కన్నుల్లో నీ రూపమే రివ్యూ

0హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్డిస్టుగా కెరీర్లో దూసుకెళ్తున్నాడు నందు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో పాటు విభిన్నమైన కథా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా నటించిన కన్నుల్లో నీ రూపమే కూడా ఇలాంటిదే. బిక్స్ రాసిన విభిన్నమైన ప్రేమ కథా చిత్రమ్ కన్నుల్లో నీ రూపమే. ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రమే కన్నుల్లో నీ రూపమే. నందు, తేజశ్విని ప్రకాష్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న బిక్స్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో… ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుందో చూద్దాం.

కథేంటంటే….

ఇది రెగ్యులర్ తరహా చిత్రం కాదు. విభిన్నమైన స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ప్రేమ, యాక్షన్, హార్రర్, కామెడీ జత చేసిన చిత్రమిది. సన్నీ(నందు) ఓ అనాథ. సృష్టి(తేజశ్విని ప్రకాష్) అనే అమ్మాయిని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమించాలని తపన పడతాడు. అనుకోకుండా ఫ్రెండ్ మ్యారేజ్ లో కలిసిన తర్వాత ప్రేమలో దింపేందుకు విశ్వ ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడు.

దాంతో ఆమె కూడా సన్నీని ప్రేమిస్తుంది. సృష్టి అన్నకు భయపడి ఓ ఫామ్ హౌస్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అయితే అయితే సన్నీని సృష్టి అన్న చంపేసి పాతిపెడతాడు. కానీ సన్నీ మాత్రం అందరిలోనూ కలిసి ఉంటాడు. తాను చనిపోయిన విషయం ఎవ్వరికీ తెలియనియ్యడు. సృష్టి మాత్రం ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమౌతుంది.

ఇంతకూ చనిపోయిన సన్నీ ఎలా బతికాడు. సన్నీ బతికి ఉన్నడానే విషయం తెలిసుకున్న సృష్టి వాళ్ల అన్న గ్యాంగ్ ఏం చేసింది. సృష్టి సన్నీ పెళ్లి జరిగిందా. తాను బతికి లేను అనే విషయం సృష్టికి సన్నీ చెప్పాడా లేదా. చివరికి సృష్టి సన్నీ స్టోరీ ఎలా ముగిసింది అనేది మాత్రం థియేటర్లోనే చూడాలి.

సమీక్ష

నందుకు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం. నటించేందుకు స్కోప్ ఉన్న పాత్ర. ఈ తరహా పాత్ర గతంలో తాను ఎప్పుడూ చేయలేదు. సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. జోష్ ఫుల్ సాంగ్ లో డ్యాన్స్ ఇరగదీశాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ కుదిరింది. చనిపోయిన తర్వాత ఎమోషన్ ను బాగా క్యారీ చేశాడు. హీరోయిన్ తేజస్విని కి చాలా మంచి పాత్ర దక్కింది. పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. నందు, తేజస్విని పెయిర్ బాగుంది. తేజస్విని నటనతో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ బాగా పండాయి. వీలైన చోటల్లా కామెడీ పండించారు. ఫిష్ వెంకట్ ఎంటర్ అయినప్పటినుంచి కామెడీ బాగా పండింది. వరుస పంచులతో నవ్వించాడు. మిగిలిన ఆర్టిస్టులు సైతం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఈ సినిమాకు సాకేత్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. అన్ని రకాల సాంగ్స్ ఇందులో ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్, ఎమోషనల్ సాంగ్, జోష్ ఫుల్ సాంగ్స్ తో సినిమాలు జోష్ తీసుకొచ్చాడు. రీరికార్డింగ్ సైతం ప్లెజెంట్ గా ఉంది. ఈ సినిమా సాకేత్ కు మంచి పేరు తీసుకొస్తుంది. N.B విశ్వకాంత్ , సుభాష్ దొంతి కెమెరా వర్క్ బ్యూటిఫుల్ గా ఉంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ముఖ్యంగా కామెడీ రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి చనిపోయాననే విషయంల చెప్పాలనే ప్రయత్నంలో పండే ఎమోషన్స్ ని దర్శకుడు బిక్స్ బాగా క్యారీ చేశాడు. చనిపోయిన తర్వాత దెయ్యంలా కాకుండా మామూలు మనిషిగానే చూపించి కొత్త ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని… ప్రేమ విఫలమైతే చనిపోవాల్సిన అవసరం లేదనే మంచి మెసేజ్ కూడా చూపించి ఆకట్టుకున్నాడు. ఓవైపు ప్రేమ, కామెడీ, ఎమోషన్ తో పాటు… మంచి మెసేజ్ తో దర్శకుడు బిక్స్ మెప్పించాడు. నిర్మాతలు సైతం ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీగా నిర్మించారు.

ఓవరాల్ గా…. బిక్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. నందు, తేజస్విని ప్రకాష్ కెమిస్ట్రీ, ఫిష్ వెంకట్ అండ్ బ్యాచ్ కామెడీ, హీరో ఫ్రెండ్స్ చేసే హడావిడి, హార్రర్ కామెడీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన చేస్తాయి. ఆత్మలు, దెయ్యాల జోనర్లో విభిన్నంగా అనిపించే చిత్రం కన్నుల్లో నీ రూపమే. సో… గో అండ్ వాచిట్

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్డిస్టుగా కెరీర్లో దూసుకెళ్తున్నాడు నందు. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో పాటు విభిన్నమైన కథా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా నటించిన కన్నుల్లో నీ రూపమే కూడా ఇలాంటిదే. బిక్స్ రాసిన విభిన్నమైన ప్రేమ కథా చిత్రమ్ కన్నుల్లో నీ రూపమే. ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రమే కన్నుల్లో నీ రూపమే. నందు, తేజశ్విని ప్రకాష్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న బిక్స్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో... ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేస్తుందో చూద్దాం. కథేంటంటే.... ఇది రెగ్యులర్ తరహా చిత్రం కాదు. విభిన్నమైన స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ప్రేమ, యాక్షన్, హార్రర్, కామెడీ జత చేసిన చిత్రమిది. సన్నీ(నందు) ఓ అనాథ. సృష్టి(తేజశ్విని ప్రకాష్) అనే అమ్మాయిని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమించాలని తపన పడతాడు. అనుకోకుండా ఫ్రెండ్ మ్యారేజ్ లో కలిసిన తర్వాత ప్రేమలో దింపేందుకు విశ్వ ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడు. దాంతో ఆమె కూడా సన్నీని ప్రేమిస్తుంది. సృష్టి అన్నకు భయపడి ఓ ఫామ్ హౌస్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అయితే అయితే సన్నీని సృష్టి అన్న చంపేసి పాతిపెడతాడు. కానీ సన్నీ మాత్రం అందరిలోనూ కలిసి ఉంటాడు. తాను చనిపోయిన విషయం ఎవ్వరికీ తెలియనియ్యడు. సృష్టి మాత్రం ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమౌతుంది. ఇంతకూ చనిపోయిన సన్నీ ఎలా బతికాడు. సన్నీ బతికి ఉన్నడానే విషయం తెలిసుకున్న సృష్టి వాళ్ల అన్న గ్యాంగ్ ఏం చేసింది. సృష్టి సన్నీ పెళ్లి జరిగిందా. తాను బతికి లేను అనే విషయం సృష్టికి సన్నీ చెప్పాడా లేదా. చివరికి సృష్టి సన్నీ స్టోరీ ఎలా ముగిసింది అనేది మాత్రం థియేటర్లోనే చూడాలి. సమీక్ష నందుకు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం. నటించేందుకు స్కోప్ ఉన్న పాత్ర. ఈ తరహా పాత్ర గతంలో తాను ఎప్పుడూ చేయలేదు. సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. జోష్ ఫుల్ సాంగ్ లో డ్యాన్స్ ఇరగదీశాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ కుదిరింది. చనిపోయిన తర్వాత ఎమోషన్ ను బాగా క్యారీ చేశాడు. హీరోయిన్ తేజస్విని కి చాలా మంచి పాత్ర దక్కింది. పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. నందు, తేజస్విని పెయిర్ బాగుంది. తేజస్విని నటనతో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ బాగా పండాయి. వీలైన చోటల్లా కామెడీ పండించారు. ఫిష్ వెంకట్ ఎంటర్ అయినప్పటినుంచి కామెడీ బాగా పండింది. వరుస పంచులతో నవ్వించాడు. మిగిలిన ఆర్టిస్టులు సైతం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాకు సాకేత్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. అన్ని రకాల సాంగ్స్ ఇందులో ఉన్నాయి. రొమాంటిక్ సాంగ్, ఎమోషనల్ సాంగ్, జోష్ ఫుల్ సాంగ్స్ తో సినిమాలు జోష్ తీసుకొచ్చాడు. రీరికార్డింగ్ సైతం ప్లెజెంట్ గా ఉంది. ఈ సినిమా సాకేత్ కు మంచి పేరు తీసుకొస్తుంది. N.B విశ్వకాంత్ , సుభాష్ దొంతి కెమెరా వర్క్ బ్యూటిఫుల్ గా ఉంది. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ముఖ్యంగా కామెడీ రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి చనిపోయాననే విషయంల చెప్పాలనే ప్రయత్నంలో పండే ఎమోషన్స్ ని దర్శకుడు బిక్స్ బాగా క్యారీ చేశాడు. చనిపోయిన తర్వాత దెయ్యంలా కాకుండా మామూలు మనిషిగానే చూపించి కొత్త ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని... ప్రేమ విఫలమైతే చనిపోవాల్సిన అవసరం లేదనే మంచి మెసేజ్ కూడా చూపించి ఆకట్టుకున్నాడు. ఓవైపు ప్రేమ, కామెడీ, ఎమోషన్ తో పాటు... మంచి మెసేజ్ తో దర్శకుడు బిక్స్ మెప్పించాడు. నిర్మాతలు సైతం ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీగా నిర్మించారు. ఓవరాల్ గా.... బిక్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. నందు, తేజస్విని ప్రకాష్ కెమిస్ట్రీ, ఫిష్ వెంకట్ అండ్ బ్యాచ్ కామెడీ, హీరో ఫ్రెండ్స్ చేసే హడావిడి, హార్రర్ కామెడీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన చేస్తాయి. ఆత్మలు, దెయ్యాల జోనర్లో విభిన్నంగా అనిపించే చిత్రం కన్నుల్లో నీ రూపమే. సో... గో అండ్ వాచిట్

కన్నుల్లో నీ రూపమే రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 3
సాంకేతికవిభాగం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.5

2.6

కన్నుల్లో నీ రూపమే రివ్యూ

కన్నుల్లో నీ రూపమే రివ్యూ

User Rating: 4.4 ( 1 votes)
3