లై రివ్యూ

0



Review of: లై
cinema:
SivaPrasad

Reviewed by:
Rating:
3
On August 11, 2017
Last modified:August 11, 2017

Summary:

లై రివ్యూ

Nithin-Lie-Movie-Review

‘అ.. ఆ’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడం వలన ‘లై’ పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. అంతేగాక ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ బాగుండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది భారీ పోటీ నడుమ ఈ సినిమా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ :

ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు.

అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా..

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నారో అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్ ను పర్ఫెక్ట్ గా పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది.

‘అ.. ఆ’ తర్వాత స్టైల్ పూర్తిగా మార్చేసిన నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. కొంచెం ఓవర్ గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నటి మేఘా ఆకాష్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో భారీ నిరుత్సాహాన్ని కలిగించే విషయం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. చాలా చోట్ల కామెడీని పెట్టె స్కోప్ ఉన్న కూడా దర్శకుడు ఆ స్పీడ్ ను వాడుకోలేదు. దీంతో వినోదానికి చోటు లేకుండా పోయింది. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. కమెడియన్ మధు కథలోకి ఎంటరవడం, హీరోయిన్ హీరోతో యూఎస్ వెళ్లడం వంటివి అసహజంగా, ఓవర్ గా అనిపిస్తాయి.

సినిమా అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్ – నితిన్ లు ఉన్నంతసేపు సినిమా బాగుంది అనిపించేలోపు హీరోయిన్ ట్రాక్, లేదా ఇతర బలవంతపు సన్నివేశాలు అడ్డం వచ్చి ఆ మూడు ను చెడగొడతాయి. సినిమాలో దర్శకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకొని రాసిన సన్నివేశాలు, ట్రాక్స్ కొంచెం ఇబ్బందిగానే అనిపించాయి.

సాంకేతిక విభాగం :

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. డైలాగ్స్, ఆర్ట్స్ డైరెక్షన్ బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా ఇంకో పది నిముషాల సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఇక నితిన్ స్టైలిష్ మేకోవర్ చాలా బాగా అనిపించింది.

ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే ప్లేట్ ను బాగానే రాసుకున్న అయన తెరకెక్కించిన విధానమే సరిగా లేదు. అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది.

తీర్పు :

ఈ ‘లై’ చిత్రం మంచి ప్లేట్ లైన్ ను, బలమైన స్టార్ నటీనటుల్ని కలిగి ఉన్నాకూడా తీసిన విధానం సరిగా లేకపోవడం వలన దెబ్బతింది. కథనం మధ్యలో అనవసరమైన సన్నివేశాలు వస్తుండటం సినిమా బాగుంది అనే మూడ్ ను చెడగొట్టి నిరుత్సాహాన్ని కలిగించింది. మొత్తం మీద మంచి నిర్మాణ విలువలు కలిగి ఉండటం, నితిన్, అర్జున్ ల పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉండటంతో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ కు ఛాయస్ గా నిలుస్తుంది.

‘లై’ : లైవ్ అప్డేట్స్

 

  • చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

  • హీరో, విలన్ మధ్య భారీ స్టైలిష్ ఫైట్ తరువాత చిత్రం తుది దశకు చేరువైంది.

  • కథలో చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ తో మరో ట్విస్ట్ రివీల్ అయింది. ఇప్పుడు నితిన్, అర్జున్ మధ్య భారీ ఫైట్ కు అంతా సిద్ధమైంది.

  • అర్జున్ గ్యాంగ్ కి నితిన్ కి మధ్య ట్రైలర్ లో చూపించిన కత్తి ఫైట్ వస్తోంది.

  • మరో ట్విస్ట్ రివీల్ అయింది. చిత్రం పూర్తిగా క్రైమ్ స్టోరీగా మారిపోయింది. అర్జున్ ని పట్టుకునేందుకు పోలీస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

  • ప్రస్తుతం నితిన్, శ్రీరామ్ ల మధ్య ఇంటరెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.

  • చిత్రం క్లైమాక్స్ దిశగా నడుస్తోంది. ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్ ‘బొంబాట్’ వస్తోంది.

  • ఇప్పుడు కథం మొత్తం సూట్కేస్ వెనుకే తిరుగుతోంది. దాని వెనుక ఉన్న నిజాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి.

  • చిత్రం వేగం పుంజుకుంది. ట్విస్ట్ లు వరుసగా రివీల్ అవుతున్నాయి.

  • కొన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ తరువాత హీరో హీరోయిన్ల మధ్య ‘మిస్ సన్ షైన్’ సాంగ్ వస్తోంది. మంచి లొకేషన్లలో పాటని చిత్రీకరించారు.

  • ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. కథ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో కు మారింది. అర్జున్ తన ఆచూకీ బయట పడకుండా జాగ్రత్త పడుతున్నాడు.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం బాగానే ఉంది. ట్విస్ట్ లు ఆసక్తిని కలిగించాయి. అర్జున్ పాత్ర, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింట్స్.

  • మరో ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడింది.

  • ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. నితిన్ అసలు ప్లాన్ ఏంటో తెలిసింది. నితిన్, అజయ్ మధ్య భారీ ఫైట్ వస్తోంది.

  • శ్రీరామ్.. అర్జున్ గురించి కూపీ లాగుతున్నాడు. ప్రస్తుతం ఛేజింగ్ సీన్స్ వస్తున్నాయి.

  • ప్రస్తుతం ‘ఫ్రీడమ్’ సాంగ్ వస్తోంది. పాటని వెగాస్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు.

  • అర్జున్ ఆచూకీ పోలీస్ లకు అంతు చిక్కడం లేదు. స్టోరీ ఆసక్తికరంగా సాగుతోంది.

  • చిత్రం వెగాస్ కు మారింది. హీరో హీరోయిన్ల తోపాటు శ్రీరామ్ కూడా అదే నగరానికి చేరుకున్నాడు. అర్జున్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • హీరో హీరోయిన్లు ఒకరినొకరు కలుసుకున్నారు. వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అబద్దాలే మాట్లాడుకుంటున్నారు.

  • ముంబై లో అర్జున్ కోసం పోలీస్ ల దర్యాప్తు కొనసాగుతోంది. నటుడు శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు.

  • మేఘా ఆకాష్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘లగ్గం టైం’ సాంగ్ వస్తోంది.

  • హీరో కుటుంబం మరియు అతని స్నేహితుల గురించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • హీరో నితిన్ సింపుల్ గా జైలులో ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ గడ్డం లుక్ లో చాలా బాగా కనిపిస్తున్నాడు.

  • అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

  • చిత్రం ముంబై నగరంలో ప్రారంభమైంది. పోలీస్ లు అర్జున్ కోసం వెతుకుతున్నారు.

  • 144 నిమిషాల నిడివి గల ‘లై’ చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

  • అ..ఆ వంటి ఘనవిజయం తరువాత నితిన్, కృష్ణగాడి వీర ప్రేమ గాధ సక్సెస్ తరువాత హను రాఘవపూడి ల కలయికలో వస్తున్న చిత్రం ‘లై’.

లై రివ్యూ
‘అ.. ఆ’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడం వలన ‘లై’ పై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. అంతేగాక ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్ బాగుండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది భారీ పోటీ నడుమ ఈ సినిమా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.. కథ : ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం భయంకరమైన క్రిమినల్ పద్మనాభన్ (అర్జున్) కోసం వెతుకుతుంటారు. పద్మనాభన్ మాత్రం యూఎస్ లో సెటిలై ఉంటాడు. ఈజీ మనీ కోసం ట్రై చేసే పాతబస్తీకి చెందిన కుర్రాడు సత్యం (నితిన్) అనుకోని విధంగా హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు. అలా అమెరికా వెళ్లిన సత్యం పద్మనాభంతో గొడవపడతాడు. ఆ గొడవతో సత్యం జీవితం తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో అతనేం చేశాడు ? అసలు పద్మనాభన్ ఎవరు ? అతనితో నితిన్ ఎందుకు గొడవపడాల్సి వచ్చింది ? అనేదే ఈ సినిమా.. ప్లస్ పాయింట్స్ : సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన విలన్ పాత్ర. ఈ క్యారెక్టర్ ను హను రాఘవపూడి ఎంత బలంగా రాసుకున్నారో అంతే బలంగా తెరపై ఆవిష్కరించారు. అర్జున్ కూడా పాత్రలోని వేరియేషన్స్ ను పర్ఫెక్ట్ గా పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆ పాత్రకు అర్జున్ చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ‘అ.. ఆ’ తర్వాత స్టైల్ పూర్తిగా మార్చేసిన నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. కొంచెం ఓవర్ గా అనిపించే పాత్రను కూడా మంచి ఈజ్ తో చేసేశాడు. అతని డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్. హీరోయిన్ గా మొదటి సినిమా చేసిన నటి మేఘా ఆకాష్ ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. మైనస్ పాయింట్స్ : సినిమాలో భారీ నిరుత్సాహాన్ని కలిగించే విషయం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. చాలా చోట్ల కామెడీని పెట్టె స్కోప్ ఉన్న కూడా దర్శకుడు ఆ స్పీడ్ ను వాడుకోలేదు. దీంతో వినోదానికి చోటు లేకుండా పోయింది. అలాగే ఇందులో కొన్ని అనవసరమైన ట్రాక్స్ కుండా ఉన్నాయి. కమెడియన్ మధు కథలోకి ఎంటరవడం, హీరోయిన్ హీరోతో యూఎస్ వెళ్లడం వంటివి అసహజంగా, ఓవర్ గా అనిపిస్తాయి. సినిమా అసలైన కథలోకి ప్రవేశించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. అర్జున్ – నితిన్ లు ఉన్నంతసేపు సినిమా బాగుంది అనిపించేలోపు హీరోయిన్ ట్రాక్, లేదా ఇతర బలవంతపు సన్నివేశాలు అడ్డం వచ్చి ఆ మూడు ను చెడగొడతాయి. సినిమాలో దర్శకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకొని రాసిన సన్నివేశాలు, ట్రాక్స్ కొంచెం ఇబ్బందిగానే అనిపించాయి. సాంకేతిక విభాగం : నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టి బాలీవుడ్ లెవెల్లో సినిమాను తీశారు. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేదిగా ఉండగా సంగీతం అలరించింది. డైలాగ్స్, ఆర్ట్స్ డైరెక్షన్ బాగున్నాయి. ఎడిటింగ్ ద్వారా ఇంకో పది నిముషాల సీన్లను కత్తిరించి ఉండాల్సింది. ఇక నితిన్ స్టైలిష్ మేకోవర్ చాలా బాగా అనిపించింది. ఇక దర్శకుడు హను రాఘవపూడి విషయానికొస్తే ప్లేట్ ను బాగానే రాసుకున్న అయన తెరకెక్కించిన విధానమే సరిగా లేదు. అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. అనవసరమైన అంశాలను చాలా వాటిని సినిమాలో ఇరికించారు. కానీ ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు. కథనానికి రొమాన్స్, ఫన్ ఇంకాస్త జోడించి ఉంటే ఫలితం ఇంకా బాగుండేది. తీర్పు : ఈ ‘లై’ చిత్రం మంచి ప్లేట్ లైన్ ను, బలమైన స్టార్ నటీనటుల్ని కలిగి ఉన్నాకూడా తీసిన విధానం సరిగా లేకపోవడం వలన దెబ్బతింది. కథనం మధ్యలో అనవసరమైన సన్నివేశాలు వస్తుండటం సినిమా బాగుంది అనే మూడ్ ను చెడగొట్టి నిరుత్సాహాన్ని కలిగించింది. మొత్తం మీద మంచి నిర్మాణ విలువలు కలిగి ఉండటం, నితిన్, అర్జున్ ల పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉండటంతో ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ కు ఛాయస్ గా నిలుస్తుంది. 'లై' : లైవ్ అప్డేట్స్   చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి. Date & Time : 06:05 AM August 11, 2017 హీరో, విలన్ మధ్య భారీ స్టైలిష్ ఫైట్ తరువాత చిత్రం తుది దశకు చేరువైంది. Date & Time : 06:00 AM August 11, 2017 కథలో చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ తో మరో ట్విస్ట్ రివీల్ అయింది. ఇప్పుడు…

లై

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 3.25
సాంకేతికవిభాగం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 3

2.9

లై

లై రివ్యూ

User Rating: 2.6 ( 1 votes)
3