ప్రేమించాలి రివ్యూ

0preminchaliసినిమా : ప్రేమించాలి
నటినటులు : సంతోష్, మనీషా యాదవ్…..
దర్శకత్వం : సుశీంధ్రన్
నిర్మాతలు : సురేష్ కొండేటి
సంగీతం: యువన్ శంకర్ రాజా
విడుదల తేది : 27 ఫిబ్రవరి 2014

గతంలో ‘ప్రేమిస్తే’, ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’ లాంటి సినిమాలను అందించిన సురేష్ కొండేటి గత సంవత్సరంలో తమిళంలో హిట్ అయిన ‘అదలాల్ కాదల్ సేవియర్’ సినిమాని ‘ప్రేమించాలి’ పేరుతో డబ్బింగ్ చేసారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించారు. సుశీంధ్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. యూత్ ని ఆకట్టుకునే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓపెన్ చేస్తే విశాఖపట్నం కాలేజ్.. అందులో ఒక గ్రూప్ ఫ్రెండ్స్.. ఆ గ్రూప్ లోని కార్తీక్(సంతోష్) అదే గ్రూప్ లోని శ్వేత(మనీషా యాదవ్) ని ప్రేమిస్తాడు. ఒకరోజు కార్తీక్ తన ప్రేమని శ్వేతకి చెబుతాడు. కామన్ గా మొదట నో అన్న శ్వేత ఆ తర్వాత కార్తీక్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అందరిలానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. వాళ్ళ కోరికలని కంట్రోల్ చేసుకోక చెయ్యకూడని తప్పు చేయడం వల్ల శ్వేతకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కట్ చేస్తే ఆ విషయం పెద్ద వాళ్ళకి తెలుస్తుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరిగింది? ఆ విషయం తెలుసుకున్న తర్వాత కార్తీక్, శ్వేతల తల్లి తండ్రులు ఏం చేసారు? చివరికి కార్తీక్ – శ్వేత కలిసారా? విడిపోయారా? అనేది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో ముందుగా ఈ మూవీ ద్వారా యువతని లాగిపెట్టి కొట్టినట్టు ఉండే ఓ సందేశాన్ని చెప్పాలనుకున్న డైరెక్టర్ సుశీంధ్రన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. లాగిపెట్టి కొట్టినట్టు ఉండే మెసేజ్ ని కూడా ఆలోజింపజేసేలా చెప్పడం సినిమాకి ప్రధాన హైలైట్. సినిమా క్లైమాక్స్ 15 నిమిషాలు చాలా ఆసక్తి కరంగా, మిమ్మల్ని ఆలోచనలో పడేసే విధంగా ఉంటుంది.

అలాగే సెకండాఫ్ లో రియలిస్టిక్ గా ఉండే కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా యూత్ కి నచ్చే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్ మనీషా యాదవ్ పరవాలేదనిపించింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ హీరో సంతోష్.. అతని లుక్ తమిళ ప్రేక్షకులకి సెట్ అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం చూడలేరు. అలాగే అతని నటన కూడా బాలేదు. అతని బదులు వేరే ఎవరన్నా అయి ఉంటే సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండేది. అలాగే సినిమాలో మొత్తం తమిళ నటీనటులే ఉండడం వల్ల వాళ్ళకి తెలుగు ఆడియన్స్ తొందరగా కనెక్ట్ కాలేరు. ఎక్కడో మచ్చుకి ఒకటో రెండో తప్ప సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది లేదు.

ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా కాలేజ్ స్టొరీ, లవ్ ట్రాక్ నడుస్తుంది. మొదటి నుంచి ఇంటర్వెల్ ముందు వరకు బోరింగ్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల దాదాపు ఒక్క క్లైమాక్స్ సీన్ తప్ప మిగతా అన్ని ట్విస్ట్ లను ఊహించేయవచ్చు. సురేష్ కొండేటి ఈ సినిమాకి ఎంచుకున్న టైటిల్ ఈ సినిమా కంటెంట్ కి అస్సలు సెట్ అవ్వదు. కొంతమంది నటీనటులకు డబ్బింగ్ వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పాల్సింది యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గురించి, తెలుగులోకి అనువదించిన రెండు పాటలు బాగున్నాయి. అలాగే యువన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ రొటీన్ గా అనిపించే కొన్ని సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది.

ఇక డైరెక్టర్ సుశీంధ్రన్ సినిమాల్లో కథ కంటే ఏదో ఒక పాయింట్ ని తీసుకొని దానికి ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే అల్లుకొని సినిమా చేస్తాడు. ఈ సినిమా విషయంలో అతను అనుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో కొంత వరకూ ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కేర్ తీసుకోవాల్సింది. ఇక డైరెక్టర్ గా కాస్త మంచి నటీనటుల్ని సెలక్ట్ చేసుకొని ఉండాల్సింది. డైరెక్టర్ గా అతని చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యేలా చెప్పినందుకు అతన్ని మెచ్చుకోవాలి.

తీర్పు :

‘ప్రేమించాలి’ సినిమా ప్రేమకథ లాంటిది కానీ పూర్తి ప్రేమ కథా చిత్రం మాత్రం కాదు. అందుకే ఈ సినిమాని లవ్ ఎంటర్టైనర్ అనడం కంటే ఒక యూత్ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీ ద్వారా కామం మత్తులో ప్రేమ అనే పదాన్ని వాడుకొని పెడదారి పడుతున్న యువత తమ హద్దుల్లో ఉండాలని, అలా ఉండకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని, అలాగే తల్లి తండులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎమోషనల్ గా సాగే సెకండాఫ్, ఆకట్టుకునే క్లైమాక్స్ ఈ చినెఅమకి ప్లస్ అయితే రొటీన్ గా అనిపించే ఫస్ట్ హాఫ్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్. ఈ సినిమాకి వచ్చిన యువతని లాగిపెట్టి కొట్టినట్టు ఉండే ఈ