కాలా రివ్యూ

0చిత్రం : కాలా
తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: ధ‌నుశ్‌
ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌
నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌

కొన్ని సినిమాల కోసం సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ సినిమాల‌కు టైమ్‌తో సంబంధం ఉండ‌దు. ఎప్పుడు వ‌చ్చినా స‌రే! ఓ బ‌జ్ క్రియేట్ చేసేస్తాయి. అటువంటి వాటిలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలు ముందుంటాయి. ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా అంటే ఆ క్రేజే వేర‌ప్ప‌.. అంటూ ఉండే హంగామాకి తిరుగుండ‌దు. ర‌జ‌నీ స్టైల్‌, డైలాగ్ డెలివరీ, న‌ట‌న ఇలా అన్ని ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడో మెప్పించేశాయి. వ‌య‌సు మీద ప‌డ్డా ఆయ‌న‌కున్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ నటించిన చిత్రం `కాలా`. ముంబై ధారావి అనే ప్రాంతంలోని ఓ డాన్ త‌న ప్రాంతంలోని ప్ర‌జ‌ల కోసం ఏం చేశాడ‌నేదే అస‌లు సినిమా. ఇక ర‌జ‌నీకాంత్‌కున్న మాస్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందులో ఆయ‌న డాన్‌గా న‌టించాడంటే సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఏర్ప‌డుతాయో చెప్పాలా? భారీ అంచ‌నాలు న‌డుమ విడుద‌లైన కాలా ఎలా ఉంది? స‌గ‌టు సినీ అభిమానికి న‌చ్చుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం.

క‌థ‌:
తిరున‌ల్ వేలికి చెందిన యువ‌కుడు క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు(ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌).. కానీ ఒక్క‌టి కాలేక‌పోతారు. చివ‌ర‌కు కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్ర‌జ‌ల‌కు చెందింది. అక్క‌డున్న హిందూ ముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాల‌ని హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) వంటి రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తాడు. అయితే ఉన్న చోటును వ‌ద‌లి పేద ప్ర‌జ‌ల ఎక్క‌డికి పోతారు. అందువ‌ల్ల వారు కాలా నాయ‌క‌త్వంతో ఎదురుతిరుగుతారు. అనుక‌న్న ప‌ని కాక‌పోతే మ‌న రాజ‌కీయ నాయ‌కులు ఊరుకుంటారా? అక్క‌డి మ‌నుషుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? త‌న ప్రాంత ప్ర‌జల‌ను ఒక్క‌టి చేసే ఎలా పోరాడుతాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:
సినిమాకు ప్ర‌ధాన బ‌లం అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంతే. రెండేళ్లు(క‌బాలి) త‌ర్వాత ర‌జ‌నీకాంత్ చేసిన కాలా..ఆయ‌నకు రాజ‌కీయంగా స‌పోర్ట్ చేసేలా తెర‌కెక్కింద‌నాలి. ఎందుకంటే ఇందులో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మైన పాయింట్ భూమి. స్వాతంత్యం వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి చ‌ర్చించే సినిమా. ద‌ర్శ‌కుడు పా రంజిత్ ధారావి ప్రాంతాన్ని ఓ ఉదాహ‌ర‌ణంగా తీసుకుని భూమి అంద‌రి హ‌క్కు అనే స‌మ‌స్య‌ను ర‌జ‌నీకాంత్ ద్వారా చెప్పించాడు. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్న ర‌జ‌నీకాంత్‌కి ఉప‌యోగ‌ప‌డే కాన్సెప్ట్ ఇది. సినిమా బ్రిడ్జ్‌ఫై వ‌చ్చే ఫైట్‌, ఇంట‌ర్వెల్ బ్లాక్‌, కోర్ పాయింట్ అన్నీ మెప్పిస్తాయి.

మైన‌స్ పాయింట్స్‌:
సినిమా స్లో నెరేష‌న్‌లో ఉండ‌టం. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం. ఇక సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉన్నా.. ర‌జ‌నీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది. అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇక తెలుగు పాట‌ల్లోని సాహిత్యం అస‌లు అర్థం కావ‌డం లేదు.

సమీక్ష‌:
క‌రికాలుడు అలియాస్ కాలాగా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆక్టుకున్నారు. సినిమా అంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది. ర‌జ‌నీకాంత్ సినిమా అంటే మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ఉండాల‌నుకునే ప్రేక్ష‌కుడికి ఇది డిఫ‌రెంట్‌గా అనిపిస్తుది. క‌బాలిలో ఫ‌స్టాఫ్‌లో ర‌జ‌నీకాంత్‌ను మాస్ హీరోగా చూపించి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ హీరోగా చూపించిన పా.రంజిత్ ఇందులో ఫ‌స్టాఫ్ అంతా ఫ్యామిలీ మేన్‌లా చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో ర‌జ‌నీకాంత్ ప్రేమ‌.. విఫ‌లం చెంద‌డం.. ఈశ్వ‌రీరావు, ర‌జ‌నీ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వ‌రీరావు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. పా.రంజిత్ ఈ సినిమాలో ఓ కోర్ పాయింట్‌.. పేద‌వాడు ఉండ‌టానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేద‌వాడికి ఉండ‌టానికి ఇళ్లు ఎందుకు లేవు. అనే ప్ర‌శ్న‌ను రైజ్ చేయించాడు. ర‌జ‌నీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయ‌డం గ్రేట్‌. ర‌జ‌నీ కూడా నేను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌ని కాకుండా ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాల‌ని ఆలోచించి ఇమేజ్‌కి భిన్నంగా చేసిన సినిమా ఇది. నానా ప‌టేక‌ర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో నానా క్యారెక్ట‌ర్‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. ఎన్‌జి.ఒ స‌భ్యురాలుగా హ్యూమా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా ఉంది. ఇక సాంతికేకంగా చూస్తే ముర‌ళి.జి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోశ్ నారాయ‌ణ్ సంగీతం, నేప‌థ్య సంగీతం ఒకే. సినిమాలో ర‌జనీ చేసే ఫ్లై ఓవ‌ర్ ఫైట్ సీన్‌.. ఇంట‌ర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి.

 

‘కాలా’ : లైవ్ అప్డేట్స్

 • ఇప్పుడు భారీ యాక్షన్ సన్నివేశాల తరువాత సినిమా పూర్తి అయింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూ ఉండండి.

 • సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది మళ్లి ఒక మంచి ట్విస్ట్ రివీల్ అయింది. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ లో ఒంటి తల రావణ అంటూ సాగే పాటతో పవర్ ఫుల్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • చిత్రం వయోలెన్స్ మోడ్లో సాగుతుంది ప్రస్తుతం ఇరు వర్గాలు ధారావి విధుల్లోకొట్టుకునే సన్నివేశాలు వస్తున్నాయి .

 • బ్యాక్ గ్రౌండ్లో నేల మా హక్కు అంటూ సాగే పాటతో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు వస్తున్నాయి.

 • నానా తన అధికారం ను ఉపయోగించి ధారావి ప్రజలను అణిచివేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఒక మంచి ట్విస్ట్ కాలా, నానాల మధ్య జరిగే సీన్లు రసవత్తరంగా ఉన్నాయి . నేల నీకు అధికారం , నేల మాకు జీవితం అనే డైలాగ్ తో సాగె సన్నివేశం వస్తుంది.

 • ప్రస్తుతం కాలా అరెస్ట్ అయ్యారు సీన్లో టెంక్షన్ వాతావరణం వుంది . కాలా , నానాలమధ్య శాంతి యుత వాతావరణం నెలకొల్పడానికి షియాజీ షిండే మినిస్టర్ గా సీన్ లో కి ఎంట్రీ ఇచ్చారు .

 • కాలా ఇంట్లో జరుగుతున్న ఫ్యామిలీ ఫంక్షన్ లో రాయే నా రంగీలా అంటూ సాగె పాట వస్తుంది.

 • ఇంటర్వెల్ తరువాత హుమా ,నానా పటేకర్ కు మధ్య కొన్ని ఇంట్రస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా యాక్షన్ సన్నివేశాలతో బాగుంది . రజిని స్క్రీన్ ప్రెజన్స్ ప్రధానంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ సీన్ ఈ చిత్రానికి హైలైట్ కానుంది.

 • సినిమా విరామం దిశగా సాగుతుంది . నికల్ నికల్ అనే సాంగ్ వస్తుంది ఇప్పుడు ఇంటర్వెల్.

 • సినిమా బ్యాక్ టు బ్యాక్ పవర్ ఫుల్ సీన్ల తో వేగం పుంజుకుంది ఇప్పుడు నానా పటేకర్ పూర్తి పరిచయం జరుగుతుంది.

 • ట్రైలర్ లో చెప్పిన పాపులర్ డైలాగ్ క్యారె సెట్టింగా అంటూ సాగే ఫైట్ సీన్ వస్తుంది.

 • సినిమా మెల్లిగా సీరియస్ మూడ్లో సాగుతుంది. ప్రస్తుతం కొన్ని పొలిటికల్ సన్నివేశాలు వస్తున్నాయి

 • కాలాకు ,అతని భార్యకు మధ్యలో కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి. నటి ఈశ్వరి రావు కాలా వైఫ్ పాత్రను పోషిస్తున్నారు.

 • చిట్టెమ్మ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ పాటలో కాలా , హుమా మధ్య కొన్ని క్యూట్ సీన్స్ వస్తున్నాయి

 • నానా పటేకర్ పరిచయం జరిగింది అయన పాత్ర హైలైట్ అవ్వనుంది. హుమా ఖురేషీ కూడా ఎన్ జి ఓ సభ్యురాలుగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు .

 • కాలా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ తరువాత యమ గ్రేటు… అనే మొదటి పాట వస్తుంది

 • ధారవి లో పేద వాళ్ల సమస్యలు తీర్చే నాయకుడి గా రజిని ని చూపిస్తున్నారు . ప్రస్తుతం వాటికీ సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇప్పుడే సూపర్ స్టార్ రజినీకాంత్ పిల్లలతో ఆడుకుంటూ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు

 • ముంబై లోని ధారవి అనే స్లమ్ ఏరియాలో సినిమా స్టార్ట్ అయింది . ఇప్పుడే సంపత్ విష్ణు బాయ్ గా ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం కొన్ని ఇంట్రడక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి

 • టైటిల్స్ పడుతున్నాయ్ భూమి మరియు మానవత్వం గురించి పాత రోజులనుండి ఇప్పటివరకు ఎలా ఉందొ వివరిస్తున్నారు

 • హాయ్ ……. 166 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైయింది

చిత్రం : కాలా తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్ ఆకాశ్‌, షాయాజీ షిండే త‌దిత‌రులు మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌ పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి సంగీతం: స‌ంతోశ్ నారాయ‌ణ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: ముర‌ళి.జి కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌ నిర్మాత‌: ధ‌నుశ్‌ ద‌ర్శ‌క‌త్వం: పా.రంజిత్‌ నిర్మాణ సంస్థ‌లు: వ‌ండ‌ర్ బార్ ఫిలిమ్స్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ కొన్ని సినిమాల కోసం సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ సినిమాల‌కు టైమ్‌తో సంబంధం ఉండ‌దు. ఎప్పుడు వ‌చ్చినా స‌రే! ఓ బ‌జ్ క్రియేట్ చేసేస్తాయి. అటువంటి వాటిలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలు ముందుంటాయి. ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా అంటే ఆ క్రేజే వేర‌ప్ప‌.. అంటూ ఉండే హంగామాకి తిరుగుండ‌దు. ర‌జ‌నీ స్టైల్‌, డైలాగ్ డెలివరీ, న‌ట‌న ఇలా అన్ని ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడో మెప్పించేశాయి. వ‌య‌సు మీద ప‌డ్డా ఆయ‌న‌కున్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ నటించిన చిత్రం `కాలా`. ముంబై ధారావి అనే ప్రాంతంలోని ఓ డాన్ త‌న ప్రాంతంలోని ప్ర‌జ‌ల కోసం ఏం చేశాడ‌నేదే అస‌లు సినిమా. ఇక ర‌జ‌నీకాంత్‌కున్న మాస్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందులో ఆయ‌న డాన్‌గా న‌టించాడంటే సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఏర్ప‌డుతాయో చెప్పాలా? భారీ అంచ‌నాలు న‌డుమ విడుద‌లైన కాలా ఎలా ఉంది? స‌గ‌టు సినీ అభిమానికి న‌చ్చుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థంటో చూద్దాం. క‌థ‌: తిరున‌ల్ వేలికి చెందిన యువ‌కుడు క‌రికాల‌న్‌(ర‌జ‌నీకాంత్‌) కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా ముంబై న‌గ‌రంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్క‌డ ప్ర‌జ‌ల క‌ష్ట సుఖాల్లో వారికి అండ‌గా నిల‌బ‌డి వారి నాయ‌కుడుగా ఎదుగుతాడు. అక్క‌డే జ‌రీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు(ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్‌).. కానీ ఒక్క‌టి కాలేక‌పోతారు. చివ‌ర‌కు కాలా సెల్వి(ఈశ్వ‌రీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్ర‌జ‌ల‌కు చెందింది. అక్క‌డున్న హిందూ ముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి మెలిసి ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాల‌ని హ‌రినాథ్ దేశాయ్‌(నానా ప‌టేక‌ర్‌) వంటి రాజ‌కీయ నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తాడు. అయితే ఉన్న చోటును వ‌ద‌లి పేద ప్ర‌జ‌ల ఎక్క‌డికి పోతారు. అందువ‌ల్ల వారు కాలా నాయ‌క‌త్వంతో ఎదురుతిరుగుతారు. అనుక‌న్న ప‌ని కాక‌పోతే మ‌న రాజ‌కీయ నాయ‌కులు ఊరుకుంటారా? అక్క‌డి మ‌నుషుల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? త‌న ప్రాంత ప్ర‌జల‌ను ఒక్క‌టి చేసే ఎలా పోరాడుతాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్ల‌స్ పాయింట్స్‌: సినిమాకు ప్ర‌ధాన బ‌లం అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంతే. రెండేళ్లు(క‌బాలి) త‌ర్వాత ర‌జ‌నీకాంత్ చేసిన కాలా..ఆయ‌నకు రాజ‌కీయంగా స‌పోర్ట్ చేసేలా తెర‌కెక్కింద‌నాలి. ఎందుకంటే ఇందులో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మైన పాయింట్ భూమి. స్వాతంత్యం వ‌చ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్ర‌జ‌లు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి స‌మ‌స్య‌లు గురించి చ‌ర్చించే సినిమా. ద‌ర్శ‌కుడు పా రంజిత్ ధారావి ప్రాంతాన్ని ఓ ఉదాహ‌ర‌ణంగా తీసుకుని భూమి అంద‌రి హ‌క్కు అనే స‌మ‌స్య‌ను ర‌జ‌నీకాంత్ ద్వారా చెప్పించాడు. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌నున్న ర‌జ‌నీకాంత్‌కి ఉప‌యోగ‌ప‌డే కాన్సెప్ట్ ఇది. సినిమా బ్రిడ్జ్‌ఫై వ‌చ్చే ఫైట్‌, ఇంట‌ర్వెల్ బ్లాక్‌, కోర్ పాయింట్ అన్నీ మెప్పిస్తాయి. మైన‌స్ పాయింట్స్‌: సినిమా స్లో నెరేష‌న్‌లో ఉండ‌టం. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం. ఇక సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉన్నా.. ర‌జ‌నీకాంత్ వంటి మాస్ హీరోను.. హీరోయిజాన్ని ఇంకా ఎలివేట్ చేయాల‌నిపిస్తుంది. అంద‌రికీ కోర్ థీమ్ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇక తెలుగు పాట‌ల్లోని సాహిత్యం అస‌లు అర్థం కావ‌డం లేదు. సమీక్ష‌: క‌రికాలుడు అలియాస్ కాలాగా ర‌జ‌నీకాంత్ త‌న‌దైన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆక్టుకున్నారు. సినిమా అంతా ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది. ర‌జ‌నీకాంత్ సినిమా అంటే మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా ఉండాల‌నుకునే ప్రేక్ష‌కుడికి ఇది డిఫ‌రెంట్‌గా అనిపిస్తుది. క‌బాలిలో ఫ‌స్టాఫ్‌లో ర‌జ‌నీకాంత్‌ను మాస్ హీరోగా చూపించి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ హీరోగా చూపించిన పా.రంజిత్ ఇందులో ఫ‌స్టాఫ్ అంతా ఫ్యామిలీ మేన్‌లా చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో ర‌జ‌నీకాంత్ ప్రేమ‌.. విఫ‌లం చెంద‌డం.. ఈశ్వ‌రీరావు, ర‌జ‌నీ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వ‌రీరావు న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. పా.రంజిత్ ఈ సినిమాలో ఓ కోర్ పాయింట్‌.. పేద‌వాడు ఉండ‌టానికి చోటు కావాలి. ఇంత పెద్ద దేశంలో ఇంకా పేద‌వాడికి ఉండ‌టానికి ఇళ్లు ఎందుకు లేవు. అనే ప్ర‌శ్న‌ను రైజ్ చేయించాడు. ర‌జ‌నీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయ‌డం గ్రేట్‌. ర‌జ‌నీ కూడా నేను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌ని కాకుండా ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాల‌ని ఆలోచించి ఇమేజ్‌కి భిన్నంగా చేసిన సినిమా ఇది. నానా ప‌టేక‌ర్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన న‌ట‌న‌తో నానా క్యారెక్ట‌ర్‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేశాడు. ఎన్‌జి.ఒ స‌భ్యురాలుగా హ్యూమా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా ఉంది.…

కాలా రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవిభాగం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3

3.1

కాలా రివ్యూ

కాలా రివ్యూ

User Rating: 3.5 ( 1 votes)
3