రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

0Rarandoi-Veduka-Chudham-Reviewనటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్

విడుదల తేదీ : మే 26, 2017

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల

నిర్మాత : నాగార్జున అక్కినేని

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

టైమ్స్ ఆఫ్ ఏపి.కామ్ రేటింగ్ : 2.75/5

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు తర్వాత నాగ చైతన్య, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొన్నాయి. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అందరి కుటుంబ సభ్యుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్). భ్రమరాంబ అంటే ఆమె తండ్రి ఆది (సంపత్) కి పంచ ప్రాణాలు. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అలా మహారాణిలా ఉండే భ్రమరాంభను తన కజిన్ పెళ్లి వేడుకలో చూసి ప్రేమిస్తాడు శివ (నాగ చైతన్య).

ఇంతలో భ్రమరాంబ కూడా శివ ఉండే వైజాగ్ కు చదువుకోడానికి వచ్చి శివకు దగ్గరవుతుంది. అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి ప్రేమను భ్రమరాంబ తండ్రి తనకు, శివ నాన్నకు ఉన్న పాత పగల కారణంగా ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి, శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి ? ఈ పగల మధ్య శివ, భ్రమరాంభల ప్రేమ ఏమైంది ? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్ అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు బాగున్నాయి. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ఒక చిన్న, మంచి ట్విస్టును ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు.

ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని భాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా, ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. నాగచైతన్యకు, జగపతి బాబుకు మధ్య తండ్రీ కొడుకుల సంబంధం, సంపత్ కు, రకుల్ ప్రీత్ సింగ్ ల నడుమ తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని కాస్త బలంగానే రాశారు. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, దేవి శ్రీ పాటలు విజువల్స్ పరంగా ఊహించిన స్థాయిలో లేకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది.

ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండాఫ్లో ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా కాస్త సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది. సినిమా కథ. కథనాలు కూడా ‘నిన్నేపెళ్లాడుతా, పండగ చేస్కో’ వంటి సినిమాల్ని తలపించాయి. ఇక రిలీజ్ కు ముందు ఆడియో విని పిక్చరైజేషన్ మీద పెట్టుకున్న ఆశలు కళ్యాణ్ కృష్ణ పేలవమైన టేకింగ్ తో చాలా వరకు గల్లంతయ్యాయి.

సాంకేతిక విభాగం :

ఇక రచయిత, దర్శకుడు అయిన కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమాతో చేసినంత మ్యాజిక్ ఈ చేయలేకపోయారు. కాస్త రొటీన్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్న అయన హీరోయిన్ రకుల్ ప్రీత్ పాత్రను, కొన్ని ఎమోషనల్ సన్ని వేశాల్ని రూపొందించడం, మంచి డైలాగులు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళ ట్రాక్స్ బాగానే రాశారు కానీ అన్నింటికన్నా ముఖ్యమైన కథనం, టేకింగ్ విషయయంలో మాత్రం పెద్దగా రాణించలేదు.

దేవిశ్రీ ప్రసాద్ పాటలు వినడానికి బాగున్నా వాటిని అందంగా తెరకెక్కించడంలో కళ్యాణ్ కృష్ణ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. కెమెరా పనితనం కలర్ ఫుల్ గా బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే మొదటి భాగంలో ఇంకొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అన్నపూర్ణ స్టూడియోస్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి.

తీర్పు:

కళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చేదిగానే ఉన్నా భారీ స్థాయి అంచనాలు పెట్టుకున్న అక్కినేని అభిమానుల్ని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. రకుల్ ప్రీత్ పాత్ర చిత్రీకరణ, హీరో హీరోయిన్ల ఎమోషనల్ లవ్ ట్రాక్, కొన్ని పాటలు, డైలాగులు, సెకండాఫ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా నిదానంగా సాగే మొదటి అర్ధ భాగం పెద్దగా కొత్తదనమేమీ కనిపించని రొటీన్ కథా కథనాలు ఇందులో నిరుత్సాహపరిచే అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా సరదాగా ఫ్యామిలీతో చూసే వాళ్ళకి ఈ చిత్రం నచ్చుతుంది.

నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ విడుదల తేదీ : మే 26, 2017 దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాత : నాగార్జున అక్కినేని సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ టైమ్స్ ఆఫ్ ఏపి.కామ్ రేటింగ్ : 2.75/5 అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలు తర్వాత నాగ చైతన్య, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొన్నాయి. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం… కథ : అందరి కుటుంబ సభ్యుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్). భ్రమరాంబ అంటే ఆమె తండ్రి ఆది (సంపత్) కి పంచ ప్రాణాలు. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అలా మహారాణిలా ఉండే భ్రమరాంభను తన కజిన్ పెళ్లి వేడుకలో చూసి ప్రేమిస్తాడు శివ (నాగ చైతన్య). ఇంతలో భ్రమరాంబ కూడా శివ ఉండే వైజాగ్ కు చదువుకోడానికి వచ్చి శివకు దగ్గరవుతుంది. అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి ప్రేమను భ్రమరాంబ తండ్రి తనకు, శివ నాన్నకు ఉన్న పాత పగల కారణంగా ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి, శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి ? ఈ పగల మధ్య శివ, భ్రమరాంభల ప్రేమ ఏమైంది ? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు ? అనేదే ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్ : దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్ అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు బాగున్నాయి. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ఒక చిన్న, మంచి ట్విస్టును ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని భాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా, ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. నాగచైతన్యకు, జగపతి బాబుకు మధ్య తండ్రీ కొడుకుల సంబంధం, సంపత్ కు, రకుల్ ప్రీత్ సింగ్ ల నడుమ తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని కాస్త బలంగానే రాశారు. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, దేవి శ్రీ పాటలు విజువల్స్ పరంగా ఊహించిన స్థాయిలో లేకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్ : సినిమా ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండాఫ్లో ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా కాస్త సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది. సినిమా కథ. కథనాలు కూడా ‘నిన్నేపెళ్లాడుతా, పండగ చేస్కో’ వంటి సినిమాల్ని తలపించాయి. ఇక రిలీజ్ కు ముందు ఆడియో విని పిక్చరైజేషన్ మీద పెట్టుకున్న ఆశలు కళ్యాణ్ కృష్ణ పేలవమైన టేకింగ్ తో చాలా వరకు గల్లంతయ్యాయి. సాంకేతిక విభాగం : ఇక రచయిత, దర్శకుడు అయిన కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమాతో చేసినంత మ్యాజిక్ ఈ చేయలేకపోయారు. కాస్త రొటీన్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్న అయన హీరోయిన్ రకుల్ ప్రీత్ పాత్రను, కొన్ని ఎమోషనల్ సన్ని వేశాల్ని రూపొందించడం, మంచి డైలాగులు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళ ట్రాక్స్ బాగానే రాశారు కానీ అన్నింటికన్నా ముఖ్యమైన కథనం, టేకింగ్ విషయయంలో మాత్రం పెద్దగా రాణించలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు వినడానికి బాగున్నా వాటిని అందంగా తెరకెక్కించడంలో కళ్యాణ్ కృష్ణ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. కెమెరా పనితనం కలర్ ఫుల్ గా బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే…

రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 3.25
సాంకేతికవిభాగం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 2.75

2.9

రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

User Rating: 2.8 ( 1 votes)
3