శ్రీనివాస కళ్యాణం రివ్యూ

0చిత్రం : శ్రీనివాస కళ్యాణం

నటీనటులు : నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్

దర్శకత్వం : విగ్నేష సతీష్

నిర్మాతలు : దిల్ రాజు

సంగీతం : మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

రచన, స్క్రీన్ ప్లే : విగ్నేష సతీష్

ఎడిటర్ : మధు

విడుదల తేదీ : ఆగష్టు 9, 2018

నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస క‌ళ్యాణం’ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై నిర్మించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ:

తన జాయింట్ ఫ్యామిలీ కి దూరంగా చండీఘడ్ లో జాబ్ చేస్తుంటాడు శ్రీనివాస్ ( నితిన్ ), అక్కడే కాఫీ డే లో జాబ్ చేస్తూ మిడిల్ క్లాస్ అమ్మాయి గా శ్రీదేవి ( రాశి ఖన్నా ) కనిపించడం కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మద్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో శ్రీ (రాశి ఖన్నా) పెద్ద బిజినెస్ మెన్ అండ్ మల్టీ మిలినియర్ అయిన ప్రకాష్ రాజ్ కూతురు అని తెలుస్తుంది లైఫ్ లో టైం కి బిజినెస్ కి తప్ప దేనికి వాల్యూ ఇవ్వని ఆయన్ని వాసు శ్రీ తో తన పెళ్ళికి ఏలా ఒప్పించాడు ? ఆ ఒప్పుకున్నే క్రమంలో శ్రీ తండ్రి (ప్రకాష్ రాజ్ ) వాస్ కు ఓ షరతు పెడుతూ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు అసలు శ్రీదేవి తండ్రి కి వాస్ కు మధ్య జరిగిన ఆ ఒప్పందం ఏమిటి ? ఆ కారణంగా వచ్చిన సమస్యలు ఏమిటి ?అసలు వాసు, శ్రీ పెళ్లి జరిగిందా ?జరిగితే వారి పెళ్లి ఎలా జరిగింది ? చివరకి శ్రీ తండ్రి మారాడా ? వాసు తన ఫామిలీ కోరుకున్న విధముగా పెళ్లి చేసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ బాంధ‌వ్యాలను, బంధువుల మధ్య అనుబంధాల గురించి తెలియ‌జేస్తూ సినిమాను చాలా ప్లెజెంట్‌గా తీశారు. ముఖ్యముగా పెళ్లి గురుంచి చాలా గొప్ప‌గా చూపించారు

హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంప్రదాయాలకు విలువ ఇచ్చే శ్రీ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే ప‌ద్మావ‌తి పాత్రలో కనిపించిన మరో హీరోయిన్ నందితా శ్వేత ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. లోపల చిన్న అసూయతో, ప్రేమించిన వాడు దూరం అవుతున్నాదనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.

కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, జయసుధ, ఆమని, సితార ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు.

దర్శకుడు సతీష్ వేగేశ్న బరువైన సన్నివేశాలన్ని కూడా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో చాలా విస్లేషాత్మకంగా చూపించినందుకు ఆయన్ని అభినందించి తీరాలి.

మైనస్ పాయింట్స్ :

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడిపారు.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయినా ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. అలాగే పద్మావతిగా మంచి భావేద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కుడా సరైన ముగింపు వుండదు.

ఓవరాల్ గా శ్రీనివాస కల్యాణంలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ని అంతే బలంగా ఎలివేట్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేదు.

సాంకేతిక విభాగం :

సతీష్ వేగేశ్న రచయితగా దర్శకుడిగా ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాటలన్నీ బాగున్నాయి. పాటల్లో తెలుగుద‌నం కనిపిస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ అందంగా కనబడ్డాయి. ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు ఆయన.

ఇక మధు ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో ఆయన కత్తెరకు ఇంకొంచెం పని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని దిల్ రాజు నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

తీర్పు:

పెళ్లి నేపథ్యంలో నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మరియు విలేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పెళ్లిని ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ, బంధువులను వారి మధ్య అనుబంధాలను చాలా చక్కగా చూపించారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులము ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

‘శ్రీనివాస కళ్యాణం’ : లైవ్ అప్డేట్స్:

 

 • ఇక సినిమా పూర్తి అయింది…పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ వుండండి…

 • అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. ప్రస్తుతం అద్భుతంగా పెళ్ళితంతు సాగుతుండగా, నేపథ్యంలో అందమైన పాట ‘కళ్యాణం వైభోగం’ వస్తోంది…

 • నితిన్, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, రాశి మరియు ఇతర ముఖ్యమైన పాత్రల మధ్య వివాహ వేదికపై ఒక హృదయానికి హత్తుకునే భావోద్వేగ సన్నివేశం జరుగుతోంది…..

 • విస్తృతంగా పెళ్ళికి సంబందించిన సన్నాహాలు పూర్తి అయిన తరువాత, ప్రస్తుతం పెద్ద ఎత్తున సాంప్రదాయ వివాహం కోసం వేదిక సిద్ధమైంది …

 • భారీ తారాగణంతో కూడిన కుటుంబ సన్నివేశం ప్రస్తుతం వస్తోంది…

 • పెళ్లి డేట్ దగ్గర పడుతున్నకొద్దీ అందరూ బంధువులు అన్ని అరెంజిమెంట్స్ చేయడంలో బిజీగా వున్నారు…’ప్రస్తుతం వినవమ్మా తూరుపు చుక్క’ అనే పల్లవితో సాగే పాట వస్తోంది….

 • `ముఖ్యమైన బంధువుగా సీనియర్ నటులు గిరిబాబు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు… అదే సమయంలో, నితిన్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఆ వేడుకలో జాయిన్ అయ్యారు… ప్రస్తుతం ‘పల్లెటూరి’ అనే పల్లవితో సాగే పాట వస్తోంది….

 • ఈవెంట్ మేనేజర్ గా యాక్టర్ అజయ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు… పెళ్లికి సంబంధించి ప్రస్తుతం కొన్ని షాపింగ్ సన్నివేశాలు వస్తున్నాయి….

 • ఎంగేజ్మెంట్ తరువాత ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ ‘మొదలవుదాం’ వస్తోంది…..

 • ప్రస్తుతం ఎంగేజ్మెంట్ జరుగుతోంది… రెండు కుటుంబాల మధ్య సంస్కృతికి సంబంధించి కొన్ని తేడాలు రియలిస్టిక్ గా చూపించబడుతున్నాయి….

 • ఇంటర్వెల్ తరువాత రెండు కుటుంబాల వారు పెళ్లి పనులు మొదలుబెట్టారు….

 • హీరో, హీరోయిన్ల ఇద్దరు ఫ్యామిలీలు చర్చించుకున్నాక వాళ్ళిద్దరి పెళ్లి ఫిక్స్ చేస్తారు…. ప్రస్తుతం బ్రేక్

 • నితిన్, రాశి ఇద్దరూ తమ ప్రేమని వాళ్ళ తల్లితండ్రులకు చెప్తారు… ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి….

 • నితిన్ తన ఫ్రెండ్ తో కలిసి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కి వెళ్తాడు…ప్రస్తుతం రెట్రో స్టైల్ లో సాగే సంథింగ్ సంథింగ్ గా అనే పాట వస్తోంది…

 • స్క్రీన్ మొత్తం బోలెడు మంది ఆర్టిస్టులతో నిండిపోయి కన్నులపండుగగా వుంది.. ఒక బ్యాచిలర్ పార్టీలో నితిన్, రాశిఖన్నా ఒకరినొకరు మొదటగా కలుసుకున్నారు… మెల్లగా రాశిఖన్నా, నితిన్ ప్రేమలో పడిపోయింది… ప్రస్తుతం ఇతడేనా ఇతడేనా అనే మెలోడీ సాంగ్ వస్తోంది…

 • రాశి ఖన్నా తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్, సితారలు ఎంట్రీ ఇచ్చారు… రాశి ఖన్నా పెద్ద అక్కగా పూనమ్ కౌర్ సీన్ లోకి వచ్చింది…. డబ్బు ఆశగల తండ్రిగా ప్రకాష్ రాజ్ చూపించబడుతున్నారు…

 • ఇప్పుడే హీరోయిన్ రాశి ఖన్నా కాఫీ షాప్ లో పనిచేసే యువతిగా పరిచయం కాబడింది.. యాక్టర్స్ సత్యం రాజేష్, హరితేజ భార్య భర్తలుగా సీన్ లోని వచ్చారు.. కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి…

 • కొన్ని పరిచయ సన్నివేశాల తరువాత ప్రస్తుతం ఎక్కడ నువ్వుంటే పల్లవితో సాగె మొదటి పాట వస్తోంది… పాట ద్వారా హీరో క్యారెక్టర్ ఎటువంటిదో ఎలివేట్ చేయబడుతోంది…..

 • సినిమా ప్రస్తుత కాలానికి మారింది, హీరో నితిన్ రాజేంద్ర ప్రసాద్ కొడుకుగా చండీగఢ్ లో సింపుల్ గాఎంట్రీ ఇచ్చాడు.. హీరోయిన్ నందిత శ్వేత కూడా సీన్ లో జాయిన్ అయింది..

 • గోదావరి జిల్లాలోని సఖినేటిపల్లిలో 20 ఏళ్ళ క్రితం సినిమా మొదలవుతుంది. సినిమాలోని పాత్రలు రాజేంద్రప్రసాద్ తో మొదలయి అన్నపూర్ణ, జయసుధ, నరేష సహా అందరూ ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేయబడుతన్నారు. కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి

 • విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది… తెలుగు సంస్కృతి మరియు వివాహాల గురించి ప్రాధాన్యతను అయన వివరిస్తున్నారు…. దానికి సంబంధించి కొన్నిసన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్నాయి

 • హాయ్ …..140 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైయింది

 

తెలుగు సంప్రదాయ వివాహాల ప్రాముఖ్యతని తెలియజేసే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలెబ్రిటీల కోసం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం స్పెషల్ షో వేయించారు. ప్రముఖ దర్శకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

నేను లోకల్ దర్శకుడు

నేను లోకల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్పెషల్ షో అనంతరం శ్రీనివాస కళ్యాణం చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ చిత్రం చూశాక పదేళ్ల క్రితం జరిగిన తన వివాహం తనకు గుర్తుకు వచ్చిందని త్రినాథ్ రావు అన్నారు. శ్రీనివాస కళ్యాణం లో చూపించిన చాలా అంశాలు తన పెళ్ళిలో కూడా జరిగిఉంటే బావుండేది అని తెలిపాడు.

క్లైమాక్స్ గురించే
ఈ చిత్రాన్ని చూసిన ప్రతి దర్శకుడు క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నితిన్ మధ్య జరిగే సంభాషణ అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశంలో సంభాషణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇంద్రగంటి మాటల్లో
ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శ్రీనివాస కళ్యాణం చూసిన అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు. క్లైమాస్ లో ఆయన నటన అద్భుతం అని అన్నారు. సన్నివేశాన్ని ఎక్కువగా ఎమోషనల్ చేయకుండా సంస్కారవంతంగా దర్శకుడు రూపొందించినట్లు ఇంద్రగంటి పేర్కొన్నారు.
మళ్ళీ పెళ్లి చేసుకోవాలని
శ్రీనివాస కళ్యాణం చిత్రం చూసిన తరువాత తన భార్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించేంత ఫీల్ కలిగిందని యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో ప్రభావవంతంగా చూపించారని అనిల్ రావిపూడి తెలిపాడు.
అన్ని తరాలవారు
శ్రీనివాస కళ్యాణం చిత్రం అన్ని తరాల వారు చూడదగ్గ చిత్రం అని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. పెళ్లైన వారు వారిని వారు ఈ చిత్రంతో గుర్తు చేసుకుంటారు. పెళ్లి కానీ వారు తమ పెళ్లి ఇలా జరగాలని కోరుకుంటారు. శ్రీనివాస కళ్యాణం చిత్రంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గౌరవం మరో స్థాయికి చేరుతుందని వంశీ పైడిపల్లి తెలిపారు.
చిత్రం : శ్రీనివాస కళ్యాణం నటీనటులు : నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్ దర్శకత్వం : విగ్నేష సతీష్ నిర్మాతలు : దిల్ రాజు సంగీతం : మిక్కీ జె మేయర్ సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి రచన, స్క్రీన్ ప్లే : విగ్నేష సతీష్ ఎడిటర్ : మధు విడుదల తేదీ : ఆగష్టు 9, 2018 నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస క‌ళ్యాణం’ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ దిల్‌రాజు, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై నిర్మించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ: తన జాయింట్ ఫ్యామిలీ కి దూరంగా చండీఘడ్ లో జాబ్ చేస్తుంటాడు శ్రీనివాస్ ( నితిన్ ), అక్కడే కాఫీ డే లో జాబ్ చేస్తూ మిడిల్ క్లాస్ అమ్మాయి గా శ్రీదేవి ( రాశి ఖన్నా ) కనిపించడం కొన్ని సంఘటనల కారణంగా ఇద్దరి మద్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న క్రమంలో శ్రీ (రాశి ఖన్నా) పెద్ద బిజినెస్ మెన్ అండ్ మల్టీ మిలినియర్ అయిన ప్రకాష్ రాజ్ కూతురు అని తెలుస్తుంది లైఫ్ లో టైం కి బిజినెస్ కి తప్ప దేనికి వాల్యూ ఇవ్వని ఆయన్ని వాసు శ్రీ తో తన పెళ్ళికి ఏలా ఒప్పించాడు ? ఆ ఒప్పుకున్నే క్రమంలో శ్రీ తండ్రి (ప్రకాష్ రాజ్ ) వాస్ కు ఓ షరతు పెడుతూ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు అసలు శ్రీదేవి తండ్రి కి వాస్ కు మధ్య జరిగిన ఆ ఒప్పందం ఏమిటి ? ఆ కారణంగా వచ్చిన సమస్యలు ఏమిటి ?అసలు వాసు, శ్రీ పెళ్లి జరిగిందా ?జరిగితే వారి పెళ్లి ఎలా జరిగింది ? చివరకి శ్రీ తండ్రి మారాడా ? వాసు తన ఫామిలీ కోరుకున్న విధముగా పెళ్లి చేసుకున్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే శ్రీనివాస కళ్యాణం చిత్రం చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ : దర్శకుడు సతీష్ వేగేశ్న పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూ బాంధ‌వ్యాలను, బంధువుల మధ్య అనుబంధాల గురించి తెలియ‌జేస్తూ సినిమాను చాలా ప్లెజెంట్‌గా తీశారు. ముఖ్యముగా పెళ్లి గురుంచి చాలా గొప్ప‌గా చూపించారు హీరో నితిన్ లుక్స్ పరంగా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో సంప్రదాయాలకు విలువ ఇచ్చే శ్రీ పాత్రలో కనిపించిన రాశి ఖన్నా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే ప‌ద్మావ‌తి పాత్రలో కనిపించిన మరో హీరోయిన్ నందితా శ్వేత ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. లోపల చిన్న అసూయతో, ప్రేమించిన వాడు దూరం అవుతున్నాదనే బాధలో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. కీలకమైన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, జయసుధ, ఆమని, సితార ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు. దర్శకుడు సతీష్ వేగేశ్న బరువైన సన్నివేశాలన్ని కూడా ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో చాలా విస్లేషాత్మకంగా చూపించినందుకు ఆయన్ని అభినందించి తీరాలి. మైనస్ పాయింట్స్ : కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడిపారు. ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయినా ప్రకాష్ రాజ్ పాత్ర మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. అలాగే పద్మావతిగా మంచి భావేద్వేగ పాత్రలో కనిపించిన నందిత పాత్రకు కుడా సరైన ముగింపు వుండదు. ఓవరాల్ గా శ్రీనివాస కల్యాణంలో బలమైన ఎమోషన్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ని అంతే బలంగా ఎలివేట్ చేసే కాన్ ఫ్లిక్ట్ లేదు. సాంకేతిక విభాగం : సతీష్ వేగేశ్న రచయితగా దర్శకుడిగా ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని…

శ్రీనివాస కళ్యాణం రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.5
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవిభాగం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.3

శ్రీనివాస కళ్యాణం రివ్యూ

శ్రీనివాస కళ్యాణం రివ్యూ రేటింగ్

User Rating: 3.65 ( 1 votes)
3