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాడు సునీల్‌. తాజాగా ’భీమ‌వ‌రం బుల్లోడు’లోనూ ఈ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ ఉన్నాయ‌ట‌. మ‌హాశివ‌రాత్రికి రాబోతున్న ఈ బుల్లోడు ఎలా ఉండ‌బోతున్నాడు? ఈ సినిమా హైలెట్స్ ఏంటి?

* సునీల్ – ఎస్తేర్ జంట‌గా న‌టించిన చిత్రం ఇది. ఉద‌య్‌ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడిగా ఉద‌య్ శంక‌ర్‌ కి మంచి పేరుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఆయ‌న‌కు మాతృసంస్థ‌. ద‌ర్శ‌కుడిగా ఆ సంస్థ‌లోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పుడు భీమ‌వ‌రం బుల్లోడిని హిట్ చేసి ఆ సంస్థ రుణం తీర్చుకోవాల‌నుకొంటున్నారాయ‌న‌.

* సునీల్ హీరో అయ్యాక… కామెడీ మిస్ అయిపోయింద‌ని అభిమానుల ఆవేద‌న‌. ఈ సంగ‌తి సునీల్‌కీ తెలుసు. అందుకే హాస్య‌న‌టుడిగా నేను ప‌ది సినిమాల్లో చేసినంత కామెడీ… ఈ ఒక్క సినిమాలోనే చేసేశా అని చెప్తున్నాడు. అంత ఎంట‌ర్‌ టైన్ అందిస్తే.. ప్రేక్ష‌కులు ఈ బుల్లోడికి విజ‌యాన్ని అందించ‌డం ఖాయం.

* ఈ చిత్ర ప్ర‌చారం కూడా వైవిధ్యంగా చేశారు. పాట‌ల్ని సునీల్ సొంతూరు భీమ‌వ‌రంలో ఆవిష్క‌రించారు. బి..బి…బి… భీమ‌వ‌రం బుల్లోడు అంటూ ఓ ప్ర‌చార గీతాన్ని ప్ర‌త్యేకంగా రూపొందించారు. ఈ పాట‌లో చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులూ క‌నిపిస్తారు.

* ఈ సినిమాకి భీమ‌వ‌రం అనే టైటిల్ పెట్ట‌డం వ‌ల్ల‌… ఆ ప్రాంత అభిమానుల ఆద‌ర‌ణ విప‌రీతంగా ఉండొచ్చు. కొస్తాలో సునీల్‌ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. వారికి ఈ సినిమా పండ‌గే.

* సునీల్ ఈ సినిమాలో క్యాన్స‌ర్ పేషెంట్‌ గా క‌నిపిస్తాడ‌ని టాక్‌. ఓ భ‌య‌స్తుడు, ధైర్య‌వంతుడిగా ఎలా మారాడు అనేదే ఈ క‌థ‌. సునీల్ సినిమాల్లోంచి ఆశించే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయ‌ట‌. అవే ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌.

* ముఖ్యంగా డాన్సుల కోసం సునీల్ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేశాడు. ఆయ‌న వేసే స్టెప్స్ ఓ రేంజులో ఉంటాయ‌ని స‌మాచార‌మ్‌.

* 1000 అబ‌ద్దాలు త‌ర‌వాత‌.. ఎస్తేర్ న‌టించిన చిత్రం ఇది. ఆమె కెరీర్‌కు ఇది డిసైడింగ్ సినిమా.

* ఈవారం బుల్లోడికి పెద్ద పోటీ లేదు. బ‌సంతి ఒక్క‌టే విడుద‌ల అవుతుంది. కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకొన్నా… బుల్లోడికి మంచి వ‌సూళ్లు

ద‌క్కొచ్చు.

* వ‌రుస వాయిదాలు ప‌డ‌డం.. ఒక మైన‌స్‌. దాన్ని దాటుకొని ఈ సినిమా విజ‌య‌తీరాల‌కు ఎలా చేరుతుందో చూడాలి.

భీమ‌వ‌రం బుల్లోడు రివ్యూ కోసం చూస్తూనే ఉండండి. 

Bheemavaram Bullodu Movie Review in English