Templates by BIGtheme NET
Home >> REVIEWS >> దేవ్ రివ్యూ

దేవ్ రివ్యూ


చిత్రం : దేవ్

నటీనటులు : కార్తి, రకుల్ ప్రీత్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ

దర్శకత్వం : రజత్ రవి శంకర్

నిర్మాతలు : లక్ష్మణ్ కుమార్

సంగీతం : హారిస్ జైరాజ్

సినిమాటోగ్రఫర్ : వేల్ రాజ్

ఎడిటర్ : అంథోని ఎల్ రూబెన్

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2019

‘ఖాకి’ తరువాత కార్తి , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలైయింది, మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

దేవ్ ( కార్తి ) కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరెస్టు ఎక్కాలని లక్ష్యం గా పెట్టుకుంటాడు. ఇక పేస్ బుక్ లో మేఘన ( రకుల్) ను చూసి ఇష్టపడతాడు. అయితే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కాని మేఘన మొదట నో చెప్పిన ఆతరువాత దేవ్ ను లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఇద్దరు డీప్ లవ్ లో ఉండగా కొన్ని కారణాల వల్ల దేవ్ ను మేఘన అపార్ధం చేసుకుని యూఎస్ వెళ్ళిపోతుంది. ఆతరువాత వారిద్దరూ మళ్ళీ కలిశారా ? దేవ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కి మేజర్ ప్లస్ అంటే కార్తినే . తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మేఘన పాత్రకు రకుల్ కరెక్ట్ గా సెట్ అయ్యింది. వారి ఇద్దరి జోడిబాగుంది.సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ లు వారి పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

ఇక సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే విజువల్స్ , సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎవరెస్టు ఎపిసోడ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాలో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా కు మేజర్ మైనస్ పాయింట్ స్టోరీనే. రొటీన్ స్టోరీ దానికి తోడు ఫ్లాట్ నరేషన్ సినిమాను బోరింగ్ గా మార్చేశాయి. ఎక్కడ ఆసక్తికర మలుపులు లేకుండా ఊహించినవిధంగా సాగిపోతుంది ఈ సినిమా. ఇక హీరో , హీరోయిన్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కన్విన్సింగ్ గా అనిపించదు.

సినిమా లో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ వంటి యాక్టర్స్ ను సరిగ్గా ఉపోయోగించుకోలేదు దర్శకుడు. వారి పాత్రలు ఏమంత ప్రత్యేకంగా అనిపించవు అలాగే క్లైమాక్స్ కూడా సరిగ్గా తెరకెక్కించలేకోపోయాడు. ఇక అప్పటి దాక హీరోకు దూరంగా వుండాలనుకున్న హీరోయిన్ సడెన్ గా మారి మళ్ళీ హీరో దగ్గరికి వచ్చేయడం లాంటి విషయాలు చుస్తే సినిమా లో స్టోరీ ఎంత వీక్ గా ఉందో అర్ధం అవుతుంది.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ రజత్ రవి శంకర్ ఒక లవ్ స్టోరీ కి అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ ను జోడించి చేసిన ఈ ప్రయత్నం విజయం సాధించలేదని చెప్పాలి. రొటీన్ స్టోరి , ఎంగేజింగ్ గా లేని కథనం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది.

ఇక హరీస్ జైరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ మాత్రం రిజిస్టర్ కావు. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుండి సినిమా కు రిచ్ లుక్ ను తీసుకొచ్చాయి అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా లో కొన్ని సన్నివేశాలను కట్ చేస్తే బాగుండేది. ముఖ్యంగా రన్ టైం చాలా ఎక్కువగా గా వుంది. నిర్మాత ఈచిత్రానికి చాలా ఖర్చు పెట్టాడు. సినిమా తెర మీద గ్రాండియర్ గా కనిపిస్తుంది.

తీర్పు :

లవ్ స్టోరీ కి అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ ను జోడించి రజత్ రవి శంకర్ తెరకెక్కించిన ఈచిత్రం లో కార్తి , రకుల్ నటన , విజువల్స్ హైలైట్ అవ్వగా స్లొ నరేషన్ , రొటీన్ స్టోరీ సినిమా కు మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

చిత్రం : దేవ్ నటీనటులు : కార్తి, రకుల్ ప్రీత్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ దర్శకత్వం : రజత్ రవి శంకర్ నిర్మాతలు : లక్ష్మణ్ కుమార్ సంగీతం : హారిస్ జైరాజ్ సినిమాటోగ్రఫర్ : వేల్ రాజ్ ఎడిటర్ : అంథోని ఎల్ రూబెన్ విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2019 ‘ఖాకి’ తరువాత కార్తి , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలైయింది, మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .. కథ : దేవ్ ( కార్తి ) కి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఎవరెస్టు ఎక్కాలని లక్ష్యం గా పెట్టుకుంటాడు. ఇక పేస్ బుక్ లో మేఘన ( రకుల్) ను చూసి ఇష్టపడతాడు. అయితే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కాని మేఘన మొదట నో చెప్పిన ఆతరువాత దేవ్ ను లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఇద్దరు డీప్ లవ్ లో ఉండగా కొన్ని కారణాల వల్ల దేవ్ ను మేఘన అపార్ధం చేసుకుని యూఎస్ వెళ్ళిపోతుంది. ఆతరువాత వారిద్దరూ మళ్ళీ కలిశారా ? దేవ్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : సినిమా కి మేజర్ ప్లస్ అంటే కార్తినే . తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. మేఘన పాత్రకు రకుల్ కరెక్ట్ గా సెట్ అయ్యింది. వారి ఇద్దరి జోడిబాగుంది.సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ లు వారి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. ఇక సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే విజువల్స్ , సినిమాటోగ్రఫీ , నేపథ్య సంగీతం. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎవరెస్టు ఎపిసోడ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాలో వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్ : సినిమా కు మేజర్ మైనస్ పాయింట్ స్టోరీనే. రొటీన్ స్టోరీ దానికి తోడు ఫ్లాట్ నరేషన్ సినిమాను బోరింగ్ గా మార్చేశాయి. ఎక్కడ ఆసక్తికర మలుపులు లేకుండా ఊహించినవిధంగా సాగిపోతుంది ఈ సినిమా. ఇక హీరో , హీరోయిన్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కన్విన్సింగ్ గా అనిపించదు. సినిమా లో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ వంటి యాక్టర్స్ ను సరిగ్గా ఉపోయోగించుకోలేదు దర్శకుడు. వారి పాత్రలు ఏమంత ప్రత్యేకంగా అనిపించవు అలాగే క్లైమాక్స్ కూడా సరిగ్గా తెరకెక్కించలేకోపోయాడు. ఇక అప్పటి దాక హీరోకు దూరంగా వుండాలనుకున్న హీరోయిన్ సడెన్ గా మారి మళ్ళీ హీరో దగ్గరికి వచ్చేయడం లాంటి విషయాలు చుస్తే సినిమా లో స్టోరీ ఎంత వీక్ గా ఉందో అర్ధం అవుతుంది. సాంకేతిక విభాగం : డైరెక్టర్ రజత్ రవి శంకర్ ఒక లవ్ స్టోరీ కి అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ ను జోడించి చేసిన ఈ ప్రయత్నం విజయం సాధించలేదని చెప్పాలి. రొటీన్ స్టోరి , ఎంగేజింగ్ గా లేని కథనం సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. ఇక హరీస్ జైరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ సాంగ్స్ మాత్రం రిజిస్టర్ కావు. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుండి సినిమా కు రిచ్ లుక్ ను తీసుకొచ్చాయి అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా లో కొన్ని సన్నివేశాలను కట్ చేస్తే బాగుండేది. ముఖ్యంగా రన్ టైం చాలా ఎక్కువగా గా వుంది. నిర్మాత ఈచిత్రానికి చాలా ఖర్చు పెట్టాడు. సినిమా తెర మీద గ్రాండియర్ గా కనిపిస్తుంది. తీర్పు : లవ్ స్టోరీ కి అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ ను జోడించి రజత్ రవి శంకర్ తెరకెక్కించిన ఈచిత్రం లో కార్తి , రకుల్ నటన , విజువల్స్ హైలైట్ అవ్వగా స్లొ నరేషన్ , రొటీన్ స్టోరీ సినిమా కు మైనస్ అయ్యాయి. చివరగా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

దేవ్ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 2
దర్శకత్వ ప్రతిభ - 2

2.3

దేవ్ రివ్యూ

దేవ్ రివ్యూ

User Rating: 2.5 ( 1 votes)
2