2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర ధనుర్ రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర ధనుర్ రాశి ఫలితాలు

  • మూల 1,2,3,4 పాదములు, పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 07 అవమానం – 05

dhanur_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలను, లాభములను పొందలేరు. సంతాన సంబంధ చికాకులు, ధన వ్యయం. స్థిరాస్తి సంబంధ క్రయవిక్రయాలలో నష్టం. బంధువర్గం సహాయ సహకారములు తీసుకొనవలెను. వారి వలన కార్యసిద్ధి. పై అధికారుల వలన ఇబ్బందులు. అధిక వ్యయము. ఆరోగ్య విషయాలు సామాన్యం. విద్యార్ధులు శ్రమించవలెను. విదేశీ నివాసం కొరకు ప్రత్నించు వారు విజయం సాధించును. వృత్తి వ్యపరడులకు మిశ్రమ ఫలితాలు. నూతన గృహం కోరిక నెరవేరును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురువు సంవత్సరం అంతా చక్కటి శుభ ఫలితాలను కలిగించును. ప్రభుత్వ వుద్యోగం ఆశించు వారికి ప్రభుత్వ వుద్యోగం, ధార్మిక మార్గంలో గురు లభ్యత, శిష్టాచారము, న్యాయబద్ధమైన ధనాదాయం కలుగచేయును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ఏల్నాటి శని దశ ప్రభావం వలన అనేక ఇబ్బందులను కలిగించును. వ్యవహరపు చిక్కుల వలన బాధపడును. శత్రురోగ , ఆర్ధిక సమస్యలు హెచ్చుగా ఉండును. శని శాంతి అవసరం.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి రాహువు 17-ఆగష్టు-2017 వరకూ అనుకూలమైన ఫలితాలను , తదుపరి చేడుఫలితాలను కలిగించును. కేతువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలిగించును.

ఏప్రిల్ 2017 ధనుర్ రాశి ఫలితాలు / April 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సామాన్య ఫలితాలు. మిత్రుల వలన లాభం. ప్రధమ ద్వితియ వారాలలో కుటుంబ సభ్యుల తిరుగుబాటు, ఘర్షణలు. తల్లిగారి ఆరోగ్య సమస్యల వలన ఆందోళన. మిత్ర సంబంధమైన సంతోషములు. స్పెక్యులేషన్ వలన నష్టం. తృతీయ వారం నుండి అధిక ధనవ్యయం. ఈ నెలలో 7, 15, 24, 30 తేదీలు మంచివి కావు.

మే 2017 ధనుర్ రాశి ఫలితాలు / May 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో నూతన కార్యములు విజయం పొందును. సంకల్ప సిద్ధి ఏర్పడును. సంతానమున ప్రయత్నములకు మంచి అనుకూలమైన కాలం. 4,6,7 తేదీలలో ప్రయాణములు, 19 , 20 తేదీలలో సౌఖ్యం. ప్రయత్న విజయములు, ఉద్యోగ ప్రయత్నములకు, ఉద్యోగ ఉన్నతి కొరకు చేయు ప్రయత్నములకు అనుకూలం. మాసాంతంలో ఉద్యోగ జీవనంలో ప్రశంసలు, ధనాదాయంలో వృద్ది. 13, 15, 26, 27 తేదీలు మంచివి కావు.

జూన్ 2017 ధనుర్ రాశి ఫలితాలు / June 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో వారసత్వ సంబంధమైన వైరం వలన చికాకులు ఏర్పడు సూచన. వ్యాపారములు సామాన్యం. లాభములు ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉండును. స్త్రీ సంబంధమైన విషయాలలో చికాకులు. స్త్రీ సంబంధ ధన వ్యయం. వివాహ ప్రయత్నములలో ఆటంకములు. సోదర వర్గీయులతో మాట తగాదాలు. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం. 27 నుండి 30 తేదీల మధ్యలో గౌరవ హాని.

జూలై 2017 ధనుర్ రాశి ఫలితాలు / July 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసం అంత మంచిది కాదు. చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో వ్యతిరేకత. పై అధికారులతో చికాకులు. స్థాన చలనం. వ్యాపార నష్టములు. ఉద్యోగ మార్పిడికి మంచిది కాదు. జీవిత భాగస్వామి అనారోగ్యం కొనసాగును. వైవాహిక జీవన సుఖరాహిత్యత. చివరి వారంలో ఆకస్మిక ప్రమాదము జరుగు సూచన. మొత్తం మీద ఈ మాసంలో శారీరక శ్రమ పెరుగును.

ఆగష్టు 2017 ధనుర్ రాశి ఫలితాలు / August 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో సమస్యల ప్రభావం కొద్దిగా తగ్గును. సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం కాదు. దైవ ఆశీస్శులు అవసరం. కోర్తువ్యవహరములలో అనుకూలత. ప్రభుత్వ సంబంధ పెద్దల దర్శనం. బంధు సమగమన, వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు. నూతన ఆలోచనలు అంత త్వరగా కార్య రూపం దాల్చవు. ప్రధమ వారంలో వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మాసాంతంలో శిరోబాధ.

సెప్టెంబర్ 2017 ధనుర్ రాశి ఫలితాలు / September 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో గౌరవ హాని, ఆకస్మిక నష్టములు. నూతన కార్యములందు పరాజయం. కొద్దిపాటి ఆపదలు. ద్వితియ వారంలో కారణరహితంగా గొడవలు, కలహములు. మిత్రులే శత్రువులగును. నాలుగవ వారంలో వివాహ ప్రయత్నములకు శుభం. ఆశించిన ధనం అందదు. ఈ నెలలో 7, 9, 13 తేదీలు మంచివికావు.

అక్టోబర్ 2017 ధనుర్ రాశి ఫలితాలు / October 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసం మంచి ఫలితాలను కలిగించును. ఆగిన కార్యములందు జయం. తలచిన పనులు సకాలంలో పూర్తి. ధనాదాయం బాగుండును. ప్రముఖులతో పరిచయాలు. సమాజహితమైన పనులు. ఈ నెలలో 15 నుండి 25 వ తేదీ మధ్య ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. పై అధికారుల సహకారం. వృత్తి వ్యాపారములలో చక్కటి ధనప్రాప్తి. స్త్రీ సంతానం వలన సౌఖ్యం.

నవంబర్ 2017 ధనుర్ రాశి ఫలితాలు / November 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో నూతన బాధ్యతలు. గౌరవ ప్రధమైన జీవనం. ఆరోగ్యం సహకరించును. వృత్తి వ్యపారాదులలో మంచి లాభములు. పట్టుదలకు పోవడం వలన నష్టములు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక అనుకూలమైన మార్పులు. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసిక ఆలోచనలు అధికం. ఆదాయం సామాన్యం. ఈ మాసంలో 1,5,19, 26 తేదీలలో ప్రయాణములు మంచివి కావు.

డిసెంబర్ 2017 ధనుర్ రాశి ఫలితాలు / December 2017 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో ఉద్యోగ జీవనలో ఆందోళన కలిగించు వాతావరణం. ఆకస్మిక వివాదాలు. ధనాదాయం తగ్గును. బంధు వర్గం వలన ఒత్తిడులు. కోరిన సహకారం లభించదు. స్త్రీలకు మాస మధ్యమంలో శస్త్ర చికిత్స సూచన. తృతీయ వారం నుండి అనేక చికాకులు. గృహ సంబంధమైన విషయాలలో వ్యయం అధికం. ఒక పర్యాయం శనికి శాంతి జపములు జరిపించుకోనిన మంచిది.

జనవరి 2018 ధనుర్ రాశి ఫలితాలు / January 2018 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. సొంత మనుష్యులతో విరోధములు. గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును. వ్యవహార చిక్కులు. ప్రయత్నాలలో ఆటంకములు. ప్రయాసతో కూడిన ప్రయాణములు. జూదం వలన నష్టం. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలత. నూతన ఆదాయ మార్గములు. మాసాంతంలో వాహన సౌఖ్యం.

ఫిబ్రవరి 2018 ధనుర్ రాశి ఫలితాలు / February 2018 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో వేధింపులు , వ్యవహార నష్టములు. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు , ఉద్యోగ జీవనంలో మార్పులకు మంచిది కాదు. వ్యయం అధికం. కాలికి సంబంధించిన సమస్యలు. అనారోగ్యము వలన ధన వ్యయం. పితృ వర్గీయులకు మంచిది కాదు. ఈ నెలలో 11 నుండి 16 వరకూ మంచి రోజులు కావు.

మార్చి 2018 ధనుర్ రాశి ఫలితాలు / March 2018 Dhanur Rasi Phalitalu:

ఈ మాసంలో శరీర ఆరోగ్య సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. శత్రుత్వములు తొలగును. మానశిక శాంతి. వృత్తిలో ప్రోత్సాహకర వాతావరణం. ద్వితియ వారం, తృతీయ వారములలో చక్కటి పురోగతి. కోర్టు తీర్పులు అనుకూలం. నాలుగవ వారం నుండి చేపట్టిన కార్యములందు స్తబ్ధత. శ్రమ అధికం. ప్రయత్న పూర్వక విజయాలు.