2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు

  • ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభ రాశికి చెందును.
  • శ్రీ హేఅమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 06 అవమానం – 01

kumbha_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందును. వృత్తి వ్యాపారములలో విజయం. ఉద్యోగ ప్రాప్తి. వివాహ ప్రయత్నములలో సఫలత. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. అధికార హోదా. ధన కనక వస్తు వాహనాదులు పొందేదురు. గృహ నిర్మాణం పూర్తి చేయగలరు. సంతోష జీవనం ఏర్పడును. ఆశించిన లాభములు లబించును. పాడి పరిశ్రమలు, క్రీడారంగం, స్వర్ణ కార్మిక వర్గం, వినోద రంగముల వారికి మంచిది. విజయం పొందుదురు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురువు 12- సెప్టెంబర్ – 2017 వరకూ మిశ్రమ ఫలితాలను, 12-సెప్టెంబర్-2017 తదుపరి అనుకూలమైన ఫలితాలను కలిగించును. మిక్కిలి భాగ్యవంతమైన జీవనం ఏర్పరచును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి శని సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలిగించును. అన్యాయ మార్గంలో ధనమార్జించును. మిక్కిలి ఖ్యాతిని ఏర్పరచును. విదేశీ ప్రయానములను , కొద్దిపాటి వృధా వ్యయమును ఏర్పరుచుండును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి రాహువు సంవత్సరం అంతా అశుభ ఫలితాలను కలిగించును. శత్రుత్వములను , అనారోగ్యమును, జీవిత భాగస్వామితో ఇబ్బందులను ఏర్పరచును. కేతువు కూడా ఆశుభుడు. కుంభ రాశి వారు ఈ సంవత్సరం రాహు – కేతువులు ఇరువురికి శాంతి అవసరం.

ఏప్రిల్ 2017 కుంభ రాశి ఫలితాలు / April 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో ప్రధమ వారంలో వృత్తి వ్యాపారములు చక్కగా జరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. 5,6 తేదీలు అనుకూలమైనవి. ద్వితియ వారంలో ఋణములు తీరును. నూతన పరిచయాలు. తృతీయ వారం నుండి సామాన్య ఫలితాలు. బంధుపరంగా కొద్దిపాటి ఆటంకములు. 25 వ తేదీ తదుపరి శుభకార్య సంబంధ వ్యయం. ఇంటిలో ఉత్సాయపూరిత వాతావరణం.

మే 2017 కుంభ రాశి ఫలితాలు / May 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో బంధు విరోధములు. తగాదాలు ఏర్పడును. ప్రేమ వ్యవహారములు నష్టపెట్టును. తలచిన పనులు జరగవు. అవరోధములు. అపవాదులు. 14,15,17 తేదీలలో శిరోబాధ. మాసాంతంలో అధిక ధనవ్యయం. ఈ మాసం అంత అనుకూలం కాదు.

జూన్ 2017 కుంభ రాశి ఫలితాలు / June 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో గత కాలంలో నిలిచిపోయిన పనులు, కార్యములు ఈ మాసంలో విజయవంతంగా పూర్తి అగును. సంతానం వలన చికాకులు. అధికంగా ధనం ఖర్చుపెట్టవలసి వచ్చును. స్నేహితుల వలన మోసం. వృధాగా శ్రమించవలెను. గృహ సంతోషములు మధ్యమం. సంతాన ప్రయత్నములు లాభించును. ఈ నెలలో 22 నుండి 29 తేదీల మధ్య ఆర్ధిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించవలెను. వ్యాపార రంగంలోని వారికి ఆకస్మికంగా ధనాదాయం స్థంభించును.

జూలై 2017 కుంభ రాశి ఫలితాలు / July 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో శరీర అనారోగ్యం, శత్రు సంబంధ చికాకులు. వివాహ ప్రయత్నాలు లాభించును. ధార్మిక కార్యక్రమాల కొరకు వ్యయం. 13 వ తేదీ తదుపరి వ్యవహార విజయం. వృత్తి వ్యాపారదులలో జయం. 23,24,25, 26 తేదీలలో వ్యాపార వర్గమునకు అతి చక్కటి కాలం. నూతన పెట్టుబడులు లాభించును. 11, 17, 20 తేదీలలో ప్రయాణములు ఫలించును. మాసాంతంలో స్త్రీ సంబంధ సౌఖ్యం.

ఆగష్టు 2017 కుంభ రాశి ఫలితాలు / August 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసం అనుకూలమైన కాలం. ప్రతీ కార్యం విజయం పొందును. బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టములు నుండి బయటపడుడురు. బంధు వర్గంతో కలయిక. కోర్టు వ్యవహారములలో అనుకూల ఫలితాలు. ఆశించిన ధన ప్రాప్తి. అనారోగ్య సమస్యలనుండి ఉపశమనం. అన్ని రంగముల వారికి అనుకూలత. పుణ్యకార్యములు . ఈ మాసంలో 5,9,17,26 తేదీలలో మిశ్రమ ఫలితాలు.

సెప్టెంబర్ 2017 కుంభ రాశి ఫలితాలు / September 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో గృహ సంబంధమైన తగాదాలు, కళత్ర వర్గం వారి వలన తోడ్పాటు, లాభములు. ద్వితియ వారంలో అనవసరమైన పనులకు ధనం వృధా. తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు. చతుర్ధ వారం నుండి స్థానచలనము కొరకు చేయు పనులు లాభించును. వాహన సౌఖ్యం. సంతాన సంబంధ శుభవార్త. ఈ మాసంలో 1, 8, 20, 22 తేదీలు మంచివి కావు.

అక్టోబర్ 2017 కుంభ రాశి ఫలితాలు / October 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను పొందును. వ్యాపార రంగంలో పోటీ, ఆదాయంలో తగ్గుదల. మానసిక అశాంతి. తల్లితో లేదా మాతృ వర్గీయులతో విభేదాలు. 10,11,12 తేదీలలో విహార యాత్రలు లేదా గృహ సంతోషాలు. 22,23,24,25 తేదీలలో ఉన్నత అధికారుల వలన ఇబ్బందులు. ఉద్యోగ జీవనంలో భయం, ఆందోళన. ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలోని వారు 22 నుండి 26 వ తేదీల మధ్య కాలంలో జాగ్రత్తగా ఉండవలెను.

నవంబర్ 2017 కుంభ రాశి ఫలితాలు / November 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో ఉద్యోగ నష్టం లేదా స్థిరాస్తి సంబంధమైన నష్టం. మానసిక అధైర్యం. ఆత్మీయుల వలన మానసిక అశాంతి. అనవసరమైన కలహములు. అపకీర్తి , కార్య విఘ్నములు. 18, 19 తేదీలలో ప్రయాణములలో ప్రమాద సూచన. జాగ్రత్త అవసరం. ఈ మాసంలో కాలం అంతగా కలసి రాదు. శని దేవునికి శాంతి జపములు జరిపిమ్చుకోనుట మంచిది. నూతన కార్య ప్రారంభములు చేయకుండుట మంచిది.

డిసెంబర్ 2017 కుంభ రాశి ఫలితాలు / Decmber 2017 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో కూడా గత మాసపు చెడు ఫలితాలు కొనసాగును. అన్ని విధములా జాగ్రత్త వహించవలెను. నిత్యం దేవాలయ దర్శన మంచిది. కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు. 4,7,13,17,22 తేదీలలో చెడు ఫలితాలు. జీవిత భాగస్వామితో తగాదాలు. నూతన కార్యములందు ఆటంకములు , విఫల ప్రయత్నములు. ధనాదాయం సామాన్యం.

జనవరి 2018 కుంభ రాశి ఫలితాలు / January 2018 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో అతి కష్టం మీద ఆశించిన ఉద్యోగం లభించును. ధనాదాయం బాగుండును. పెద్ద వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభములు ఏర్పడును. వృత్తి వ్యాపారములు సామాన్యం. తృతీయ వారంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు. బంధు సమాగమం. మాసాంతంలో శుభవార్త. స్త్రీ మూలక లాభము. వివాహ ప్రయత్నములు లాభించును.

ఫిబ్రవరి 2018 కుంభ రాశి ఫలితాలు / February 2018 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో గౌరవ హోదాలు పెరుగును. నూతన పదవుల ప్రాప్తి. జీవన స్థిరత్వం. కుటుంబ సంతోషములు. గృహ సంబంధ లాభములు. స్థానచలనం. నూతన వస్తువుల అమరిక. 22వ తేదీ తదుపరి నూతన వ్యాపారములు లాభించును. మాసాంతంలో ఉద్యోగ భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన. ఈ నెలలో 1,6,10,19 తేదీలు మంచివి కావు.

మార్చి 2018 కుంభ రాశి ఫలితాలు / March 2018 Kumbha Rasi Phalitalu:

ఈ మాసంలో ప్రధమ వారంలో మిత్రులతోనూ , అధికారులతోనూ విభేదములు. ద్వితియ వారంలో మిశ్రమ ఫలితాలు. తృతీయ వారంలో సంతానం వలన సౌఖ్యత. కుటుంబ వాతావరణంలో ఆనందాలు. తగాదాలలో విజయం. 20 వ తేదీ నుండి ఆర్ధిక పరమైన విషయాలలో అననుకూలత. ఆకస్మిక సంఘటనలు. దుర్జన సహవాసం.