2017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సర మేషరాశి ఫలితాలు

02017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సర మేషరాశి ఫలితాలు

mesha_rasiఅశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేష రాశికి చెందును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 04 అవమానం – 03

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మేష రాశి వారికి సంవత్సర ప్రారంభంలో ఆశాజనకంగా కన్పించును. నెమ్మదిగా చికాకులు, సమస్యలు ఎదురగును. ధన భారం ఉండును. అవసరములకు బందుమిత్రుల సహకారం లభించును. వ్యాపార రంగంలోని వారికి చికాకులు ఉండును. వ్యవసాయ రంగంలోని వారికి నష్టములు ఎదురగను. వివాదములు కలుగు సూచన. ఈ సంవత్సరం ఉద్యోగ రంగంలోని వారికి ఆశించిన స్థానచలనం ఏర్పడును. గృహ వాతావరణంలో అసౌక్యం. యంత్ర పరిశ్రమ యజమానులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలిగించును. కోర్టు వివాదాములలో అతికష్టంతో విజయం లభించును. సంవత్సరాంతంలో స్త్రీ సంభందమైన వ్యయములు, పితృ వర్గం వారివలన ఆర్ధిక నష్టములు కలుగును. సొంత గృహం కొరకు ప్రయత్నాలు ఫలించును. విదేశీ ప్రయత్నాలు మిక్కిలి విఘ్నములను కలుగచేయును.

సంవత్సర ప్రారంభం నుండి 11-సెప్టెంబర్-2017 వరకూ మేష రాశి వారికి గురువు మంచి ఫలితాలు ఇవ్వడు. అనారోగ్య సమస్యలను, శారిరక పీడను, ఋణములను , శత్రుత్వములను, బాధలను కలిగించును. గురువుకి శాంతి జపములు జరుపుట మంచిది. 12-సెప్టెంబర్-2017 నుండి గురువు మేష రాశి వారికి శుభఫలితలను ఇచ్చును. ముఖ్యముగా అవివాహితులకు వివాహ సంబంధంగా శుభం. సంతాన ప్రయత్నములు చేయువారికి సంతాన ప్రాప్తి. ఆధ్యాత్మిక భావము , వేదాంత ప్రీతి.

సంవత్సర ప్రారంభం నుండి 20-జూన్-2017 వరకూ శని మేషరాసి వారికి విశేష ధనలాభాములను కలిగించును. పితృ సంభంద విషయాల్లో మాత్రం మంచి ఫలితాలను కలుగచేయడు. పితృ వర్గీయులతో విభేదాలను ఏర్పరచును. 21-జూన్-2017 నుండి 26-అక్టోబర్-2017 వరకూ శని ఆకస్మిక ధన నష్టములను, చోర సంభంధమైన లేదా అగ్ని సంభంధమైన నష్టమును , వ్యవహరపు చిక్కులను, శారీరక పీడను, వాహన ప్రమాదములను కలిగించును. ఈ కాలంలో శనికి శాంతి జపములు జరుపుట మంచిది.

సంవత్సర ప్రారంభం నుండి 17-ఆగష్టు-2017 వరకూ రాహువు ఆర్ధికంగా యోగించును. స్వల్పంగా సంతాన సంబంధ విషయాలలో విచారమును కలుగ చేయును. 18-ఆగష్టు-2017 నుండి సంవత్సరాంతం వరకూ రాహువు యోగించడు. ఆరోగ్య విషయాలలో మేషరాసి వారు జాగ్రత్త వహించాలి. సంవత్సర ప్రారంభం నుండి 17-ఆగష్టు-2017 వరకూ కేతువు యోగించును. చక్కటి ధనర్జనాను ఏర్పరచును. అవినీతి పరమైన ధనదాయమును ఏర్పరచును. 18-ఆగష్టు-2017 తదుపరి సంవత్సరాంతం వరకూ మంచి ఫలితాలను ఇవ్వడు. నేత్ర సంబంధ సమస్యలను, ప్రయాణములను కలిగించును. విద్యారంగంలోనివారికి మంచి చేయును.

ఏప్రిల్ 2017 మేషరాసి ఫలితాలు / April 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెల ప్రారంభంలో మంచి అనుకూలత. ఆ తదుపరి కుటుంబంలో చికాకులు, పనులు వాయిద, ఘర్షణలు, ధన అవసరములు పెరిగి మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన ధనప్రాప్తి. వాహన సౌక్యం. ద్వితియ గృహంలో బంధు లేదా స్నేహ వర్గ రాకపోకలు. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి శుభం. కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు.మాసాంతంలో వృత్తిలో అభివృధి, మనోవాంచా ఫలసిద్ధి. ఈ నెలలో 6, 11 , 15, 19, 23 తేదీలు మంచివి కావు.

మే 2017 మేషరాసి ఫలితాలు / May 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో ధనసంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. కష్టంతో కార్యవిజయం. విరోధుల వలన ఉద్యోగ జీవితంలో ప్రమాదం. వైరాగ్య భావన ఏర్పడగలదు. ద్వితియ వారంలో సామాన్య ఫలితాలు. తృతీయ వారంలో ఒత్తిడి తగ్గును. సుఖ సంతోషములు నెలకొనును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు / ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేసిడి ప్రయత్నాలు సఫలము అగును. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ నెలలో 5 నుండి 10వ తేదీ మధ్య వివాహ ప్రయత్నములుకు శుభం.

జూన్ 2017 మేషరాసి ఫలితాలు/ June 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో సోదర వర్గంతో వివాదములు కలుగు సూచన. గృహంలో మార్పులు చేయుదురు. నూతన వస్తువుల అమరిక. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉండును. ప్రతీ వ్యవహారం నిదానంగా పూర్తిఅగును. చివరి వారంలో వాహన ప్రమాద సూచన. 21వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. ఈ నెలలో 2, 7, 15, 18, 21, 25 తేదీలు మంచివి కావు.

జూలై 2017 మేషరాసి ఫలితాలు / July 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో గతకాలంలో చేసిన ఋణములు తీరును. తల్లిగారికి లేదా మాతృ వర్గం వారికి అనారోగ్య సూచన. ప్రధమ వారంలో ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు. తృతియ వారంలో విద్యార్దులకు అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. బందువుల రాకపోకలు ఉండగలవు. మాసాంతంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. సన్మానం. నివాస మార్పు కోసం చేయు ఫలితాలు ఆటంకములతో ఫలించును. స్థిరచిత్తంతో ప్రయత్నించవలెను.

ఆగష్టు 2017 మేషరాసి ఫలితాలు / August 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో గృహంలో వినోదాలు సంతోషకార్యములు.మానసిక ప్రశాంతత. నూతన పరిచయాలు దీర్హకాలిక బంధాలకు దారితీయును. ఆదాయంలో పెరుగుదల. ద్వితియ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు. మిత్రుల సహాయ సహకారములు సంపూర్ణం. మూడవ వారం నుండి వ్యయం అధికంగా ఉండు సూచన. భూమి లేదా స్థిరాస్తి వ్యవహారములో వివాదములు ఏర్పడు సూచన. ఈ నెలలో 13, 14, 20, 28 తేదీలు మంచివి కావు.

సెప్టెంబర్ 2017 మేషరాసి ఫలితాలు / September 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో సంతాన సంబంధ లాభములు. సంతాన ప్రాప్తి. సంతానంతో చికాకులు ఏర్పడినప్పటికీ బుధు గ్రహ బలం వలన తొలగును. ధనాదాయం సామాన్యం. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ లభించును. ద్వితియ వారం తదుపరి నూతన గృహ ప్రయత్నములు ఫలించును. ఆలోచనలు అధికం. ప్రేమకలాపముల వలన ఆర్ధిక వ్యయం. ఈ నెలలో ప్రారంభించు వ్యాపారములు విజయవంతం అగును. నాలుగవ వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలహం.

అక్టోబర్ 2017 మేషరాసి ఫలితాలు / October 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి. సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. పోటీదారుల వలన ఇబ్బందులు. ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. 25, 26,27 తేదీలు పెద్ద వయ్యస్కులకు నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యను ఏర్పరచు సూచన.

నవంబర్ 2017 మేషరాసి ఫలితాలు / November 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ నెలలో కోర్టు వ్యవహరాలు, అవివాహితుల వివాహ ప్రయత్నములు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక. స్థానచలనముకు అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో శాంతి. వ్యాపారములు విస్తరించే అవకాశం. మాసాంతంలో ఉద్యోగ ప్రయత్నములు లాభించును. 26, 28,30 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.

డిసెంబర్ 2017 మేషరాసి ఫలితాలు / December 2017 Mesha Rasi Telugu Phalalu:

ఈ మాసంలో ధనాదాయం బాగానే ఉండును. సంఘంలో చక్కటి పేరుప్రఖ్యాతలు , గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. శతృ జయం. అన్ని విషయములందు లాభములు. శుభ వార్తలు వినుదురు. ద్వితియ వారంలో ప్రయనములందు ఆకస్మిక నష్టం. 9 నుండి 12 వరకూ మంచిది కాదు.

జనవరి 2018 మేషరాసి ఫలితాలు / January 2018 Mesha Rasi Telugu Phalalu:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సంసార సంబంధంగా చికాకులు, గొడవలు కలుగు సూచన. తోటి వారితో వివాదములు. ద్వితియ తృతీయ వారంలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభం, విజయం. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ది. వాహన సంభందిత వ్యయం ఏర్పడును. విద్యార్ధులకు మంచి కాలం కాదు. విద్యావిఘ్నములను ఏర్పరచు సూచన.

ఫిబ్రవరి 2018 మేషరాసి ఫలితాలు / February 2018 Mesha Rasi Telugu Phalalu:

ఈ మాసంలో మీ ప్రమేయం లేకుండా అవమానములు, అపవాదులు ఏర్పడు సూచన. కాని చివరకు విజయం మీదే. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు ఇది అనువైన కాలం. దూర ప్రాంతంలో స్థిరత్వం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. ఉదర సంభందమైన సమస్యలు భాదించగలవు. 8 , 10 , 14, 17 తేదీలు మంచివి కావు.

మార్చి 2018 మేషరాసి ఫలితాలు / March 2018 Mesha Rasi Telugu Phalalu:

ఈ మాసంలో జీవిత భాగస్వామి మూలాన ధనప్రాప్తి. ఊహించని విధంగా ధన లాభములు. వృత్తి వ్యాపారముల వలన చక్కటి ధన సంపాదన.గృహ వాతావరణంలో చికాకులు , సంఘర్షణాపూర్వక వాతావరణం. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. మాసాంతంలో వృధా వ్యయం. కార్యవిఘ్నత. ప్రభుత్వ వ్యవహారములలో అననుకూలత. ఈ నెలలో 3, 6, 16, 23 , 25, 26 తేదీలు మంచివి కావు.