2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మకర రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మకర రాశి ఫలితాలు

  • ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 03 అవమానం – 01

makara_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందును. వృత్తి జీవనం వారికి , ఉద్యోగ జీవనంలోని వారికి లాభములు. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు. స్వస్థలంలో అభివృద్ధి. విదేశాములలోని వారికి కొద్దిపాటి విఘ్నములు , కష్ట నష్టములు. సొంత గృహ ప్రయత్నము ఫలించును. భూసంబంధ లేదా వ్యవసాయ సంబంధ లాభములు కలుగును. సోదర వర్గంతో అనుకూలత, పురాణ శ్రవణం వంటి శుభ ఫలితాలు ఏర్పడును. సోదర అనుకూలత, కళత్ర విషయాలలో శుభం. మొత్తం మీద ఆదాయం బాగుంటుంది. తీవ్ర ప్రయత్నము అనంతరం విజయములు ఏర్పడును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలను కలిగించును. మిక్కిలి పేరు ప్రతిష్టలను ఏర్పరచును. ఆధ్యాత్మిక భావన అధికమగును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ఏల్నాటి శని దశ ప్రభావం వలన స్వార్జితం, పిత్రార్జితం ఖర్చు అగును. అనవసర ధన వ్యయం. ఈ సంవత్సరం నెలకు ఒక పర్యాయం 100 గ్రాముల నల్ల నువ్వులు జల దానం చేయుట , సంవత్సరములో ఒక పర్యాయం శని గ్రహ శాంతి జపం చేయించుకొనుట మంచిది.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి రాహువు సంవత్సరం అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు. కళత్ర , పిత్రార్జిత సమస్యలను ఏర్పరచును. నిత్యం రాహు గ్రహ స్తోత్రము చదువుకొనుట మంచిది. కేతువు కూడా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగించును. కాని తీవ్ర నష్టములు కలుగవు. కావున కేతువుకు శాంతి అవసరం లేదు.

ఏప్రిల్ 2017 మకర రాశి ఫలితాలు / April 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో మనసుకి కష్టం కలిగించే సంఘటనలు ప్రధమ వారంలో చోటుచేసుకోనును. అకాల భోజనం. నిద్రలేమి, శిరోబాధ కలుగును. ద్వితియ వారంలో బంధు విరోధాలు. శత్రుభయం, ఆందోళనలు , పితృ వర్గం వారికి హాని. 25 వ తేదీ తదుపరి స్థాన చలనం. విఫల ప్రయాణాలు. ఈ నెలలో 17, 23, 30 వ తేదీలు మంచివి కావు.

మే 2017 మకర రాశి ఫలితాలు / May 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలను కలిగించును. మనసు నిలకడగా ఉండదు. చెడు ఆలోచనలు. మానసిక ఆందోళన. ఆకస్మిక ప్రమాదాలు. ధనాదాయం సామాన్యం. వ్యాపార వ్యవహారాలలో ఉద్రిక్తత. ప్రయత్నాలలో విఘ్నములు. తృతీయ వారం నుండి పరిస్థితులలో అనుకూలత. సోదర వర్గం వారితో కలయికలు, వినోదము. వారి సహాయం. ఈ నెలలో 9 నుండి 13 వ తేదీల మధ్య వాహనాల విషయంలో , ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం.

జూన్ 2017 మకర రాశి ఫలితాలు / June 2017 Makara Rasi Phalitalu:

ఈ నెలలో చక్కటి ఆరోగ్యం. శత్రు నాశనం , కార్య విజయం. ఆదాయంలో పెరుగుదల. చేపట్టిన పనులలో గుర్తింపు. గృహ నిర్మాణ సంబంధ లాభం. 10 నుండి 14 తేదీల మధ్య వివాహ ప్రయత్నములు, సంతాన సంబంధ విషయాలకు అనుకూలం. నూతన వస్తువుల అమరిక. జీవిత భాగస్వామితో సౌఖ్యత. బాగా ఎదిగిన సంతానం వలన సంతోషం. ఈ నెలలో 5,16,22, 30 తేదీలు మంచివి కావు.

జూలై 2017 మకర రాశి ఫలితాలు / July 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో శత్రు విజయం, కోర్టు వ్యవహారములలో విజయం , అనరోగ్యముల నుండి విముక్తి. కుటుంబ కార్యముల కోసం ధన వ్యయం. నూతన వ్యాపారములు మధ్యమ ఫలించును. ద్వితియ వారం నుండి ఉద్యోగ జీవనంలో అనుకోని ఒడిదుడుకులు. అనుకున్న లక్ష్యాలు పూర్తి కావు. ప్రయాణములు వలన అలసట. లాటరీల వలన నష్టం. హామీలు పనికిరావు.

ఆగష్టు 2017 మకర రాశి ఫలితాలు / August 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు పొందుదురు. వృత్తి వ్యాపారములలో లాభం. ఆర్ధిక ఋణములు తీరును. తలచిన ప్రతీ ఆర్ధిక కార్యం విజయం పొందును. రావలసిన ధనం చేతికి వచ్చును. కళత్ర వర్గం వారితో వైరం. వివాహ ప్రయత్నములకు మంచిది కాదు. 7,8,9 తేదీలలో ఆదాయం బాగుండును. 13, 16, 19 వ తేదీలు మంచివి కావు.

సెప్టెంబర్ 2017 మకర రాశి ఫలితాలు / September 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు కలుగును. ఆదాయం పెరుగును. కుటుంబ సంతోషాలు. పిన్న వయస్సు వారికి ఆశించిన వృద్ధి. విదేశీ ప్రయత్నాలు లాభించును. కళత్ర వర్గం వారితో వైరములు కొనసాగును. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగును. ఈ నెలలో 5,7,12,19,27 తేదీలు మంచివి కావు.

అక్టోబర్ 2017 మకర రాశి ఫలితాలు / October 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసం ప్రధమ వారంలో ఒక అశుభ వార్త. మనోవిచారం. అనవసర తగాదాలు. తెలిసిన వ్యక్తుల వలన ఆర్ధిక నష్టం. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు. నష్టం. రక్త సంబంధ అనారోగ్య విషయాల పట్ల జాగ్రత్త అవసరం. వృధా వ్యయం. అదృష్ట రాహిత్యత. చివరి వారం నుండి పరిస్టితులలో అనుకూలత. మాత్రు వర్గీయుల సహకారం.

నవంబర్ 2017 మకర రాశి ఫలితాలు / November 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసం విద్యార్ధులకు అనుకూలమైన ఫలితాలను కలిగించును. విద్యా సంబంధమైన ప్రయత్నాలలో జయం. కార్య సిద్ధి. వినోదములు. కుటుంబంలో సంతోషములు. గృహంలో శుభకార్యములు. దాదాపు అన్ని విషయాలలో అనుకూలత ఉండును. ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితి. వాహన వివాహాది సంబంధ విషయాలలో లాభములు. సంతాన ప్రయత్నములు ఫలించును.

డిసెంబర్ 2017 మకర రాశి ఫలితాలు / December 2017 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో స్థానచలనము కొరకు చేయు ప్రయత్నములు లాభించును. స్త్రీ మూలక ధనప్రాప్తి. బంధువులతో కలయిక. వ్యాపారములలో ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు. 18 వ తేదీ తదుపరి వృధా వ్యయము. ఆడంబరాలకు మిక్కిలి వ్యయము. నాలుగవ వారంలో ఉద్యోగ జీవనంలోని వారికి తీవ్ర ఒత్తిడి. ఈ నెలలో 8,15,17,20 తేదీలు మంచివి కావు.

జనవరి 2018 మకర రాశి ఫలితాలు / January 2018 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో పనులలో విఘ్నములు. సామాన్య ఫలితాలు. పితృ సంబంధ విషయాల వలన మానసిక చికాకులు. వృత్తి జీవనం వారికి, వ్యాపారస్థులకు సామాన్య ఆదాయం. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన ఉద్యోగ మార్గములు. వివాహ ప్రయత్నములలో ఏర్పడిన స్తంభన తొలగును. విద్యార్ధులకు పోటీ పరీక్షలలో ప్రతికూలమైన వాతావరణం.

ఫిబ్రవరి 2018 మకర రాశి ఫలితాలు / February 2018 Makara Rasi Phalitalu:

. ఈ మాసంలో గృహ సంబంధ నిర్మానములకు , ఋణ ప్రయత్నములకు మంచిది. ద్వితియ వారంలో రాజ సన్మానం. కార్య సిద్ధి. దూర ప్రాంత ప్రయాణములు. తృతీయ వారంలో అనారోగ్య సమస్యలు. శస్త్ర చికిత్స, వృధా ప్రయత్నములు. కుటుంబ సభ్యులతో అననుకూలత. నాలుగవ వారంలో సామాన్య ఫలితాలు. కళత్రముతో చికాకులు కొనసాగును.

మార్చి 2018 మకర రాశి ఫలితాలు / March 2018 Makara Rasi Phalitalu:

ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగా ఉండును. భూ లాభం , అదృష్టం, వ్యపారాదులలో అధికమైన ధనప్రాప్తి. సుఖసంతోషాలు. విందులు, వేడుకలలో పాల్గోనేదురు. వస్త్ర లాభం. మనస్పర్ధలు తొలగును. 16, 17, 18, 19 తేదీలలో నూతన వ్యాపార వ్యవహారములకు మంచివి. లోహ సంబంధ వ్యాపారములు ఈ నెలలో ప్రారంభిమ్చాకూడదు. ఈ మాసంలో చేయు పెట్టుబడులు లాభించును.