రుద్రమదేవి రివ్యూ

0allu-arjun-rudhramadevi-photos-04

సినిమా: రుద్ర‌మ‌దేవి
న‌టీన‌టులు: అనుష్క (టైటిల్ రోల్‌) అల్లు అర్జున్‌, ద‌గ్గుబాటి రానా, ప్ర‌కాష్ రాజ్‌, కృష్ణంరాజు, హంసా నందిని, నిత్యామీన‌న్‌, కేథ‌రిన్ థెస్రా త‌దిత‌రులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తి
ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌
ఆర్ట్‌: తోట త‌ర‌ణి
ఫైట్స్‌: పీట‌ర్ హెయిన్స్‌/ విజ‌య‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: అజ‌య్‌విన్సెంట్‌
ఎడిటింగ్‌: శ‌్రీక‌ర‌ప్ర‌సాద్‌
సంగీతం: ఇళ‌య‌రాజా
స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీమతి రాగిణి
ద‌ర్శ‌క‌త్వం: గుణ‌శేఖ‌ర్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 158 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 09 అక్టోబ‌ర్‌, 2015

రుద్రమదేవి రివ్యూ:

కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించి, ప్రజల చేత మన్ననలు పొంది, కాకతీయ వంశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టతలు తెచ్చి పెట్టిన వీరణారి రుద్రమదేవి జీవిత కథాంశంతో తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ‘ది వారియర్ క్వీన్’ అనేది ఉపశీర్షిక. ఇండియాలోనే మొట్ట మొదటి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ డైరెక్టర్. అనుష్క మెయిల్ లీడ్ గా నటించగా రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు, కేథరిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హిస్టారికల్ కథని ఎంత మేరకు ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాడన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఓరుగల్లు(ఇప్పటి వరంగల్)ని కాకతీయ రాజ్య పీఠంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా 63 ఏళ్ళు పరిపాలించిన రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు). ఆయనకి వారసులు లేరు. ఆయన చివరి సంతానం కూడా ఆడబిడ్డే పుడుతుంది. కానీ తనకి వారసుడు పుట్టలేదు అని తెలిస్తే దేవగిరి రాజైన సింగన్న(రాజ మురాద్) దండెత్తి వస్తాడని, అలాగే తన దాయాదుల వల్లే తమకు ముప్పు పొంచి ఉన్నదని గణపతి దేవుడు బాధపడుతున్న తరుణంలో మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచి, తమకు పుట్టింది మగ పిల్లాడే, అని తనకి రుద్రమదేవి అనే నామకరణం చేసినా రుద్రదేవ యువరాజుగా ప్రజలకి పరిచయం చేస్తాడు. అనుకున్నట్టుగానే కుమార్తెను ఒక రాజుని తయారు చేసినట్టే సకల విద్యల్లోనూ శిక్షణ ఇప్పిస్తాడు. రుద్రదేవ కూడా అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. అప్పుడే యువరాజుగా పట్టాభిశాక్తుల్ని చేస్తారు.

ఇదిలా ఉండగా గణపతిదేవుడు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్). మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు రుద్రవీరని చంపి కాకతీయ సింహాసనాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, మరోవైపు దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) కూడా కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి వ్యూహాలు రచిస్తుంటాడు. అదే తరుణంలో బంధిపోటుగా పేరు తెచ్చుకున్న గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్ర వీరతో పోరు కోసం సిద్దంగా ఉంటాడు. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రుద్రవీర ఏం చేసింది.? రుద్రవీర యువరాజు మగ కాదు,ఆడ అని తెలిసిన తర్వాత కాకతీయ ప్రజలు ఏం చేసారు.? అలా చేయడం వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? ఆ ఇబ్బందుల నుంచి ప్రజలని కాపాడి, మహాదేవ నాయకుడి నుంచి కాకతీయ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.? అసలు రుద్రవీరకి బాల్య మిత్రుడైన గోనగన్నారెడ్డి రుద్రమదేవికి ఎందుకు ఎదురెళ్ళాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

రుద్రమదేవి జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. అలానే రుద్రమదేవి సినిమాకి కూడా హైలైట్ గా నిలిచే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ముందుగా ఆ బ్లాక్స్ గురించి చెప్పుకుంటే.. రుద్రమదేవి చిన్ననాటి ఎపిసోడ్ తో పాటు, అనుష్క ఇంట్రడక్షన్ సీన్ అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ఆ తర్వాత అనుష్క పై ఓ ముఠా దాడి చేసినప్పుడు అక్కడ అనుష్క చేసే వీరోచిత పోరాటం బాగుంది. ఆ ఫైట్ లో అనుష్క కత్తితిప్పుడు సూపర్బ్. వీటికంటే మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారిగా థియేటర్లోని ఆడియన్స్ లో ఓ సరికొత్త ఎనర్జీ జెనరేట్ అవుతుంది. ఈ సీన్ లో ఇంటెన్స్ తో పాటు డైలాగ్స్ లో కావలసినంత వెటకారం, కామెడీ కూడా ఉంటాయి. అందుకే ఈ సీన్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్ లో చూపే సర్ప వ్యూహం – గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి.

ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్నారు.. సో సినిమాకి హైలైట్ గా నిలిచిన నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే.. ముందుగా ఇలాంటి ఓ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించడమే కాకుండా ఈ సినిమా కోసం రెండేళ్ళు టైం కేటాయించిన అనుష్కకి హ్యాట్సాఫ్. అనుష్క వారియర్ లా, ఒక మెచ్యూర్ యువరాణిలా బాగా చేసింది. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో కత్తి తిప్పడం, రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలకు దీటుగా నిలిచింది. ఇక అంతఃపురంలో రాణిగా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇక అనుష్క కంటే మించి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది గోనగన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్. బన్ని లుక్ అండ్ తెలంగాణా యాసలో బన్ని చెప్పిన డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. ‘గమ్మునుండవో..’ అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ కూడా అవుతుంది. తన ఇంటెన్స్ యాక్షన్ రోల్ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. రుద్రమదేవి అనే సినిమాకి అనుష్క – అల్లు అర్జున్ లు రెండు కళ్ళు లాంటివారు. ఇక రానా యువరాజు పాత్రలో బాగా చేసాడు. మంత్రిగా ప్రకాష్ రాజ్, రాజుగా కృష్ణంరాజులు తమ పాత్రలకి న్యాయం చేస్తే సుమన్, ఆదిత్య మీనన్, విక్రంజీత్ లు నెగటివ్ షేడ్స్ ని బాగా చేసారు. మిగతా చిన్న చిన్న పాత్రలో చేసిన నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు తెరపై కాస్త గ్లామర్ ని ఒలకబోశారు.

ఇక సినిమా పరంగా చూసుకుంటే.. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన సెట్స్ మనకు 13వ శతాబ్దంని గుర్తు చేస్తాయి. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 7 కోట గోడల నిర్మాణం, చివరి వార్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కథలో బాగంగా వచ్చే కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభం ముందే ఈ రియల్ లైఫ్ కథలో ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే క్షమించాలి అని వేసారు కాబట్టి కథ గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ కథలో రియాలిటీ కంటే సినిమాటిక్ కల్పిత అంశాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే సినిమాకి రాసుకున్న కథనం బాలేదు. ఎందుకు అంటే చెబుతున్నది రియల్ గా జరిగిందే అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా రెగ్యులర్ వేలో రాసారు. దాని వలన అన్ని పాత్రల పరిచయాల తర్వాత రుద్రమదేవి కథలో ఏం జరుగుతుందా అనేది తెలిసిపోతుంది. దాంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలియని ఓ కథని చెబుతున్నప్పుడు అందులో ఎన్నో కొన్ని థ్రిల్స్ ఉండాలి. కానీ ఇందులో థ్రిల్స్ అనేవి లేవు. రుద్రమదేవి కథ మొత్తానికి ఒకే ఒక్క ట్విస్ట్ ని రాసుకున్నారు, ఆ ట్విస్ట్ ఆడియన్స్ ఊహించదగినదే కావడం వలన చివర్లో పెద్ద కిక్ ఏమీ ఉండదు. ఇక నేరేషన్ కూడా అంతే స్లోగా సాగడం, ముఖ్యంగా సెకండాఫ్ లో అయితే ఉన్న మూడ్ ని మరింత తగ్గించేలా నేరేషన్ ఉంటుంది. సెకండాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.

సెకండాఫ్ లో సూపర్ అని చెప్పుకునేలా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం. సన్నివేశాలే బోర్ కొడుతున్నాయి అంటే.. మధ్య మధ్యలో వరుసగా పాటలు వచ్చి సినిమా వేగాన్ని ఇంకా కిందకి పడేస్తాయి. సో పాటల్ని కట్ చేసేయవచ్చు. ఇకపోతే ఇలాంటి హిస్టారికల్ సినిమాలలో డైరెక్టర్ చేయాల్సిన మేజిక్ చరిత్రలోని పాత్రలని సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు కనెక్ట్ చేసెయ్యాలి. అలానే ఆడియన్స్ లో మనం 13వ శతాబ్దంలో ఉన్నా అనే ఫీలింగ్ ని కలిగించాలి. ఈ రెండింటిలో ఏ ఫీలింగ్ ని క్రియేట్ చేయలేకపోయాడు. ఎక్కడా పాత్రలని 100% ఎలివేట్ చేయలేదు. దాంతో ఒకటి రెండు పాత్రలకు తప్ప మిగతా ఏ పాత్రకి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. దానివల్ల ఆడియన్స్ సినిమాతో కంటిన్యూగా సింక్ అవ్వరు. ఇక సినిమాకి కీలకం కావాల్సిన వార్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఒకటి రెండు ఫార్మేషన్స్ ని బాగానే చూపిన వార్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు గ్లామర్ అట్రాక్షన్ కే తప్ప సినిమాకి పెద్ద ఉపయోగపడని పాత్రలు. వీరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ని కూడా తీసేయవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. ఆయన వేసిన సెట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఆయన కాకతీయ కట్టడాలను కళ్ళకు కట్టినట్లు రూపకల్పన చేసారు. అలాగే సెట్స్ కి కొనసాగింపుగా చేసిన విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అంటే బాగున్నాయి అనేలా ఉన్నాయే తప్ప, ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమాకి ఉండాల్సిన హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇక అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ లో లేదా బయట తీసిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు సినిమాకి హెల్ప్ కాలేదు, అలాగే ఆయన నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. సో మ్యూజిక్ అనేది ఈ సినిమాకి మైనస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత సీనియర్ ఎడిటర్ ఇంత స్లోగా ఉండేలా ఓ ఎపిక్ డ్రామాని ఎడిట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి తరానికి మ్యాచ్ అయ్యేలా నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మాత్రం అందరికీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పీటర్ హెయిన్, విజయ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ జస్ట్ యావరేజ్ అనుకునేలా ఉన్నాయే తప్ప రుద్రమదేవి అనే హిస్టారికల్ సినిమాకి సరిపోయే రేంజ్ లో లేవు. తోట ప్రసాద్ – గుణశేఖర్ – పరుచూరి బ్రదర్స్ కలిసి రానుకున్న డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ కి రాసిన డైలాగ్స్ బాగున్నాయి.

ఇక కథ – కథనం – నిర్మాణం – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది గుణశేఖర్.. కథ – రుద్రమదేవి అనే ఒరిజినల్ కథని తీసుకొని దానికి ఎక్కువ సినిమాటిక్ అంశాలను జత చేసి చివరికి వచ్చేసరికి రెగ్యులర్ స్టొరీ చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. కథనం – అవసరానికి మించిన సాగదీత, స్లో అండ్ రొటీన్. దర్శకత్వం – దర్శకుడిగా ఓ హిస్టారికల్ కథనే ఎంచుకున్నారు బాగుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. ఏ ఒక్క పాత్రని పూర్తిగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. అలాగే చాలా సీన్స్ లో ఇంటెన్స్ ఉన్నా దానిని తెరపైకి తీసుకురాలేకపోయాడు. నిర్మాతగా కూడా ఓ డీసెంట్ విజువల్ ట్రీట్ ఇచ్చాడే తప్ప, ఓ కేవ్వుకేక అనిపించుకునే విజువల్ వండర్ మూవీ అయితే ఇవ్వలేదు.

తీర్పు :

భారతీయ వీరణారిగా చరిత్ర పుటల్లో నిలిచిన రాణీ రుద్రమదేవి జీవిత గాధ ఆధారంగా హిస్టారికల్ ఎపిక్ డ్రామాగా వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకునేలా లేకపోయినా, పరవాలేదు అనిపించుకునేలా మాత్రం ఉంది. కథలో దమ్మున్న సినిమా అయినప్పటికీ కథనం మరియు డైరెక్షన్ కారణాల కారణంగా యావరేజ్ అటెంప్ట్ గా నిలిచిపోవాల్సి వచ్చింది. ఒక హిస్టారికల్ కథని చెబుతున్నప్పుడు ఆ కథని ప్రేక్షకుల మదికి బలంగా తగిలేలా చెప్పాలి కానీ చెప్పలేకపోయారు. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ లు తమ పాత్రల మీద ప్రాణం పెట్టి చేయడం వలన ఆ పాత్రలకు మంచి ఎస్టాబ్లిష్ మెంట్ వచ్చింది, అవే సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యాయి. సినిమాని సాగదీయడం, అనవసరపు సాంగ్స్, ఆకట్టుకోలేకపోయిన వార్ ఎపిసోడ్స్, సెకండాఫ్ బాగా డల్ గా సాగడం లాంటివి సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్ గా అంచనాలను కాస్త తగ్గించుకొని, కాస్త స్లో అయినా పర్లేదు అనుకొని సినిమా చూస్తే డీసెంట్ హిస్టారికల్ ఫిల్మ్ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.

రుద్రమదేవి లైవ్ అప్ డేట్స్:

Updated at 04:31 AM

సినిమా పూర్తైంది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.

Updated at 04:30 AM

ఇప్పుడే క్లైమాక్స్ పూర్తైంది. అల్లు అర్జున్ పాత్ర బలమైన ముద్ర వేసి క్లైమాక్స్‌కు ముగింపు పలికింది.

Updated at 04:27 AM

ఓ భారీ క్లైమాక్స్ ఇప్పుడే మొదలైంది. అనుష్క ఒక ఎమోషనల్ స్పీచ్ ఇస్తోంది.

Updated at 04:21 AM

కథలో ఇప్పుడే ఇంటరెస్టింగ్ పాయింట్ కొత్తగా రివీల్ అయింది. అల్లు అర్జున్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. తన పాత్రలో బన్నీ అద్భుతంగా నటిస్తున్నాడు.

Updated at 04:02 AM

ప్రస్తుతం సినిమా సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఓ భారీ వార్ సీక్వెన్స్‌కు ప్లాన్స్ జరుగుతున్నాయి.

Updated at 03:52 AM

ప్రస్తుతం అనుష్క, నిత్యామీనన్, క్యాథరిన్‌ల నేపథ్యంలో ఓ అందమైన పాట వస్తోంది. సెట్స్ చాలా బాగున్నాయి.

Updated at 03:47 AM

రుద్ర దేవుడు అసలు రూపం రుద్రమదేవి అని తెలిసిపోతుంది ..

Updated at 03:44 AM

ముక్తాంబ గా నిత్యామెనన్ సూపర్బ్ ..  ముక్తాంబ = రుద్రమదేవి మధ్య కొన్ని ఎమోషనల్  సీన్లు వస్తున్నాయి.. సీన్ చాలా బాగుంది

Updated at 03:41 AM

పద్మ వ్యూహం లో దొరకడానికి నేను అభిమన్యుణ్ణి కాదు ,, ఆని అమ్మ మొగుడు శ్రీ కృష్ణ గసన్టోణ్ణి”: గొనగన్నా రెడ్డి

Updated at 03:22 AM

సినిమాలో ఇప్పుడు కొన్ని కామెడీ సీన్లు వస్తున్నాయి.

Updated at 03:17 AM

మురళి (ఆదిత్య)  హరి హర దేవుడు (సుమన్) ఒక్కటౌతారు..వారు పథకానికి మదనిక (హంసనందిని)ని వాడుకుంటారు.

Updated at 03:15 AM

ఇంటర్వెల్ తర్వాత సినిమా రొమాంటిక్ సాంగ్‌తో మొదలైంది. రానా, అనుష్కల మధ్యన ప్రస్తుతం ఓ రొమాంటిక్ సాంగ్ వస్తోంది.

Updated at 03:10 AM

ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ వరకూ సినిమా ఆసక్తికరంగా నడిచింది.

Updated at 03:06 AM

అల్లు అర్జున్, అనుష్కల మధ్యన ఓ ఆసక్తికర ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తోంది.

Updated at 03:03 AM

ప్రస్తుతం అనుష్క, బాబా సెహగల్‌ల మధ్యన ఓ భారీ ఫైట్ వస్తోంది.

Updated at 02:58 AM

సినిమాలో ఓ ఆసక్తికర ట్విస్ట్ వచ్చింది. ఇంటర్వెల్ దిశగా సినిమా వెళుతోంది.

Updated at 02:55 AM

చాళుక్య వీరభద్రుడు (దగ్గుబాటి రానా) ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. చాళుక్యవీరభద్రుడుకి, గోన గన్నారెడ్డికి మద్య సన్నివేశం చాలా బాగుంది

Updated at 02:49 AM

ప్రస్తుతం రెండో సాంగ్ వస్తోంది. ఈ సాంగ్‍లో అనుష్క చాలా అందంగా కనబడుతోంది.

Updated at 02:47 AM

యువరాణులుగా నిత్యా మీనన్(ముక్తాంబ ), కాథరిన్ థ్రెసా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.

Updated at 02:43 AM

జెట్ స్పీడ్‌లో ఒక్కో క్యారెక్టర్ ఎంట్రీ వస్తోంది. రానా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 02:35 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రానే వచ్చాడు.. ఒకప్పుడు కొండవీటి దొంగ లో చిరంజీవి స్టయిల్ లో కనిపించాడు. థియేటర్లో హంగామా మొదలైంది. అల్లు అర్జున్ అభిమాను కేరింతలు, విజిల్స్ మొదలయ్యాయి. 

Updated at 02:30 AM

ప్రస్తుతం అనుష్క ఇంట్రడక్షన్ సాంగ్ వస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. రుద్రమదేవి అనుష్క వాయిస్, ముఖంలో ఎక్స్ ప్రేషన్స్ అన్ని మారిపోయాయి..ఒక మహరాణి హోదాలో అద్భుతంగా కనిపిస్తుంది..కాకతీయ సామ్రాజ్యానికి మహరాణి చాలా బాగా కుదిరింది. 

Updated at 2:20 am :

తెరపైకి రుద్రమదేవి (అనుష్క) వచ్చింది.. ఏనుగుతో తలపడుతుంది.. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా చూపించారు. అనుష్క చాలా అందంగా కనిపిస్తుంది. థియేటర్లో చప్పట్లు.. విజిల్స్ మారు మోగుతుంది. 

Updated at 02:15 AM

సినిమా చాలా ఆసక్తికరమైన సన్నివేశాలతో మొదలైంది. పదేళ్ళ తర్వాత కాలానికి సినిమా షిఫ్ట్ అయింది. నాగదేవులుగా బాబా సెహగల్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 02:05 AM

ఓ యువరాజుగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్ చాలా బాగున్నాయి.

Updated at 01:58 AM

కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. విజువల్స్ చాలా బాగున్నాయి.

Updated at 01:54 AM

కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.

Updated at 01:50 AM

చిరంజీవి వాయిస్ ఓవర్‍తో సినిమా మొదలైంది.

Updated at 01:48 AM

158 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది

*************

 

కాక‌తీయ వీర‌నారి రాణి రుద్ర‌మ‌దేవి జీవిత చ‌రిత్ర ఆధారంగా, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ దాదాపు 9 సంవ‌త్స‌రాలు పాటు రీసెర్చ్ చేసి భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన సినిమా రుద్ర‌మ‌దేవి. దాదాపు రూ.70 కోట్ల భారీ బ‌డ్జెట్‌( వ‌డ్డీల‌తో క‌లుపుకుని రూ.80 కోట్లు) తో తెర‌కెక్కిన రుద్ర‌మ‌దేవికి గుణ‌శేఖ‌ర్ ముందుగా మే28వ తేదీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. అప్ప‌టి నుంచి వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న రుద్ర‌మ ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. గోన గ‌న్నారెడ్డిగా అల్లు అర్జున్‌, చాళుక్య వీర‌భ‌ద్రుడిగా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న ఈసినిమా ఎలా ఉండ‌బోతోందో నేటిసినిమా.కామ్ ప్ర‌త్యేక విశ్లేష‌ణ అందిస్తోంది.

రుద్ర‌మ‌దేవి సింగిల్ స్టోరీ లైన్‌:
13వ శ‌తాబ్దంలో కాక‌తీయ సామ్రాజ్యాన్ని రుద్ర‌మ‌దేవి జీవిత చ‌రిత్ర ఆథారంగా ఈ మూవీ తెర‌కెక్కింది.

రుద్ర‌మ‌దేవి స్టోరీ ఎలా ఉండ‌బోతోంది….
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఉన్న‌వ‌రంగ‌ల్‌ను కేంద్రంగా చేసుకుని కాక‌తీయ సామ్రాజ్యం ఏర్పాటైంది. 13వ శ‌తాబ్దంలో ఈ సామ్రాజ్యాన్ని ప్రతాప‌రుద్రుడు అనే రాజు ప‌రిపాలించాడు. ప్ర‌తాప‌రుద్రుడికి కొడుకులు లేక‌పోవ‌డంతో ఆయ‌న కుమార్తె రుద్ర‌మ‌దేవి రాజ్యాన్ని పాలిస్తుంది. చిన్న‌త‌నంలోనే ఆమె అస‌మాన ధైర్య స‌హాసాలు ప్ర‌ద‌ర్శిస్తుంది. వ‌రంగ‌ల్ రాజ్యాన్ని పెను ముప్పుగా మారిన ద‌క్క‌న్‌, ముస్లిం రాజుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెత్తిస్తుంది. ఆమె ధైర్య సాహ‌సాల గురించి విన్న ఢిల్లీ సుల్తాన్‌లు సైతం వ‌రంగ‌ల్ మీద దాడి చేసేందుకు సాహ‌సించ‌రు. ఆమె నిడ‌ద‌వోలు సామ్రాజ్యాన్ని పాలించే చాళుక్య వీర‌భ‌ద్రుడు (రానా)ను వివాహం చేసుకుంటుంది. రుద్ర‌మ పాల‌న‌లో బందిపోటు నాయ‌కుడు గోన గ‌న్నారెడ్డి (అల్లు అర్జున్‌) ఆమెకు పెద్ద స‌వాల్‌గా మార‌తాడు. కాక‌తీయ సామ్రాజ్యం కోసం త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి రుద్ర‌మ ఎలాంటి పోరాటాలు చేసింది ? చివ‌ర‌కు ఆమె జీవితం ఏమైంది ? అన్న అంశాలు థియేట‌ర్లో చూసి తెలుసుకోవాలి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌:
ఈ సినిమాలో అనుష్క రుద్ర‌మ‌దేవి టైటిల్ రోల్ పోషించింది. దాదాపు మూడు సంవ‌త్స‌రాల పాటు ఆమె ఈ పాత్ర‌కోసం క‌ష్ట‌ప‌డింది. రుద్ర‌మ‌దేవిగా క‌నిపించేందుకు ఆమె ఆహార్యం, లుక్‌ను మార్చుకునేందుకు అనుష్క చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇక రాబిన్‌హుడ్ లాంటి గోన గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్‌లాగా స్టైలీష్‌స్టార్ బ‌న్ని క్యారెక్ట‌ర్ ఉండ‌నుంది. ఓవ‌రాల్‌గా బ‌న్ని క్యారెక్ట‌ర్ సినిమాలో 50 నిమిషాల పాటు ఉండ‌నుంది. ఈ క్యారెక్ట‌ర్ సినిమాకే హైలెట్‌గా నిల‌వ‌నుంది. ఇక చాళుక్యుల రాజుగా రానా కూడా త‌న‌దైన శైలీలో రౌద్ర ర‌సంతో రెచ్చిపోయిన‌ట్టు ట్రైల‌ర్ల ద్వారా తెలుస్తోంది. మ‌హామంత్రిగా ప్ర‌కాష్‌రాజ్ న‌టించ‌గా…రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు కీల‌క‌పాత్ర‌లో నటించారు. రాణి రుద్ర‌మ చెలిక‌త్తెలుగా నిత్యామీన‌న్‌, హంసానందిని న‌టించారు. ఓవ‌రాల్‌గా భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న ఈసినిమాకు ఆర్టిస్టులు కొండ‌త‌బ‌లం కానున్నారు. ఇక రుద్ర‌మ‌దేవి-రానా మ‌ధ్య వ‌చ్చే శృంగార స‌న్నివేశాలను గుణ‌శేఖ‌ర్ బాగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్‌లో ఆ ముగ్గురే కీల‌కం:
రుద్ర‌మ‌దేవి సినిమాకు ప‌నిచేసిన సాంకేతిక నిపుణుల్లో ముగ్గురిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. తోట త‌ర‌ణి ఆర్ట్ వ‌ర్క్ చూస్తుంటే క‌ళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంది. భారీ సెట్టింగులు, కోట‌లు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈ సినిమా కోసం తోట త‌ర‌ణి కూడా రెండు సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డిస్కెచ్‌లు వేయ‌డం విశేషం. తోట కాక‌తీయరాజుల జీవిత చ‌రిత్ర‌లు చ‌దివి ఎంతో ప‌రిశోధ‌న చేసి ఈ సినిమాకు ప‌నిచేశారు. ఈ ఆర్ట్‌వ‌ర్క్‌తో పాటు భారీ సెట్టింగులు ప్రేక్ష‌కుల క‌ళ్ల‌కు క‌ట్టేలా చూప‌డంలో జ‌య‌న‌న్ విన్సెంట్ సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉండ‌నుంది. ట్రైలర్ల‌లో చూస్తుంటే కెమేరా వ‌ర్క్ కోసం ప‌డిన క‌ష్టం తెలుస్తోంది. రుద్ర‌మ‌దేవికి సంగీతం అందిచిన ఇళ‌య‌రాజా ఈ సినిమా ఆర్ ఆర్ కోసం లండ‌న్‌లో ర‌క‌ర‌కాల ఇన్‌స్ర్టుమెంట్స్‌తో వ‌ర్క్ చేయ‌డం విశేషం. సినిమాలో ఆర్ ఆర్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఇళ‌య‌రాజా రెండు నెల‌ల పాటు దీనికోస‌మే వ‌ర్క్ చేశారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మాట‌లు, శ్రీక‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్‌పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. కాక‌తీయుల మొత్తం చ‌రిత్ర‌ను 158 నిమిషాల్లో చాలా క్రిస్పీగా ప్రేక్ష‌కుల‌కు చూపించ‌డంలో ఎడిటింగ్ సినిమాను చాలా ఫాస్ట్‌గా మూవ్ చేసేలా కీ రోల్ ప్లే చేసిన‌ట్టు తెలుస్తోంది.

గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్‌పై అంచ‌నాలు…ఆశ‌లు..
గుణ‌శేఖ‌ర్ ఈ సినిమా క‌థ కోసం ఏకంగా 9 సంవ‌త్స‌రాల పాటు రీసెర్చ్ చేయ‌డం ఈ సినిమా కోసం అత‌డు ప‌డిన క‌ష్టం అర్థ‌మ‌వుతోంది. 9 సంవ‌త్స‌రాలుగా క‌థ‌పై క‌స‌ర‌త్తులు…3 సంవ‌త్స‌రాలుగా సినిమా షూటింగ్ చేసిన గుణ‌శేఖ‌ర్‌…సినిమా కోసం స‌ర్వ‌స్వంతో పాటు ఆస్తిపాస్తుల‌న్నిధార‌పోసి రుద్ర‌మ‌దేవిని తెర‌కెక్కించాడు. ఇక భార‌త‌దేశ‌పు తొలి హిస్టారిక‌ల్ స్టీరియోస్కోపిక్ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కింది. సినిమా బాగా రావాలన్న ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా టాప్‌ టెక్నీషియన్స్‌తో 3డి ఫార్మాట్‌లో ఈ సినిమాను గుణ‌శేఖ‌ర్‌ నిర్మించారు.
ఈ సినిమాను 3 డీ ఫార్మాట్‌లో తెర‌కెక్కించేందుకు గుణ‌శేఖ‌ర్ 3డి విద్య కోసం లండన్‌లో క్రాస్‌కోర్స్‌ నేర్చుకోవ‌డం విశేషం. ఓవ‌రాల్‌గా గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను ముందుగా రూ.40-50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాల‌ని అనుకున్నా చివ‌ర‌కు అది రూ.80 కోట్ల‌కు చేరుకుంది. అయినా ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా గుణ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఫైన‌ల్‌గా….
భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం ‘రుద్రమదేవిస‌. రుద్ర‌మ‌దేవిగా అనుష్క‌, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌, చాళుక్య వీరభద్రుడుగా దగ్గుబాటి రానా నటించిన ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కింది. ఈ భారీ చిత్రం అక్టోబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ఒక్క‌డు, చూడాల‌ని ఉంది, బాల రామాయ‌ణం లాంటి హిట్ సినిమాలు తీసిన గుణ‌శేఖ‌ర్ ఆ త‌ర్వాత ఆ స్థాయి సినిమాలే తీయ‌లేక‌పోయాడు. ఈ సిన‌మా కోసం గుణ‌శేఖ‌ర్ క‌సితో ప‌నిచేసి మునుప‌టి ఫామ్‌లోకి వ‌స్తాన‌న్న ధీమాతో ఉన్నాడు. బాహుబ‌లి త‌ర్వాత ఓ టాలీవుడ్ కాస్త అటూ ఇటూగా అదేస్థాయి అంచ‌నాల‌తో వ‌స్తున్న రుద్ర‌మ‌దేవి మ‌రి కొద్ది గంట‌ల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రుద్ర‌మ‌దేవి మూవీపై ఆకాంక్ష‌:
ఒక చారిత్ర‌క అంశాన్ని ఎన్నో క‌ష్టాలు, వ్య‌వ‌ప్ర‌యాస‌ల‌కోర్చి తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌తో పాటు ఈ సినిమా యూనిట్ మొత్తానికి నేటిసినిమా.కామ్ శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో పాటు సినిమా విజ‌యం సాధించాల‌ని…ఈ సినిమా విజ‌యం స్ఫూర్తితో టాలీవుడ్‌లో ఈ త‌ర‌హా చిత్రాలు ఎన్నో రావాల‌ని కోరుకుంటోంది. ఈ సినిమా హిట్ అయ్యి…బాహుబ‌లి, శ్రీమంతుడు త‌ర‌హాలో టాలీవుడ్ స్థాయిని, ఖ్యాతిని దేశ‌వ్యాప్తంగా చాటాల‌ని నేటిసినిమా.కామ్ కోరుకుంటోంది.

రుద్ర‌మ‌దేవి తెలుగు, ఇంగ్లీష్ వెర్ష‌న్ రివ్యూల కోసం చూస్తూనే ఉండండి

సినిమా: రుద్ర‌మ‌దేవి న‌టీన‌టులు: అనుష్క (టైటిల్ రోల్‌) అల్లు అర్జున్‌, ద‌గ్గుబాటి రానా, ప్ర‌కాష్ రాజ్‌, కృష్ణంరాజు, హంసా నందిని, నిత్యామీన‌న్‌, కేథ‌రిన్ థెస్రా త‌దిత‌రులు సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తి ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ ఆర్ట్‌: తోట త‌ర‌ణి ఫైట్స్‌: పీట‌ర్ హెయిన్స్‌/ విజ‌య‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: అజ‌య్‌విన్సెంట్‌ ఎడిటింగ్‌: శ‌్రీక‌ర‌ప్ర‌సాద్‌ సంగీతం: ఇళ‌య‌రాజా స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీమతి రాగిణి ద‌ర్శ‌క‌త్వం: గుణ‌శేఖ‌ర్‌ సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ ర‌న్ టైం: 158 నిమిషాలు రిలీజ్ డేట్‌: 09 అక్టోబ‌ర్‌, 2015 రుద్రమదేవి రివ్యూ: కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించి, ప్రజల చేత మన్ననలు పొంది, కాకతీయ వంశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టతలు తెచ్చి పెట్టిన వీరణారి రుద్రమదేవి జీవిత కథాంశంతో తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ‘ది వారియర్ క్వీన్’ అనేది ఉపశీర్షిక. ఇండియాలోనే మొట్ట మొదటి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ డైరెక్టర్. అనుష్క మెయిల్ లీడ్ గా నటించగా రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు, కేథరిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హిస్టారికల్ కథని ఎంత మేరకు ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాడన్నది ఇప్పుడు చూద్దాం.. కథ : ఓరుగల్లు(ఇప్పటి వరంగల్)ని కాకతీయ రాజ్య పీఠంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా 63 ఏళ్ళు పరిపాలించిన రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు). ఆయనకి వారసులు లేరు. ఆయన చివరి సంతానం కూడా ఆడబిడ్డే పుడుతుంది. కానీ తనకి వారసుడు పుట్టలేదు అని తెలిస్తే దేవగిరి రాజైన సింగన్న(రాజ మురాద్) దండెత్తి వస్తాడని, అలాగే తన దాయాదుల వల్లే తమకు ముప్పు పొంచి ఉన్నదని గణపతి దేవుడు బాధపడుతున్న తరుణంలో మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచి, తమకు పుట్టింది మగ పిల్లాడే, అని తనకి రుద్రమదేవి అనే నామకరణం చేసినా రుద్రదేవ యువరాజుగా ప్రజలకి పరిచయం చేస్తాడు. అనుకున్నట్టుగానే కుమార్తెను ఒక రాజుని తయారు చేసినట్టే సకల విద్యల్లోనూ శిక్షణ ఇప్పిస్తాడు. రుద్రదేవ కూడా అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. అప్పుడే యువరాజుగా పట్టాభిశాక్తుల్ని చేస్తారు. ఇదిలా ఉండగా గణపతిదేవుడు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్). మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు రుద్రవీరని చంపి కాకతీయ సింహాసనాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, మరోవైపు దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) కూడా కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి వ్యూహాలు రచిస్తుంటాడు. అదే తరుణంలో బంధిపోటుగా పేరు తెచ్చుకున్న గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్ర వీరతో పోరు కోసం సిద్దంగా ఉంటాడు. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రుద్రవీర ఏం చేసింది.? రుద్రవీర యువరాజు మగ కాదు,ఆడ అని తెలిసిన తర్వాత కాకతీయ ప్రజలు ఏం చేసారు.? అలా చేయడం వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? ఆ ఇబ్బందుల నుంచి ప్రజలని కాపాడి, మహాదేవ నాయకుడి నుంచి కాకతీయ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.? అసలు రుద్రవీరకి బాల్య మిత్రుడైన గోనగన్నారెడ్డి రుద్రమదేవికి ఎందుకు ఎదురెళ్ళాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్ : రుద్రమదేవి జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. అలానే రుద్రమదేవి సినిమాకి కూడా హైలైట్ గా నిలిచే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ముందుగా ఆ బ్లాక్స్ గురించి చెప్పుకుంటే.. రుద్రమదేవి చిన్ననాటి ఎపిసోడ్ తో పాటు, అనుష్క ఇంట్రడక్షన్ సీన్ అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ఆ తర్వాత అనుష్క పై ఓ ముఠా దాడి చేసినప్పుడు అక్కడ అనుష్క చేసే వీరోచిత పోరాటం బాగుంది. ఆ ఫైట్ లో అనుష్క కత్తితిప్పుడు సూపర్బ్. వీటికంటే మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారిగా థియేటర్లోని ఆడియన్స్ లో ఓ సరికొత్త ఎనర్జీ జెనరేట్ అవుతుంది. ఈ సీన్ లో ఇంటెన్స్ తో పాటు డైలాగ్స్ లో కావలసినంత వెటకారం, కామెడీ కూడా ఉంటాయి. అందుకే ఈ సీన్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్ లో చూపే సర్ప వ్యూహం – గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్నారు.. సో సినిమాకి హైలైట్ గా నిలిచిన నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే.. ముందుగా ఇలాంటి ఓ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించడమే కాకుండా ఈ సినిమా కోసం రెండేళ్ళు టైం కేటాయించిన అనుష్కకి హ్యాట్సాఫ్. అనుష్క వారియర్ లా, ఒక మెచ్యూర్ యువరాణిలా బాగా చేసింది. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో కత్తి తిప్పడం, రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలకు దీటుగా నిలిచింది. ఇక అంతఃపురంలో…

రుద్రమదేవి

కథ - స్క్రీన్ ప్లే - 3.75
నటీనటుల ప్రతిభ - 4
సాంకేతిక విభాగం పనితీరు - 4
దర్శకత్వ ప్రతిభ - 4

3.9

రుద్రమదేవి

రుద్రమదేవి

User Rating: 4.12 ( 11 votes)
4