డీజే దువ్వాడ జగన్నాథమ్ రివ్యూ

0


DJ-Duvvada-Jagannadham-Review

‘ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‘ (2017)
స్టార్ కాస్ట్ : అల్లు అర్జున్ , పూజా హగ్దే , రావు రమేష్ తదితరులు..
దర్శకత్వం : హరీష్ శంకర్
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేది : జూన్ 23, 2017
అల్లు అర్జున్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు. అభిమానుల‌తో పాటు.. స‌గ‌టు సినీ ప్రేమికుడిని సైతం అల‌రించేలా క‌థ‌ల్ని ఎంపిక చేసుకొంటున్నాడు. దాంతో అల్లు అర్జున్ సినిమా అన‌గానే అంచ‌నాలు ఆకాశానికి తాకుతున్నాయి. `డీజే… దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` విష‌యంలోనూ అదే జ‌రిగింది. మాస్ ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడిగా.. హీరోయిజాన్ని తెర‌పై బాగా ఆవిష్క‌రిస్తార‌నే పేరున్న హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌డంతో `డీజే` చిత్రం ప్రేక్ష‌కుల‌తో పాటు.. ప‌రిశ్ర‌మ కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురు చూసింది. అల్లు అర్జున్ బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌ని పోషించ‌డంతోపాటు.. ఆ స‌న్నివేశాల‌తో విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు బాగా సంద‌డి చేశాయి. సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి.
మ‌రి ఆ సంద‌డికి త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా? అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ పాత్ర‌తో చేసిన హంగామా ఎలా ఉంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చూస్తే..
క‌థేంటంటే?: చేయి తిరిగిన శాఖాహార వంట‌కాడు దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి (అల్లు అర్జున్‌). విజ‌య‌వాడ స‌మీపంలోని స‌త్య‌నారాయ‌ణ‌పురం అగ్ర‌హారంలో ఉంటూ ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌రిగే వేడుక‌ల్లో త‌న చేతి వంట‌ల రుచుల్ని చూపిస్తుంటాడు. అనుకోకుండా ఆయ‌న‌కి ఫ్యాష‌న్ డిజైన‌ర్ పూజ (పూజ‌హెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. మ‌రోప‌క్క‌ అగ్ర‌హారం, వంట‌లే లోకంగా క‌నిపించే శాస్త్రి ఎవ‌రికీ తెలియ‌కుండా, త‌న‌ని తాను డీజేగా ప‌రిచ‌యం చేసుకొంటూ హైద‌రాబాద్‌లో ప‌నుల్ని చ‌క్క‌బెడుతుంటాడు. ఒకొక్క‌రినీ టార్గెట్ చేసి చంపేస్తుంటాడు. ఇంత‌కీ శాస్త్రి డీజేగా ఎందుకు మారాల్సి వ‌స్తుంది? బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి హ‌త్య‌లు చేసేవ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది? అందుకు ఆయ‌న్ని ప్రోత్స‌హించిన పురుషోత్తం ఎవ‌రు? రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేష్‌)తో శాస్త్రికి వైరం ఎలా ఏర్ప‌డింది? అత‌ని అక్ర‌మాల‌ని బ‌య‌టపెట్టేందుకు శాస్త్రి ఏం చేశాడు? లాంటి విష‌యాల‌తో సినిమా సాగుతుంది.

ఎలా ఉందంటే?: బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి.. ఆయ‌న కుటుంబం నేప‌థ్యంలో సాగే ఓ ప్ర‌తీకార క‌థ ఇది. దువ్వాడ‌ జ‌గ‌న్నాథ శాస్త్రి పాత్ర చుట్టూ అల్లిన స‌న్నివేశాలే సినిమాకి కొత్త‌ద‌నాన్ని పంచాయి. మిగిలిందంతా రివేంజ్‌ ఫార్ములా క‌థ‌ల్నే గుర్తుకు తెప్పిస్తుంది. కాక‌పోతే ఇటీవ‌లకాలంలో మ‌న స‌భ్య స‌మాజంలో చ‌ర్చ‌ను లేవ‌నెత్తిన ఓ సంస్థ ఆర్థిక నేరాన్ని ప్ర‌తిబింబించేలా ప్ర‌ధాన క‌థ‌ని, స‌న్నివేశాల్ని అల్లాడు ద‌ర్శ‌కుడు. వాటి చుట్టూ భావోద్వేగాల్ని, కామెడీని, యాక్ష‌న్‌ని, గ్లామ‌ర్‌ని స‌మ‌పాళ్ల‌లో మేళ‌విస్తూ కొత్త‌గా వండి వార్చాడు.
ఫ‌క్తు వాణిజ్య చిత్రం డీజే. ఇందులో అల్లు అర్జున్ అటు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ శాస్త్రిగా, ఇటు డీజేగా రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో క‌నిపించి మెప్పిస్తాడు. డీజేగా స్టైలిష్‌గా క‌నిపించ‌డం అల్లు అర్జున్‌కి కొట్టిన‌పిండే. శాస్త్రిగా ఆయ‌న చేసే సంద‌డే కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. భాష, యాస విష‌యాల్లో ఆయ‌న ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. తొలి స‌గ‌భాగం సినిమా ఆస‌క్తిక‌రమైన క‌థ‌, కామెడీ, యాక్ష‌న్‌, రొమాంటిక్ స‌న్నివేశాల‌తో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విరామం వ‌ర‌కు సినిమా సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా విరామానికి ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఘ‌ట్టం ఆక‌ట్టుకునేలా ఉంటుంది. దేవిశ్రీప్ర‌సాద్ నేప‌థ్య సంగీతం ఆ యాక్ష‌న్ పార్ట్‌కు మ‌రింత‌ ప్ర‌త్యేక‌త‌ తెచ్చింది..
అలాగే పూజా హెగ్డే అందం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆమె ప్ర‌తి స‌న్నివేశంలోనూ గ్లామ‌ర్‌గా క‌నిపించింది. హరీష్ శంక‌ర్ రాసిన మాట‌లు కూడా బాగున్నాయి. ద్వితీయార్థంలో సీటీమార్ పాట‌తో బ‌న్నీ త‌నలోని డ్యాన్స‌ర్‌ని ఓ స్థాయిలో చూపించాడు. చాలా వ‌ర‌కు స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి అంచ‌నాకు త‌గ్గ‌ట్లే సాగుతాయి. క‌థ‌లో కొన్నైనా మ‌లుపులుంటే బాగుండేద‌నిపిస్తే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు. ప‌తాక స‌న్నివేశాల్లో కొత్త‌ద‌నం చూపించాడు ద‌ర్శ‌కుడు. ఫార్ములా ప్ర‌కారం కాకుండా కామెడీతో ఆ స‌న్నివేశాల్ని ముగించిన విధానం ఆక‌ట్టుకునేలా ఉంది.

ఎవరెలా చేశారంటే?: అల్లు అర్జున్ ఇదివ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త ర‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు కూడా కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. శాస్త్రి పాత్ర‌లో చాలా బాగా న‌టించారు. యాక్ష‌న్‌, డ్యాన్సుల్లో మ‌రోసారి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ని క‌న‌బ‌రిచారు. పూజా హెగ్డే అందం సినిమాకి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఆమె పాత్ర‌కి చెప్పుకోద‌గ్గ ప్రాధాన్యం లేక‌పోయినా, అందంతోనే ఆక‌ట్టుకొంటుంది. వెన్నెల కిషోర్‌, రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, ముర‌ళీశ‌ర్మ వాళ్ల వాళ్ల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌ల‌తోనూ, నేప‌థ్య సంగీతంతోనూ సినిమాకి ప్రాణం పోశారు. అయ‌నంక బోస్ కెమెరా ప‌నిత‌నం కంటికి ప‌సందైన విందులా ఉంటుంది. దిల్‌రాజు నిర్మాణ విలువ‌లు తెర‌పై అడుగ‌డుగునా క‌నిపిస్తాయి. హ‌రీష్ శంక‌ర్ త‌న క‌లానికి మ‌రింత ప‌దునుపెట్టి సంభాష‌ణ‌ల్ని రాశారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ప‌నితీరుకి మంచి మార్కులే ప‌డ‌తాయి.

బలాలు
+ క‌థా నేప‌థ్యం
+ అల్లు అర్జున్.. పూజా హెగ్డే
+ సంభాష‌ణ‌లు
+ సంగీతం.. ప‌తాక స‌న్నివేశాలు

బలహీనతలు
– సాధార‌ణ‌మైన‌ క‌థ
– వూహ‌కు అందేలా స‌న్నివేశాలు
చివ‌రిగా: కాల‌క్షేపానికి ఢోకా లేని “డీజే”
గ‌మ‌నిక‌: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే. ఇది స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది.

 • ఎంటర్ టైనింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

 • విలన్, అల్లు అర్జున్ మధ్య ఆసక్తికర సీన్లు వస్తున్నాయి. అల్లు అర్జున్ తన మిషన్ లో సుబ్బరాజుని వాడుకుంటున్నాడు.

 • అల్లు అర్జున్ విలన్లతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.

 • విలన్ ని వెతికే పనిలో బన్నీ.. సుబ్బరాజుని కలిసాడు. అతడి నుంచి నిజాలు రాబట్టే సన్నివేశాలు హాస్యభరితంగా ఉన్నాయి.

 • సాంగ్ పూర్తయింది. బన్నీ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఇరగదీశాడు.

 • పూజా హెగ్డే, అల్లు అర్జున్ మధ్య రొమాంటిక్ సీన్ తరువాత సూపర్ హిట్ సాంగ్ ‘ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, మెగాస్టార్ ‘ వస్తోంది.

 • మెయిన్ విలన్ గురించి నిజాలు తెలుసుకున్న బన్నీ అతడిని వెతికే పనిలో పడ్డాడు. అందుకోసం పూజా హెగ్డే సాయం తీసుకుంటున్నాడు.

 • అల్లు అర్జున్, పోలీస్ అధికారి మురళీశర్మ మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. మంచి ఫైట్ సీన్ వస్తోంది. బన్నీ తన పాత్రలో ఒదిగిపోయాడు.

 • విలన్లు నిజాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. అందుకోసం అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్ సీన్లు వస్తున్నాయి.

 • అల్లు అర్జున్, రావురమేష్ మధ్య కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

 • ప్రస్తుతం ‘బాక్స్ బద్దలైపోయే’అనే సాంగ్ వస్తోంది. బన్నీ డాన్స్ తో అదరగొడుతున్నాడు.

 • బన్నీ, పూజా హెగ్డే మధ్య లవ్ ప్రపోజల్ సీన్ వస్తోంది. హరీష్ శంకర్ రాసిన డైలాగులు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి.

 • ఇంటర్వెల్ తరువాత సినిమా ప్రారంభమైంది. పూజాహెగ్డే, పోసాని మధ్య వస్తున్న ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటున్నాయి.

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం బావుంది. పట్టున్న కథనం, వేగంగా నడిచిన స్క్రీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మూడు పాటలు చిత్రానికి ప్లస్ గా మారాయి.

 • మరో ఫైట్స్ సీన్ వస్తోంది. చిత్రం చిన్న ట్విస్ట్.. అల్లు అర్జున్, రావురమేష్ ల మధ్య ఆసక్తికర సభాషణతో ఇంటర్వెల్ పడింది.

 • రావురమేష్, పోసాని మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది. అద్భుతమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ దిశగా చిత్రం సాగుతోంది.

 • దుబాయ్ లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో పాటని చిత్రీకరించారు. కొరియోగ్రఫీ చాలా బావుంది.

 • పూజా హెగ్డే అల్లు అర్జున్ ప్రేమలో పడింది. ప్రస్తుతం మెలోడీ సాంగ్ ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ వస్తోంది.

 • సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు. పూజా హెగ్డే, సుబ్బరాజు మధ్య ఫన్నీ సీన్లు వస్తున్నాయి.

 • పూజా హెగ్డే తండ్రిగా పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చాడు. రావురమేష్ కి పోసాని సన్నిహితుడు.

 • చంద్ర మోహన్ సమస్యని అల్లు అర్జున్ తెలుసుకున్నాడు. సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫైట్ వస్తోంది.

 • అల్లు అర్జున్, సీనియర్ నటుడు చంద్ర మోహన్ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • సినిమాలో మరో పాట ‘మెచ్చుకో..మెచ్చుకో’ వస్తోంది. పాటలో అల్లు అర్జున్ ట్రెడిషనల్ లుక్ బావుంది.

 • పూజా హెగ్డే చాలా హాట్ గా కనిపిస్తోంది. బన్నీ, పూజా హెగ్డే ల మధ్య హాస్యభరితమైన సీన్లు వస్తున్నాయి.

 • చిత్రంలో కామెడీ సీన్లు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో తన డైలాగ్ డెలివరీ తో అలరిస్తున్నాడు.

 • హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అల్లు అర్జున్, కిషోర్ ల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ‘నాయుడు’ గా రావురమేష్ ఎంట్రీ ఇచ్చాడు. రావురమేష్ పాత్ర ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంలో తన తండ్రి రావు గోపాల్ రావు పాత్రని పోలి ఉంది.

 • ప్రస్తుతం టైటిల్ సాంగ్ ‘శరణం భజే భజే డీజే’ వస్తోంది. సాంగ్ లో అల్లు అర్జున్ హీరోయిజాన్ని చూపిస్తున్నారు.

 • భారీ ఫైట్ సీన్ వస్తోంది. ఫైట్ ని చాలా స్టైలిష్ గా కంపోజ్ చేశారు.

 • పోలీస్ అధికారిగా మురళీశర్మ ఎంట్రీ ఇచ్చాడు. కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

 • యాంకర్ ఝాన్సీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • బ్రాహ్మణ పాత్రలో అల్లు అర్జున్ అలరిస్తున్నాడు. బన్నీ డైలాగ్ డెలివరీ చాలా బావుంది.

 • దువ్వాడ జగన్నాథమ్ గా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు..బన్నీ ఎంట్రీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

 • అల్లు అర్జున్ చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.

 • అన్నపూర్ణా క్యాటరింగ్ సభ్యులుగా తనికెళ్ళ భరణి మరియు కొంత మంది నటులు పరిచయం అయ్యారు.

 • హాయ్.. 156 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

 • సరైనోడు వంటి ఘనవిజయం తరువాత అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ రోజు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి.

‘ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‘ (2017) స్టార్ కాస్ట్ : అల్లు అర్జున్ , పూజా హగ్దే , రావు రమేష్ తదితరులు.. దర్శకత్వం : హరీష్ శంకర్ నిర్మాతలు: దిల్ రాజు మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్ విడుదల తేది : జూన్ 23, 2017 అల్లు అర్జున్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు. అభిమానుల‌తో పాటు.. స‌గ‌టు సినీ ప్రేమికుడిని సైతం అల‌రించేలా క‌థ‌ల్ని ఎంపిక చేసుకొంటున్నాడు. దాంతో అల్లు అర్జున్ సినిమా అన‌గానే అంచ‌నాలు ఆకాశానికి తాకుతున్నాయి. `డీజే... దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` విష‌యంలోనూ అదే జ‌రిగింది. మాస్ ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడిగా.. హీరోయిజాన్ని తెర‌పై బాగా ఆవిష్క‌రిస్తార‌నే పేరున్న హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌డంతో `డీజే` చిత్రం ప్రేక్ష‌కుల‌తో పాటు.. ప‌రిశ్ర‌మ కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురు చూసింది. అల్లు అర్జున్ బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌ని పోషించ‌డంతోపాటు.. ఆ స‌న్నివేశాల‌తో విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు బాగా సంద‌డి చేశాయి. సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి. మ‌రి ఆ సంద‌డికి త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా? అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ పాత్ర‌తో చేసిన హంగామా ఎలా ఉంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చూస్తే.. క‌థేంటంటే?: చేయి తిరిగిన శాఖాహార వంట‌కాడు దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి (అల్లు అర్జున్‌). విజ‌య‌వాడ స‌మీపంలోని స‌త్య‌నారాయ‌ణ‌పురం అగ్ర‌హారంలో ఉంటూ ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌రిగే వేడుక‌ల్లో త‌న చేతి వంట‌ల రుచుల్ని చూపిస్తుంటాడు. అనుకోకుండా ఆయ‌న‌కి ఫ్యాష‌న్ డిజైన‌ర్ పూజ (పూజ‌హెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. మ‌రోప‌క్క‌ అగ్ర‌హారం, వంట‌లే లోకంగా క‌నిపించే శాస్త్రి ఎవ‌రికీ తెలియ‌కుండా, త‌న‌ని తాను డీజేగా ప‌రిచ‌యం చేసుకొంటూ హైద‌రాబాద్‌లో ప‌నుల్ని చ‌క్క‌బెడుతుంటాడు. ఒకొక్క‌రినీ టార్గెట్ చేసి చంపేస్తుంటాడు. ఇంత‌కీ శాస్త్రి డీజేగా ఎందుకు మారాల్సి వ‌స్తుంది? బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి హ‌త్య‌లు చేసేవ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది? అందుకు ఆయ‌న్ని ప్రోత్స‌హించిన పురుషోత్తం ఎవ‌రు? రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేష్‌)తో శాస్త్రికి వైరం ఎలా ఏర్ప‌డింది? అత‌ని అక్ర‌మాల‌ని బ‌య‌టపెట్టేందుకు శాస్త్రి ఏం చేశాడు? లాంటి విష‌యాల‌తో సినిమా సాగుతుంది. ఎలా ఉందంటే?: బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి.. ఆయ‌న కుటుంబం నేప‌థ్యంలో సాగే ఓ ప్ర‌తీకార క‌థ ఇది. దువ్వాడ‌ జ‌గ‌న్నాథ శాస్త్రి పాత్ర చుట్టూ అల్లిన స‌న్నివేశాలే సినిమాకి కొత్త‌ద‌నాన్ని పంచాయి. మిగిలిందంతా రివేంజ్‌ ఫార్ములా క‌థ‌ల్నే గుర్తుకు తెప్పిస్తుంది. కాక‌పోతే ఇటీవ‌లకాలంలో మ‌న స‌భ్య స‌మాజంలో చ‌ర్చ‌ను లేవ‌నెత్తిన ఓ సంస్థ ఆర్థిక నేరాన్ని ప్ర‌తిబింబించేలా ప్ర‌ధాన క‌థ‌ని, స‌న్నివేశాల్ని అల్లాడు ద‌ర్శ‌కుడు. వాటి చుట్టూ భావోద్వేగాల్ని, కామెడీని, యాక్ష‌న్‌ని, గ్లామ‌ర్‌ని స‌మ‌పాళ్ల‌లో మేళ‌విస్తూ కొత్త‌గా వండి వార్చాడు. ఫ‌క్తు వాణిజ్య చిత్రం డీజే. ఇందులో అల్లు అర్జున్ అటు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ శాస్త్రిగా, ఇటు డీజేగా రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో క‌నిపించి మెప్పిస్తాడు. డీజేగా స్టైలిష్‌గా క‌నిపించ‌డం అల్లు అర్జున్‌కి కొట్టిన‌పిండే. శాస్త్రిగా ఆయ‌న చేసే సంద‌డే కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. భాష, యాస విష‌యాల్లో ఆయ‌న ప‌డిన క‌ష్టం తెర‌పై క‌నిపిస్తుంది. తొలి స‌గ‌భాగం సినిమా ఆస‌క్తిక‌రమైన క‌థ‌, కామెడీ, యాక్ష‌న్‌, రొమాంటిక్ స‌న్నివేశాల‌తో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విరామం వ‌ర‌కు సినిమా సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా విరామానికి ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఘ‌ట్టం ఆక‌ట్టుకునేలా ఉంటుంది. దేవిశ్రీప్ర‌సాద్ నేప‌థ్య సంగీతం ఆ యాక్ష‌న్ పార్ట్‌కు మ‌రింత‌ ప్ర‌త్యేక‌త‌ తెచ్చింది.. అలాగే పూజా హెగ్డే అందం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆమె ప్ర‌తి స‌న్నివేశంలోనూ గ్లామ‌ర్‌గా క‌నిపించింది. హరీష్ శంక‌ర్ రాసిన మాట‌లు కూడా బాగున్నాయి. ద్వితీయార్థంలో సీటీమార్ పాట‌తో బ‌న్నీ త‌నలోని డ్యాన్స‌ర్‌ని ఓ స్థాయిలో చూపించాడు. చాలా వ‌ర‌కు స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి అంచ‌నాకు త‌గ్గ‌ట్లే సాగుతాయి. క‌థ‌లో కొన్నైనా మ‌లుపులుంటే బాగుండేద‌నిపిస్తే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు. ప‌తాక స‌న్నివేశాల్లో కొత్త‌ద‌నం చూపించాడు ద‌ర్శ‌కుడు. ఫార్ములా ప్ర‌కారం కాకుండా కామెడీతో ఆ స‌న్నివేశాల్ని ముగించిన విధానం ఆక‌ట్టుకునేలా ఉంది. ఎవరెలా చేశారంటే?: అల్లు అర్జున్ ఇదివ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త ర‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు కూడా కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. శాస్త్రి పాత్ర‌లో చాలా బాగా న‌టించారు. యాక్ష‌న్‌, డ్యాన్సుల్లో మ‌రోసారి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ని క‌న‌బ‌రిచారు. పూజా హెగ్డే అందం సినిమాకి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఆమె పాత్ర‌కి చెప్పుకోద‌గ్గ ప్రాధాన్యం లేక‌పోయినా, అందంతోనే ఆక‌ట్టుకొంటుంది. వెన్నెల కిషోర్‌, రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, ముర‌ళీశ‌ర్మ వాళ్ల వాళ్ల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌ల‌తోనూ, నేప‌థ్య సంగీతంతోనూ సినిమాకి ప్రాణం పోశారు. అయ‌నంక బోస్ కెమెరా ప‌నిత‌నం కంటికి ప‌సందైన విందులా ఉంటుంది. దిల్‌రాజు నిర్మాణ విలువ‌లు తెర‌పై అడుగ‌డుగునా క‌నిపిస్తాయి. హ‌రీష్ శంక‌ర్ త‌న క‌లానికి మ‌రింత ప‌దునుపెట్టి సంభాష‌ణ‌ల్ని రాశారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ప‌నితీరుకి మంచి మార్కులే ప‌డ‌తాయి. బలాలు + క‌థా నేప‌థ్యం + అల్లు అర్జున్..…

డీజే దువ్వాడ జగన్నాథమ్ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే
నటీ నటుల ప్రతిభ
సాంకేతికవిభాగం పనితీరు
దర్శకత్వ ప్రతిభ

డీజే దువ్వాడ జగన్నాథమ్ రివ్యూ

డీజే దువ్వాడ జగన్నాథమ్ రివ్యూ

User Rating: 3.46 ( 4 votes)
60