ధడక్ రివ్యూ

0‘ప్రేమ’.. ఈమాట చెప్పగానే చాలామంది గుండె అలా.. అలలా మైమరచి కొట్టుకుంటుంది. ఎంతలా అంటే తొలిప్రేమ గుర్తొచ్చి మళ్ళీ అలసిపోయేంత ఆలోచనలు మనసుని కదిలించేలా…! ఇందులో అర్జున్ రెడ్డి గుండె చప్పుడు ఉండచ్చు.. RX100 సినిమాలో హీరో కార్తికేయ మనసులోని అంతులేని ప్రేమ కూడా ఉండొచ్చు.. అది లోకానికి పిచ్చిలా కూడా కనిపించొచ్చు. కానీ..

‘ధడక్’ లో ఇవన్నీ మిస్ అయ్యాయి. ధడక్ ఓ హిందీ పదం… హిందీ భాష తెలిసిన వాళ్లకు ఇబ్బంది లేదు కానీ తెలుగు మాత్రమే తెలిసినవాళ్ళకు ఆ మీనింగ్ తెలియడం చాలా ముఖ్యం. ధడక్ అంటే అర్థం… ‘గుండె చప్పుడు’.. మన గుండె కొట్టుకునే శబ్దం మనకు వినిపించాలంటే మనం మననే మర్చిపోవాలి. అంటే ‘ప్రేమ’లో ఉండాలి. దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించిన మరాఠి ‘సైరాట్’ లో ఆ ‘గుండె చప్పుడు’ మనకు మామూలుగా వినిపించదు.. డాల్బీ డీటీయస్ సరౌండ్ సౌండ్ లో భారీగా వినిపిస్తుంది.. వినిపించడమే కాదు.. గుండెను అలా పిండేస్తుంది. మరి మీలో ఎంతమంది మరాఠి సినిమా ‘సైరాట్’ ను చూసి ఉంటారో నాకు నిజంగా తెలీదు గానీ.. కులాలు.. డబ్బు.. అధికారం.. లాంటి పదాలు లేని ఒక సమాజంలో ఉన్నట్టు అనుకుని ఒకరినొకరు స్వచ్చంగా ‘తొలిప్రేమ’ లా… ప్రేమించిన జంట ఇందాక చెప్పినవన్నీ అడ్డం వచ్చి ‘ప్రేమ’ కు అడ్డుగోడలుగా నిలిస్తే.. దాన్ని వాళ్ళు ఎదుర్కోలేక జీవితంలో విఫలమైతే.. అదే ‘సైరాట్’.

కానీ.. బాలీవుడ్ వెర్షన్ అయిన ‘ధడక్’ లో ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు కూడా ప్రేమిస్తారు.. విఫలమౌతారు. కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అది అసహజంగా అనిపిస్తుంది. అంటే ‘ఒరిజినల్’ సినిమాను మించి ఇంకా కల్ట్ క్లాసిక్ తీసి ఆస్కార్ కు పంపుదామనుకొన్న బాలీవుడ్ జనాలు అసలులో పావు వంతు కూడా తీయలేక చతికిల పడ్డట్టుగా ఉంది.. ఫైనల్ గా ఒకే కన్సొలేషన్- అంటే- ఓదార్పు ఒకటే.. అది జాన్వి కపూర్ – ఇషాన్ ఖట్టర్ల డీసెంట్ యాక్టింగ్.. ఇంకా వారిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయిన జాన్వి డెబ్యూ సినిమా కోసం చాలా మంది ఎదురు చూసి ఉంటారు. వాళ్ళను మాత్రం జాన్వి ఏమాత్రం నిరాశపరచలేదు. ఇక బాక్స్ ఆఫీస్ సక్సెస్ విషయానికి వస్తే మొదటి రోజు కలెక్షన్స్ బాగా ఉన్నాయి కానీ మరో రెండు రోజులైతే గానీ ఆవిషయం గురించి మనం మాట్లాడలేం..!

'ప్రేమ'.. ఈమాట చెప్పగానే చాలామంది గుండె అలా.. అలలా మైమరచి కొట్టుకుంటుంది. ఎంతలా అంటే తొలిప్రేమ గుర్తొచ్చి మళ్ళీ అలసిపోయేంత ఆలోచనలు మనసుని కదిలించేలా...! ఇందులో అర్జున్ రెడ్డి గుండె చప్పుడు ఉండచ్చు.. RX100 సినిమాలో హీరో కార్తికేయ మనసులోని అంతులేని ప్రేమ కూడా ఉండొచ్చు.. అది లోకానికి పిచ్చిలా కూడా కనిపించొచ్చు. కానీ.. 'ధడక్' లో ఇవన్నీ మిస్ అయ్యాయి. ధడక్ ఓ హిందీ పదం... హిందీ భాష తెలిసిన వాళ్లకు ఇబ్బంది లేదు కానీ తెలుగు మాత్రమే తెలిసినవాళ్ళకు ఆ మీనింగ్ తెలియడం చాలా ముఖ్యం. ధడక్ అంటే అర్థం... 'గుండె చప్పుడు'.. మన గుండె కొట్టుకునే శబ్దం మనకు వినిపించాలంటే మనం మననే మర్చిపోవాలి. అంటే 'ప్రేమ'లో ఉండాలి. దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించిన మరాఠి 'సైరాట్' లో ఆ 'గుండె చప్పుడు' మనకు మామూలుగా వినిపించదు.. డాల్బీ డీటీయస్ సరౌండ్ సౌండ్ లో భారీగా వినిపిస్తుంది.. వినిపించడమే కాదు.. గుండెను అలా పిండేస్తుంది. మరి మీలో ఎంతమంది మరాఠి సినిమా 'సైరాట్' ను చూసి ఉంటారో నాకు నిజంగా తెలీదు గానీ.. కులాలు.. డబ్బు.. అధికారం.. లాంటి పదాలు లేని ఒక సమాజంలో ఉన్నట్టు అనుకుని ఒకరినొకరు స్వచ్చంగా 'తొలిప్రేమ' లా... ప్రేమించిన జంట ఇందాక చెప్పినవన్నీ అడ్డం వచ్చి 'ప్రేమ' కు అడ్డుగోడలుగా నిలిస్తే.. దాన్ని వాళ్ళు ఎదుర్కోలేక జీవితంలో విఫలమైతే.. అదే 'సైరాట్'. కానీ.. బాలీవుడ్ వెర్షన్ అయిన 'ధడక్' లో ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు కూడా ప్రేమిస్తారు.. విఫలమౌతారు. కానీ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అది అసహజంగా అనిపిస్తుంది. అంటే 'ఒరిజినల్' సినిమాను మించి ఇంకా కల్ట్ క్లాసిక్ తీసి ఆస్కార్ కు పంపుదామనుకొన్న బాలీవుడ్ జనాలు అసలులో పావు వంతు కూడా తీయలేక చతికిల పడ్డట్టుగా ఉంది.. ఫైనల్ గా ఒకే కన్సొలేషన్- అంటే- ఓదార్పు ఒకటే.. అది జాన్వి కపూర్ - ఇషాన్ ఖట్టర్ల డీసెంట్ యాక్టింగ్.. ఇంకా వారిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయిన జాన్వి డెబ్యూ సినిమా కోసం చాలా మంది ఎదురు చూసి ఉంటారు. వాళ్ళను మాత్రం జాన్వి ఏమాత్రం నిరాశపరచలేదు. ఇక బాక్స్ ఆఫీస్ సక్సెస్ విషయానికి వస్తే మొదటి రోజు కలెక్షన్స్ బాగా ఉన్నాయి కానీ మరో రెండు రోజులైతే గానీ ఆవిషయం గురించి మనం మాట్లాడలేం..!

ధడక్ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 1.75
నటీ నటుల ప్రతిభ - 2.75
సాంకేతికవిభాగం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2

2.3

ధడక్ రివ్యూ

ధడక్ రివ్యూ రేటింగ్

User Rating: 3.98 ( 2 votes)
2