Templates by BIGtheme NET
Home >> REVIEWS >> టాక్సీవాలా రివ్యూ

టాక్సీవాలా రివ్యూ


నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్

దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యన్

నిర్మాత : ఎస్ కె ఎన్

సంగీతం : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్

ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ ఐదు సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసుకోని జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. రక రకాల జాబ్ లు చేసి..ఏ జాబ్ నచ్చక, ఫైనల్ గా ఓ కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ సెటిల్ అవుతాడు. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న టైంలో కార్ లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా శివ లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. దాంతో ఆ కార్ ని వదిలించుకోవడానికి శివ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఆ కార్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అంతలో ఆ కారు లో ప్రయాణించిన ఓ డాక్టర్ ను ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు ఆ కార్ అతన్ని ఎందుకు చంపుతుంది ? ఆ కార్ లో ఏముంది ? ఎవరు కోసం ఎదురుచుస్తూ ఉంది? శివకు ఆ కార్ కు ఎందుకు అంత అటాచ్ మెంట్ పెరుగుతుంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? దానికి శివ ఏ విధంగా సహాయపడతాడు ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఓక్యాబ్ డ్రైవర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓ ఆర్డనరీ కుర్రాడిగా కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు ఆ హర్రర్ సీన్స్ లో భయపడుతూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకిగా నటించిన ప్రియాంక జవాల్కర జూనియర్ డాక్టర్ అను పాత్రలో చాలా చక్కగా నటించింది. ఆమె పాత్ర ఇంట్రడక్షన్ సీన్ తోపాటు హీరోతో సాగే కొన్ని సన్నివేశాల్లోనూ తన నటనతో బాగా ఆకట్టుకుంటుంది.

సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా .. తన నటనతో సినిమాలో హైలెట్గా నిలిచింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి.

మధు, మధు పక్కన అసిస్టెంట్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికి, ఆ లైన్ ను పూర్తిగా కన్విన్స్ చేసిన విధానంలో కొన్ని చోట్ల సినిమాటిక్ గా అనిపిస్తాయి. విలన్ తాలూకు సన్నివేశాలను కూడా ఇంకా కొంచెం క్లారిటీగా చూపించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా రవివర్మ పాత్రను దాచి ఉంచడం సినిమాకి అనుగుణంగా ఎదో కావాలని చేసినట్లు ఉంటుంది.

సెకెండాఫ్ లో కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. అయితే దర్శకుడు సినిమాని చాల చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు.

మెయిన్ గా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండీ ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువుగా కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న మైనస్ లు కూడా లేకుండా ఉండి ఉంటే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండి ఉండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ మంచి స్టోరీ లైన్ తో పాటు మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు జెక్స్ బిజాయ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని యస్ కె ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌ హీరో హీరోయిన్లుగా, మాళవికా నాయర్‌ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం కొన్ని సన్నివేశాల్లో తప్ప, బాగా ఆకట్టుకుంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. ఆ లైన్ కి చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి కామెడీ సీన్స్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. అయితే.. దర్శకుడు సినిమాని చాలా చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. మెయిన్ గా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువుగా కనిపిస్తోంది.

మొత్తం మీద ఈ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మిగిలిన వర్గాల ప్రేక్షకులని కూడా అలరిస్తుందని చెప్పొచ్చు.

నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్ దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యన్ నిర్మాత : ఎస్ కె ఎన్ సంగీతం : జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్ ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్ విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ ఐదు సంవత్సరాలు కష్టపడి పూర్తి చేసుకోని జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. రక రకాల జాబ్ లు చేసి..ఏ జాబ్ నచ్చక, ఫైనల్ గా ఓ కారు కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ సెటిల్ అవుతాడు. ఇక అంత హ్యాపీ అనుకుంటున్న టైంలో కార్ లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా శివ లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. దాంతో ఆ కార్ ని వదిలించుకోవడానికి శివ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఆ కార్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అంతలో ఆ కారు లో ప్రయాణించిన ఓ డాక్టర్ ను ఆ కారు అతి దారుణంగా చంపేస్తోంది. అసలు ఆ కార్ అతన్ని ఎందుకు చంపుతుంది ? ఆ కార్ లో ఏముంది ? ఎవరు కోసం ఎదురుచుస్తూ ఉంది? శివకు ఆ కార్ కు ఎందుకు అంత అటాచ్ మెంట్ పెరుగుతుంది ? ఫైనల్ గా ఆ కారు ఎవరి పై రివేంజ్ తీసుకోవాలనుకుంటుంది ? దానికి శివ ఏ విధంగా సహాయపడతాడు ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాలో ఓక్యాబ్ డ్రైవర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓ ఆర్డనరీ కుర్రాడిగా కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు ఆ హర్రర్ సీన్స్ లో భయపడుతూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకిగా నటించిన ప్రియాంక జవాల్కర జూనియర్ డాక్టర్ అను పాత్రలో చాలా చక్కగా నటించింది. ఆమె పాత్ర ఇంట్రడక్షన్ సీన్ తోపాటు హీరోతో సాగే కొన్ని సన్నివేశాల్లోనూ తన నటనతో బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా .. తన నటనతో సినిమాలో హైలెట్గా నిలిచింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. మధు, మధు పక్కన అసిస్టెంట్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. మైనస్ పాయింట్స్ : దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నప్పటికి, ఆ లైన్ ను పూర్తిగా కన్విన్స్ చేసిన విధానంలో కొన్ని చోట్ల సినిమాటిక్ గా అనిపిస్తాయి. విలన్ తాలూకు సన్నివేశాలను కూడా ఇంకా కొంచెం క్లారిటీగా చూపించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా రవివర్మ పాత్రను దాచి ఉంచడం సినిమాకి అనుగుణంగా ఎదో కావాలని చేసినట్లు ఉంటుంది. సెకెండాఫ్ లో కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. అయితే దర్శకుడు సినిమాని చాల చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. మెయిన్ గా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండీ ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువుగా కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న మైనస్ లు కూడా లేకుండా ఉండి ఉంటే ఈ చిత్రం మరో స్థాయిలో ఉండి ఉండేది. సాంకేతిక విభాగం : దర్శకుడు దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ మంచి స్టోరీ లైన్ తో పాటు మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు జెక్స్ బిజాయ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని యస్ కె ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. తీర్పు : విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌ హీరో హీరోయిన్లుగా, మాళవికా నాయర్‌ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం కొన్ని సన్నివేశాల్లో తప్ప, బాగా ఆకట్టుకుంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు…

టాక్సీవాలా రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 3.5
నటీ-నటుల ప్రతిభ - 3.75
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.4

టాక్సీవాలా రివ్యూ

టాక్సీవాలా రివ్యూ

User Rating: 2.35 ( 3 votes)
3