హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ

0 

విడుదల తేదీ : జులై 28, 2018
నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక

దర్శకత్వం : లక్ష్మణ్ కార్య

నిర్మాతలు : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

సినిమాటోగ్రఫర్ : బాల‌రెడ్డి

సుమంత్ అశ్విన్ హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డినిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అక్షర (నిహారిక) ఆనంద్‌ (సుమంత్ అశ్విన్‌) ప్రేమించుకుంటారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ పెద్దలు సంతోషంగా అంగీకరిస్తారు. ఇదరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుంది.అంతా హ్యాపిగా ఉన్న టైం లో అక్షర ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వరుణ్ (రాజా) ఎంటర్ అవుతాడు

అంతలో కొన్ని సంఘటనల కారణంగా అక్షర ఆనంద్ విషయంలో డిజ్పాయింట్ అవుతుంది ఈ క్రమంలో పెళ్లి దగ్గర పడుతుందనగా.. అక్షర ఆనంద్‌ను పెళ్లి చేసుకునే విషయంలో పూర్తిగా కన్ఫ్యూజన్‌కు గురవుతుంది చివరకి అక్షర ఆనంద్ ను అర్థం చేసుకుంటుందా ? వారి పెళ్లి అనుకున్న ప్రకారంగానే జరుగుతుందా ? లేదా ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు లక్ష్మణ్ కార్య రాసుకున్న సున్నితమైన కథే ఈ సినిమాకు ప్రధాన బలం.బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది.

ఇక హీరో సుమంత్ అశ్విన్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబర్చి ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మెగా డాటర్ నిహారిక అందంగా కనిపిస్తూ, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసింది.  తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన మురళి శర్మ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. కొన్ని ఏమోషనల్ సీన్స్ లో అయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు లక్ష్మణ్ కార్య మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మాత్రం కథనాన్ని రాసుకోలేదు.

ఫస్టాఫ్ ను బాగానే నడిపిన ఆయన, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీశారుకుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ , లవ్ ట్రాక్ ను కూడా అంత కన్నా బాగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు.

హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఉంది, అది కొన్ని సమస్యల కారణంగా ఘర్షణలో నలిగిపోతోంది అని తెలుస్తుంటుంది కానీ ప్రేక్షకుడి మనసుకు మాత్రం అంత బలంగా దగ్గరకాలేకపోయింది.

సాంకేతిక విభాగం :

తమన్ యస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.శక్తికాంత్ కార్తీక్ సమకూర్చున పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పెళ్లి తాలూకు సందడికి సంబంధించిన విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు.

ఇక ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళు పాటించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

సినిమాలో మెయిన్ థీమ్ గా చెప్పాలనుకున్న ఓ సగటు అమ్మాయికి పెళ్లి పట్ల ఉన్న కన్ ఫ్యుజన్స్ ను అనుమానాలను భయాలను చెప్పటం బాగుంది. ఈ చిత్రం కూడా ఎక్కువుగా అమ్మాయిలకే కనెక్ట్ అవుతుంది తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించకపోవచ్చు

‘హ్యాపీ వెడ్డింగ్’ : లైవ్ అప్డేట్స్:

నిహారిక మరియు ఆమె ఆంటీ ఇంద్రజ మధ్య కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది. కెమెరా వర్క్ చాలా బావుంది. నిహారిక సింపుల్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

 • నరేష్ మరియు మురళి శర్మ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇంటర్వెల్ తరువాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ ను ఆకట్టుకునేందుకు హీరో ఆమె వద్దకు వెళుతున్నాడు.

 • ఇంటర్వెల్ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. నేటి యువతకు సంబంధించిన సమకాలీన మరియు ఆధునిక సంబంధాల ఆధారంగా చిత్రీకరించిన సినిమా. ఒక మంచి పాయింట్ తో సినిమా సగానికి చేరుకుంది.

 • జంట మధ్య ఊహించని విధంగా ఒక సమస్య ఏర్పడింది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

 • ఈ సినిమా మంచి ఫ్యామిలీ మూమెంట్స్ తో ముందుకు సాగుతోంది. నిశ్చితార్థం కుదిరింది. ఎమోషనల్ సీన్స్ రియాలిస్టిక్ గా ఉన్నాయి.

 • నీహారిక చాలా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న పాత్రలో అలరిస్తున్నారు. సినిమా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది.

 • సుమంత్ అశ్విన్ మరియు నిహరిక ఇద్దరూ కూడా తెరపై అకట్టుకుంటున్నారు.

 • నీహారిక ప్రవర్తనకు సంబంధించిన కొన్ని మంచి సన్నివేశాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.

 • సుమంత్ అశ్విన్ మరియు నిహారిక ప్రేమలో ఉన్నారు. వారి మ్యాచ్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి. మురళీ శర్మ మరియు నరేష్ లు కూడా ఎంట్రీ ఇచ్చారు.

 • కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. సీరియస్ ట్విస్ట్ తో సినిమా కథ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. నిహారిక ఒక పబ్ లో ఎంట్రీ ఇచ్చారు.

 • హాయ్.. హ్యాపీ నోట్ తో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సుమంత్ పెళ్లిలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.

 

 

  విడుదల తేదీ : జులై 28, 2018 నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక దర్శకత్వం : లక్ష్మణ్ కార్య నిర్మాతలు : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి సంగీతం : శక్తికాంత్ కార్తీక్ సినిమాటోగ్రఫర్ : బాల‌రెడ్డి సుమంత్ అశ్విన్ హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డినిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : అక్షర (నిహారిక) ఆనంద్‌ (సుమంత్ అశ్విన్‌) ప్రేమించుకుంటారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ పెద్దలు సంతోషంగా అంగీకరిస్తారు. ఇదరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుంది.అంతా హ్యాపిగా ఉన్న టైం లో అక్షర ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వరుణ్ (రాజా) ఎంటర్ అవుతాడు అంతలో కొన్ని సంఘటనల కారణంగా అక్షర ఆనంద్ విషయంలో డిజ్పాయింట్ అవుతుంది ఈ క్రమంలో పెళ్లి దగ్గర పడుతుందనగా.. అక్షర ఆనంద్‌ను పెళ్లి చేసుకునే విషయంలో పూర్తిగా కన్ఫ్యూజన్‌కు గురవుతుంది చివరకి అక్షర ఆనంద్ ను అర్థం చేసుకుంటుందా ? వారి పెళ్లి అనుకున్న ప్రకారంగానే జరుగుతుందా ? లేదా ? అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్ : దర్శకుడు లక్ష్మణ్ కార్య రాసుకున్న సున్నితమైన కథే ఈ సినిమాకు ప్రధాన బలం.బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక హీరో సుమంత్ అశ్విన్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబర్చి ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మెగా డాటర్ నిహారిక అందంగా కనిపిస్తూ, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసింది.  తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన మురళి శర్మ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. కొన్ని ఏమోషనల్ సీన్స్ లో అయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. మైనస్ పాయింట్స్ : దర్శకుడు లక్ష్మణ్ కార్య మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మాత్రం కథనాన్ని రాసుకోలేదు. ఫస్టాఫ్ ను బాగానే నడిపిన ఆయన, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీశారుకుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ , లవ్ ట్రాక్ ను కూడా అంత కన్నా బాగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఉంది, అది కొన్ని సమస్యల కారణంగా ఘర్షణలో నలిగిపోతోంది అని తెలుస్తుంటుంది కానీ ప్రేక్షకుడి మనసుకు మాత్రం అంత బలంగా దగ్గరకాలేకపోయింది. సాంకేతిక విభాగం : తమన్ యస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.శక్తికాంత్ కార్తీక్ సమకూర్చున పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పెళ్లి తాలూకు సందడికి సంబంధించిన విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళు పాటించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. తీర్పు : సినిమాలో మెయిన్ థీమ్ గా చెప్పాలనుకున్న ఓ సగటు అమ్మాయికి పెళ్లి పట్ల ఉన్న కన్ ఫ్యుజన్స్ ను అనుమానాలను భయాలను చెప్పటం బాగుంది. ఈ చిత్రం కూడా ఎక్కువుగా అమ్మాయిలకే కనెక్ట్ అవుతుంది తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించకపోవచ్చు 'హ్యాపీ వెడ్డింగ్' : లైవ్ అప్డేట్స్: నిహారిక మరియు ఆమె ఆంటీ ఇంద్రజ మధ్య కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 10:20 AM July 28, 2018 ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది. కెమెరా వర్క్ చాలా బావుంది. నిహారిక సింపుల్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తోంది. Date & Time : 10:12 AM July 28, 2018 నరేష్ మరియు మురళి శర్మ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 10:05 AM July 28, 2018 ఇంటర్వెల్ తరువాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ ను ఆకట్టుకునేందుకు హీరో ఆమె వద్దకు వెళుతున్నాడు. Date & Time : 10:00 AM July 28, 2018 ఇంటర్వెల్ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. నేటి యువతకు సంబంధించిన సమకాలీన మరియు ఆధునిక సంబంధాల ఆధారంగా చిత్రీకరించిన సినిమా. ఒక మంచి పాయింట్ తో సినిమా సగానికి చేరుకుంది. Date & Time…

హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 2.75
సాంకేతికవిభాగం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.5

2.6

హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ

హ్యాపీ వెడ్డింగ్ రివ్యూ రేటింగ్

User Rating: Be the first one !
3