కబాలి రివ్యూ

0Kabali-Review-Rating‘కబాలి’.. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సినీ అభిమానులందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఆకాశాన్నంటిన అంచనాల మధ్యన మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌కు దగ్గర పడుతున్నా కొద్దీ పలు సరికొత్త కథనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కబాలికి హైలైట్‌గా నిలిచే అంశం ఏదనే విషయమై ఓ ఆసక్తికర కథనం తెలిసింది. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్‌లో రజనీ యంగ్‌లుక్‌లో ఆకట్టుకోనున్నారట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది. మలేషియాలో తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా గురించి ఇప్పుడు సౌతిండియన్ సినీ అభిమానులంతా ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆకాశాన్నంటే అంచనాలతో రేపు విడుదలవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ఇప్పటికే పలు దేశాల్లో పడిపోయాయి. ఇక ఈ ప్రీమియర్ షోస్ నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టిచూస్తే, ‘కబాలి’ సినిమా రజనీ అభిమానులను అలరించే అంశాలను బాగానే నింపుకున్నా, ఓవరాల్‌గా సాధారణ ప్రేక్షకుడిని కట్టిపడేసే స్థాయిలో లేదని వినిపిస్తోంది.

ఈ సినిమా ప్రీమియర్ షోస్ చూసిన వారు చెప్తోన్న దాన్ని బట్టి, ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికల్లా సినిమా చాలాచోట్ల నెమ్మదించిందని, ఈ పార్ట్ కాస్త బోరింగ్‌గా కూడా తయారైందని వినిపిస్తోంది. అదేవిధంగా రజనీ అభిమానులను కాకుండా, సాధారణ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అంశాలు లేవని కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే టాక్ వినిపిస్తూ ఉండడం ఆసక్తికర అంశంగా మారింది. సుమారు 4000 థియేటర్లలో, ఎన్నో అంచనాల మధ్యన విడుదల కానున్న సినిమాకు, ప్రీమియర్ షోస్ నుంచి ఇలాంటి టాక్ రావడం అభిమానులను ఇబ్బంది పెట్టే అంశమే. అయితే పూర్తి స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుడికి ఏ మేర చేరుతుందనేది తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే!

 

కబాలి కథ విషయానికొస్తే..

మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్  నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం  (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు.

రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్‌ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్‌ ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది.

మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు.

(ఇది ఫేస్‌బుక్‌లో బాలాజీ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే)

‘కబాలి’.. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సినీ అభిమానులందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఆకాశాన్నంటిన అంచనాల మధ్యన మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌కు దగ్గర పడుతున్నా కొద్దీ పలు సరికొత్త కథనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కబాలికి హైలైట్‌గా నిలిచే అంశం ఏదనే విషయమై ఓ ఆసక్తికర కథనం తెలిసింది. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్‌లో రజనీ యంగ్‌లుక్‌లో ఆకట్టుకోనున్నారట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది. మలేషియాలో తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా గురించి ఇప్పుడు సౌతిండియన్ సినీ అభిమానులంతా ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆకాశాన్నంటే అంచనాలతో రేపు విడుదలవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ఇప్పటికే పలు దేశాల్లో పడిపోయాయి. ఇక ఈ ప్రీమియర్ షోస్ నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టిచూస్తే, ‘కబాలి’ సినిమా రజనీ అభిమానులను అలరించే అంశాలను బాగానే నింపుకున్నా, ఓవరాల్‌గా సాధారణ ప్రేక్షకుడిని కట్టిపడేసే స్థాయిలో లేదని వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోస్ చూసిన వారు చెప్తోన్న దాన్ని బట్టి, ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికల్లా సినిమా చాలాచోట్ల నెమ్మదించిందని, ఈ పార్ట్ కాస్త బోరింగ్‌గా కూడా తయారైందని వినిపిస్తోంది. అదేవిధంగా రజనీ అభిమానులను కాకుండా, సాధారణ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అంశాలు లేవని కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే టాక్ వినిపిస్తూ ఉండడం ఆసక్తికర అంశంగా మారింది. సుమారు 4000 థియేటర్లలో, ఎన్నో అంచనాల మధ్యన విడుదల కానున్న సినిమాకు, ప్రీమియర్ షోస్ నుంచి ఇలాంటి టాక్ రావడం అభిమానులను ఇబ్బంది పెట్టే అంశమే. అయితే పూర్తి స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుడికి ఏ మేర చేరుతుందనేది తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే!   కబాలి కథ విషయానికొస్తే.. మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. అక్కడ అరాచకాలు ఎదుర్కొంటున్న తమిళులు తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. జాతి వివక్షను ఎదిరించి కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన సూపర్ స్టార్  నెల్సన్ మండేలాలాగా అక్కడికి వస్తాడు. కొంతకాలం  (బాషాలో ఆటోడ్రైవర్ లా) సామాన్యుడిలాగే జీవిస్తాడు. కానీ పరిస్థితుల ప్రభావంతో శత్రువుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు రజనీ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. అలా మలేషియాలోని తమిళులు, దళితుల నాయకుడిగా మారి వారి జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పు తీసుకొస్తాడు. రజనీ అభిమానిని ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో మునిగితేలుతుంది. సినిమాలో కొన్ని ఫ్లాష్‌ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్‌ ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది. మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. మలేషియాలోని తమిళుల అవస్థ పట్ల పా రంజిత్ ఇంతకంటే మంచి సినిమా తీయవచ్చు. రంజిత్ దళిత రాజకీయాలు కూడా సినిమాలో బ్యాక్ సీట్ అయ్యాయి. ఈ సినిమా రజనీకి కమర్షియల్ వెహికిల్ గా మారిందని చెప్పవచ్చు. (ఇది ఫేస్‌బుక్‌లో బాలాజీ శ్రీనివాసన్‌ అనే వ్యక్తి పెట్టిన రివ్యూ మాత్రమే)
కథ - స్క్రీన్ ప్లే - 3.75
నటీ నటుల ప్రతిభ - 4.25
సాంకేతికవర్గ పనితీరు - 4
దర్శకత్వ ప్రతిభ - 3.75

3.9

User Rating: 3.81 ( 6 votes)
4