జై లవ కుశ రివ్యూ

0JaiLavaKusaటైటిల్ : ‘ జై లవకుశ ‘ (2017)
స్టార్ కాస్ట్ : ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశిఖన్నా తదితరులు…
దర్శకత్వం : బాబీ
నిర్మాతలు: కళ్యాణ్ రామ్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : సెప్టెంబర్ 21, 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తారక్ త్రిపాత్రాభినయం చేయడం, టీజర్స్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకోవడంతో తార స్థాయి క్రేజ్ నెలకొంది. మరి ఇన్ని అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అన్నదమ్ములుగా పుట్టిన ముగ్గురు జై, లవ, కుశ లు రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని వాళ్ళ తల్లి ఆశపడుతుంది. కానీ ముగ్గురిలో కొంత లోపంతో పుట్టిన పెద్దవాడైన జైను లవ కుశలు చిన్న చూపుతో హేళనగా చూసి దూరం పెట్టడంతో మనసు గాయపడ్డ జై క్రూరుడిగా మారతాడు. తనకెవ్వరూ లేరు తనకు తానొక్కడే అనుకుని రావణుడిలా తయారవుతాడు.

చివరికి తనకిష్టమైన గుర్తింపును పొందడం కోసమే చిన్నతనంలోనే దూరమైన లవ, కుశలను తిరిగి మళ్ళీ తన దగ్గరకే రప్పించుకుని పంతం నెగ్గించుకోవాలని చూస్తాడు. అసలు జై పొందాలనుకున్న గుర్తింపు ఏమిటి ? లవ, కుశలను తన దగ్గరకు ఎందుకు రప్పించుకున్నాడు ? చివరికి ఈ ముగ్గురి అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగింది ? అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన బలం తారక్ నటనే. మూడు పాత్రల్లోను ఆయన నటించిన తీరు అద్బుతమనే చెప్పాలి. వేషం, భాష, వ్యక్తిత్వం చివరికి శరీరం కదిలే వేగంలో కూడా మూడు పాత్రల్లోనూ మూడు విధాలుగా పెర్ఫార్మ్ చేసి స్పష్టమైన తేడా కనబడేలా నటించాడాయన. ఇదే కథలో ఆయన గనుక లేకపోతే కలగాపులగంగా మారి సినిమా మొత్తం తలకిందులయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి టిపికల్ వేరియేషన్స్ ను తారక్ తన నటనతో అరటిపండు వలచినంత స్పష్టంగా కళ్ళ ముందు ఆవిష్కరించాడు. కొన్ని సన్నివేశాల్లో ముగ్గురూ ఒకేలా ఉన్నా కేవలం ఎన్టీఆర్ ఆహార్యాన్ని బట్టే ముగ్గురిలో ఎవరు ఎవరో చెప్పేయవచ్చు. అంత పర్ఫెక్షన్ చూపించాడు తారక్. కేవలం అభిమానులకే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన నటన నచ్చుతుంది.

ఇక దర్శకుడు బాబీ విషయానికొస్తే ఆయన రాసుకున్న లైన్, కొంత కథనం బాగానే ఉన్నాయి. జై తో పాటు కొంచెం చిలిపితనం కలిగిన కుశ, బెరుకుతనం, నిజాయితీ ఉన్న లవ కుమార్ పాత్రల్ని కూడా బాగానే రాసుకున్నాడు. మూడింటిలో వేటికీ అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఇక తీసిన విధానం చూస్తే ఫస్టాఫ్ మొత్తాన్ని లవ, కుశ పాత్రల మీద కొంత సరదాగా నడుపుతూ ఇంటర్వెల్ లో జై పాత్రను ప్రవేశపెట్టి మంచి బ్రేక్ ఇచ్చాడు. అలాగే సెకండాఫ్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్య నడిపిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. జై పాత్ర ఎలివేషన్, ఫైట్స్ మాస్ ఆడియన్సుకి నచ్చుతాయి. రాశీఖన్నా కొంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అందంగా కనిపిస్తూ మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ ఆకట్టుకునే కథనం లేకపోవడమే. బాబీ కొత్త లైన్ నే పట్టుకుని దాన్ని సగం వరకు బాగానే నడిపినా ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేల్చేశాడు. బాగుంది బాగుంది అనుకునేలోపు సినిమాను రొటీన్ దారిలోకి తీసుకెళ్లి దానికి క్యాజువల్ ఎండింగ్ ఇచ్చి కొంత నిరుత్సాహానికి గురిచేశాడు. ఫస్టాఫ్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు కూడా అతి సాధారణమైన కారణాలు తప్ప ఔరా అనిపించే రీజన్స్ ఎక్కడా కనబడవు.

ఇక సెకండాఫ్లో జై మిగతా ఇద్దరినీ తన దగ్గరకు రప్పించుకోవడం వరకు బాగున్నా వాళ్ళని వాడుకోవడం మాత్రం పరమ రొటీన్ గానే అనిపించింది. ఇక క్లైమాక్స్ కూడా అన్ని సినిమాల్లాగే ఊహాజనితంగానే ఉంది. పెద్దగా కొత్తదనం, ఉద్వేగం కనబడలేదు. నివేతా పాత్రకు కూడా సరైన రీజన్ కనబదు. పైగా లవ్ ట్రాక్స్ కూడా ఏమంత ఆకట్టుకునే విధంగా లేవు. ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మూడు పాత్రల తీరు చిత్రాన్ని ఎలాగోలా ఒడ్డుకు లాక్కొచ్చాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు బాబీ సినిమా కోసం ఎంచుకున్న లైన్, జై, లవ, కుశ పాత్రల్ని మలచిన తీరు, అన్నదమ్ముల అనుబంధాన్ని ఎలివేట్ చేసిన విధానం, ఎన్టీఆర్ ను తొలిసారి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చూపించి మెప్పించినా, కోన వెంకట్, చక్రవర్తిలు రాసిన కథనంలో పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేకపోవడంతో ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తి కలగలేదు. ఛోటా కె నాయుడి సినిమాటోగ్రఫీ బాగుంది. జై కోటను, అతని ఊరు భైరాంపూర్ బాగా చూపించారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ను మూడు విధాలుగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. అలాగే ముగ్గురు కలిసి కబడే ఫ్రేమ్స్ ను సైతం బాగానే హ్యాండిల్ చేశారు.

దేవిశ్రీ ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించగా, పాటల సంగీతంతో పర్వాలేదనిపించాడు. ఇకపోతే ఎన్టీఆర్ డ్యాన్సులు, డైలాగులు భీభత్సం అనలేం కానీ బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగానే ఉంది. కళ్యాణ్ రామ్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద ‘జై లవ కుశ’ ఎన్టీఆర్ సోలో పెర్ఫార్మెన్స్ మీద నడిచ చిత్రమని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో ఆయన నటించిన విధానం ముఖ్యంగా జై పాత్రలో ఆయన నెగెటివ్ నటన అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. కొత్త లైన్, కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు, సెకండాఫ్లో ఎలివేట్ అయ్యే అన్నదమ్ముల సెటిమెంట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేని కథనం, రొటీన్ ఎండింగ్ కొంత నిరుత్సాహానికి గురిచేసే అంశాలు. మొత్తం మీద ఎన్టీఆర్ అద్భుత నటనతో ఈ చిత్రం అభిమానులని అలరించేలా ఉన్నా రెగ్యులర్ ప్రేక్షకులకు యావరేజ్ అనిపిస్తుంది.

 • చిత్రం పూర్తయింది..పూర్తి రివ్యూ కోసం TeluguNow.com చూస్తూ ఉండండి.

 • ఆసక్తికరమైన ఫ్యామిలీ ఎమోషన్ సీన్ తో చిత్రం చివరి దశకు చేరుకుంది.

 • చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. చిత్రంలో ట్విస్ట్ రివీల్ అయింది.

 • అన్నదమ్ముల మధ్య వస్తున్న సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

 • ట్రైలర్ చూపిన పాపులర్ డైలాగ్ ఘట్టమేదైనా.. పాత్రేదైనా నేను రె..రెడీ అని చెప్పే సీన్ వస్తోంది.

 • తమన్నా గ్లామర్, డాన్స్ మూమెంట్స్ ఆడియన్స్ కి కన్నుల విందుగా ఉన్నాయి. ఎన్టీఆర్ ని రావణగా చూస్తున విధానం కూడా చాలా బావుంది.

 • మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ ‘స్వింగ్ జరా’ వస్తోంది.

 • అన్నదమ్ముల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు వస్తున్నాయి. జై ఇంకా వైలెంట్ గా మారుతున్నాడు.

 • చిత్రంలో ఇప్పుడు సూపర్ హిట్ మెలోడీ సాంగ్ ‘నీ కళ్లలోన’ వస్తోంది.

 • చిత్రం మళ్లీ ప్రజెంట్ డే కి వచ్చింది. రైతులకు సంబందించిన ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.

 • చిత్రం మరలా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ముగ్గురు అన్నదమ్ములు ఒక చోట కలిశారు. జై, లవ మరియు కుశ లని ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా బావుంది.

 • జై సరికొత్త శక్తిగా అవతరించాడు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ముగిశాయి.

 • చిత్రంలో మరో హీరోయిన్ నివేద థామస్ ‘సిమ్రన్’ గా ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. జై గురించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి. రావణ సాంగ్ తో జై పాత్రని అద్భుతంగా చూపిస్తున్నారు.

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : లవ, కుశ పాత్రలతో సాగిన ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. ఇంటర్వెల్ సన్నివేశంలో జై పాత్రని అద్భుతంగా పరిచయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచిన సీన్ ఇదే.

 • అద్భుతమైన ఫైట్ సీన్ తరువాత ఇంటర్వెల్ పడింది.

 • థియేటర్ మొత్తం ఫాన్స్ ఉత్సాహం ఉరకలు వేస్తోంది.

 • అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జై పాత్ర పరిచయానికి సంబందించిన సీన్ మొదలైంది. రావణగా జై పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు.

 • చిత్రంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. కొన్ని ఉత్కంఠ భరితమైన సీన్స్ వస్తున్నాయి.

 • లవ, రాశి ఖన్నా మధ్య రొమాంటిక్ సీన్స్ తరువాత హిట్ సాంగ్ ‘ట్రింగ్ ట్రింగ్’ మొదలైంది.

 • ప్రస్తుతం ఫైట్ సీన్ వస్తోంది. కుశ పాత్రలో ఎన్టీఆర్ చాలా బాగా నటిస్తున్నాడు.

 • పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.

 • కమెడియన్లు బ్రహ్మాజీ, ప్రభాస్ శీనులు ఎంట్రీ ఇచ్చారు. మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.

 • ప్రస్తుతం బ్యాంకుకు సంబందించిన కామెడీ సీన్స్ వస్తున్నాయి.

 • నటి నందిత కూడా సీన్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ సీన్స్ వస్తున్నాయి.

 • హీరోయిన్ రాశి ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్, రాశి మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఎన్టీఆర్ మరో పాత్ర లవ పరిచయం కూడా జరిగింది. లవ తన కథ ని వివరిస్తున్నాడు. హంసా నందిని సీన్ లోకి ఎంటర్ అయింది.

 • ఎన్టీఆర్ కుశ పాత్రతో పరిచయం అయ్యాడు. ‘దోచేస్తా’ సాంగ్ మొదలు కావడంతో ఆడియన్స్ ఉత్సాహం పెరిగింది.

 • కొన్ని అవమానకర ఘటనలు సమాజంపై జై అభిప్రాయం మారేలా చేస్తున్నాయి. ఉత్కంఠ భరితమైన సీన్స్ వస్తున్నాయి.

 • పోసాని కృష్ణ మురళి పాత్రతో తొలి సన్నివేశం మొదలైంది. జై, లవ మరియు కుశ ల చిన్ననాటి సన్నివేశాలు చూపిస్తున్నారు.

 • రోడ్డు ప్రమాదాలపై ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మెసేజ్ వచ్చింది. చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ కు అంకితం చేశారు.

 • 158 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది. అభిమానుల ఉత్సాహానికి అవధులు లేకుండా ఉంది.

 • భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తున్నాము.

Summary
Review Date
Reviewed Item
జై లవ కుశ రివ్యూ
Author Rating
41star1star1star1stargray
టైటిల్ : ‘ జై లవకుశ ‘ (2017) స్టార్ కాస్ట్ : ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశిఖన్నా తదితరులు… దర్శకత్వం : బాబీ నిర్మాతలు: కళ్యాణ్ రామ్ మ్యూజిక్ : దేవి శ్రీ విడుదల తేది : సెప్టెంబర్ 21, 2017 యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రంపై అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తారక్ త్రిపాత్రాభినయం చేయడం, టీజర్స్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకోవడంతో తార స్థాయి క్రేజ్ నెలకొంది. మరి ఇన్ని అంచనాల నడుమ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… కథ : అన్నదమ్ములుగా పుట్టిన ముగ్గురు జై, లవ, కుశ లు రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని వాళ్ళ తల్లి ఆశపడుతుంది. కానీ ముగ్గురిలో కొంత లోపంతో పుట్టిన పెద్దవాడైన జైను లవ కుశలు చిన్న చూపుతో హేళనగా చూసి దూరం పెట్టడంతో మనసు గాయపడ్డ జై క్రూరుడిగా మారతాడు. తనకెవ్వరూ లేరు తనకు తానొక్కడే అనుకుని రావణుడిలా తయారవుతాడు. చివరికి తనకిష్టమైన గుర్తింపును పొందడం కోసమే చిన్నతనంలోనే దూరమైన లవ, కుశలను తిరిగి మళ్ళీ తన దగ్గరకే రప్పించుకుని పంతం నెగ్గించుకోవాలని చూస్తాడు. అసలు జై పొందాలనుకున్న గుర్తింపు ఏమిటి ? లవ, కుశలను తన దగ్గరకు ఎందుకు రప్పించుకున్నాడు ? చివరికి ఈ ముగ్గురి అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగింది ? అనేదే సినిమా కథ. ప్లస్ పాయింట్స్ : సినిమాకు ప్రధాన బలం తారక్ నటనే. మూడు పాత్రల్లోను ఆయన నటించిన తీరు అద్బుతమనే చెప్పాలి. వేషం, భాష, వ్యక్తిత్వం చివరికి శరీరం కదిలే వేగంలో కూడా మూడు పాత్రల్లోనూ మూడు విధాలుగా పెర్ఫార్మ్ చేసి స్పష్టమైన తేడా కనబడేలా నటించాడాయన. ఇదే కథలో ఆయన గనుక లేకపోతే కలగాపులగంగా మారి సినిమా మొత్తం తలకిందులయ్యేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి టిపికల్ వేరియేషన్స్ ను తారక్ తన నటనతో అరటిపండు వలచినంత స్పష్టంగా కళ్ళ ముందు ఆవిష్కరించాడు. కొన్ని సన్నివేశాల్లో ముగ్గురూ ఒకేలా ఉన్నా కేవలం ఎన్టీఆర్ ఆహార్యాన్ని బట్టే ముగ్గురిలో ఎవరు ఎవరో చెప్పేయవచ్చు. అంత పర్ఫెక్షన్ చూపించాడు తారక్. కేవలం అభిమానులకే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన నటన నచ్చుతుంది. ఇక దర్శకుడు బాబీ విషయానికొస్తే ఆయన రాసుకున్న లైన్, కొంత కథనం బాగానే ఉన్నాయి. జై తో పాటు కొంచెం చిలిపితనం కలిగిన కుశ, బెరుకుతనం, నిజాయితీ ఉన్న లవ కుమార్ పాత్రల్ని కూడా బాగానే రాసుకున్నాడు. మూడింటిలో వేటికీ అన్యాయం జరగకుండా చూసుకున్నాడు. ఇక తీసిన విధానం చూస్తే ఫస్టాఫ్ మొత్తాన్ని లవ, కుశ పాత్రల మీద కొంత సరదాగా నడుపుతూ ఇంటర్వెల్ లో జై పాత్రను ప్రవేశపెట్టి మంచి బ్రేక్ ఇచ్చాడు. అలాగే సెకండాఫ్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్య నడిపిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. జై పాత్ర ఎలివేషన్, ఫైట్స్ మాస్ ఆడియన్సుకి నచ్చుతాయి. రాశీఖన్నా కొంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అందంగా కనిపిస్తూ మెప్పించింది. మైనస్ పాయింట్స్ : సినిమాకు ప్రధాన మైనస్ ఆకట్టుకునే కథనం లేకపోవడమే. బాబీ కొత్త లైన్ నే పట్టుకుని దాన్ని సగం వరకు బాగానే నడిపినా ఆ తర్వాత మాత్రం పూర్తిగా తేల్చేశాడు. బాగుంది బాగుంది అనుకునేలోపు సినిమాను రొటీన్ దారిలోకి తీసుకెళ్లి దానికి క్యాజువల్ ఎండింగ్ ఇచ్చి కొంత నిరుత్సాహానికి గురిచేశాడు. ఫస్టాఫ్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు కూడా అతి సాధారణమైన కారణాలు తప్ప ఔరా అనిపించే రీజన్స్ ఎక్కడా కనబడవు. ఇక సెకండాఫ్లో జై మిగతా ఇద్దరినీ తన దగ్గరకు రప్పించుకోవడం వరకు బాగున్నా వాళ్ళని వాడుకోవడం మాత్రం పరమ రొటీన్ గానే అనిపించింది. ఇక క్లైమాక్స్ కూడా అన్ని సినిమాల్లాగే ఊహాజనితంగానే ఉంది. పెద్దగా కొత్తదనం, ఉద్వేగం కనబడలేదు. నివేతా పాత్రకు కూడా సరైన రీజన్ కనబదు. పైగా లవ్ ట్రాక్స్ కూడా ఏమంత ఆకట్టుకునే విధంగా లేవు. ఎన్టీఆర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మూడు పాత్రల తీరు చిత్రాన్ని ఎలాగోలా ఒడ్డుకు లాక్కొచ్చాయి. సాంకేతిక విభాగం : దర్శకుడు బాబీ సినిమా కోసం ఎంచుకున్న లైన్, జై, లవ, కుశ పాత్రల్ని మలచిన తీరు, అన్నదమ్ముల అనుబంధాన్ని ఎలివేట్ చేసిన విధానం, ఎన్టీఆర్ ను తొలిసారి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చూపించి మెప్పించినా, కోన వెంకట్, చక్రవర్తిలు రాసిన కథనంలో పెద్దగా కొత్తదనం, ఆసక్తి లేకపోవడంతో ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తి కలగలేదు. ఛోటా కె నాయుడి సినిమాటోగ్రఫీ బాగుంది. జై కోటను, అతని ఊరు భైరాంపూర్ బాగా చూపించారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ను మూడు విధాలుగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. అలాగే ముగ్గురు కలిసి కబడే ఫ్రేమ్స్…

జై లవ కుశ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే
నటీ నటుల ప్రతిభ
సాంకేతికవిభాగం పనితీరు
దర్శకత్వ ప్రతిభ

జై లవ కుశ రివ్యూ

జై లవ కుశ రివ్యూ

User Rating: 2.05 ( 6 votes)
78