స్పైడర్‌ రివ్యూ

0Spyder-Reviewచిత్రం : స్పైడర్‌ 27, 2017
నటీనటులు : మహేష్ బాబు, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం : ఎ.ఆర్.మురుగ‌దాస్
నిర్మాత : ఎన్‌.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు
సంగీతం : హరీశ్ జైరాజ్
విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2017

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఈర్జీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. మరి ఇన్ని అంచనాలను మోస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

క‌థః

శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని వారిని కాపాడ‌టంలో ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. ఆ ప్రకారం త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ప‌బ్లిక్ మాట్లాడే ప్రైవేట్ ఫోన్ల ద్వారా కొన్ని ప‌దాలు వినిపిస్తే త‌న‌కు అల‌ర్ట్ వ‌చ్చేలా రెండు సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకార‌మే కొంద‌రిని కాపాడుతుంటాడు. ఈ ప‌నిలో అత‌నికి మ‌రో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇత‌నికి సాయం చేయ‌బోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంది. దాంతో దానికి కార‌కులెవ‌ర‌నే విష‌యాన్ని ఆరాతీస్తాడు.

భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించిన విష‌యాలు అప్పుడే వెలుగులోకి వ‌స్తాయి. ఇత‌రుల ఏడుపు విని ఆనందాన్ని అనుభ‌వించే ఆ సోద‌రుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జ‌నాల ఏడుపులు విన‌డానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారా? హాస్పిట‌ల్‌లో ఉన్న పేషెంట్స్ ప్రాణాల‌తో భైర‌వుడు ఎలా ఆడుకున్నాడు. ఆ ఆట నుంచి జ‌నాల‌ను కాపాడ‌టానికి శివ‌కు చార్లీ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎలా సాయం చేసింది? ఇంత‌కూ శివ‌కు, చార్లీకి ప‌రిచ‌యం ఎలా జ‌రిగింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

నటీనటుల పెర్ఫార్మన్స్ :

మహేష్‌ తనదైన శైలి ఇంటెన్సిటీతో నటించాడు. దర్శకుడి ఆలోచనల్లో ఒదిగిపోయాడు. ఆయన పాత్ర చాలా స్టైలిష్‌గా సాగుతుంది. రకుల్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, అందంగా కనిపిస్తుంది. ప్రతినాయకుడిగా ఎస్‌.జె. సూర్య నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. భైరవగా ఒదిగిపోయి నటించాడాయన. భరత్‌.. అతని నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయి. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. హారిస్‌ సంగీతం, సంతోష్‌శివన్‌ కెమెరా పనితనం చాలా బాగుంది. వీఎఫ్‌ఎక్స్‌ కథా సన్నివేశాలకు తగినట్లుగా సహజంగా తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు సినిమాకు ప్రధాన బలం. ప్రతీ సన్నివేశంలో రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. మురుగదాస్‌ రాసుకొన్న కథా, కథనాల్లోనే కాస్త తడబడినట్లు కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

మహేష్‌, సూర్యల నటన
సాంకేతిక హంగులు
ద్వితీయార్ధం

మైన‌స్ పాయింట్స్:

అక్కడక్కడా సాగదీతగా అనిపించే ప్రథమార్ధం
కథలో లీనం చేసే కథనం లేకపోవటం

సాంకేతిక విభాగం :

దర్శకుడు మురుగదాస్ ‘స్పైడర్’ కు మంచి కథని దానికి కావాల్సిన ముఖ్యమైన విలన్ పాత్రని, అందులోకి నటుడు ఎస్.జె.సూర్యని, రెండు భాషలకు సరిపడేలా హీరోగా మహేష్ ను ఎంచుకొని ఫస్టాఫ్, సెకండాఫ్ ఆరంభం వరకు సినిమాను ఆకట్టుకునే విధంగా నడిపారు కానీ ఆ తర్వాత భాగాన్నే కొంచెం వీక్ గా తీశారు. ఇక సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనబడింది. క్యాప్చర్ చేయడానికి కష్టమైన యాక్షన్ సన్నివేశాల్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉంచారాయన.

అలాగే స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలోని మేజర్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచాయి. కీలక సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గొప్పగా ఉన్నాయి. హారిశ్ జైరాజ్ పాటల సంగీతం యావరేజ్ గానే ఉన్నా సరికొత్త తరహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించారు. శేఖర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

మహేష్ ఈసారి రెగ్యులర్ స్టార్ హీరోయిలా కాకుండా బలమైన కథకు, పాత్రలకు ప్రాధాన్యమిచ్చి చేసిన ‘స్పైడర్’ చిత్రం ఆయన చేసిన మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. దర్శకుడు మురుగదాస్ ఎంచుకున్న కథ, రాసుకున్న కథనం, ప్రతినాయకుడి పాత్ర, అందులో ఎస్.జె. సూర్య నటన, మహేష్ పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ కథనం, సినిమాలోని సోషల్ మెసేజ్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా సెకండాఫ్లో తీవ్రత లోపించడం, ఫ్యాన్స్ ఆశించే స్థాయిలో మహేష్ కు ఎలివేషన్ లేకపోవడం, రెగ్యులర్ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మిస్సవడం బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘స్పైడర్’ రెగ్యులర్ ఆడియన్సుని మరీ ఎక్కువగా మెప్పించలేకపోవచ్చు కానీ బలమైన కథలని, మహేష్ నుండి భిన్నత్వాన్ని కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది.