డైనమైట్ రివ్యూ

0dynamite-movie-Review

మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు విష్ణు న‌టించిన గ‌త నాలుగు సినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌చ్చిన‌వే. రౌడీ, ఎర్ర‌బ‌స్సు, అనుక్ష‌ణం ఇలా సినిమా సినిమాకు సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అదే కోవ‌లో త‌మిళంలో హిట్ అయిన అరిమానంబీ సినిమాను స‌త్తా ఉన్న డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌నే నిర్మాత‌గా రీమేక్ చేశారు. విష్ణు స‌ర‌స‌న అందాల భామ ప్ర‌ణీత న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 900 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఎంత‌వ‌ర‌కు అందుకుందో…. డైన‌మైట్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో వ‌చ్చిన డైన‌మైట్ ఎంత వ‌ర‌కు పేలిందో నేటిసినిమా.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

ఓ అమ్మాయిని రోడ్డుపై పోకిరీలు ఏడిపిస్తుంటే ఆ పోకిరీల‌ను చిత‌క్కొట్టేస్తాడు శివాజీకృష్ణ అలియాస్ శివ్ (మంచు విష్ణు). ఇది చూసిన అనామిక దాసరి (ప్రణీత) ఇంప్రెస్ అవుతుంది. వెంట‌నే మెచ్చుకుంటూ మెసేజ్‌, మ‌రుస‌టి రోజే డిన్న‌ర్ ఇంకేముంది ల‌వ్‌లో ప‌డిపోతారు. అనామికను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ కేసు గురించి ఇన్వెస్ట్ చేస్తున్న పోలీసుల‌కు అనామిక గోవాలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆమె ఛానెల్ 24 ఎండీ అయిన దాస‌రి రంగ‌నాథ్ కుమార్తె.

అనామిక‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారో..అస‌లు ఆమె నేప‌థ్యం ఏంటో తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ‌తాడు శివ్‌. ఈ లోగా ఆమె తండ్రిని కిడ్నాఫ‌ర్లు ఓ వీడియో చిప్ ఇవ్వాల్సిందిగా బెదిరిస్తుంటారు. అక్కడే ఉన్న శివ్ ని చూసిన కిడ్నాపర్స్ కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో రంగ‌నాథ్ చ‌నిపోతాడు. త‌ర్వాత వారు అనామిక‌ను కూడా చంప‌డానికి ట్రై చేస్తుంటారు. చివ‌ర‌కు శివ్… ఆ వీడియో చిప్ ని దక్కించుకోవడంతో పాటు అనామికను కిడ్నాపర్స్ నుంచి కాపాడతాడు.

సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రిషిదేవ్ త‌న ప‌వ‌ర్ ఉప‌యోగించి శివ్‌, అనామికను చంపి అయినా సరే ఆ వీడియో చిప్ ని తీసుకురావాల‌ని త‌న గ్యాంగ్‌ను రంగంలోకి దింపుతాడు. ఆ వీడియో చిప్‌లో రిషిదేవ్‌కు స‌బంధించి ఉన్న ర‌హ‌స్య‌మేంటి…సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రిషిదేవ్‌ను శివ్ ఎలా ఎదుర్కొన్నాడు ? చివ‌ర‌కు క‌థ ఎలా మ‌లుపులు తిరిగింది అన్న‌దే మిగిలిన స్టోరీ.

న‌టీన‌టులు ప‌నితీరు:

ఈ సినిమాకు విష్ణు త‌న క్యారెక్ట‌ర్‌కు త‌గిన‌ట్టు బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీలో చాలా మార్పులు-చేర్పుల‌తో క‌న‌ప‌డ్డాడు. ‘అనుక్షణం’, ‘రౌడీ’లో విష్ణు అద్భుతమైన నటన కనబర్చాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విష్ణు న‌ట‌న అత‌డిని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. యాక్ష‌న్‌, చేజింగ్ సీన్స్‌లో బాగా న‌టించాడు. డూప్ లేకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం కూడా ప్ర‌శంసించ‌ద‌గ్గ విష‌యం. ఇక ప్ర‌ణీత త‌న లుక్స్‌తోను, క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లోను ట్రావెల్ చేసింది. చేజింగ్ సీన్స్‌లో, భ‌య‌ప‌డేట‌ప్పుడు ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ బాగున్నాయి. ఇక విల‌న్‌గా రిషీ పాత్ర చేసిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించాడు. ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్‌లో కూడా ఈ పాత్ర‌ను జేడీ పోషించ‌డంతో తెలుగులో కూడా తనే అయితే బాగుంటుందని విష్ణు, దేవా కట్టా జేడీని తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, నాగినీడు, రవి ప్రకాశ్ తదితరులు బాగా నటించారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరు:

తమిళ ‘అరీమా నంబిస‌ కథను తెలుగుకు త‌గిన‌ట్టుగా చ‌క్క‌గా మార్పులు-చేర్పులు చేశారు దేవా కట్టా. స్ర్కీన్ ప్లే అద్భుతంగా కుదిరింది. ఫస్టాఫ్ అప్పుడే అయిపోయిందా అన్నంత వేగంగా సాగింది. సెకండాఫ్ కూడా అదే స్పీడ్‌తో ముందుకు వెళ్లింది. బీవీయస్ రవి రాసిన డైలాగులు సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. పంచ్‌ల‌కు, ప్రాస‌ల‌కు పోకుండా న‌డిపించాడు. అచ్చు పాట‌లు మ‌రీ అంత గొప్ప‌గా కాక‌పోయినా బాగున్నాయి. చిన్నా ఆర్ ఆర్ సూప‌ర్బ్‌. ఇక ముందునుంచి చెప్పిన‌ట్టు ఈ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలను విజ‌య‌న్ ఓ రేంజ్‌లో తీశారు. చాలా సీన్ల‌లో విష్ణు డూప్ లేకుండా న‌టించాడు. విష్ణును చాలా బాగా క‌ష్ట‌పెట్టిన‌ట్టు కూడా అర్థ‌మ‌వుతోంది. టేబుల్ కింద నుంచి జారుకుంటూ వెళ్లే సీన్, అమాంతంగా పడిపోయే సీన్స్ లో హీరోయిన్ ని కూడా కష్టపెట్టారు. టెక్నికల్ గా సినిమా బాగుంది.

ఫైన‌ల్‌గా…

మంచు విష్ణు ఇలాంటి స్టోరీని సెల‌క్ట్ చేసుకోవ‌డం ప్ర‌శంస‌నీయం. అలాగే క‌థ‌కు దేవ క‌ట్టా కూడా న్యాయం చేశాడు. విష్ణు సినిమాకు చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా దర్శకుడు తీశాడు. హీరో, హీరోయిన్ కెమిస్ర్టీ బాగుంది. అయితే సినిమాలో రొమాంటిక్ సీన్స్ పెద్దగా లేకపోయినా, మంచి లవర్స్ అనే విషయం ప్రేక్షకులకు కమ్యూనికేట్ అయ్యే విధంగా సీన్స్ ఉన్నాయి. ఓవ‌రాల్‌గా డైన‌మైట్‌ను ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

 

 

మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు విష్ణు న‌టించిన గ‌త నాలుగు సినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌చ్చిన‌వే. రౌడీ, ఎర్ర‌బ‌స్సు, అనుక్ష‌ణం ఇలా సినిమా సినిమాకు సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అదే కోవ‌లో త‌మిళంలో హిట్ అయిన అరిమానంబీ సినిమాను స‌త్తా ఉన్న డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌నే నిర్మాత‌గా రీమేక్ చేశారు. విష్ణు స‌ర‌స‌న అందాల భామ ప్ర‌ణీత న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 900 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఎంత‌వ‌ర‌కు అందుకుందో…. డైన‌మైట్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌తో వ‌చ్చిన డైన‌మైట్ ఎంత వ‌ర‌కు పేలిందో నేటిసినిమా.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం. స్టోరీ: ఓ అమ్మాయిని రోడ్డుపై పోకిరీలు ఏడిపిస్తుంటే ఆ పోకిరీల‌ను చిత‌క్కొట్టేస్తాడు శివాజీకృష్ణ అలియాస్ శివ్ (మంచు విష్ణు). ఇది చూసిన అనామిక దాసరి (ప్రణీత) ఇంప్రెస్ అవుతుంది. వెంట‌నే మెచ్చుకుంటూ మెసేజ్‌, మ‌రుస‌టి రోజే డిన్న‌ర్ ఇంకేముంది ల‌వ్‌లో ప‌డిపోతారు. అనామికను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ కేసు గురించి ఇన్వెస్ట్ చేస్తున్న పోలీసుల‌కు అనామిక గోవాలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆమె ఛానెల్ 24 ఎండీ అయిన దాస‌రి రంగ‌నాథ్ కుమార్తె. అనామిక‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారో..అస‌లు ఆమె నేప‌థ్యం ఏంటో తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ‌తాడు శివ్‌. ఈ లోగా ఆమె తండ్రిని కిడ్నాఫ‌ర్లు ఓ వీడియో చిప్ ఇవ్వాల్సిందిగా బెదిరిస్తుంటారు. అక్కడే ఉన్న శివ్ ని చూసిన కిడ్నాపర్స్ కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో రంగ‌నాథ్ చ‌నిపోతాడు. త‌ర్వాత వారు అనామిక‌ను కూడా చంప‌డానికి ట్రై చేస్తుంటారు. చివ‌ర‌కు శివ్… ఆ వీడియో చిప్ ని దక్కించుకోవడంతో పాటు అనామికను కిడ్నాపర్స్ నుంచి కాపాడతాడు. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రిషిదేవ్ త‌న ప‌వ‌ర్ ఉప‌యోగించి శివ్‌, అనామికను చంపి అయినా సరే ఆ వీడియో చిప్ ని తీసుకురావాల‌ని త‌న గ్యాంగ్‌ను రంగంలోకి దింపుతాడు. ఆ వీడియో చిప్‌లో రిషిదేవ్‌కు స‌బంధించి ఉన్న ర‌హ‌స్య‌మేంటి…సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రిషిదేవ్‌ను శివ్ ఎలా ఎదుర్కొన్నాడు ? చివ‌ర‌కు క‌థ ఎలా మ‌లుపులు తిరిగింది అన్న‌దే మిగిలిన స్టోరీ. న‌టీన‌టులు ప‌నితీరు: ఈ సినిమాకు విష్ణు త‌న క్యారెక్ట‌ర్‌కు త‌గిన‌ట్టు బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీలో చాలా మార్పులు-చేర్పుల‌తో క‌న‌ప‌డ్డాడు. ‘అనుక్షణం’, ‘రౌడీ’లో విష్ణు అద్భుతమైన నటన కనబర్చాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విష్ణు న‌ట‌న అత‌డిని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. యాక్ష‌న్‌, చేజింగ్ సీన్స్‌లో బాగా న‌టించాడు. డూప్ లేకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం కూడా ప్ర‌శంసించ‌ద‌గ్గ విష‌యం. ఇక ప్ర‌ణీత త‌న లుక్స్‌తోను, క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లోను ట్రావెల్ చేసింది. చేజింగ్ సీన్స్‌లో, భ‌య‌ప‌డేట‌ప్పుడు ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ బాగున్నాయి. ఇక విల‌న్‌గా రిషీ పాత్ర చేసిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించాడు. ఈ సినిమా త‌మిళ్ వెర్ష‌న్‌లో కూడా ఈ పాత్ర‌ను జేడీ పోషించ‌డంతో తెలుగులో కూడా తనే అయితే బాగుంటుందని విష్ణు, దేవా కట్టా జేడీని తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, నాగినీడు, రవి ప్రకాశ్ తదితరులు బాగా నటించారు. టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప‌నితీరు: తమిళ ‘అరీమా నంబిస‌ కథను తెలుగుకు త‌గిన‌ట్టుగా చ‌క్క‌గా మార్పులు-చేర్పులు చేశారు దేవా కట్టా. స్ర్కీన్ ప్లే అద్భుతంగా కుదిరింది. ఫస్టాఫ్ అప్పుడే అయిపోయిందా అన్నంత వేగంగా సాగింది. సెకండాఫ్ కూడా అదే స్పీడ్‌తో ముందుకు వెళ్లింది. బీవీయస్ రవి రాసిన డైలాగులు సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. పంచ్‌ల‌కు, ప్రాస‌ల‌కు పోకుండా న‌డిపించాడు. అచ్చు పాట‌లు మ‌రీ అంత గొప్ప‌గా కాక‌పోయినా బాగున్నాయి. చిన్నా ఆర్ ఆర్ సూప‌ర్బ్‌. ఇక ముందునుంచి చెప్పిన‌ట్టు ఈ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలను విజ‌య‌న్ ఓ రేంజ్‌లో తీశారు. చాలా సీన్ల‌లో విష్ణు డూప్ లేకుండా న‌టించాడు. విష్ణును చాలా బాగా క‌ష్ట‌పెట్టిన‌ట్టు కూడా అర్థ‌మ‌వుతోంది. టేబుల్ కింద నుంచి జారుకుంటూ వెళ్లే సీన్, అమాంతంగా పడిపోయే సీన్స్ లో హీరోయిన్ ని కూడా కష్టపెట్టారు. టెక్నికల్ గా సినిమా బాగుంది. ఫైన‌ల్‌గా… మంచు విష్ణు ఇలాంటి స్టోరీని సెల‌క్ట్ చేసుకోవ‌డం ప్ర‌శంస‌నీయం. అలాగే క‌థ‌కు దేవ క‌ట్టా కూడా న్యాయం చేశాడు. విష్ణు సినిమాకు చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా దర్శకుడు తీశాడు. హీరో, హీరోయిన్ కెమిస్ర్టీ బాగుంది. అయితే సినిమాలో రొమాంటిక్ సీన్స్ పెద్దగా లేకపోయినా, మంచి లవర్స్ అనే విషయం ప్రేక్షకులకు కమ్యూనికేట్ అయ్యే విధంగా సీన్స్ ఉన్నాయి. ఓవ‌రాల్‌గా డైన‌మైట్‌ను ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.    

డైనమైట్ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 3.5
నటీ - నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవర్గం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.5

డైనమైట్ రివ్యూ

డైనమైట్ రివ్యూ

User Rating: 3.4 ( 1 votes)
4