మహానుభావుడు రివ్యూ

0Mahanubhavudu-Telugu-Reviewచిత్రం : మహానుభావుడు
నటీనటులు: శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్
సంగీతం: తమన్
దర్శకత్వం : మారుతి
నిర్మాత : వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్

ఇప్పటికి రెండుసార్లు పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి విజయాల్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి ‘మహానుభావుడు’ చిత్రం ద్వారా ‘జై లవ కుశ, స్పైడర్’ వంటి భారీ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగాడు. మారుతితో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

కథ :

ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు కూడా ఆనంద్ ప్రవర్తనతో ఇంబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.

తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు…? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు పెర్ఫార్మన్స్:

శర్వానంద్ మరోసారి తానెంతటి విలక్షణ నటుడో రుజువు చేశాడు. ఓసీడీ డిజార్డర్ ఉన్న కుర్రాడిగా అతను జీవించేశాడు. ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్.. మేనరిజమ్స్.. నటనతో శర్వా అదరగొట్టేశాడు. నిజంగానే ఓసీడీ ఉన్న వ్యక్తిలాగా కనిపించాడు శర్వా. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో మరింత మెరుగైంది. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో పోలిస్తే కొంచెం నాజూగ్గా.. మరింత అందంగా తయారైన మెహ్రీన్.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తెరమీద హీరోయిన్ కనిపించినపుడల్లా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. కుర్రాళ్లకు ఈ అమ్మాయి భలేగా నచ్చేస్తుందనడంలో సందేహం లేదు. ఆమె నటన కూడా బాగానే సాగింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువ స్కోర్ చేసేది వెన్నెల కిషోరే. తనదైన కామెడీ టైమింగ్ తో.. హావభావాలతో అలరించాడు కిషోర్. నాజర్ తనకు అలవాటైన తండ్రి పాత్రలో ఓకే అనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

ప్ల‌స్ పాయింట్స్:

ఓసీడీ అనే పాయింట్ తెలుగు తెర‌కు కొత్త‌. ఈ పాయింట్ ఆధారంగా క‌థానాయ‌కుడి పాత్ర‌ను అల్లుకోవ‌డం బావుంది. ప‌రిస‌రాల‌కు త‌గ్గ‌ట్టు స‌ర్దుకుని పోలేనివారు ఎలాంటి ఇబ్బందుల‌కు గుర‌వుతారో చెప్పే ప్ర‌క్రియ‌లో కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. అతి శుభ్ర‌త‌గ‌ల వ్య‌క్తిగా శ‌ర్వానంద్ న‌ట‌న‌, అత‌ను ప్రేమించే ఊరిపెద్ద కూతురి పాత్ర‌లో మెహ‌రీన్‌, ఆనంద్ క‌జిన్ కిశోర్ గా వెన్నెల‌కిశోర్ పాత్ర‌లు మెప్పిస్తాయి. నాజ‌ర్‌, టిల్లు వేణు, ర‌ఘుబాబు, ర‌జిత త‌దిత‌రులంతా ఆయా పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. పాట‌లు పెద్ద‌గా ఇంప్రెసివ్‌గా అనిపించ‌వు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. లొకేష‌న్లు కూడా బావున్నాయి. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను రాసుకున్న తీరు బావుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాల ప‌నితీరు ప్ర‌శంస‌నీయం.

మైన‌స్ పాయింట్లు:

ఓసీడీ అనే పాయింట్‌ను మిన‌హాయిస్తే సినిమా చాలా పాత కాన్సెప్టే. స‌ర్వ‌త్రా ఓట్లు, ఎన్నిక‌లు వ‌చ్చిన ఈ కాలంలో ఇంకా కుస్తీ పోటీల ద్వారా స‌ర్పంచి కుర్చీల‌కు ఎంపిక జ‌రుగుతాయ‌న‌డం సినిమాటిక్‌గా బావుందేమో కానీ, నిజ జీవితంలో చూడ‌లేమేమో. ఓసీడీ పాయింట్‌ను ఎలివేట్ చేయ‌డంతోనే ఫ‌స్టాఫ్ మొత్తం సాగిపోయింది. సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ లు ఏమీ లేవు. పైగా ఓసీడీ ల‌క్ష‌ణాల‌ను దాటి హీరో కుస్తీ పోటీల్లో ఎలా పాల్గొంటాడ‌న్న‌ది కూడా స్ట్రాంగ్‌గా చెప్పలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. అప్ప‌టికే ఏడేళ్లుగా కుస్తీ పోటీల్లో విజ‌యాన్ని సాధించిన వ్య‌క్తిని అస‌లు కుస్తీ శిక్ష‌ణ‌కు అడుగైన పెట్ట‌ని హీరో కొట్టేయ‌డం, గెలిచేయ‌డం న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌దు. క‌థ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బావుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మారుతి హీరోకి ఓసిడి అనే లక్షణాన్ని ఆపాదించి దాని ద్వారానే ఫన్ ను జనరేట్ చేస్తూ, నవ్వించే ఫన్నీ సన్నివేశాలతో, వాటికి కొంత ప్రేమను, చివర్లో ఎమోషన్ ను కనెక్ట్ చేసి సినిమా తీసిన విధానం బాగుంది. ఆరంభం నుండి చివరి వరకు ఎక్కడా బోర్ అనిపించకుండా కథనాన్ని నడిపిన ఆయన రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు. సంగీత దర్శకుడు థమన్ సినిమాకు కావాల్సిన మంచి సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి తన వంతు న్యాయం చేశాడు.

నాజర్ షఫీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తం కలఫ్ ఫుల్ గా, క్లిస్టర్ క్లియర్ గా అనిపించింది. పాత్రల డైలాగులు, పాటల్లోని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. యువీ క్రియఁషన్స్ వారు పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. ఎక్కడా లోటు కనబడలేదు.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘మాహానుభావుడు’ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి బేషుగ్గా ఎంజాయ్ చేయవచ్చు. కొద్దిగా నెమ్మదించిన ఫస్టాఫ్, ఊహించేయగల కథనం ఇందులో చిన్న చిన్న బలహీనతలు కాగా ఆరంభం నుండి చివరి వరకు నవ్వించే ఫన్నీ సన్నివేశాలు, ఆసక్తికరమైన ఓసిడి కాన్సెప్ట్, మంచి పాటలు, శర్వానంద్ నటన, సినిమా చివర్లో ఎలివేట్ అయ్యే ఎమోషన్ ఆకట్టుకునే అంశాలుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దసరా పండుగకి కుటుంబమంతా సరదాగా వినోదాన్ని పొందాలి అనుకుంటే ‘మహానుభావుడు’ సినిమాకి వెళితే చాలు.

Summary
Review Date
Reviewed Item
Mahanubhavudu Movie
Author Rating
41star1star1star1stargray
చిత్రం : మహానుభావుడు నటీనటులు: శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్ సంగీతం: తమన్ దర్శకత్వం : మారుతి నిర్మాత : వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఇప్పటికి రెండుసార్లు పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి విజయాల్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి ‘మహానుభావుడు’ చిత్రం ద్వారా ‘జై లవ కుశ, స్పైడర్’ వంటి భారీ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగాడు. మారుతితో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం… కథ : ఆనంద్ (శర్వానంద్) ఓసీడీ ( అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే వ్యాధితో ఇబ్బంది పడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతి శుభ్రత, అతి నీట్నెస్ ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి కారణంగా తాను ఇబ్బంది పడటంతో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆనంద్ తల్లి, కజిన్ (వెన్నెల కిశోర్) లు కూడా ఆనంద్ ప్రవర్తనతో ఇంబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆనంద్, మేఘన (మెహరీన్) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తన వ్యాధి గురించి చెప్పకుండా తనను ఇంప్రెస్ చేసి ప్రేమలో పడేస్తాడు. అయితే మేఘన మాత్రం తన తండ్రి రామరాజు (నాజర్)కి నచ్చితేనే నిన్ను ప్రేమిస్తానని ఆనంద్ కు కండిషన్స్ పెడుతుంది. పల్లెటూరి నుంచి వచ్చిన మేఘన తండ్రితో ఆనంద్ ఫ్రీగా ఉండలేకపోతాడు. రామరాజు కూడా తన కూతురికి ఆనంద్ కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆనంద్ రామరాజు కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడు...? మేఘన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు..? ఆనంద్ వ్యాధిని అతడి ప్రేమ ఎలా జయించింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు పెర్ఫార్మన్స్: శర్వానంద్ మరోసారి తానెంతటి విలక్షణ నటుడో రుజువు చేశాడు. ఓసీడీ డిజార్డర్ ఉన్న కుర్రాడిగా అతను జీవించేశాడు. ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్.. మేనరిజమ్స్.. నటనతో శర్వా అదరగొట్టేశాడు. నిజంగానే ఓసీడీ ఉన్న వ్యక్తిలాగా కనిపించాడు శర్వా. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో మరింత మెరుగైంది. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో పోలిస్తే కొంచెం నాజూగ్గా.. మరింత అందంగా తయారైన మెహ్రీన్.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తెరమీద హీరోయిన్ కనిపించినపుడల్లా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. కుర్రాళ్లకు ఈ అమ్మాయి భలేగా నచ్చేస్తుందనడంలో సందేహం లేదు. ఆమె నటన కూడా బాగానే సాగింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువ స్కోర్ చేసేది వెన్నెల కిషోరే. తనదైన కామెడీ టైమింగ్ తో.. హావభావాలతో అలరించాడు కిషోర్. నాజర్ తనకు అలవాటైన తండ్రి పాత్రలో ఓకే అనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే. ప్ల‌స్ పాయింట్స్: ఓసీడీ అనే పాయింట్ తెలుగు తెర‌కు కొత్త‌. ఈ పాయింట్ ఆధారంగా క‌థానాయ‌కుడి పాత్ర‌ను అల్లుకోవ‌డం బావుంది. ప‌రిస‌రాల‌కు త‌గ్గ‌ట్టు స‌ర్దుకుని పోలేనివారు ఎలాంటి ఇబ్బందుల‌కు గుర‌వుతారో చెప్పే ప్ర‌క్రియ‌లో కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. అతి శుభ్ర‌త‌గ‌ల వ్య‌క్తిగా శ‌ర్వానంద్ న‌ట‌న‌, అత‌ను ప్రేమించే ఊరిపెద్ద కూతురి పాత్ర‌లో మెహ‌రీన్‌, ఆనంద్ క‌జిన్ కిశోర్ గా వెన్నెల‌కిశోర్ పాత్ర‌లు మెప్పిస్తాయి. నాజ‌ర్‌, టిల్లు వేణు, ర‌ఘుబాబు, ర‌జిత త‌దిత‌రులంతా ఆయా పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. పాట‌లు పెద్ద‌గా ఇంప్రెసివ్‌గా అనిపించ‌వు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. లొకేష‌న్లు కూడా బావున్నాయి. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల‌ను రాసుకున్న తీరు బావుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాల ప‌నితీరు ప్ర‌శంస‌నీయం. మైన‌స్ పాయింట్లు: ఓసీడీ అనే పాయింట్‌ను మిన‌హాయిస్తే సినిమా చాలా పాత కాన్సెప్టే. స‌ర్వ‌త్రా ఓట్లు, ఎన్నిక‌లు వ‌చ్చిన ఈ కాలంలో ఇంకా కుస్తీ పోటీల ద్వారా స‌ర్పంచి కుర్చీల‌కు ఎంపిక జ‌రుగుతాయ‌న‌డం సినిమాటిక్‌గా బావుందేమో కానీ, నిజ జీవితంలో చూడ‌లేమేమో. ఓసీడీ పాయింట్‌ను ఎలివేట్ చేయ‌డంతోనే ఫ‌స్టాఫ్ మొత్తం సాగిపోయింది. సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ లు ఏమీ లేవు. పైగా ఓసీడీ ల‌క్ష‌ణాల‌ను దాటి హీరో కుస్తీ పోటీల్లో ఎలా పాల్గొంటాడ‌న్న‌ది కూడా స్ట్రాంగ్‌గా చెప్పలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. అప్ప‌టికే ఏడేళ్లుగా కుస్తీ పోటీల్లో విజ‌యాన్ని సాధించిన వ్య‌క్తిని అస‌లు కుస్తీ శిక్ష‌ణ‌కు అడుగైన పెట్ట‌ని హీరో కొట్టేయ‌డం, గెలిచేయ‌డం న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌దు. క‌థ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బావుండేది. సాంకేతిక విభాగం : దర్శకుడు మారుతి హీరోకి ఓసిడి అనే లక్షణాన్ని ఆపాదించి దాని ద్వారానే ఫన్ ను జనరేట్ చేస్తూ, నవ్వించే ఫన్నీ సన్నివేశాలతో, వాటికి కొంత ప్రేమను, చివర్లో ఎమోషన్ ను కనెక్ట్ చేసి సినిమా తీసిన విధానం బాగుంది. ఆరంభం నుండి చివరి వరకు ఎక్కడా బోర్ అనిపించకుండా కథనాన్ని నడిపిన ఆయన రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు. సంగీత దర్శకుడు థమన్ సినిమాకు కావాల్సిన మంచి సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి తన వంతు న్యాయం చేశాడు. నాజర్ షఫీ…

మహానుభావుడు రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే
నటీ నటుల ప్రతిభ
సాంకేతికవిభాగం పనితీరు
దర్శకత్వ ప్రతిభ

మహానుభావుడు రివ్యూ

మహానుభావుడు రివ్యూ

User Rating: 4.29 ( 4 votes)
69