ఉంగరాల రాంబాబు రివ్యూ

0



Ungarala-Rambabu-Reviewచిత్రం : ఉంగరాల రాంబాబు
నటీనటులు : సునీల్, మియా జార్జ్
దర్శకత్వం : క్రాంతి కుమార్
నిర్మాత : పరుచూరి కిరీటి
సంగీతం : గిబ్రాన్
విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017

ఎంతో కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్ కెరీర్ కు ఉంగరాల రాంబాబు చిత్రం చాలా కీలకమైనది. ఎప్పుడో విడుదలకావలసిన ఈ చిత్రం వాయిదా పడుతూ చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం..

కథ :

రాంబాబు (సునీల్) చాలా ధనవంతుడు. రాంబాబు తన తాత మరణానంతరం ఆస్తి మొత్తం కోల్పోతాడు. సునీల్ కు ఇక ఏ ఆధారమూ ఉండదు. అప్పుడతను బాదం బాబా(పోసాని) గా పేరుగాంచిన బాబా వద్దకు వెళతాడు. బాబా సునీల్ ని ఓదార్చి సలహా ఇస్తాడు. బాబా సలహాతో సునీల్ ఓ బంజరు భూమిలో మొక్కలు నాటడం మొదలు పెడతాడు. రాంబాబుకు అదృష్టం కలసి వచ్చి 200 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ లు దొరుకుతాయి.

దీనితో రాంబాబు మళ్లీ ధనవంతుడిగా మారిపోతాడు. దీనితో రాంబాబుకు జోతిష్యం మీద బలమైన నమ్మకం ఏర్పడుతుంది. కాలం గడిచే కొద్దీ సునీల్ బిజినెస్ లో నష్టాలని చవిచూస్తాడు. మరో మారు రాంబాబు బాబా సలహా కోసం వెళతాడు. పెళ్లి చేసుకుంటే చిక్కులు వీడిపోతాయని తన ఆఫీస్ లోనే పనిచేసే అమ్మాయి (మియా జార్జ్) సరైన జోడి అని బాబా సలహా ఇస్తాడు. కానీ రాంబాబు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన హీరోయిన్ తండ్రి( ప్రకాష్ రాజ్) వలన చిక్కుల్లో పడతాడు. ఆయా చిక్కులు ఏమిటి ? వాటి మధ్య రాంబాబు తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగిలిన కథ.

నటీనటులు :

హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్రిస్తున్న సునీల్ రాంబాబు సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా.. అభిమానులు తన నుంచి ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయాడు. దొంగ బాబా పాత్రలో పోసాని ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గా మియాజార్జ్ పరవాలేదనిపించింది. స్టార్ కామెడియన్ గా ఎదుగుతున్న వెన్నెల కిశోర్ బోరింగ్ సీన్స్ నుంచి ఆడియన్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్ :

పోసాని, వెన్నెల కిశోర్ ల కామెడీ

మైనస్ పాయింట్స్ :

కథా కథనం
సంగీతం

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బావున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలని రిచ్ గా చిత్రీకరించారు. గిబ్రాన్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. మధ్య మధ్యలో వచ్చే పాటలు బోరింగ్ స్టోరీ నుంచి ప్రేక్షుకులను ఉపశమనం కలిగించేవిగా ఉండవు. డైలాగులు బావున్నాయి. కెమెరా పనితనం బావుంది.

దర్శకుడు క్రాంతి మాధవ్ విషయానికి వస్తే.. గతం లో తన చిత్రాల వలన సంపాదించుకున్న పేరుని ఈ చిత్రంతో పోగొట్టుకున్నారు. ఇలాంటి దర్శకుడు ఈ విధంగా ఉంగరాల రాంబాబు చిత్రాన్ని తెరెక్కించడం షాక్ కి గురిచేసే అంశం. పతాక సన్నివేశాల్లో దర్శకుడు తన స్క్రీన్ ప్లే నైపుణ్యాని ప్రదర్శించలేకపోయాడు.

తీర్పు :

మొత్తానికి ఉంగరాల రాంబాబు చిత్రం అన్ని విభాగాల్లో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఇలాంటి కథలకు టాలీవుడ్ లో ఎప్పుడో కాలం చెల్లింది. సునీల్ తన కెరీర్ పరంగా ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలి. కథల ఎంపిక విషయం అతడు వ్యూహాలని మార్చాలి. పోసాని, వెన్నెల కిషోర్ లు కనిపించే కొన్ని ఫన్నీ సీన్స్ మినహా ఈ చిత్రంలో మరేం లేదు. కాబట్టి ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని మర్చిపోవడం మంచిది.

Summary
Review Date
Reviewed Item
ఉంగరాల రాంబాబు
Author Rating
21star1stargraygraygray
చిత్రం : ఉంగరాల రాంబాబు నటీనటులు : సునీల్, మియా జార్జ్ దర్శకత్వం : క్రాంతి కుమార్ నిర్మాత : పరుచూరి కిరీటి సంగీతం : గిబ్రాన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017 ఎంతో కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్ కెరీర్ కు ఉంగరాల రాంబాబు చిత్రం చాలా కీలకమైనది. ఎప్పుడో విడుదలకావలసిన ఈ చిత్రం వాయిదా పడుతూ చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.. కథ : రాంబాబు (సునీల్) చాలా ధనవంతుడు. రాంబాబు తన తాత మరణానంతరం ఆస్తి మొత్తం కోల్పోతాడు. సునీల్ కు ఇక ఏ ఆధారమూ ఉండదు. అప్పుడతను బాదం బాబా(పోసాని) గా పేరుగాంచిన బాబా వద్దకు వెళతాడు. బాబా సునీల్ ని ఓదార్చి సలహా ఇస్తాడు. బాబా సలహాతో సునీల్ ఓ బంజరు భూమిలో మొక్కలు నాటడం మొదలు పెడతాడు. రాంబాబుకు అదృష్టం కలసి వచ్చి 200 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ లు దొరుకుతాయి. దీనితో రాంబాబు మళ్లీ ధనవంతుడిగా మారిపోతాడు. దీనితో రాంబాబుకు జోతిష్యం మీద బలమైన నమ్మకం ఏర్పడుతుంది. కాలం గడిచే కొద్దీ సునీల్ బిజినెస్ లో నష్టాలని చవిచూస్తాడు. మరో మారు రాంబాబు బాబా సలహా కోసం వెళతాడు. పెళ్లి చేసుకుంటే చిక్కులు వీడిపోతాయని తన ఆఫీస్ లోనే పనిచేసే అమ్మాయి (మియా జార్జ్) సరైన జోడి అని బాబా సలహా ఇస్తాడు. కానీ రాంబాబు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన హీరోయిన్ తండ్రి( ప్రకాష్ రాజ్) వలన చిక్కుల్లో పడతాడు. ఆయా చిక్కులు ఏమిటి ? వాటి మధ్య రాంబాబు తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగిలిన కథ. నటీనటులు : హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్రిస్తున్న సునీల్ రాంబాబు సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా.. అభిమానులు తన నుంచి ఆశించే కామెడీని మాత్రం అందించలేకపోయాడు. దొంగ బాబా పాత్రలో పోసాని ఆకట్టుకున్నాడు. తనదైన నటనతో నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గా మియాజార్జ్ పరవాలేదనిపించింది. స్టార్ కామెడియన్ గా ఎదుగుతున్న వెన్నెల కిశోర్ బోరింగ్ సీన్స్ నుంచి ఆడియన్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్లస్ పాయింట్స్ : పోసాని, వెన్నెల కిశోర్ ల కామెడీ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం సాంకేతిక విభాగం : ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బావున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలని రిచ్ గా చిత్రీకరించారు. గిబ్రాన్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. మధ్య మధ్యలో వచ్చే పాటలు బోరింగ్ స్టోరీ నుంచి ప్రేక్షుకులను ఉపశమనం కలిగించేవిగా ఉండవు. డైలాగులు బావున్నాయి. కెమెరా పనితనం బావుంది. దర్శకుడు క్రాంతి మాధవ్ విషయానికి వస్తే.. గతం లో తన చిత్రాల వలన సంపాదించుకున్న పేరుని ఈ చిత్రంతో పోగొట్టుకున్నారు. ఇలాంటి దర్శకుడు ఈ విధంగా ఉంగరాల రాంబాబు చిత్రాన్ని తెరెక్కించడం షాక్ కి గురిచేసే అంశం. పతాక సన్నివేశాల్లో దర్శకుడు తన స్క్రీన్ ప్లే నైపుణ్యాని ప్రదర్శించలేకపోయాడు. తీర్పు : మొత్తానికి ఉంగరాల రాంబాబు చిత్రం అన్ని విభాగాల్లో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఇలాంటి కథలకు టాలీవుడ్ లో ఎప్పుడో కాలం చెల్లింది. సునీల్ తన కెరీర్ పరంగా ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలి. కథల ఎంపిక విషయం అతడు వ్యూహాలని మార్చాలి. పోసాని, వెన్నెల కిషోర్ లు కనిపించే కొన్ని ఫన్నీ సీన్స్ మినహా ఈ చిత్రంలో మరేం లేదు. కాబట్టి ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని మర్చిపోవడం మంచిది.

ఉంగరాల రాంబాబు రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2
నటీ నటుల ప్రతిభ - 2.75
సాంకేతికవిభాగం పనితీరు - 2
దర్శకత్వ ప్రతిభ - 2

2.2

ఉంగరాల రాంబాబు రివ్యూ

ఉంగరాల రాంబాబు రివ్యూ

User Rating: 0.5 ( 1 votes)
2