2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మీనరాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మీనరాశి ఫలితాలు

  • పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం – 11 వ్యయం – 05 రాజపూజ్యం – 02 అవమానం – 04

meena_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందును. శని బలం వలన ఈ సంవత్సరంలో క్రమక్రమేపి శుభ ఫలితాలు కలుగును. గత కాలపు చెడు ఫలితాలు క్రమేపి తొలగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిది.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి గురువు 12- సెప్టెంబర్ – 2017 వరకూ స్వల్పంగా యోగించును. వివాహ ప్రయత్నములు చేయువారికి మిక్కిలి యోగ్యమైన సంబంధమును ఏర్పరచును. వైవాహిక జీవనంలో సంతోషములు ఏర్పడును. 12-సెప్టెంబర్-2017 తదుపరి అంతగా మంచి ఫలితాలను ఇవ్వడు. ఆర్ధికంగా కొద్దిపాటి ఇబ్బందులను ఏర్పరచును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి శని సంవత్సరం అంతా మంచి అనుకూలమైన ఫలితాలను కలిగించును. లోహ సంబధమైన , కమీషన్ సంబంధమైన వ్యాపారములు చేయువారికి కలసి వచ్చును. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీన రాశి వారికి రాహువు – కేతువు ఇరువురూ సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను కలిగించును.

ఏప్రిల్ 2017 మీనరాశి ఫలితాలు / April 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో జాతకులు ఉద్రేకపూరితంగా ఉందురు. అకారణమైన కోపం, చిరాకు ఏర్పడుచుండును. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు తగ్గును. కుటుంబ నష్టములు తగ్గును. బంధు మిత్రుల ఆదరణ , చేయూత లభించును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు ఏర్పడును. మాసాంతంలో వినోద సంబంధ వ్యయం. ఈ నెలలో 3,8,11,13,17 తేదీలు మంచివి కావు.

మే 2017 మీనరాశి ఫలితాలు / May 2017 Meena Rasi Phalitalu:

ఈ నెలలో చక్కటి ఆదాయమునకు సూచనలు కలవు. శరీర అరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి రాబడి ప్రారంభమగును. పశు సంబంధ హాని. 14, 15, 16, 17 తేదీలలో కార్యానుకులత. ప్రభుత్వ రంగంలోని వారికి మంచిది. దూరప్రాంత నివాస ప్రయత్నములు లాభించును. ఆలోచనలు సక్రమంగా ఉండును. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం.

జూన్ 2017 మీనరాశి ఫలితాలు / June 2017 Meena Rasi Phalitalu:

ఈ నెలలో ప్రయత్న ఆటంకములు కొద్దిగా ఉండినప్పటికి అంతిమంగా విజయం లభించును. ధనాదాయం నెమ్మదిగా పెరుగును. గతకాలపు ఋణములు క్రమంగా తొలగును. ద్వితియ , తృతీయ వారములలో నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. 16 నుండి 20 వ తేదీలలో వివాహ ప్రయత్నములు ఫలించును. 23 వ తేదీ తదుపరి కుటుంబ పెద్దలతో గొడవలు. మానసిక అశాంతి.

జూలై 2017 మీనరాశి ఫలితాలు / July 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు, అందరి సహకారము లభించును. దురాప్రయనములు కలసివచ్చును. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం. తృతీయ వారంలో దైవదర్శన. పుణ్య క్షేత్ర సందర్శన. 18 వ తేదీ తదుపరి సంతాన సౌఖ్యత. మాసాంతమునకు చక్కటి ప్రశాంతత. ఈ నెలలో 5,14,20,29 తేదీలు మంచివి కావు.

ఆగష్టు 2017 మీనరాశి ఫలితాలు / August 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో ఇష్టమైన వ్యక్తులతో ప్రయాణములు, ఆశించిన విధంగా ధనం సర్దుబాటు. సంతానం వలన చక్కటి సౌఖ్యత. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం. ద్వితియ వారంలో ఇరుగుపొరుగు వారితో తగాదాలు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు. 16,17,18 తేదీలలో గౌరవ హాని. మాసాంతంలో శ్రమ అధికం. ఆరోగ్య భంగములు.

సెప్టెంబర్ 2017 మీనరాశి ఫలితాలు / September 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో ఆశించిన ఋణ ప్రాప్తి. శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ ప్రయత్నములు అతి కష్టం మీద విజయమగును. 10 వ తేదీ తదుపరి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. మధ్యవర్తిత్వం లాభించును. కోర్టు వ్యవహారములు అనుకూలం . గృహ సంతోషములు మధ్యమం. ఈ నెలలో 7,18,25,30 తేదీలు మంచివి కావు. 5,6 తేదీలలో వివాహ ప్రయత్నములకు అనుకూలం. కళత్ర సౌఖ్యత. ధనాదాయం బాగుండును.

అక్టోబర్ 2017 మీనరాశి ఫలితాలు / October 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో సామాన్య ఫలితాలు కలుగును. నూతన పనులు ఆరంభించకూడదు.భూసంబంధ లేదా వారసత్వ సంబంధ చికాకులు. ద్వితియ వారంలో వస్త్ర లాభం. ధనదాయంలో పెరుగుదల. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆనంద సమయం. నాలుగవ వారం నుండి మసంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం. చికాకులు. ఫలించని ప్రయాణములు.

నవంబర్ 2017 మీనరాశి ఫలితాలు / November 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో గృహంలో విందు భోజనములు, అతిధుల ఆతిధ్యం. నూతన వస్తువుల అమరిక. సంతానంతో చికాకులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు బుధ గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన ప్రమోషన్లు ఏర్పడును. అందరి మన్ననలను పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు. గృహ సంబంధ వ్యయాలు. ఈ నెలలో 8,11,20,26 తేదీలు మంచివి కావు.

డిసెంబర్ 2017 మీనరాశి ఫలితాలు / December 2017 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం. పోటీదారులు తొలగును. కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన మనస్తాపం. మిత్రుల సహకారంతో వృద్ధి. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం. ప్రభుత్వ సంబంధ అడ్డంకులు. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు.

జనవరి 2018 మీనరాశి ఫలితాలు / January 2018 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో నలుగురిలో గుర్తింపు. ఉద్యోగ జీవనంలో ఉన్నతి. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కలుగును. కుటుంబములో మీ మాట నెగ్గును. సంకల్ప సిద్ధి ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలు, సంతోష సమయం. ౧౭వ తేదీ నుండి నిలకడైన జీవనం. జీవిత భాగస్వామితో సోఖ్యం. సంతాన లాభములు. ఉన్నత వర్గం వారితో స్నేహం తన్మూలక లాభం.

ఫిబ్రవరి 2018 మీనరాశి ఫలితాలు / February 2018 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. విదేశీ ప్రయత్నములు, వివాహ ప్రయత్నములు, సంతాన ప్రయత్నములకు చక్కటి అనువైన కాలం. మాస మధ్యమంలో ఆకస్మిక ప్రయాణములు. పితృ వర్గీయులకు అశుభం. 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో నష్టం. చివరి వారంలో శారీరక అలసట. నరముల సమస్యలు. తల్లితండ్రులతో తగాదాలు . మానసిక విచారం.

మార్చి 2018 మీనరాశి ఫలితాలు / March 2018 Meena Rasi Phalitalu:

ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కొనసాగును. ఆశించిన స్థాయిలో కుటుంబం నుండి సహకారం ఉండదు. భాత్రువర్గం వారితో విరోధములు. స్థాన చలనం. మానసిక చాంచల్యత. 17, 18 తేదీలలో వాహన ప్రమాద సూచన. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం. సౌకర్యం. అన్నివిధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును.