నా నువ్వే రివ్యూ

0 

రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. తనలో దాగిన లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ని తమన్నా కోసం ఇన్నాళ్లకు బయటకు తీశారు అదే ‘నా నువ్వే’ మూవీ ద్వారా. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నా నువ్వే’ మంచి అంచనాలతో గురువారం నాడు (జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రమోషన్‌ సాంగ్స్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి.

ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ జోడి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటార‌నే భావన ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతోంది. ఈ ధీమా తోటే.. ‘నా నువ్వే’ పక్కా హిట్ అంటున్నారు చిత్ర యూనిట్. అయితే నేడు ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ మూవీపై ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సినిమా చాలా కూల్‌గా ఉందని.. తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడని స్క్రీన్ ప్లే చాలా బావుందంటున్నారు.

క‌థ

మీరా (త‌మ‌న్నా) ఓ ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్‌లో రేడియో జాకీ. డెస్టినీని బ‌లంగా న‌మ్ముతుంటుంది. డెస్టినీవ‌ల్లే తాను ప‌దే ప‌దే వ‌రుణ్ (క‌ల్యాణ్‌రామ్‌)ని క‌లుసుకొంటున్నాన‌నేది ఆమె భావ‌న‌. వ‌రుణ్ అమెరికాకి వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్న పీహెచ్‌డీ విద్యార్థి. రెండుసార్లు త‌న ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో, మూడోసారి విజ‌య‌వంతంగా వీసాని పొంది అమెరికా ఫ్లైటెక్కే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఇంత‌లోనే అనుకోకుండా వ‌రుణ్‌ని క‌లిసిన మీరా డెస్టెనీ ఇద్ద‌రినీ క‌లుపుతున్న విష‌యం గురించి చెబుతుంది. డెస్టినీని పెద్ద‌గా ప‌ట్టించుకోని వ‌రుణ్ ఆమె మాట‌ల్ని ప‌ట్టించుకోడు. కానీ మీరా చెప్పిన‌ట్టుగానే ఆమెని మ‌ళ్లీ క‌లుస్తాడు వ‌రుణ్. ఆ త‌ర్వాత ఇద్ద‌రి జీవితాల్ని డెస్టినీ ఎలా ప్ర‌భావితం చేసింది? ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డి ప్రేమించుకొన్నాక వాళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌నేదే మిగ‌తా సినిమా.

విశ్లేష‌ణ‌

తీస్తున్న‌ది రొమాంటిక్ క‌థ కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగానే మంచి జోడీని ఎంపిక చేసుకొన్నాడు ద‌ర్శ‌కుడు…

క‌ల్యాణ్‌రామ్‌ని ల‌వ‌ర్‌బాయ్‌గా మార్చ‌డంపైన కూడా మంచి క‌స‌ర‌త్తులే చేశారు…

కెమిస్ట్రీ కోసమ‌ని హీరోహీరోయిన్ల‌ని కూడా బాగా ప్రిపేర్ చేశారు…

ప్రేమక‌థ‌ల్లో మేజిక్ క‌నిపించాలి కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగానే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసుకొన్నారు…

ఇన్ని చేసిన ద‌ర్శ‌కుడు క‌థని మాత్రం ప‌క్కాగా రాసుకోలేక‌పోయాడు. రాసుకొనే స‌న్నివేశాల నుంచే మొద‌ట కెమిస్ట్రీ రావాల‌నే అస‌లు విష‌యాన్ని మరిచిపోయాడు. దాంతో నో మేజిక్‌, నో ల‌వ్ అన్న‌ట్టుగా సినిమా సాగుతుంది. త‌మ‌న్నా పాత్ర‌, ఆమె కుటుంబం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లో మిన‌హా ఎక్క‌డా వాస్త‌విక‌త క‌నిపించ‌దు. పాత్ర‌ల‌న్నీ కూడా… కృత‌కంగా సినిమాకోసం కొని తెచ్చుకొన్న హావ‌భావాల‌తోనే సాగుతాయి. దాంతో సినిమా ఏ కోశానా ఆక‌ట్టుకోదు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా బిత్తిరి స‌త్తి చేసే హంగామా… ప్రేమికుడి కోసం రైల్వేస్టేష‌న్‌లోనే తిష్ట‌వేసి ఎఫ్‌.ఎమ్‌.స్టేష‌న్‌ని న‌డిపే మీరా పాత్ర‌, ఎన్నిసార్లు అమెరికా ప్ర‌యాణం ఆగిపోయినా న‌వ్వుకుంటూ తిరిగొచ్చే హీరో పాత్ర‌… ఇలా ఎందులోనూ వాస్త‌విక‌త క‌నిపించ‌దు. డెస్టినీ అనే విష‌యాన్ని వాడిన విధానం కూడా సినిమాకి ఏమాత్రం అత‌క‌లేదు. డెస్టినీని ఒక స‌న్నివేశానికో, రెండు స‌న్నివేశాల‌కో ప‌రిమితం చేయాలి. కానీ ప్ర‌తిచోటా అదే ప్ర‌స్తావ‌నే. దాంతో డెస్టినీలోని మేజిక్కే ఇందులో క‌నిపించ‌దు. క‌ల్యాణ్‌రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కూడా గొప్ప కెమిస్ట్రీ ఏమీ పండ‌లేదు. కాక‌పోతే క‌థ‌, క‌థ‌నాల్లోనే లోపాలు క‌నిపిస్తుండ‌డంతో వాళ్ల‌పైన కంప్లైట్స్ చేసే ఆస్కార‌మే రాదు. సెకండ్‌హాఫ్‌లో డెస్టినీ పేరుతో సాగే హంగామా మ‌రింత విసుగు తెప్పిస్తుంది. కాస్త‌లో కాస్త ప‌తాక స‌న్నివేశాలే ప‌ర్వాలేద‌నిపిస్తాయి. పోసాని కాసేపు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. పీసీ శ్రీరామ్ కెమెరా ప్లెజెంట్‌గా బంధించిన స‌న్నివేశాలే కాస్త‌లో కాస్త ప్రేక్ష‌కుడికి ఊర‌ట‌. అలాగే త‌మ‌న్నా అందం కూడా ఆక‌ట్టుకుంటుంది. మూడు పాట‌ల్ని చాలా బాగా చిత్రీక‌రించారు.

న‌టీన‌టులు

త‌మ‌న్నానే సినిమాకి హైలెట్గా నిలిచింది. ఆమె అందంతో పాటు, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మంచి ప్రేమ‌క‌థ కుదిరితే, త‌మ‌న్నా అద్భుత‌మైన కెమిస్ట్రీ పండించ‌గ‌ల‌ద‌ని ఈ చిత్రంతో మ‌రోమారు రుజువు చేస్తుంది. క‌ల్యాణ్‌రామ్ కూడా తాను రొమాంటిక్ క‌థ‌ల‌కీ స‌రిపోతాన‌నే ఓ సంకేతాన్ని ఈసినిమాతో ఇస్తాడు. సినిమాలో ఆ ఇద్ద‌రి పాత్ర‌లు మిన‌హా మ‌రే పాత్ర‌కీ ప్రాధాన్యం లేదు. పోసాని, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల‌కిషోర్ అక్క‌డ‌క్క‌డా నవ్వించారంతే.

సాంకేతిక‌త‌…

సినిమాకి శ‌ర‌త్ వాసుదేవ‌న్ సంగీతం, పీసీ శ్రీరామ్ కెమెరా మేజిక్ ప్ర‌ధాన‌బ‌లం. సినిమా రెండు గంట‌లే ఉండేలా క‌ట్ చేశాడు ఎడిట‌ర్‌. అయినప్ప‌టికీ స‌హ‌నంతో చూడాల్సిన ప‌రిస్థితి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. జ‌యేంద్ర త‌న‌కి బాగా అల‌వాటైన యాడ్ పిల్మ్స్ త‌ర‌హాలో ఈ చిత్రాన్ని తీశాడు. క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఆయ‌న క‌స‌ర‌త్తులు ఫ‌లించ‌లేదనిపిస్తుంది.

తీర్పు

ప్రేమ‌క‌థ‌ల‌కి కెమిస్ట్రీ, మేజిక్కే కాదు… ఆత్మ కూడా అవ‌స‌ర‌మ‌నే విష‌యాన్నే గ‌ట్టిగా చెబుతుందీ చిత్రం. క‌ల్యాణ్‌రామ్‌, త‌మ‌న్నా జోడీ… మంచి పాట‌ల కోసమైతే ఒక‌సారి చూడొచ్చీ సినిమాని.

 • చాలా ఇబ్బందులు తరువాత చివరికి హీరో హీరోయిన్ వద్దకు చేరతాడు. ఫైనల్ గా సినిమా హ్యాపీ నోట్ తో ఎండ్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూ ఉండండి.

 • ప్రముఖ నటుడు ప్రియదర్శి సన్నివేశానికి వచ్చి, కళ్యాణ్ రామ్ ను తమన్న వద్దకు చేర్చడానికి సహాయం చేస్తున్నాడు.

 • కొన్ని ఎమోషనల్ సన్నివేశాల తరువాత ప్రేమిక సాంగ్ వస్తోంది.. ఇప్పుడు హీరో తన ప్రేయసి గురించి నిరాశలో ఉన్నాడు

 • సినిమా ఓపెనింగ్ సీన్ లో తమన్నాకు సంబంధించిన ఎఫ్.ఎమ్ ఛానల్ సీన్ ఇంకా కొనసాగుతోంది. ఆమె గత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటోంది.

 • ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది మరియు చిత్ర కథనం ప్రస్తుత రోజుల్లోకి వస్తుంది … సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ టికెట్ కలెక్టర్ గా సన్నివేశంలోకి ఎంట్రి ఇచ్చారు.

 • కథలో ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంది. సినిమా ఎమోషనల్ గా ముందుకు సాగుతోంది.

 • జంట మధ్య కొన్ని అపార్థాల తరువాత మళ్లీ వారు ఒకటవుతున్నారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం చినికి చినికి సాంగ్ ద్వారా నరేట్ చేయబడుతోంది.

 • ఇంటర్వెల్ తరువాత ప్రధాన జంట మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హే హే అనే సాంగ్ వస్తోంది.

 • హీరో తమన్నకు ఒక చిన్న పరీక్ష పెడతాడు. మరియు ఆమె ఎదుర్కొనేందుకు అంగీకరిస్తుంది. చిత్రం సగం పూర్తయ్యింది … ఇప్పుడు ఇంటర్వెల్

 • ఎట్టకేలకు ప్రధాన జంట ఒకరికొకరు నేరుగా కలుసుకున్నారు … హీరో మరియు హీరోయిన్ మధ్య కొన్ని క్లాసి మరియు చక్కగా వ్రాసిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

 • కథానాయకుడు మరియు హీరోయిన్ యొక్క తొలి సమావేశానికి సమయం సెట్ అయ్యింది. ఇప్పుడు మంచి టైమింగ్ లో నిజమా మనాస అనే సాంగ్ వస్తోంది … బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బావుంది.

 • కళ్యాణ్ రామ్ కోసం తమన్న వేతకటం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమెకు రేడియో జాకీగా కూడా ఉద్యోగం దొరుకుతుంది.

 • కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిన తమన్నా చూడకుండానే అతని ప్రేమలో పడుతుంది. ప్రధాన జంట మధ్య కొన్ని ఆసక్తికరమైన ఇమాజినేషన్ సన్నివేశాలు వస్తున్నాయి

 • హైదరాబాద్ వీధుల్లో ఒక పెప్పీ సాంగ్.. మొదటి పాట రైట్ రైట్ రైట్ వస్తోంది…

 • తనికెళ్ల భరణి హీరోయిన్ ఫాదర్ గా పరిచయం చేయబడ్డారు. కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ వస్తున్నాయి.

 • ప్రముఖ నటుడు బిత్తిరి సత్తి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. బిత్తిరి సత్తి తమన్నలకు మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

 • కొన్ని ఇంట్రడక్షన్ సన్నివేశాలు తర్వాత ఈ చిత్రం తిరిగి ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది … చిత్రం యొక్క అసలైన కథాంశం వెల్లడైంది … ప్రధాన జంట మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి

 • హీరో కల్యాణ్ రామ్ కూడా విమానాశ్రయం లో సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. హాస్యనటుడు వెన్నెల కిషోర్ కూడా సన్నివేశంలోకి వస్తాడు.

 • ఈ చిత్రం కథ కాచిగూడ రైల్వే స్టేషన్ లో మొదలైంది … ఒక రేడియో జాకీగా తమన్నా సింపుల్ ఎంట్రీ ఇచ్చారు.

 • హాయ్..125 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది

  రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. తనలో దాగిన లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ని తమన్నా కోసం ఇన్నాళ్లకు బయటకు తీశారు అదే ‘నా నువ్వే’ మూవీ ద్వారా. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నా నువ్వే’ మంచి అంచనాలతో గురువారం నాడు (జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రమోషన్‌ సాంగ్స్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ జోడి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటార‌నే భావన ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతోంది. ఈ ధీమా తోటే.. ‘నా నువ్వే’ పక్కా హిట్ అంటున్నారు చిత్ర యూనిట్. అయితే నేడు ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ మూవీపై ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా కూల్‌గా ఉందని.. తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడని స్క్రీన్ ప్లే చాలా బావుందంటున్నారు. క‌థ మీరా (త‌మ‌న్నా) ఓ ఎఫ్‌.ఎమ్ స్టేష‌న్‌లో రేడియో జాకీ. డెస్టినీని బ‌లంగా న‌మ్ముతుంటుంది. డెస్టినీవ‌ల్లే తాను ప‌దే ప‌దే వ‌రుణ్ (క‌ల్యాణ్‌రామ్‌)ని క‌లుసుకొంటున్నాన‌నేది ఆమె భావ‌న‌. వ‌రుణ్ అమెరికాకి వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్న పీహెచ్‌డీ విద్యార్థి. రెండుసార్లు త‌న ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో, మూడోసారి విజ‌య‌వంతంగా వీసాని పొంది అమెరికా ఫ్లైటెక్కే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. ఇంత‌లోనే అనుకోకుండా వ‌రుణ్‌ని క‌లిసిన మీరా డెస్టెనీ ఇద్ద‌రినీ క‌లుపుతున్న విష‌యం గురించి చెబుతుంది. డెస్టినీని పెద్ద‌గా ప‌ట్టించుకోని వ‌రుణ్ ఆమె మాట‌ల్ని ప‌ట్టించుకోడు. కానీ మీరా చెప్పిన‌ట్టుగానే ఆమెని మ‌ళ్లీ క‌లుస్తాడు వ‌రుణ్. ఆ త‌ర్వాత ఇద్ద‌రి జీవితాల్ని డెస్టినీ ఎలా ప్ర‌భావితం చేసింది? ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డి ప్రేమించుకొన్నాక వాళ్ల జీవితాల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌నేదే మిగ‌తా సినిమా. విశ్లేష‌ణ‌ తీస్తున్న‌ది రొమాంటిక్ క‌థ కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగానే మంచి జోడీని ఎంపిక చేసుకొన్నాడు ద‌ర్శ‌కుడు… క‌ల్యాణ్‌రామ్‌ని ల‌వ‌ర్‌బాయ్‌గా మార్చ‌డంపైన కూడా మంచి క‌స‌ర‌త్తులే చేశారు… కెమిస్ట్రీ కోసమ‌ని హీరోహీరోయిన్ల‌ని కూడా బాగా ప్రిపేర్ చేశారు… ప్రేమక‌థ‌ల్లో మేజిక్ క‌నిపించాలి కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టుగానే సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసుకొన్నారు… ఇన్ని చేసిన ద‌ర్శ‌కుడు క‌థని మాత్రం ప‌క్కాగా రాసుకోలేక‌పోయాడు. రాసుకొనే స‌న్నివేశాల నుంచే మొద‌ట కెమిస్ట్రీ రావాల‌నే అస‌లు విష‌యాన్ని మరిచిపోయాడు. దాంతో నో మేజిక్‌, నో ల‌వ్ అన్న‌ట్టుగా సినిమా సాగుతుంది. త‌మ‌న్నా పాత్ర‌, ఆమె కుటుంబం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లో మిన‌హా ఎక్క‌డా వాస్త‌విక‌త క‌నిపించ‌దు. పాత్ర‌ల‌న్నీ కూడా… కృత‌కంగా సినిమాకోసం కొని తెచ్చుకొన్న హావ‌భావాల‌తోనే సాగుతాయి. దాంతో సినిమా ఏ కోశానా ఆక‌ట్టుకోదు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా బిత్తిరి స‌త్తి చేసే హంగామా… ప్రేమికుడి కోసం రైల్వేస్టేష‌న్‌లోనే తిష్ట‌వేసి ఎఫ్‌.ఎమ్‌.స్టేష‌న్‌ని న‌డిపే మీరా పాత్ర‌, ఎన్నిసార్లు అమెరికా ప్ర‌యాణం ఆగిపోయినా న‌వ్వుకుంటూ తిరిగొచ్చే హీరో పాత్ర‌… ఇలా ఎందులోనూ వాస్త‌విక‌త క‌నిపించ‌దు. డెస్టినీ అనే విష‌యాన్ని వాడిన విధానం కూడా సినిమాకి ఏమాత్రం అత‌క‌లేదు. డెస్టినీని ఒక స‌న్నివేశానికో, రెండు స‌న్నివేశాల‌కో ప‌రిమితం చేయాలి. కానీ ప్ర‌తిచోటా అదే ప్ర‌స్తావ‌నే. దాంతో డెస్టినీలోని మేజిక్కే ఇందులో క‌నిపించ‌దు. క‌ల్యాణ్‌రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కూడా గొప్ప కెమిస్ట్రీ ఏమీ పండ‌లేదు. కాక‌పోతే క‌థ‌, క‌థ‌నాల్లోనే లోపాలు క‌నిపిస్తుండ‌డంతో వాళ్ల‌పైన కంప్లైట్స్ చేసే ఆస్కార‌మే రాదు. సెకండ్‌హాఫ్‌లో డెస్టినీ పేరుతో సాగే హంగామా మ‌రింత విసుగు తెప్పిస్తుంది. కాస్త‌లో కాస్త ప‌తాక స‌న్నివేశాలే ప‌ర్వాలేద‌నిపిస్తాయి. పోసాని కాసేపు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. పీసీ శ్రీరామ్ కెమెరా ప్లెజెంట్‌గా బంధించిన స‌న్నివేశాలే కాస్త‌లో కాస్త ప్రేక్ష‌కుడికి ఊర‌ట‌. అలాగే త‌మ‌న్నా అందం కూడా ఆక‌ట్టుకుంటుంది. మూడు పాట‌ల్ని చాలా బాగా చిత్రీక‌రించారు. న‌టీన‌టులు త‌మ‌న్నానే సినిమాకి హైలెట్గా నిలిచింది. ఆమె అందంతో పాటు, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మంచి ప్రేమ‌క‌థ కుదిరితే, త‌మ‌న్నా అద్భుత‌మైన కెమిస్ట్రీ పండించ‌గ‌ల‌ద‌ని ఈ చిత్రంతో మ‌రోమారు రుజువు చేస్తుంది. క‌ల్యాణ్‌రామ్ కూడా తాను రొమాంటిక్ క‌థ‌ల‌కీ స‌రిపోతాన‌నే ఓ సంకేతాన్ని ఈసినిమాతో…

నా నువ్వే రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే
నటీ నటుల ప్రతిభ
సాంకేతికవిభాగం పనితీరు
దర్శకత్వ ప్రతిభ

నా నువ్వే రివ్యూ

నా నువ్వే రివ్యూ

User Rating: 2.8 ( 1 votes)
65