పంతం రివ్యూ

0 

పంతం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపిచంద్, మెహ్రీన్, సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, ప్రిథ్వి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ, హంస నందిని, జయప్రకాష్ రెడ్డి, సయాజి షిండే, అజై, బద్రం, జీవా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె చక్రవర్తి వహించారు మరియు నిర్మాత రాధా మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.

మాస్ హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ‘పంతం’ అంటూ మన ముందుకొస్తున్నాడు. ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించగా.. సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త డైరెక్టర్ కె. చక్రవర్తి గోపీచంద్‌కి హిట్ అందించాడో లేదనే విషయమై ఆడియెన్స్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా గ్రిప్పింగ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గని యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. గోపీచంద్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు. ఇతరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారని టాక్. ‘పంతం’ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా అని, గోపీచంద్‌ మళ్లీ హిట్ పట్టలెక్కినట్టేనని టాక్ నడుస్తోంది. ప్రీమియర్ షోలు చూసిన వాళ్లలో చాలా మంది సినిమా హిట్ అని అంటున్నారు.

గోపీచంద్ గత చిత్రాలకు భిన్నంగా పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘పంతం’ ప్రీమియర్ షోలను అమెరికాలో ఇప్పటికే ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసిన వారు గోపీచంద్ 25వ సినిమాతో హిట్ కొట్టినట్టే అని చెబుతున్నారు.

లంచం
అవినీతి
కుంభ‌కోణాలు

వీటిపై హీరోలు స్పీచులివ్వ‌డం… అవి చూసి జ‌నాలు చొక్కాలు చించుకోవ‌డం ‘అరె.. ఏం చెప్పాడ్రా’ అంటూ ఊగిపోవ‌డం.. ఈ రోజుల‌న్నీ పోయాయి. ఎందుకంటే ఇవ‌న్నీ అరిగిపోయిన క్యాసెట్లు. ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’ రోజులు కావు.. విన‌గానే షాక్ అయిపోవ‌డానికి, చ‌ప్ప‌ట్లు కొట్టేయ‌డానికి. ఓ విధంగా ‘ఠాగూర్‌’తోనే జ‌నాలు వెక్స్ అయిపోయారు. మ‌ళ్లీ అదే పాయింటు ప‌ట్టుకోవ‌డానికి గ‌ట్స్ ఉండాలి. పాత సినిమాల ఛాయ‌లు క‌నిపించ‌కుండా, ఏదో ఓ మ్యాజిక్ చూపించాలి. ‘కిక్‌’ది అదే స్టోరీ. కాక‌పోతే.. ఎక్క‌డా ద‌ర్శ‌కుడు దొర‌క‌లేదు. ర‌వితేజ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో మ్యాజిక్ చేసేశాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు గోపీచంద్ ‘పంతం’ అనే క‌థ ప‌ట్టుకొచ్చాడు. ఇది కూడా సోకాల్డ్ జెంటిల్‌మెన్ టూ కిక్ సినిమాల వ‌ర‌కూ న‌డిచిన పాత క‌థే. ఉన్న‌వాడి ద‌గ్గ‌ర కొట్టు.. లేని వాడికి పంచి పెట్టు కాన్సెప్టే. మ‌రి… ‘కిక్‌’లా ఏదో ఓ మ్యాజిక్ తోడైందా? ఈ సినిమాని నిల‌బెట్టిందా? ఎన్నో సినిమాల నుంచి విజ‌యం కోసం మొహం వాచిపోయిన గోపీచంద్‌కి త‌న 25వ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇచ్చింది?

క‌థ‌

”చెప్పుకోవ‌డానికి ఇదేం కొత్త క‌థ కాదు సార్‌.. దేశం పుట్టిన‌ప్ప‌టి నుంచీ మ‌నం చెప్పుకుంటున్న క‌థే”క్లైమాక్స్ సీన్‌లో.. కోర్టులో.. న్యాయ‌మూర్తి ముందు గోపీచంద్ చెప్పే డైలాగ్ ఇది.

ఈ డైలాగ్ చెప్ప‌డానికి గోపీచంద్ అంత సేపు ఆగాడు కానీ, సినిమా మొద‌లైన పావు గంట‌కే ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. ఇదేం కొత్త క‌థ కాదు.. సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచీ చూస్తున్న‌దే అని.

హొం మినిస్ట‌ర్‌ని టార్గెట్ చేయ‌డం, తాను ఎక్క‌డెక్క‌డో దాచుకున్న డ‌బ్బుని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం, దాన్ని ఓ ట్ర‌స్ట్‌కి అందింవ్వ‌డం ఇదీ హీరో చేసే ప‌ని. మ‌ధ్య‌లో అక్ష‌ర (మెహ‌రీన్‌)తో ఓ ప్రేమ క‌థ కూడా న‌డుపుతుంటాడు. అస‌లు హోం మినిస్ట‌ర్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ దోపిడీ వెనుక క‌థానాయ‌కుడి పంతం, ల‌క్ష్యం ఏమిట‌న్న‌దే సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌

జెంటిల్‌మెన్‌.. ఎప్ప‌టి సినిమా..? అందులో శంక‌ర్ ఏం చెప్పాడు? ఉన్న‌వాళ్ల ద‌గ్గ‌ర నుంచి దోచుకుని లేనివాళ్ల‌కు పెట్ట‌డంలో త‌ప్పు లేద‌న్నాడు.

మంచి పాయింటే. అందుకే… దాని చుట్టూ ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ అన్నీ జెంటిల్‌మెన్‌లు కావుగా.! `పంతం` క‌థ‌, దాన్ని న‌డిపిన తీరు, నేప‌థ్యం.. వీటిని చూస్తే ద‌ర్శ‌కుడి ల‌క్ష్యం చాలా పెద్ద‌దిగానే క‌నిపిస్తుంది. ఈసారి `ఎక్స్‌గ్రేషియా` అనే పాయింట్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్‌పెట్టాడు.

ప్ర‌మాదాల వ‌ల్ల గాయ‌ప‌డిన‌, మ‌ర‌ణించిన వాళ్ల‌కు సహాయం అందాలంటే.. ఫైళ్ల‌పై సంత‌కాలు జ‌రగాలి. అలా జ‌ర‌గాలంటే.. అధికారుల చేతులు త‌డ‌పాలి. లంచం లేనిదే అక్క‌డ ఏ ప‌నీ జ‌ర‌గ‌డం లేదు. ఆ లంచాలు ఇవ్వ‌లేక‌… చాలా కుటుంబాలు ప్ర‌భుత్వ స‌హాయం కోసం ఎదురుచూస్తూ.. ఎదురు చూస్తూ.. గ‌డిపేస్తున్నాయి. నిజానికి మంచి పాయింటే ఇది. కానీ.. దాన్ని డీల్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడి సామర్థ్యం ఏమాత్రం స‌రిపోలేదు. అస‌లు త‌ప్పు ఎక్క‌డ జరుగుతోంది? ఈ త‌ప్పుకు ప్ర‌ధాన కార‌కులు ఎవ‌రు? అనే విష‌యాల‌పై రీసెర్చ్ జ‌ర‌గ‌లేదు. అన్నీ పైపై స‌న్నివేశాలే. గ‌వ‌ర్న‌మెంటు ఆఫీసులో స‌హాయం కోసం వెళ్లిన ఓ వృథ్ధ జంట‌కు జ‌రిగిన అవ‌మానం, ‘మీ క‌ళ్ల ముందు చ‌నిపోతే.. స‌హాయం ఇస్తారా’ అంటూ.. అక్క‌డిక్క‌డే ఓ వృద్ధురాలు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం… హృద‌యాల్ని క‌దిల్చివేసే స‌న్నివేశం. పేప‌ర్‌పై చాలా బాగా రాసుకున్న ఇలాంటి సీన్లు తెర‌పైకి వ‌చ్చేట‌ప్పుడు తేలిపోయాయి. ఎక్క‌డ ఏ స‌న్నివేశాన్ని ఎలివేట్ చేయాలో, ఎక్క‌డ ఏ ఎమోష‌న్‌తో కొట్టాలో.. ద‌ర్శ‌కుడికి అర్థం కాలేదు.

రాబ‌రీ స‌న్నివేశాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉండాలి? ‘ధూమ్‌’ లాంటి సినిమాలు చూసిన‌వాళ్ల‌కు ఈ దొంగ‌త‌నాలు ఏమాత్రం ఆన‌వు. లాజిక్కులు ప‌ట్టించుకోకుండా… హీరో త‌న బుర్ర వాడ‌కుండా.. సుల‌భంగా డ‌బ్బులు దొబ్బేస్తుంటాడు. విశ్రాంతి ముందు సంప‌త్‌తో ఓ డైలాగ్ చెప్పింది.. ‘ఇక్క‌డేదో ట్విస్టు ఉంది సుమా’ అనిపించారు. కానీ.. రెండో భాగం మొద‌లైన‌.. రెండో నిమిషంలోనే అది తేలిపోతుంది. విక్రాంత్ ఫ్లాష్ బ్యాక్ ఒక్క‌టే ద‌ర్శ‌కుడు కాస్త బెట‌ర్‌గా డీల్ చేశాడ‌నిపిస్తుంది. కాక‌పోతే… అక్క‌డ కూడా శ్రీ‌మంతుడు ఛాయ‌లు కొన్ని క‌నిపిస్తాయి. కోర్టు సీనులో డైలాగులు ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం.. అవే ఈ సినిమాని నిల‌బెడ‌తాయి అని లెక్క‌లేసుకుని ఉంటారు. కానీ.. వాటినీ స‌రైన రీతిలో తీయ‌లేక‌పోయాడు. అది కోర్టా? లేదంటే హీరో ప్రెస్ మీటా? అన్న‌ట్టు సాగింది ఆస‌న్నివేశం. ఓ ప‌క్క వాద‌న‌లు జ‌రుగుతుంటాయి? మ‌రోవైపు అదే కోర్టు హాలులో మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు హీరో స‌మాధానాలు చెబుతుంటాడు? న్యాయ స్థానాలు, అక్క‌డ తీర్పు ఇచ్చే ప‌ద్ధ‌తుల‌పై ద‌ర్శ‌కుడికి మ‌రీ అంత అవ‌గాహ‌న లేక‌పోతే ఎలా? మ‌ధ్య మ‌ధ్య‌లో హీరో మంచిత‌నం, ఉదాత్త‌త చెప్పే స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డ వేశారు. వాటి వ‌ల్ల సింప‌తీ వ‌స్తుంద‌ని ఆశ‌. కాక‌పోతే.. అవే ఈ సినిమాని మ‌రీ బోరింగ్‌గా త‌యారు చేశాయి.

న‌టీన‌టులు

గ‌త పాతిక సినిమాల‌తో గోపీచంద్ ఏం చేశాడో, ఈ సినిమాలోనూ అదే చేశాడు. క‌థ‌లోలానే అత‌ని న‌ట‌న‌లోనూ కొత్త‌ద‌నం లేదు. కాక‌పోతే.. ఈమ‌ధ్య మ‌రింత స్టైలీష్ లుక్‌తో క‌నిపించ‌డం అల‌వాటు చేసుకున్న గోపీ.. ఈసారీ అలాంటి లుక్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. మెహ‌రీన్ హీరోయిన్ స్టేజీ దాటిపోయి… ఆంటీల ప్లేసులోకి చేరిపోనుందా? అనే అనుమానం వేస్తోంది. త‌న పాత్ర‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. దానికి స‌రిప‌డేట్టుగానే ఆమె న‌ట‌న సాగింది. మిర్చి సంప‌త్ ఎప్ప‌ట్లా బాగా అరిచాడు. జ‌య‌ప్ర‌కాష్ రొటీన్‌గానే రాయ‌ల‌సీమ యాస‌లో డైలాగులు చెప్పాడు. ఫృథ్వీ న‌వ్వించ‌డానికి రెడీగానే ఉన్నా.. ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేదు. దాదాపుగా పాత్ర‌ధారులంద‌రిదీ ఇదే ప‌రిస్థితి.

సాంకేతికంగా

గోపీసుంద‌ర్‌కి దిష్టి త‌గిలిన‌ట్టుంది. అందుకే… కొన్ని పాడైపోయిన ట్యూన్లు ఈ సినిమాకి ఇచ్చేసి ఆ దిష్టిని పోగొట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ‘దేశ‌మంటే మ‌ట్టీ కాదు.. దేశ‌మంటే మ‌నుషులోయ్‌’ అంటూ సామెత‌ల్ని, సూక్తుల్ని ప‌ట్టుకుని ఓ పాట త‌యారు చేశారు. ఆ పాట‌కీ, సంద‌ర్భానికీ, వేసే స్టెప్పుల‌కూ సంబంధం లేక‌పోవ‌డంతో ఈ పాటే ఓ కామెడీ ట్రాక్‌లా క‌నిపిస్తుంది. కెమెరా వ‌ర్క్ బాగుంది. ఓ పాట‌ని లేపేసి ఎడిట‌ర్ చాలా మంచి ప‌ని చేశాడు. ద‌ర్శ‌కుడు ఓ బ‌ల‌మైన పాయింట్ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ… దాన్ని న‌డిపించే ద‌మ్ము క‌థ‌, క‌థ‌నాల్లో లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నం నెర‌వేర‌లేదు.

తీర్పు: ”లోప‌లున్న‌ది బ‌య‌ట‌కు తీస్తాం.. బ‌య‌ట ఉన్న‌ది లోప‌ల‌కు తోస్తాం టింగ్ టింగ్‌” ఇదీ ఈ సినిమాలోని డైలాగే.
`”హిట్ క‌థ‌ల్ని కొట్టి బ‌య‌ట‌కు తీశా… దాంతో సినిమా తీసి మిమ్మ‌ల్ని థియేట‌ర్‌లోకి తోశా… టింగ్ టింగ్‌…” అని ఫీలైపోయి. ఈ క‌థ వండేశాడు. ఎలాగో హిట్ ఫార్ములా క‌దా అని గోపీచంద్ ఓకే చెప్పేశాడు. డ్రైవింగ్ రానివాడు ఫెరారీ కాలు జోలికి వెళ్ల‌డం, ఫ్లాపుల్లో ఉన్న‌వాడు ఫార్ములా ని న‌మ్ముకోవ‌డం రెండూ ఒక్క‌టే అని ఈ సినిమా మ‌రోసారి తేల్చేసింది.

ఫినిషింగ్ ట‌చ్‌: ప‌గ ప‌ట్టిన పంతం…

‘పంతం’ : లైవ్ అప్డేట్స్ :

 

 • పబ్లిక్ కి ఒక మంచి సోషల్ మెసేజ్ ఇవ్వడంతో సినిమా పూర్తి అయింది….అయితే పూర్తి రివ్యూ కోసం చూస్తూనే వుండండి telugunow.com

 • సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది….ప్రస్తుతం లంచగొండితనం, లంచగొండి రాజకీయనాకులకు సంబంధించి గోపిచంద్ చెప్పే కొన్ని డైలాగులతో కూడిన సన్నివేశం జరుగుతోంది

 • విలన్ గ్యాంగ్ కోర్ట్ లోనే గోపీచంద్ ని చంపడానికి ప్లాన్ చేశారు. ఆ పరిస్థితులు ఒక హై ఓల్టేజ్ యాక్షన్ బ్లాక్ కి దారి తీశాయి

 • దొంగిలించిన డబ్బుతో సహా గోపీచంద్ కోర్ట్ కి సరెండర్ అవడానికి సిద్దమయ్యాడు…..ప్రస్తుతం కొన్ని క్లిష్టమైన కోర్ట్ సన్నివేశాలు వస్తున్నాయి

 • మళ్ళి మెహ్రీన్ స్క్రీన్ పై కనిపించింది….ప్రస్తుతం ‘నిన్ను చూసి’ అనే మెలోడీ సాంగ్ వస్తోంది

 • హీరో చేస్తున్న దొంగతనాల వెనకున్న అసలు కారణం రివీల్ అయింది….. ప్రస్తుతం ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి..

 • కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది….. హీరో ఐడెంటిటీ బయటపడింది

 • హీరో గ్యాంగ్ లోని ముఖ్యమైన వారిని సంపత్ గ్యాంగ్ పట్టుకుంది… హీరో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు…. ఆ సన్నివేశాలు ఒక స్టైలిష్ ఫైట్ కి దారి తీశాయి

 • మెల్లగా సన్నివేశాలు రొమాంటిక్ మూడ్ లోకి మారాయి… ప్రస్తుతం యూరప్ లో అందమైన లొకేషన్లో తీసిన ‘ఫస్ట్ టైం’ అనే సాంగ్ వస్తోంది.

 • ఫన్నీ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ ప్రారంభమయింది… ప్రస్తుతం హీరోకి, జేపీకి మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి

 • ఫస్ట్ హాఫ్ అప్ డేట్ : సినిమా చాలావరకు ఎంటర్టైన్మెంట్ తో సాగింది..గోపీచంద్, శ్రీనివాస రెడ్డి, మరియు పృద్విల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి…..కాగా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి

 • హీరోకి, సంపత్ గ్యాంగ్ మెంబెర్స్ కి మధ్య జరిగే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తర్వాత సినిమా సగం పూర్తి అయింది… ప్రస్తుతం బ్రేక్ టైం

 • కొన్ని ట్రయల్స్ తర్వాత చివరికి హీరోయిన్ హీరోని ఇంప్రెస్ చేసింది…ప్రస్తుతం వారిమధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి

 • గోపీచంద్ సహాయకుడిగా సీనియర్ యాక్టర్ తనికెళ్ళ భరణి ఇప్పుడే సీన్ లో జాయిన్ అయ్యారు….ప్రస్తుతం వారిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్న సన్నివేశాలు వస్తున్నాయి

 • మొత్తానికి హీరోయిన్ హీరోని కలుసుకుంది… ప్రస్తుతం వారిద్దరి మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి

 • షాయాజీ షిండే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా ఇప్పుడే ఎంటర్ అయ్యారు… ఆయన దొంగతనం కేసుని విచారణ చేస్తున్నారు

 • గుడిలో చూసిన వెంటనే మొదటి చూపులోనే హీరోని ప్రేమించిన హీరోయిన్, అతనికోసం గుడిలో వెతుకుతోంది…. ఆ సన్నివేశం మొత్తం మరొక అద్భుత సాంగ్ ‘రైట్ నౌ’ కి దారి తీసింది

 • హోమ్ మినిస్టర్ గా నటుడు సంపత్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు… ఆయనకు సంబందించిన కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి

 • ఒక పెద్ద దొంగతనం చేసేలా హీరో ప్లాన్ చేస్తున్నాడు… ఆ పరిస్థితి ఒక ఫైట్ కి దారి తీసింది…ప్రస్తుతం కొందరు అండర్ వరల్డ్ డాన్ యొక్క గ్యాంగ్

 • హీరోయిన్ మెహ్రీన్ ఇప్పుడే గుడిలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది…సాంప్రదాయ దుస్తుల్లో ఆమె చాలా అందంగా వుంది…

 • కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి ఇప్పుడే స్కీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు…. గోపీచంద్, పృథ్వి, శ్రీనివాస రెడ్డి ల మధ్య ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి

 • కొన్ని పరిచయ సన్నివేశాలతర్వాత మొదటి పాట ‘దేశమంటే’ వస్తోంది. జానపదం, మోడరన్ స్టైల్ ను మిక్స్ చేస్తూ హీరో క్యారక్టరైజెషన్ తెలుపుతూ పాట సాగుతోంది

 • ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది….ఇప్పుడే హీరో గోపీచంద్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్స్ శ్రీనివాస రెడ్డి, జయప్రకాశ్ రెడ్డిలు కూడా సీన్లో జాయిన్ అయ్యారు

 • ప్రస్తుతం లంచగొండితనం, బ్లాక్ మనీ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

 • హాయ్.. 145 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.

 

  పంతం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపిచంద్, మెహ్రీన్, సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, ప్రిథ్వి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ, హంస నందిని, జయప్రకాష్ రెడ్డి, సయాజి షిండే, అజై, బద్రం, జీవా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె చక్రవర్తి వహించారు మరియు నిర్మాత రాధా మోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు. మాస్ హీరో గోపీచంద్ గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ‘పంతం’ అంటూ మన ముందుకొస్తున్నాడు. ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించగా.. సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త డైరెక్టర్ కె. చక్రవర్తి గోపీచంద్‌కి హిట్ అందించాడో లేదనే విషయమై ఆడియెన్స్ టాక్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా గ్రిప్పింగ్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గని యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. గోపీచంద్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందంటున్నారు. ఇతరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారని టాక్. ‘పంతం’ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా అని, గోపీచంద్‌ మళ్లీ హిట్ పట్టలెక్కినట్టేనని టాక్ నడుస్తోంది. ప్రీమియర్ షోలు చూసిన వాళ్లలో చాలా మంది సినిమా హిట్ అని అంటున్నారు. గోపీచంద్ గత చిత్రాలకు భిన్నంగా పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘పంతం’ ప్రీమియర్ షోలను అమెరికాలో ఇప్పటికే ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసిన వారు గోపీచంద్ 25వ సినిమాతో హిట్ కొట్టినట్టే అని చెబుతున్నారు. లంచం అవినీతి కుంభ‌కోణాలు వీటిపై హీరోలు స్పీచులివ్వ‌డం… అవి చూసి జ‌నాలు చొక్కాలు చించుకోవ‌డం ‘అరె.. ఏం చెప్పాడ్రా’ అంటూ ఊగిపోవ‌డం.. ఈ రోజుల‌న్నీ పోయాయి. ఎందుకంటే ఇవ‌న్నీ అరిగిపోయిన క్యాసెట్లు. ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’ రోజులు కావు.. విన‌గానే షాక్ అయిపోవ‌డానికి, చ‌ప్ప‌ట్లు కొట్టేయ‌డానికి. ఓ విధంగా ‘ఠాగూర్‌’తోనే జ‌నాలు వెక్స్ అయిపోయారు. మ‌ళ్లీ అదే పాయింటు ప‌ట్టుకోవ‌డానికి గ‌ట్స్ ఉండాలి. పాత సినిమాల ఛాయ‌లు క‌నిపించ‌కుండా, ఏదో ఓ మ్యాజిక్ చూపించాలి. ‘కిక్‌’ది అదే స్టోరీ. కాక‌పోతే.. ఎక్క‌డా ద‌ర్శ‌కుడు దొర‌క‌లేదు. ర‌వితేజ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో మ్యాజిక్ చేసేశాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు గోపీచంద్ ‘పంతం’ అనే క‌థ ప‌ట్టుకొచ్చాడు. ఇది కూడా సోకాల్డ్ జెంటిల్‌మెన్ టూ కిక్ సినిమాల వ‌ర‌కూ న‌డిచిన పాత క‌థే. ఉన్న‌వాడి ద‌గ్గ‌ర కొట్టు.. లేని వాడికి పంచి పెట్టు కాన్సెప్టే. మ‌రి… ‘కిక్‌’లా ఏదో ఓ మ్యాజిక్ తోడైందా? ఈ సినిమాని నిల‌బెట్టిందా? ఎన్నో సినిమాల నుంచి విజ‌యం కోసం మొహం వాచిపోయిన గోపీచంద్‌కి త‌న 25వ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇచ్చింది? క‌థ‌ ”చెప్పుకోవ‌డానికి ఇదేం కొత్త క‌థ కాదు సార్‌.. దేశం పుట్టిన‌ప్ప‌టి నుంచీ మ‌నం చెప్పుకుంటున్న క‌థే”క్లైమాక్స్ సీన్‌లో.. కోర్టులో.. న్యాయ‌మూర్తి ముందు గోపీచంద్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ చెప్ప‌డానికి గోపీచంద్ అంత సేపు ఆగాడు కానీ, సినిమా మొద‌లైన పావు గంట‌కే ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. ఇదేం కొత్త క‌థ కాదు.. సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచీ చూస్తున్న‌దే అని. హొం మినిస్ట‌ర్‌ని టార్గెట్ చేయ‌డం, తాను ఎక్క‌డెక్క‌డో దాచుకున్న డ‌బ్బుని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం, దాన్ని ఓ ట్ర‌స్ట్‌కి అందింవ్వ‌డం ఇదీ హీరో చేసే ప‌ని. మ‌ధ్య‌లో అక్ష‌ర (మెహ‌రీన్‌)తో ఓ ప్రేమ క‌థ కూడా న‌డుపుతుంటాడు. అస‌లు హోం మినిస్ట‌ర్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ దోపిడీ వెనుక క‌థానాయ‌కుడి పంతం, ల‌క్ష్యం ఏమిట‌న్న‌దే సినిమా స్టోరీ. విశ్లేష‌ణ‌ జెంటిల్‌మెన్‌.. ఎప్ప‌టి సినిమా..? అందులో శంక‌ర్ ఏం చెప్పాడు? ఉన్న‌వాళ్ల ద‌గ్గ‌ర నుంచి దోచుకుని లేనివాళ్ల‌కు పెట్ట‌డంలో త‌ప్పు లేద‌న్నాడు. మంచి పాయింటే. అందుకే… దాని చుట్టూ ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ అన్నీ జెంటిల్‌మెన్‌లు కావుగా.! `పంతం` క‌థ‌, దాన్ని న‌డిపిన తీరు, నేప‌థ్యం.. వీటిని చూస్తే ద‌ర్శ‌కుడి ల‌క్ష్యం చాలా పెద్ద‌దిగానే క‌నిపిస్తుంది. ఈసారి `ఎక్స్‌గ్రేషియా` అనే పాయింట్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్‌పెట్టాడు. ప్ర‌మాదాల వ‌ల్ల గాయ‌ప‌డిన‌, మ‌ర‌ణించిన వాళ్ల‌కు సహాయం అందాలంటే.. ఫైళ్ల‌పై సంత‌కాలు జ‌రగాలి. అలా జ‌ర‌గాలంటే.. అధికారుల చేతులు త‌డ‌పాలి. లంచం లేనిదే అక్క‌డ ఏ ప‌నీ జ‌ర‌గ‌డం లేదు. ఆ లంచాలు ఇవ్వ‌లేక‌… చాలా కుటుంబాలు ప్ర‌భుత్వ స‌హాయం కోసం ఎదురుచూస్తూ.. ఎదురు చూస్తూ.. గ‌డిపేస్తున్నాయి. నిజానికి మంచి పాయింటే ఇది. కానీ.. దాన్ని డీల్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడి సామర్థ్యం ఏమాత్రం స‌రిపోలేదు. అస‌లు త‌ప్పు ఎక్క‌డ జరుగుతోంది? ఈ త‌ప్పుకు ప్ర‌ధాన కార‌కులు ఎవ‌రు? అనే విష‌యాల‌పై రీసెర్చ్ జ‌ర‌గ‌లేదు. అన్నీ పైపై స‌న్నివేశాలే. గ‌వ‌ర్న‌మెంటు ఆఫీసులో స‌హాయం కోసం వెళ్లిన ఓ వృథ్ధ జంట‌కు…

పంతం రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 3.25
సాంకేతికవిభాగం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 2.75

2.9

పంతం రివ్యూ

పంతం రివ్యూ రేటింగ్

User Rating: 3.45 ( 4 votes)
3