నా పేరు సూర్య రివ్యూ

0



విడుదల తేదీ : మే 4, 2018

నటీనటులు : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, శరత్ కుమార్, అర్జున్

దర్శకత్వం : వక్కంతం వంశీ

నిర్మాత : శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు, శిరీషా లగడపాటి

సంగీతం : విశాల్-శేఖర్

సినిమాటోగ్రఫర్ : రాజీవ్ రవి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఆరంభం నుండి భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఎప్పటికైనా బోర్డర్ కి వెళ్లి దేశం కోసం యుద్ధం చేస్తూ చనిపోవాలనే బలమైన ఆశయం కలిగిన సోల్జర్ సూర్య (అల్లు అర్జున్) తనకున్న అతి కోపం, ఆవేశం కారణంగా ఆర్మీ నుండి బయటకు పంపివేయబడతాడు. తిరిగి ఆర్మీలోకి రావాలన్నా, బోర్డర్ కి వెళ్లాలన్నా ఇండియాలోనే ప్రముఖ సైకియాటిస్ట్ రామకృష్ణంరాజు (అర్జున్) పర్యవేక్షణలోఉండి, అతనిచేత అన్ని విధాల ఫిట్ గా ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకురమ్మని చీఫ్ సూర్యని ఆదేశిస్తాడు.

అలా సర్టిఫికెట్ కోసం రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య తన ప్రవర్తనను ఎలా మార్చుకున్నాడు, తండ్రి కొడుకులైన రామకృష్ణంరాజు, సూర్యల గత అనుభంధం ఎలాంటిది, చివరికి అందరికీ నచ్చినట్టు తనని తాను మార్చుకున్న సూర్య జీవితంలో ఏం కోల్పొతాడు అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన బలం కథానాయకుడు సూర్య పాత్ర. ఈ పాత్రను రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ మలచిన తీరు చాలా బాగుంది. కోపం, బలం, దేశభక్తి, ప్రేమ వంటి లక్షణాలు కలగలసిన సూర్య పాత్ర స్క్రీన్ మీద కనబడుతున్నంతసేపు చూసే వాళ్ళలో ఒక రకమైన కసి మైంటైన్ అవుతూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు మరొక ఎత్తని చెప్పాలి. నటనలో ఆయన చూపించిన తీవ్రత సోల్జర్ సూర్య పాత్రను చాలా కాలంపాటు గుర్తుండిపోయేలా చేసింది. మాట్లాడే విధానం, నడక, డ్రెస్సింగ్ సెన్స్, రొమాన్స్, కీలమైన ఎమోషనల్ సన్నివేశాలు అన్నింటిలో కొత్త బన్నీ కనిపిస్తాడు.

వక్కంతం వంశీ గతంలో రాసిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ చిత్రాల్లాగానే ఈ సినిమా కథనాన్ని కూడా ఫస్టాఫ్ వరకు చాలా రేసీగా రాసుకున్నారు. కథలో నిగూఢంగా దేశానికి శత్రువులు ఎక్కడో తయారవ్వరు మన దేశంలో మనం చేసే తప్పుల వలనే తయారవుతారు, వ్యక్తిత్వాన్ని వదిలేస్తే ప్రాణాలు వదిలేసినట్టే వంటి సున్నితమైన అంశాలను బాగానే చెప్పారు. చిత్రం ఆరంభం నుండి చివరి వరకు తరచూ వచ్చే యాక్షన్ సన్నివేశాలు మంచి థ్రిల్ ఇచ్చాయి.

ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో హీరో పాత్ర తనలోని మార్పు వలన తాను ఏం కోల్పోతున్నాడో రియలైజ్ అవడం బాగుంది. ఇక తన నుండి అందరూ ఆశించే డ్యాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న అల్లు అర్జున్ మంచి మంచి డాన్స్ మూమెంట్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు.

మైనస్:

ఫస్టాఫ్ వరకు కథను సూర్య పాత్రను హైలెట్ చేస్తూ బాగానే నడిపిన దర్శకుడు వక్కంతం వంశీ ద్వితీయార్థానికి వచ్చే సరికి చప్పబడిపోయారు. ద్వితీయార్థంలో మొదలయ్యే అసలు కథ చెప్పుకోడానికి, వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం ఉండాల్సినంత ప్రభావంతంగా లేదు. రెండు మూడు సన్నివేశాలు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇంటర్వెల్ సమయానికి హీరో తనని తాను మార్చుకుని, చివరికి తన లక్ష్యమైన ఇండియా సరిహద్దులకి ఎలా చేరుకుంటాడో చూడాలి అనే ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు సెకండాఫ్లో కథను పూర్తిగా వేరే ట్రాక్లోకి తీసుకెళ్లిపోయాడు. ఆయన తీసుకున్న ఆ టర్న్ మంచిదే అయినా ప్రేక్షకుడు ఇంప్రెస్ అయ్యే విధంగా దాని ప్రయాణం లేకపోవడంతో ద్వితీయార్థం దెబ్బతింది.

ఎప్పుడైన ప్రేక్షకుడు బాగుంటుందని ఊహించినదానికి భిన్నంగా వేరే కథనాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది ప్రేక్షకుడు బాగుంటుందని కోరుకున్న దానికంటే గొప్పగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలోనే దర్శకుడు వంశీ కొంత తడబబడ్డారు. పైగా ప్రతినాయకుడి పాత్రలో బలం లేకపోవడం, హీరోయిన్ పాత్ర కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ద్వితీయార్థాన్ని సాదా సీదాగా మిగిల్చేశాయి.

సాంకేతిక విభాగం:

రచయితగా ‘రేసు గుర్రం, టెంపర్’ వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో తనలోనూ మంచి సినిమాలు తీయగల దర్శకుడున్నాడని హింట్ ఇచ్చారు. రేసీ కథనం, గుర్తుండిపోయే సూర్య పాత్ర, పవర్ ఫుల్ డైలాగులతో ఇంటర్వెల్ వరకు సినిమాను బాగానే నడిపిన ఆయన సెకండాఫ్లో మాత్రం ట్రాక్ మార్చి మంచి సందేశాలనైతే ఇవ్వగలిగారు కానీ నెమ్మదైన కథనంతో, బలహీనమైన సన్నివేశాలతో బోర్ కొట్టించారు.

సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా పాటలకు మూడు వంతుల న్యాయం మాత్రమే చేయగలిగారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, కెచ్చ, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ స్టంట్స్ అభిమానులకు, యాక్షన్ ప్రియులకు మంచి కిక్ ఇస్తాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ క్వాలిటీగా కనబడింది. కోటగిరి వెంకటేశ్వరావుగారి ఎడిటింగ్ సినిమాకు బాగా సహకరించింది. పాటలకు కంపోజ్ చేసిన నృత్యాలు బాగున్నాయి. శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాస్ నిర్మాణ విలువలు సినిమాను ఒక మెట్టు పైనే నిలబెట్టాయి.

తీర్పు :

లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో వ్యక్తిత్వాన్ని వదిలేసి గమ్యం చేరుకున్నా ప్రయోజనం లేదనే సందేశంతో మన ముందుకొచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం పర్వాలేదనే స్థాయిలో ఆకట్టుకుంది. వక్కంతం వంశీ గుర్తుండిపోయేలా రాసిన సూర్య పాత్ర, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో కొత్తగా కనిపించిన అల్లు అర్జున్, మంచి యాక్షన్ కంటెంట్, దేశభక్తితో కూడిన సందేశం ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా ఇంటర్వెల్ తర్వాత ట్రాక్ మారి నెమ్మదించి, నిరుత్సాహానికి గురిచేసిన కథనం, కొన్ని రొటీన్ సన్నివేశాలు కొంత ఇబ్బందిపెట్టే అంశాలు. మొత్తం మీద కోపం, దేశభక్తి, ప్రేమ కలగలిసిన ఈ సూర్య జర్నీ టికెట్ కొన్న ప్రేక్షకులను నిరుత్సాహపరచడని మాత్రం చెప్పొచ్చు.

కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత ఈ సినిమా దేశభక్తి సందేశంతో ముగిసింది. సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం telugunow చూస్తూ ఉండండి.

  • శరత్ కుమార్ – బన్నీ మధ్య ఒక హార్డ్ హిట్టింగ్ లాంగ్ డైలాగ్ కన్వర్సెషన్ నడుస్తోంది.

  • ప్రస్తుతం బన్నీ మరియు శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.

  • సినిమాలోని చివరి పాట ఇరగ ఇరగ.. వస్తోంది.

  • ఇప్పుడు మరొక పెద్ద యాక్షన్ బ్లాక్ … బన్నీ మరియు అనూప్ మధ్య తీవ్రమైన పోరాట సన్నివేశాలు వస్తున్నాయి.

  • బన్నీ మళ్లీ తన హైపర్ క్యారెక్టర్ లోకి తిరిగి వచ్చాడు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో చిత్రం ముందుకు సాగుతోంది.

  • కథలో ఒక చిన్న ట్విస్ట్ బయటపడింది..

  • తన కుటుంబానికి దూరంగా ఉన్న బన్నీ చివరకు వారిని కలుసుకుంటాడు. ఇప్పుడు ఏన్నియల్లో ఎన్నియల్లో అనే పాట వస్తోంది.

  • బన్నీ మరియు ప్రభాస్ శీను మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు సినిమాలోని నాలుగవ పాట మాయ.. వస్తోంది.

  • సాయి కుమార్ మాజీ సైనికుడిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అతను ఒక సమస్య పై శరత్ కుమార్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు …

  • బన్నీ మరియు అతని కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇంటర్వెల్ తరువాత సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం యాంగర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. బన్నీ తన షార్ట్ టెంపర్ ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

  • సినిమా కథ సగం పూర్తయ్యింది.. ఇప్పుడు ఇంటర్వెల్

  • ప్రస్తుతం బన్నీ మరియు అనూప్ సింగ్ ల మధ్య భారీ ఫైట్ సీన్స్ వస్తున్నాయి.

  • బన్నీ మరియు అర్జున్ మధ్య మరికొన్ని కౌన్సెలింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. సినిమా మళ్లీ ప్రస్తుత రోజుల్లోకి మారింది. ఇప్పుడు లవర్ ఆల్సొ ఫైటర్ ఆల్సొ అనే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

  • పోసాని కృష్ణ మురళి హీరోయిన్ అను అంకుల్ గా ఎంట్రీ ఇచ్చారు.

  • ఈ చిత్రం తిరిగి వెనువెంటనే ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లిపోయింది మరియు ప్రస్తుతం హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ బన్నీ యొక్క ప్రేయసిగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రెండో పాట ‘బ్యూటిఫుల్ లవ్’ వస్తోంది.

  • బన్నీ మరియు అతని తండ్రి అర్జున్ మధ్య కొన్ని సలహాల దృశ్యాలు వస్తున్నాయి …

  • శరత్ కుమార్ మరియు ఠాకూర్ అనూప్ సింగ్ తండ్రి మరియు కొడుకుగా పరిచయమయ్యారు …

  • ప్రస్తుతం అర్జున్ పని చేస్తున్న విశాఖపట్నంకి ఈ చిత్రం షిఫ్ట్ అయ్యింది. బన్నీ యొక్క రూమ్మెట్ గా కమెడియన్ వెన్నెల కిషోర్ సీన్ లోకి వచ్చాడు. అర్జున్ భార్యగా నదియా కూడా పరిచయంచేయబడ్డారు.

  • సైకాలజీ ప్రొఫెసర్ గా యాక్షన్ హీరో అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన బన్నీ తండ్రిగా నటిస్తున్నారు. తండ్రి మరియు కొడుకుల మధ్య వివాదానికి సంబంధించిన కొన్ని చిన్ననాటి దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ప్రముఖ నటుడు రావు రమేష్ బన్నీ గాడ్ ఫాదర్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

  • బోమన్ ఇరానీ మరియు బన్నీల మధ్య తీవ్రమైన మాటల సంభాషణ సన్నివేశం తరువాత అతి ఆగ్రహం వైఖరి కారణంగా బన్నీకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.

  • ఇప్పుడు మొదటి పాట సైనిక వస్తోంది … బ్యాక్ గ్రౌండ్ లో ఆర్మీకి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

  • ఫస్ట్ ఫైట్ తరువాత పోలీస్ స్టేషన్ లో మరో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ వస్తున్నాయి.. ఈ సీన్ లో బన్నీ అసలు క్యారెక్టర్ భయటపడుతోంది.

  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం బార్ లో ఫస్ట్ ఫైట్ వస్తోంది.

  • డెహ్రాడూన్ ఆర్మీ క్యాంప్ లో సినిమా కథ మొదలైంది..

  • హాయ్..168 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.

విడుదల తేదీ : మే 4, 2018 నటీనటులు : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, శరత్ కుమార్, అర్జున్ దర్శకత్వం : వక్కంతం వంశీ నిర్మాత : శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు, శిరీషా లగడపాటి సంగీతం : విశాల్-శేఖర్ సినిమాటోగ్రఫర్ : రాజీవ్ రవి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఆరంభం నుండి భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.. కథ: ఎప్పటికైనా బోర్డర్ కి వెళ్లి దేశం కోసం యుద్ధం చేస్తూ చనిపోవాలనే బలమైన ఆశయం కలిగిన సోల్జర్ సూర్య (అల్లు అర్జున్) తనకున్న అతి కోపం, ఆవేశం కారణంగా ఆర్మీ నుండి బయటకు పంపివేయబడతాడు. తిరిగి ఆర్మీలోకి రావాలన్నా, బోర్డర్ కి వెళ్లాలన్నా ఇండియాలోనే ప్రముఖ సైకియాటిస్ట్ రామకృష్ణంరాజు (అర్జున్) పర్యవేక్షణలోఉండి, అతనిచేత అన్ని విధాల ఫిట్ గా ఉన్నట్టు సర్టిఫికెట్ తీసుకురమ్మని చీఫ్ సూర్యని ఆదేశిస్తాడు. అలా సర్టిఫికెట్ కోసం రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య తన ప్రవర్తనను ఎలా మార్చుకున్నాడు, తండ్రి కొడుకులైన రామకృష్ణంరాజు, సూర్యల గత అనుభంధం ఎలాంటిది, చివరికి అందరికీ నచ్చినట్టు తనని తాను మార్చుకున్న సూర్య జీవితంలో ఏం కోల్పొతాడు అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్ : సినిమాకి ప్రధాన బలం కథానాయకుడు సూర్య పాత్ర. ఈ పాత్రను రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ మలచిన తీరు చాలా బాగుంది. కోపం, బలం, దేశభక్తి, ప్రేమ వంటి లక్షణాలు కలగలసిన సూర్య పాత్ర స్క్రీన్ మీద కనబడుతున్నంతసేపు చూసే వాళ్ళలో ఒక రకమైన కసి మైంటైన్ అవుతూ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు మరొక ఎత్తని చెప్పాలి. నటనలో ఆయన చూపించిన తీవ్రత సోల్జర్ సూర్య పాత్రను చాలా కాలంపాటు గుర్తుండిపోయేలా చేసింది. మాట్లాడే విధానం, నడక, డ్రెస్సింగ్ సెన్స్, రొమాన్స్, కీలమైన ఎమోషనల్ సన్నివేశాలు అన్నింటిలో కొత్త బన్నీ కనిపిస్తాడు. వక్కంతం వంశీ గతంలో రాసిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ చిత్రాల్లాగానే ఈ సినిమా కథనాన్ని కూడా ఫస్టాఫ్ వరకు చాలా రేసీగా రాసుకున్నారు. కథలో నిగూఢంగా దేశానికి శత్రువులు ఎక్కడో తయారవ్వరు మన దేశంలో మనం చేసే తప్పుల వలనే తయారవుతారు, వ్యక్తిత్వాన్ని వదిలేస్తే ప్రాణాలు వదిలేసినట్టే వంటి సున్నితమైన అంశాలను బాగానే చెప్పారు. చిత్రం ఆరంభం నుండి చివరి వరకు తరచూ వచ్చే యాక్షన్ సన్నివేశాలు మంచి థ్రిల్ ఇచ్చాయి. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో హీరో పాత్ర తనలోని మార్పు వలన తాను ఏం కోల్పోతున్నాడో రియలైజ్ అవడం బాగుంది. ఇక తన నుండి అందరూ ఆశించే డ్యాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న అల్లు అర్జున్ మంచి మంచి డాన్స్ మూమెంట్స్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు. మైనస్: ఫస్టాఫ్ వరకు కథను సూర్య పాత్రను హైలెట్ చేస్తూ బాగానే నడిపిన దర్శకుడు వక్కంతం వంశీ ద్వితీయార్థానికి వచ్చే సరికి చప్పబడిపోయారు. ద్వితీయార్థంలో మొదలయ్యే అసలు కథ చెప్పుకోడానికి, వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం ఉండాల్సినంత ప్రభావంతంగా లేదు. రెండు మూడు సన్నివేశాలు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటర్వెల్ సమయానికి హీరో తనని తాను మార్చుకుని, చివరికి తన లక్ష్యమైన ఇండియా సరిహద్దులకి ఎలా చేరుకుంటాడో చూడాలి అనే ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు సెకండాఫ్లో కథను పూర్తిగా వేరే ట్రాక్లోకి తీసుకెళ్లిపోయాడు. ఆయన తీసుకున్న ఆ టర్న్ మంచిదే అయినా ప్రేక్షకుడు ఇంప్రెస్ అయ్యే విధంగా దాని ప్రయాణం లేకపోవడంతో ద్వితీయార్థం దెబ్బతింది. ఎప్పుడైన ప్రేక్షకుడు బాగుంటుందని ఊహించినదానికి భిన్నంగా వేరే కథనాన్ని చెప్పాలనుకున్నప్పుడు అది ప్రేక్షకుడు బాగుంటుందని కోరుకున్న దానికంటే గొప్పగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలోనే దర్శకుడు వంశీ కొంత తడబబడ్డారు. పైగా ప్రతినాయకుడి పాత్రలో బలం లేకపోవడం, హీరోయిన్ పాత్ర కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ద్వితీయార్థాన్ని సాదా సీదాగా మిగిల్చేశాయి. సాంకేతిక విభాగం: రచయితగా ‘రేసు గుర్రం, టెంపర్’ వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో తనలోనూ మంచి సినిమాలు తీయగల దర్శకుడున్నాడని హింట్ ఇచ్చారు. రేసీ కథనం, గుర్తుండిపోయే సూర్య పాత్ర, పవర్ ఫుల్ డైలాగులతో ఇంటర్వెల్ వరకు సినిమాను బాగానే నడిపిన ఆయన సెకండాఫ్లో మాత్రం ట్రాక్ మార్చి మంచి సందేశాలనైతే ఇవ్వగలిగారు కానీ నెమ్మదైన కథనంతో, బలహీనమైన సన్నివేశాలతో బోర్ కొట్టించారు. సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా పాటలకు మూడు వంతుల న్యాయం మాత్రమే చేయగలిగారు. ఫైట్ మాస్టర్స్…

నా పేరు సూర్య రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.25
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవిభాగం పనితీరు - 2.5
దర్శకత్వ ప్రతిభ - 2.25

2.6

నా పేరు సూర్య రివ్యూ

నా పేరు సూర్య రివ్యూ

User Rating: 1.61 ( 4 votes)
3