నేనే రాజు నేనే మంత్రి రివ్యూ

0Cinema:
SivaPrasad

Reviewed by:
Rating:
3
On August 11, 2017
Last modified:August 11, 2017

Summary:

నేనే రాజు నేనే మంత్రి రివ్యూ , నేనే రాజు నేనే మంత్రి సమీక్ష, Nene Raju Nene Mantri Review, LIVE UPDATES, Nene Raju Nene Mantri Review Rating, Nene Raju Nene Mantri Public talk, Nene Raju Nene Mantri Collections

nene-raju-nenu-mantri-Review

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎన్నడు చూడని పోటీ ఈ రోజు వచ్చింది. విచిత్రంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఏ సినిమాలోనూ లేకపోవడం ఒక విశేషమైతే, అన్నింటికీ ఓపెనింగ్స్ డీసెంట్ గా రికార్డు కావడం మరో విశేషం. కాని ఉన్నంతలో ప్రమోషన్స్ పరంగా నేనే రాజు నేనే మంత్రి ఒక అడుగు ముందు ఉండటం వల్ల పాజిటివ్ బజ్ దీని మీదే ఎక్కువగా ఉంది.

ఒక్క ట్రైలర్ తోనే అంచనాలు అమాంతం పెంచేసిన ఈ మూవీకి ఫ్లాప్ డైరెక్టర్ తేజ అనే రిమార్క్ కొద్దిగా మైనస్ అనిపించినా తన గత హిట్ సినిమాల రేంజ్ లో ఇది కూడా రూపొందించినట్టు అనిపించడం ప్లస్ గా మారింది.మరి రన్నింగ్ రేస్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా అది ముగిసే లోపు కూడా అదే ప్లేస్ ను నిలబెట్టుకునేలా ఉన్నాడా లేదా అనేది రివ్యూ లో చూద్దాం

కథ:

ఇది అధికార దాహంతో దేనికైనా తెగించడానికి సిద్ధపడే ఒక యువ రాజకీయ నాయకుడి కథ. జోగేంద్ర(రానా)వడ్డీ వ్యాపారం చేసే ఎరువుల వ్యాపారి. ఒకసారి గుళ్ళో సర్పంచి భార్య చేతిలో తాను ఎంత గానో ప్రేమించే భార్య రాధ(కాజల్) గర్భం పోవడంతో పంతం పట్టి ఎత్తులు వేసి ఎమెల్యే దాకా ఎదుగుతాడు. ఆ తర్వాత తన ఎత్తులతో హోం మినిస్టర్(అశుతోష్ రానా)ని మోసం చేసి మినిస్టర్ పదవి కొట్టేస్తాడు. తర్వాత సిఎం పదవికి టార్గెట్ పెట్టుకుంటాడు.

ఈ క్రమంలో మారణ హోమం సృష్టించుకుంటూ పోతాడు. చివరికి అయినవారు కానివారు అందరిని పోగొట్టుకునే స్టేజి కి వస్తాడు. రాధా చేసిన త్యాగం వల్ల అనూహ్యంగా ప్రజల్లో మద్దతు పెరిగి సిఎం కుర్చీకి దగ్గరవుతాడు. ఆ తర్వాత ప్రత్యర్థుల కుట్రలో ఉరికంబం దాకా వస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది నేనే రాజు నేనే మంత్రి కథ

నటీనటులు:

రానా ఇప్పుడున్న యూత్ హీరోల్లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మాస్ హీరోగా సెటిల్ అవ్వాలని కెరీర్ మొదలు పెట్టిన రానా తనను అలా యాక్సెప్ట్ చేయాడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు అని త్వరగానే గుర్తించి బాహుబలితో విలన్ గా కొత్త టర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్ లగా తక్కువ టైం లోనే స్టార్ హీరో అవుదాం అనుకున్న అతని ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టే. ఇది ఈ సినిమాలో కూడా ప్రూవ్ అయ్యింది. నెగటివ్, పాజిటివ్ అనేది ఆలోచించకుండా నటుడిగా తనను ఛాలెంజ్ చేసే పాత్రలను ఎంచుకుంటే మోహన్ బాబు, గోపి చంద్ లాగా ఫ్యూచర్ లో ఎప్పుడైనా హీరోగా మారొచ్చు అనే ఎత్తుగడ నిజంగా మెచ్చుకోవాల్సిందే.

ఇందులో రానా బదులు ఆసాంతం జోగేంద్రనే కనిపిస్తాడు. పొగరు, దర్పం, అహంకారం కలగలసిన పాత్రలో అవతలి వాడు ఎంతటివాడైనా తీసి పారేసే మొండిఘటంగా రానా చెలరేగాడు. కంపేర్ చేసుకుని చూస్తే బాహుబలి కంటే ఇందులోనే పాత్రతో ఆడుకోవడానికి రానాకు ఎక్కువ స్కోప్ దక్కింది. అందుకే దాన్ని వృధాగా పోనివ్వలేదు. తనకు అన్యాయం జరగనంత వరకు చక్కగా ఉండి ఆ తర్వాత దుర్మార్గుడిగా మారే వేరియేషన్ అద్భుతంగా చూపించాడు రానా. కాని వాయిస్ మాడ్యులేషన్ ఇంకా మెరుగు పరుచుకోవాల్సి ఉంది. ఇక కాజల్ కథలో కీలకమైన పాత్ర పోషించి రానాతో సమానంగా స్క్రీన్ స్పేస్ తీసుకుని జీవం పోసింది.జోగేంద్రకు తగ్గ జోడిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో మాగ్జిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది.

క్యాథరిన్ త్రేస్సా మరీ కొత్తదనం నిండిన పాత్ర కాదు కాని నెగటివ్ షేడ్స్ లో  బాగా ఒదిగిపోయింది.శివ పాత్రలో నవదీప్ ధృవ తర్వాత మరో మంచి పాత్ర దక్కించుకున్నాడు. కాని ఆ పాత్రకు ముగింపు మింగుడు పడదు. సిఎం గా తనికెళ్ళ భరణి రెండు సీన్లకు పరిమితమైతే, రానా పక్కన ఉండే బ్యాచ్ లో శివాజీ రాజా, జోష్  రవి బాగున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజయ్, మిగిలిన పాత్రల్లో జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, పోసాని, సత్య ప్రకాష్, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రల్లో బాగానే చేసారు. అనవసరమైన పాత్రలు అన్ని కొన్ని లెంగ్త్ పెరగడానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు. మెయిన్ విలన్ గా అశుతోష్ రానా తనకు అలవాటైన ధోరణిలోనే నటించేసాడు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు తేజ తన నుంచి ఏది మిస్ అవుతోందో చాలా కాలం తర్వాత గుర్తించాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు వ్యవహరించిన తేజ ఇన్నాళ్ళకు కాస్త సరైన రూట్ లో పడ్డట్టు కనిపిస్తుంది. కాని తేజ అది పూర్తి స్థాయిలో మాత్రం అందుకోలేదు. జోగేంద్ర పాత్ర రూపకల్పనలో చూపిన శ్రద్ధ కథనం మీద పూర్తిగా పెట్టకపోవడం వల్ల సెకండ్ హాఫ్ మరీ సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తుంది. సిఎం పదవి అనే ఇష్యూ ని చాలా ఆషామాషీగా చూపించిన తేజ జోగేంద్ర తప్ప మిగిలిన వారంతా మరీ తెలివి లేని వాళ్ళుగా చూపించడం, అతని ప్రతి పనికి తలోగ్గుతూ ప్రతిచర్యకు దిగకపోవడం కొంచెం సిల్లీగానే అనిపిస్తాయి.

ట్రైలర్ నుంచి పోస్టర్స్ దాకా అన్నింటిలో పొలిటికల్ థ్రిల్లర్ అని కలరింగ్ ఇచ్చిన తేజ జోగేంద్ర, రాధల లవ్ ట్రాక్ కి అంత స్పేస్ ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది. కాని అన్ని దుర్మార్గాలు చేసిన జోగేంద్ర చివరికి వచ్చేటప్పటికి రాష్ట్రం మొత్తం ఆరాధించే నాయకుడిగా మారడం మాత్రం ఎంత మాత్రం లాజిక్ కి అందదు. పైగా ఒక ఊరికి చెందిన మినిస్టర్ రాష్ట్రం మొత్తం ఆరాధించే లీడర్ గా ఎదగడం కూడా కనెక్ట్ కాదు. కాని మేకింగ్ పరంగా చూస్తే  తేజ గత సినిమాలతో పోలిస్తే ఇది కొన్ని  మెట్లు పైనే నిలుస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతంతో షాక్ ఇస్తాడు. సందర్భానికి తగ్గ పాటలు, నేపధ్య సంగీతంతో తనవరకు పర్వాలేదు అనిపిస్తాడు.

లక్ష్మి భూపాల మాటలు ట్రైలర్ లో చూపించిన సీన్స్ తో పాటు అక్కడక్కడ చమక్కు మనిపిస్తాయి. ఎనకటికి సామెతలు మొదట్లో బాగానే అనిపించినా తర్వాత మాత్రం స్పార్క్ కోల్పోయాయి. క్లైమాక్స్ లో మాత్రం డైలాగ్స్ బాగున్నాయి. వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం బాగుంది. రానాను ఎలివేట్ చేయడాన్ని బాగా చూపించాడు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ టైం లో మాత్రం చేతులు కట్టేసినట్టు ఉన్నారు. ఓ పదిహేను నిముషాలు కత్తెర వేయడానికి చాలా అవకాశం ఉంది. సురేష్ సంస్థ, బ్లూ ప్లానెట్ నిర్మాణం చాలా తెలివిగా ఉంది. ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టి తెరపై మాత్రం భారీతనం కనిపించేలా చేసుకున్న ప్లానింగ్ మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ప్లస్ పాయింట్స్

 • రాధా జోగేంద్రగా రానా నటన
 • కాజల్ పాత్ర
 • ఫస్ట్ హాఫ్
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్

 • లెంగ్త్
 • యాంటీగా అనిపించే క్లైమాక్స్
 • పాత్రల మధ్య గందరగోళం
 • మితిమీరిన ట్విస్టులు

చివరి మాట

నేనే రాజు నేనే మంత్రి మూవీని దర్శకుడు తేజ పాయింట్ అఫ్ వ్యూ లో చూసుకుంటే చాలా కాలం తర్వాత వచ్చిన బెటర్ మూవీ. అలా అని చెప్పి మిగిలినవాటితో పోల్చుకుంటేనో లేక పెట్టుకున్న అంచనాలు మ్యాచ్ అయ్యాయో లేదో అని చెక్ చేసుకుంటేనో తప్ప పూర్తిగా నిరాశ పరచదు. కాని ట్రైలర్ తో ఏవేవో ఊహించుకుని దానికి తగ్గట్టే ఉంటుంది అని ఎక్కువ ఆశిస్తే మాత్రం తేజ నిరాశ పరుస్తాడు. రానాకు కెరీర్ పరంగా ఇది హెల్ప్ చేసే మూవీనే. కమర్షియల్ అంశాలు ఉన్నట్టే అనిపించినా అవి సినిమాలో చాలా చోట్ల మిస్ అయ్యాయి. పొలిటికల్ జానర్ లో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి ఒక లుక్ వేద్దాం అనుకుంటే ఓ మోస్తరుగా మెప్పిస్తుందే తప్ప ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ మాత్రం ఇవ్వదు. తేజ గత సినిమాలతో పోల్చుకుని ఆనందపడాలే తప్ప నేనే రాజు నేనే మంత్రి హీరో కాని ఒక విలన్ కథ. అంతే. అంతకు మించి ఏమి లేదు.

 

‘నేనే రాజు నేనే మంత్రి’ : లైవ్ అప్డేట్స్:

 

 • ఊహించని ట్విస్ట్ తో చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

 • జైలు వద్ద భారీగా జనం పోగయ్యారు. జోగేంద్రకు మద్దత్తు తెలుపుతున్నారు. ప్రస్తుతం ‘జోగేంద్ర జోగేంద్ర’ సాంగ్ వస్తోంది.

 • అశుతోష్ రానని చంపేసి జోగేంద్ర బలమైన శక్తిగా మారడు. ఇప్పుడు చిత్రం ప్రజెంట్ డే కు వచ్చింది.

 • తమిళనాడు రాజకీయాల్లో జరిగిన సంఘటనల లాంటి సన్నివేశాలు వస్తున్నాయి.

 • జోగేంద్ర తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు.

 • కథ ఊహించిన ఘటన జరిగింది. ప్రస్తుతం ఎమోషనల్ గా సాగే ‘సుమంగళి’ సాంగ్ వస్తోంది.

 • జోగేంద్ర తన భార్య కోరికని మన్నించాడు. రాజకీయాలను వదలి ఊళ్లోనే ఉండేందుకు అంగీకరించాడు.

 • ఈ పొలిటికల్ గేమ్ లో జోగేంద్ర తన డబ్బునంతటినీ కోల్పోయి తన గ్రామం చేరుకున్నాడు. రానా, కాజల్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.

 • జోగేంద్ర పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు.

 • అజయ్ ఎస్పీగా తిరిగి సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. శత్రువుల నుంచి జోగేంద్రకు సమస్యలు మొదలయ్యాయి.

 • రానా పెద్ద రాజకీయ నాయకుడిగా మారాడు. అదే క్రమంలో శత్రువులు కూడా పెరిగారు. రానాకు కేథరిన్ సాయం అందిస్తోంది.

 • ఇంటర్వెల్ తరువాత రానా, కాజల్ మధ్య ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి. రానా ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఆసక్తికరమైన పొలిటికల్ సీన్స్ తో చిత్రం ఇప్పటివరకు పరవాలేదు. రానా, కాజల్ మధ్య రొమాన్స్ బావుంది.

 • జోగేంద్ర, నవదీప్ మధ్య సంఘర్షణ జరగడంతో నగదీప్ మరణించాడు. ఇప్పుడు ఇంటర్వెల్.

 • కేథరిన్ న్యూస్ ఛానల్ ఓనర్ గా ఎంట్రీ ఇచ్చింది. జోగేంద్ర, కేథరిన్ మధ్య పరిచయం జరిగింది.

 • అశుతోష్ రానా హోమ్ మంత్రిగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని రాజకీయ ఎత్తుగడల తరువాత రానాకు తనికెళ్ల భరణి కేబినెట్ లో మంత్రిపదవి దక్కింది.

 • కథ పూర్తిగా రాజకీయ కోణంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి పాత్రలో తనికెళ్ళ భరణి ఎంట్రీ ఇచ్చాడు.

 • జోగేంద్ర రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు. అతడి దోపిడీ కూడా పెరుగుతోంది. జోగేంద్ర.. రాధా జోగేంద్రగా మారాడు.

 • గ్రామంలో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. జోగేంద్ర అసిస్టెంట్ గా నవదీప్ పరిచయం అయ్యాడు.

 • టివి యాంకర్ బిత్తిరి సత్తి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ సీన్స్ వస్తున్నాయి.

 • జోగేంద్ర, ప్రదీప్ రావత్ మధ్య భారీ ఫైట్ సీన్ వస్తోంది. ప్రదీప్ రావత్ మరణించాడు. పోలీస్ అధికారిగా నటుడు అజయ్ ఎంటర్ అయ్యాడు.

 • నటుడు ప్రదీప్ రావత్ క్రింది స్థాయి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పోసాని కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు.

 • ఓ చిరు వ్యాపారిగా ఉన్న జోగేంద్ర తన గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యాడు.

 • కాజల్, రానా మధ్య రొమాంటిక్ సన్నివేశంతో మెలోడీ సాంగ్ ‘సుఖీభవ’ వస్తోంది.

 • రాధగా కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. జోగేంద్ర మరియు రాధాలు భార్య భర్తలు.

 • జోగేంద్ర తన కథని వివరిస్తున్నాడు. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది.

 • జోగేంద్రగా రానా కనిపిస్తున్నాడు. అతడిని జైలుకు తరలిస్తున్నారు. సన్నివేశంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

 • టైటిల్స్ పడుతున్నాయి. నటుడు జయప్రకాశ్ రెడ్డి పోలీస్ అధికారిగా ఎంట్రీ ఇచ్చాడు.

 • హాయ్..152 నిమిషాల నిడివి గల ‘నేనే రాజు నేనే మంత్రి ‘ చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

Summary
నేనే రాజు నేనే మంత్రి రివ్యూ
Article Name
నేనే రాజు నేనే మంత్రి రివ్యూ
Description
నేనే రాజు నేనే మంత్రి రివ్యూ , నేనే రాజు నేనే మంత్రి సమీక్ష, Nene Raju Nene Mantri Review, LIVE UPDATES, Nene Raju Nene Mantri Review Rating, Nene Raju Nene Mantri Public talk, Nene Raju Nene Mantri Collections
Author
TeluguNow
నేనే రాజు నేనే మంత్రి రివ్యూ , నేనే రాజు నేనే మంత్రి సమీక్ష, Nene Raju Nene Mantri Review, LIVE UPDATES, Nene Raju Nene Mantri Review Rating, Nene Raju Nene Mantri Public talk, Nene Raju Nene Mantri Collections
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎన్నడు చూడని పోటీ ఈ రోజు వచ్చింది. విచిత్రంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఏ సినిమాలోనూ లేకపోవడం ఒక విశేషమైతే, అన్నింటికీ ఓపెనింగ్స్ డీసెంట్ గా రికార్డు కావడం మరో విశేషం. కాని ఉన్నంతలో ప్రమోషన్స్ పరంగా నేనే రాజు నేనే మంత్రి ఒక అడుగు ముందు ఉండటం వల్ల పాజిటివ్ బజ్ దీని మీదే ఎక్కువగా ఉంది. ఒక్క ట్రైలర్ తోనే అంచనాలు అమాంతం పెంచేసిన ఈ మూవీకి ఫ్లాప్ డైరెక్టర్ తేజ అనే రిమార్క్ కొద్దిగా మైనస్ అనిపించినా తన గత హిట్ సినిమాల రేంజ్ లో ఇది కూడా రూపొందించినట్టు అనిపించడం ప్లస్ గా మారింది.మరి రన్నింగ్ రేస్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా అది ముగిసే లోపు కూడా అదే ప్లేస్ ను నిలబెట్టుకునేలా ఉన్నాడా లేదా అనేది రివ్యూ లో చూద్దాం కథ: ఇది అధికార దాహంతో దేనికైనా తెగించడానికి సిద్ధపడే ఒక యువ రాజకీయ నాయకుడి కథ. జోగేంద్ర(రానా)వడ్డీ వ్యాపారం చేసే ఎరువుల వ్యాపారి. ఒకసారి గుళ్ళో సర్పంచి భార్య చేతిలో తాను ఎంత గానో ప్రేమించే భార్య రాధ(కాజల్) గర్భం పోవడంతో పంతం పట్టి ఎత్తులు వేసి ఎమెల్యే దాకా ఎదుగుతాడు. ఆ తర్వాత తన ఎత్తులతో హోం మినిస్టర్(అశుతోష్ రానా)ని మోసం చేసి మినిస్టర్ పదవి కొట్టేస్తాడు. తర్వాత సిఎం పదవికి టార్గెట్ పెట్టుకుంటాడు. ఈ క్రమంలో మారణ హోమం సృష్టించుకుంటూ పోతాడు. చివరికి అయినవారు కానివారు అందరిని పోగొట్టుకునే స్టేజి కి వస్తాడు. రాధా చేసిన త్యాగం వల్ల అనూహ్యంగా ప్రజల్లో మద్దతు పెరిగి సిఎం కుర్చీకి దగ్గరవుతాడు. ఆ తర్వాత ప్రత్యర్థుల కుట్రలో ఉరికంబం దాకా వస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది నేనే రాజు నేనే మంత్రి కథ నటీనటులు: రానా ఇప్పుడున్న యూత్ హీరోల్లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మాస్ హీరోగా సెటిల్ అవ్వాలని కెరీర్ మొదలు పెట్టిన రానా తనను అలా యాక్సెప్ట్ చేయాడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు అని త్వరగానే గుర్తించి బాహుబలితో విలన్ గా కొత్త టర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. బాబాయ్ వెంకటేష్ లగా తక్కువ టైం లోనే స్టార్ హీరో అవుదాం అనుకున్న అతని ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టే. ఇది ఈ సినిమాలో కూడా ప్రూవ్ అయ్యింది. నెగటివ్, పాజిటివ్ అనేది ఆలోచించకుండా నటుడిగా తనను ఛాలెంజ్ చేసే పాత్రలను ఎంచుకుంటే మోహన్ బాబు, గోపి చంద్ లాగా ఫ్యూచర్ లో ఎప్పుడైనా హీరోగా మారొచ్చు అనే ఎత్తుగడ నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇందులో రానా బదులు ఆసాంతం జోగేంద్రనే కనిపిస్తాడు. పొగరు, దర్పం, అహంకారం కలగలసిన పాత్రలో అవతలి వాడు ఎంతటివాడైనా తీసి పారేసే మొండిఘటంగా రానా చెలరేగాడు. కంపేర్ చేసుకుని చూస్తే బాహుబలి కంటే ఇందులోనే పాత్రతో ఆడుకోవడానికి రానాకు ఎక్కువ స్కోప్ దక్కింది. అందుకే దాన్ని వృధాగా పోనివ్వలేదు. తనకు అన్యాయం జరగనంత వరకు చక్కగా ఉండి ఆ తర్వాత దుర్మార్గుడిగా మారే వేరియేషన్ అద్భుతంగా చూపించాడు రానా. కాని వాయిస్ మాడ్యులేషన్ ఇంకా మెరుగు పరుచుకోవాల్సి ఉంది. ఇక కాజల్ కథలో కీలకమైన పాత్ర పోషించి రానాతో సమానంగా స్క్రీన్ స్పేస్ తీసుకుని జీవం పోసింది.జోగేంద్రకు తగ్గ జోడిగా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో మాగ్జిమం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. క్యాథరిన్ త్రేస్సా మరీ కొత్తదనం నిండిన పాత్ర కాదు కాని నెగటివ్ షేడ్స్ లో  బాగా ఒదిగిపోయింది.శివ పాత్రలో నవదీప్ ధృవ తర్వాత మరో మంచి పాత్ర దక్కించుకున్నాడు. కాని ఆ పాత్రకు ముగింపు మింగుడు పడదు. సిఎం గా తనికెళ్ళ భరణి రెండు సీన్లకు పరిమితమైతే, రానా పక్కన ఉండే బ్యాచ్ లో శివాజీ రాజా, జోష్  రవి బాగున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అజయ్, మిగిలిన పాత్రల్లో జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, పోసాని, సత్య ప్రకాష్, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రల్లో బాగానే చేసారు. అనవసరమైన పాత్రలు అన్ని కొన్ని లెంగ్త్ పెరగడానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు. మెయిన్ విలన్ గా అశుతోష్ రానా తనకు అలవాటైన ధోరణిలోనే నటించేసాడు. సాంకేతిక వర్గం: దర్శకుడు తేజ తన నుంచి ఏది మిస్ అవుతోందో చాలా కాలం తర్వాత గుర్తించాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు వ్యవహరించిన తేజ ఇన్నాళ్ళకు కాస్త సరైన రూట్ లో పడ్డట్టు కనిపిస్తుంది. కాని తేజ అది పూర్తి స్థాయిలో మాత్రం అందుకోలేదు. జోగేంద్ర పాత్ర రూపకల్పనలో చూపిన శ్రద్ధ కథనం మీద పూర్తిగా పెట్టకపోవడం వల్ల సెకండ్ హాఫ్ మరీ…

నేనే రాజు నేనే మంత్రి

కథ - స్క్రీన్ ప్లే - 3
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవిభాగం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.3

నేనే రాజు నేనే మంత్రి

నేనే రాజు నేనే మంత్రి రివ్యూ

User Rating: 3.55 ( 2 votes)
3


నేనే రాజు నేనే మంత్రి రివ్యూ

55%
55%
Good one

నేనే రాజు నేనే మంత్రి మూవీని దర్శకుడు తేజ పాయింట్ అఫ్ వ్యూ లో చూసుకుంటే చాలా కాలం తర్వాత వచ్చిన బెటర్ మూవీ.

 • 5.5
 • User Ratings (1 Votes)
  6.8