జనతా గ్యారెజ్ రివ్యూ

0Janath-Garage-Review

 

‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాల నడుమే భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా, అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

సత్యం (మోహన్ లాల్) ఆటో మొబైల్ వర్క్స్‌ రిపేరింగ్‌లో ఎంతో అనుభవమున్న వ్యక్తి. జనతా గ్యారెజ్ పేరుతో తన కుటుంబం, మిత్రులతో కలిసి ఓ గ్యారెజ్ నెలకొల్పి ఆటో మొబైల్ రిపేర్స్‌తో పాటు, తమ వద్దకు సాయం కోరి వచ్చేవారికి అండగా నిలబడుతూంటాడు సత్యం. ఈ క్రమంలోనే సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్, జనతా గ్యారెజ్‌కు దూరంగా, తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ (ఎన్టీఆర్).. చిన్నప్పట్నుంచీ మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటినే తన ప్రపంచంగా మార్చేసుకొని బతుకుతూంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబైలో పుట్టి పెరిగిన ఆనంద్, హైద్రాబాద్‌లో ఉండే జనతా గ్యారెజ్‌ను లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్‍ను జనతా గ్యారెజ్‌కు దగ్గర చేసిన అంశమేంటీ? సత్యం తన పెదనాన్నే అని ఆనంద్ తెలుసుకుంటాడా? జనతా గ్యారెజ్‌ను ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళతాడు? అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారెజ్ అన్న ఒక పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం, ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్నదానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్నిచోట్ల బాగానే వాడుకున్నారని చెప్పొచ్చు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనా స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీలో, యాక్టింగ్‍లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్‍ లాల్‌ను తెలుగు తెరపై చూడడమన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్ లాల్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. చాలాచోట్ల సినిమాను ఆయన పాత్రే నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా చెప్పాలి. ‘జయహో జనతా..’ అంటూ ఈ సమయంలోనే వచ్చే మాంటేజ్ సాంగ్ చాలా బాగుంది. ఇక ‘పక్కాలోకల్’ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్!

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ పాయింట్ అంటే ఒక బలమైన కథ, కథనాలు లేకపోవడమనే చెప్పాలి. అదిరిపోయే రెండు పాత్రలను పెట్టుకొని వాటి చుట్టూ అల్లిన కమర్షియల్ కథ చాలా పాతది, ఇప్పటికే బోర్ కొట్టినది కావడం అతిపెద్ద మైనస్. ఇక ఫస్టాఫ్‌లో అసలు కథ పరిచయం కాకపోవడం, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల తర్వాత సినిమాలో కథే లేకపోవడం కూడా నిరాశపరిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా తేలిపోయింది.

ఇక కథా వేగం మొదట్నుంచీ నెమ్మదిగా సాగడం కూడా మైనస్ అనే చెప్పుకోవాలి. సమంత, నిత్యా మీనన్‌ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నా, వాళ్ళు వేళ్ళపై లెక్కెబెట్టేన్ని సన్నివేశాల్లో కనిపించారు. రెండున్నర గంటలకు పైనే ఉన్న నిడివి కూడా ఓ మైనస్‌గానే చెప్పుకోవచ్చు. ఇక పక్కా కమర్షియల్ సినిమా అయిన ఇందులో కామెడీ లాంటిది ఎక్కడా లేకపోవడం కూడా నిరుత్సాహపరచే అంశమే.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పుకుంటే.. రెండు మంచి పాత్రలతో కథ చెప్పాలని ప్రయత్నించిన శివ, అసలు కథని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించేలా రాయలేకపోయారు. అయితే కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో దాన్ని మలుచుకొని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను అందించడంలో ఫర్వాలేదనిపించాడు. జనతా గ్యారెజ్ నేపథ్యాన్ని, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషలను చాలా బాగా డీల్ చేశాడు.

తిరు సినిమాటోగ్రఫీ టెక్నికల్‌గా ఈ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చింది. లైటింగ్, ఫ్రేమింగ్, షాట్ మేకింగ్ అన్నీ పద్ధతిగా ఉండి సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో దేవీ మరోసారి తన ప్రతిభ చూపాడు. ఎడిటింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సాదాసీదాగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

తన గత రెండు సినిమాల్లోనూ ఒక బలమైన అంశాన్ని, తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్‌లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ, ఈసారి పూర్తిగా కమర్షియల్ పంథాని మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా ‘జనతా గ్యారెజ్’. ఒక మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన, వాటిచుట్టూ పూర్తి స్థాయిలో కట్టిపడేసే కథ, కథనాలను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్‌ల అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు లాంటివి ఈ సినిమాకు కమర్షియల్‌గా బాగా కలిసివచ్చే అంశాలుగా నిలిచాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘జనతా గ్యారెజ్‌’లో అన్ని రిపేర్లూ చేస్తారు కానీ, ఆ రిపేర్ మరీ బాగుందనే స్థాయిలో ఉండదు.

‘జనతా గ్యారేజ్’ లైవ్ అప్డేట్స్: |Janatha Garage Full Moive Review

 • సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం TeluguNow.com పై వేచి ఉండండి.

 • ఎమోషనల్ క్లైమాక్స్ నడుస్తోంది. ఎన్టీఆర్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు.

 • అజయ్ పై కొన్ని భావోద్వేగపూరితమైన సన్నివేశాలు నడుస్తున్నాయి.

 • కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది. సాయికుమార్ తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.

 • సూపర్ హిట్టైన పక్కా లోకల్.. ఐటమ్ సాంగ్ తో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పాటలో ఆమె చాలా అందంగా ఉంది.

 • ఎన్టీఆర్, సచిన్ ఖేడేకర్ ల మధ్య ప్రతిఘటన సన్నివేశాలు నడుస్తున్నాయి. ఆశిష్ విద్యార్థి కథలోకి ఎంటరయ్యాడు.

 • సెకండ్ హాఫ్ లో నిత్యా మీనన్ రీ ఎంట్రీ ఇచ్చింది.

 • ఎన్టీఆర్, సమంతల మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.

 • టైటిల్ సాంగ్ జయహో జనతా వస్తోంది. ఎన్టీఆర్ చాలా ఆవేశంగా ముందుకెళుతున్నాడు. సినిమా మంచి వేగం అందుకుంది.

 • బలమైన ఫైటింగ్ సన్నివేశం నడుస్తోంది. అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగులు చెబుతున్నాడు.

 • సెకండ్ హాఫ్ లో రాజీవ్ కనకాల ఎంట్రీ జరిగింది. కథనంలో అద్భుతమైన సన్నివేశం నడుస్తోంది.

 • ఇంటర్వెల్ తరువాత సినిమా చాలా సీరియస్ గా మొదలైంది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చేరే కీలక ఘట్టం నడుస్తోంది.

 • సింపుల్ గా ఉంటూనే మంచి ప్రభావం ఉండే సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.

 • కథలో మరో ట్విస్ట్ వచ్చింది. సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోకి మారి, మంచి ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

 • మూడవ పాట ‘యాపిల్ బ్యూటీ’ వస్తోంది. ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

 • ఎన్టీఆర్, సమంతల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • కథలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. తారక్ తన పాత్రలో చాలా తెలివిగా నటిస్తున్నాడు.

 • సమంత, ఎన్టీఆర్, నిత్యా మీనన్లపై కొన్ని కామెడీ సన్నివేశాలు నడుసున్నాయి. రెండవ పాట రాక్ ఆన్ బ్రో.. వస్తోంది. లొకేషన్స్ బాగున్నాయి.

 • నిత్యామీనన్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ కి మారింది.

 • కథలోకి సమంత ఎంటరైంది. సినిమా సీరియస్ గా మారింది.

 • యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింపుల్ గా సూపర్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అతని లుక్ కూల్ గా చాలా బాగుంది.

 • సీనియర్ నటుడు సురేష్, సచిన్ ఖేడేకర్ కథలోకి ఎంటరయ్యారు. మోహన్ లాల్ మెకానిక్ పాత్రలో కనిపిస్తున్నాడు.

 • మోహన్ లాల్, సాయి కుమార్ లు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. జనతా గ్యారేజ్ చూపబడుతోంది .

 • జనతా గ్యారేజ్ చిత్రం ఇప్పుడే మొదలైంది. సినిమా రన్ టైమ్ 162 నిముషాలుగా ఉంది. కథ జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలైంది.

 • జనతా గ్యారేజ్ లైవ్ అప్డేట్స్ కు స్వాగతం. థియేటర్ మొత్తం అభిమానులతో నిండిపోయి ఉంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా షో చూడటానికి వచ్చారు.

 

నాన్నకు ప్రేమతో’ లాంటి క్లాస్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ‘జనతా గ్యారెజ్’ అన్న సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 1న) భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఎన్టీఆర్ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) కొన్ని గంటల్లో మీ సినిమా రిలీజవుతోంది. ఎలా ఉంది?

స) సినిమా విడుదలవుతుందంటే కచ్చితంగా దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచన ఉంటుంది. రేపు ప్రేక్షకులే సినిమా ఎలా ఉందో డిసైడ్ చేస్తారు. రెండు వారాలు సినిమా హడావుడిలో పడిపోతాం. మళ్ళీ ఇంకో సినిమా మొదలవుతుంది. ఇదంతా ఒక సైకిల్‌లా జరిగిపోయే విషయం. ఎప్పటికప్పుడు నటుడిగా ఎదుగుతూ, మంచి సినిమాలు చేయడమే మన పని. తప్పకుండా ‘జనతా గ్యారెజ్’ అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) కొన్నేళ్ళుగా మీ మాటల్లో చాలా మార్పు, ఆలోచనల్లో పరిణతి కనిపిస్తోంది. కారణం?

స) కారణమంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. వయసు పెరుగుతూ ఉన్నా కొద్దీ మనమేంటీ అనేది అర్థం చేసుకోవాలి. మెల్లిగా జీవితంపై అవగాహన వచ్చేస్తుంటుందప్పుడు. పరాజయాలే ఓ వేకప్ కాల్‌లా ఇవన్నీ నేర్పించాయి. మా అబ్బాయి అభయ్ రాక కూడా నన్ను పూర్తిగా మార్చేసింది.

ప్రశ్న) ‘జనతా గ్యారెజ్’ విషయానికి వస్తే, ఇక్కడ ఏమేం రిపేర్ చేస్తూంటారు?

స) (నవ్వుతూ..) ఈ ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ‘జనతా గ్యారెజ్‌’లో అన్నీ రిపేర్ చేస్తూంటాం. మనుషులను రిపేర్ చేసే గ్యారెజ్ ఇది. ఆ అంశమే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.

ప్రశ్న) ఈ సినిమా కథ విని, మీ పాత్ర గురించి తెలుసుకోగానే ఎలా ఫీలయ్యారు?

స) నేను ఈ కథ రెండేళ్ళ క్రితమే విన్నా. వినగానే చాలా ఎగ్జైట్ అయ్యా. ప్రకృతి అంటే ఇష్టమనే ఓ యువకుడు, ఎక్కడో మనుషులంటే ఇష్టం ఉండే ఓ వ్యక్తి… ఈ ఇద్దరినీ కలిపే పరిస్థితులూ.. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అనుకోని కారణాల వల్ల సినిమా మొదలవ్వడానికి ఆలస్యమైంది. జనతా గ్యారెజ్ ఒక సినిమా కథగా కన్నా ఓ మంచి ఎక్స్‌పీరియన్స్. ఎంతో బాగా నచ్చడం వల్లేనేమో ఈ పాత్రలో ఒదిగిపోవడం చాలా సులభమైంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుంది? ఆ పాత్ర కోసం ఏయే కసరత్తులు చేశారు?

స) ముందే చెప్పినట్లు ‘జనతా గ్యారెజ్‌’లో నేనొక నేచర్ లవర్‌గా కనిపిస్తా. చెట్లు, మొక్కలంటే ఇష్టపడే ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమాలోని పాత్రకు ఇందులో పాత్రకు పూర్తి వ్యత్యాసం ఉంటుంది. అందుకనే ఈ పాత్ర కోసం లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం. మీరు సినిమా చూస్తే ఎక్కడా స్టైలిష్‌గా కనిపించాలని చేసే ప్రయత్నాలుండవు. బయట మనకు కనిపించే యువకులంతా ఎలా ఉంటారో, ఎలా డ్రెస్ అయి కనిపిస్తారో అలా ఉంటా.

ప్రశ్న) దర్శకుడు కొరటాల శివతో పనిచేయడం ఎలా అనిపించింది?

స) కొరటాల శివ అమేజింగ్ రైటర్. ఓ రచయిత అనేవాడు మనసుతో ఆలోచిస్తాడు, దర్శకుడు మెదడుతో ఆలోచిస్తాడు. తనలోని దర్శకుడిని, రచయితని సరిగ్గా హ్యాండిల్ చేయగల సమర్ధుడు కొరటాల శివ. బృందావనం అప్పట్నుంచే మేమిద్దరం మంచి స్నేహితులం. టాలెంటెడ్ దర్శకులతో పనిచేయడం ఎప్పుడూ బాగుంటుంది.

ప్రశ్న) మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్‌తో కలిసి నటించడం గురించి చెప్పండి?

స) మోహన్ లాల్ గారి లాంటి టాప్ క్లాస్ యాక్టర్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ప్రొఫెషనల్‌గానే కాక పర్సనల్‌గా కూడా ఆయన నాకు బాగా దగ్గరయ్యారు. ఒక సూపర్‌స్టార్ అయి ఉండి కూడా సింపుల్‌గా ఉండడం, పర్సనల్ లైఫ్‌లో అందరి లాంటి వ్యక్తిలా ఉండడం చూసి ఆయన్ను ఇన్స్పిరేషన్‌గా మార్చుకున్నా.

ప్రశ్న) ఇప్పటికే సినిమా చూసేశారని విన్నాం. ఎలా అనిపించింది?

స) నేను చేసిన సినిమాలన్నీ నాకు బాగానే ఉంటాయి కదండీ (నవ్వుతూ..) యా! ‘జనతా గ్యారెజ్‌’ను ఒక యాక్షన్ డ్రామాగా కన్నా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా చెప్పుకోవచ్చు అనిపించింది. ఆ డ్రామా ఎలా ఉంటుందన్నది మీరు సినిమాలో చూడాల్సిందే. రేప్పొద్దున మేమనుకున్న ఈ అంశం ప్రేక్షకులకూ నచ్చితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది?

ప్రశ్న) బాక్సాఫీస్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందీ? సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందీ? ఇలాంటివి ఆలోచిస్తూంటారా?

స) ఎందుకోగానీ నేను ఈ బాక్సాఫీస్ నెంబర్స్, నెంబర్ గేమ్స్ వీటిని పెద్దగా నమ్మను. ఇప్పుడింక పరిస్థితులు మారాయి, ప్రేక్షకులు కూడా నెంబర్స్‌ని చూసే సినిమా విజయాన్ని చూస్తున్నారు కాబట్టి అవెలా ఉన్నాయన్నది గమనిస్తూంటా. ఇప్పటికీ నేనైతే సక్సెస్‌ను బాక్సాఫీస్ ఫిగర్స్‌తో కలిపి చూడలేను.

ప్రశ్న) హీరోయిజం, మాస్ ఇమేజ్ లాంటివి స్టార్ హీరోలను ఎప్పుడూ వెంటాడే అంశాలు. వీటిని మీరెలా హ్యాండిల్ చేస్తూంటారు?

స) ఈ హీరోయిజం, స్టార్ హీరో అన్నవి నాకే బోర్ కొట్టేశాయి. అనవసరమైన హీరోయిజాలు ప్రేక్షకులూ కోరుకోవట్లేదన్నది నాతో సహా అందరు హీరోలూ అర్థం చేసుకున్నారనుకుంటున్నా. ఇప్పుడంతా ఎంత బలమైన కథతో ప్రేక్షకుడిని మెప్పిస్తున్నామన్నదే ప్రధానంగా మారిపోయింది. అలాంటప్పుడు కథ అవసరానికి తగ్గట్టే డ్యాన్స్‌లు, పాటలు, ఫైట్స్ ఉండేలా చూస్తూంటాం. దీంతో నాకూ నటుడిగా నిరూపించుకునే అవకాశం ప్రతిసారీ దక్కుతుంది. నన్ను నేను హీరోగా కంటే నటుడిగానే ఎక్కువగా ప్రస్తావించుకుంటా. ఇక మాస్ ఇమేజ్ అన్నది కూడా ఇప్పుడెక్కడా లేదనే నమ్ముతా. ఎంత మంది ప్రేక్షకులకు సినిమా చేరితే అంత మాస్!

ప్రశ్న) చివరగా, మీ తదుపరి సినిమా ఏంటి?

స) ప్రస్తుతానికి జనతా గ్యారెజ్.. జనతా గ్యారెజ్. ఈ సినిమా విడుదలయ్యాక, కొత్తదేంటీ? ఎప్పుడు మొదలవుతుందీ? అన్నది ప్రకటిస్తా.

Summary
Review Date
Reviewed Item
Janatha Garage
Author Rating
31star1star1stargraygray
‘   ‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాల నడుమే భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా, అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం.. కథ : సత్యం (మోహన్ లాల్) ఆటో మొబైల్ వర్క్స్‌ రిపేరింగ్‌లో ఎంతో అనుభవమున్న వ్యక్తి. జనతా గ్యారెజ్ పేరుతో తన కుటుంబం, మిత్రులతో కలిసి ఓ గ్యారెజ్ నెలకొల్పి ఆటో మొబైల్ రిపేర్స్‌తో పాటు, తమ వద్దకు సాయం కోరి వచ్చేవారికి అండగా నిలబడుతూంటాడు సత్యం. ఈ క్రమంలోనే సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్, జనతా గ్యారెజ్‌కు దూరంగా, తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ (ఎన్టీఆర్).. చిన్నప్పట్నుంచీ మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటినే తన ప్రపంచంగా మార్చేసుకొని బతుకుతూంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబైలో పుట్టి పెరిగిన ఆనంద్, హైద్రాబాద్‌లో ఉండే జనతా గ్యారెజ్‌ను లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్‍ను జనతా గ్యారెజ్‌కు దగ్గర చేసిన అంశమేంటీ? సత్యం తన పెదనాన్నే అని ఆనంద్ తెలుసుకుంటాడా? జనతా గ్యారెజ్‌ను ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళతాడు? అన్నది సినిమా. ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారెజ్ అన్న ఒక పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం, ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్నదానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్నిచోట్ల బాగానే వాడుకున్నారని చెప్పొచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనా స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీలో, యాక్టింగ్‍లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్‍ లాల్‌ను తెలుగు తెరపై చూడడమన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్ లాల్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. చాలాచోట్ల సినిమాను ఆయన పాత్రే నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా చెప్పాలి. ‘జయహో జనతా..’ అంటూ ఈ సమయంలోనే వచ్చే మాంటేజ్ సాంగ్ చాలా బాగుంది. ఇక ‘పక్కాలోకల్’ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్! మైనస్ పాయింట్స్ : ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ పాయింట్ అంటే ఒక బలమైన కథ, కథనాలు లేకపోవడమనే చెప్పాలి. అదిరిపోయే రెండు పాత్రలను పెట్టుకొని వాటి చుట్టూ అల్లిన కమర్షియల్ కథ చాలా పాతది, ఇప్పటికే బోర్ కొట్టినది కావడం అతిపెద్ద మైనస్. ఇక ఫస్టాఫ్‌లో అసలు కథ పరిచయం కాకపోవడం, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల తర్వాత సినిమాలో కథే లేకపోవడం కూడా నిరాశపరిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా తేలిపోయింది. ఇక కథా వేగం మొదట్నుంచీ నెమ్మదిగా సాగడం కూడా మైనస్ అనే చెప్పుకోవాలి. సమంత, నిత్యా మీనన్‌ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నా, వాళ్ళు వేళ్ళపై లెక్కెబెట్టేన్ని సన్నివేశాల్లో కనిపించారు. రెండున్నర గంటలకు పైనే ఉన్న నిడివి కూడా ఓ మైనస్‌గానే చెప్పుకోవచ్చు. ఇక పక్కా కమర్షియల్ సినిమా అయిన ఇందులో కామెడీ లాంటిది ఎక్కడా లేకపోవడం కూడా నిరుత్సాహపరచే అంశమే. సాంకేతిక విభాగం : ముందుగా దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పుకుంటే.. రెండు మంచి పాత్రలతో కథ చెప్పాలని ప్రయత్నించిన శివ, అసలు కథని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించేలా రాయలేకపోయారు. అయితే కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో దాన్ని మలుచుకొని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను అందించడంలో ఫర్వాలేదనిపించాడు. జనతా గ్యారెజ్ నేపథ్యాన్ని, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషలను చాలా బాగా డీల్ చేశాడు. తిరు సినిమాటోగ్రఫీ టెక్నికల్‌గా ఈ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చింది. లైటింగ్, ఫ్రేమింగ్, షాట్ మేకింగ్ అన్నీ పద్ధతిగా ఉండి సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో దేవీ మరోసారి తన ప్రతిభ చూపాడు. ఎడిటింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సాదాసీదాగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. తీర్పు : తన గత రెండు సినిమాల్లోనూ ఒక బలమైన అంశాన్ని, తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్‌లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ, ఈసారి పూర్తిగా కమర్షియల్ పంథాని మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా ‘జనతా గ్యారెజ్’. ఒక మంచి కమర్షియల్…

జనతా గ్యారెజ్

కథ - స్క్రీన్ ప్లే - 3.5
నటీ నటుల ప్రతిభ - 4
సాంకేతికవిభాగం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.6

జనతా గ్యారెజ్

జనతా గ్యారెజ్

User Rating: 3.25 ( 11 votes)
4