2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు

  • విశాఖ 4 వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం – 08 వ్యయం – 14 రాజపూజ్యం – 04 అవమానం – 05

vruchika_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు మిశ్రమఫలితాలను పొందును. ఆశించినంత లాభములు కనిపించవు. సామాన్య పరిస్థితి ఏర్పడును. జ్ఞాతుల వలన పీడ, బంధువులతో కలహం, చోర బాధ, విదేశీ ప్రయత్నములకు ఆటంకములు, వివాహములు తప్పిపోవుట, కలత్రమూలక వివాదములు ఏర్పడును. వృత్తి జీవనం మరియు వ్యాపార రంగంలోనివారికి మధ్యమ ఫలితాలు. ఉద్యోగ జీవనం చేయువారికి ఒడిదుడుకులు. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం. వ్యవసాయ రంగం వారికి మంచిది. రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలాలు. ధనవ్యయం. సంతాన సంబంధ ప్రయత్నములు లాభించును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి గురువు 12 – సెప్టెంబర్ – 2017 వరకూ విశేషమైన ధనదాయమును కలిగించును. చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. సత్కార్యములను చేయును. 12- సెప్టెంబర్-2017 తదుపరి మిశ్రమ ఫలితాలను కలిగించును. ప్రభుతం వలన , ఋణముల వలన బాధ, నరముల సంబంధిత ఆరోగ్య సమస్యలు ఏర్పడును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ధనవ్యయమును , నేత్ర సంబంధ సమస్యలను, సంతాన వ్యతిరేకతను ఏర్పరచును. ప్రతీ విషయములోను అటంకములను , కష్టపడాల్సిన పరిస్థితులను ఏర్పరచును. ఎల్నటి శని దాస కూడా ఉండుట వలన శని ప్రభావం తీవ్రంగా ఉండును. శనికి శాంతి జపములు జరుపవలెను. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సంవత్సరం అంతా రాహువు అనుకూలమైన ఫలితాలనే కలిగించును. గృహ సంబధమైన ప్రయత్నములకు బలం చేకూరును. కేతువు కూడా మంచి ఫలితాలనే కలిగించును.

ఏప్రిల్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / April 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో మొదటి వారంలో శరీర అనారోగ్యం. శ్రమానంతర కార్య జయం. ఉద్యోగ జీవనం సామాన్యం. విద్యార్ధులకు మంచి అవకాశములు. నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి. ఈ నెల 11, 12 తేదీలలో శత్రుత్వములు. తగవుల వలన అశాంతి. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు. 22 వ తేదీ తదుపరి ధనాదాయంలో పెరుగుదల. మంచి పేరు. అవసరములకు ధనం సర్దుబాటు.

మే 2017 వృశ్చిక రాశి ఫలితాలు / May 2017 Vruchika Rasi Phalitalu:

ఈ నెలలో 5,6,7 తేదీలలో కళత్ర సంబంధమైన చికాకులు. నూతన వ్యక్తుల పరిచయం. వృత్తి వ్యాపారములలో ధనం. శుభ సంకల్పములు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో పోటీతత్వం. తోటివారి వలన ఇబ్బందులు. అపవాదులు. 25, 27 తేదీలలో కార్యజయం. మాసాంతమునకు అనుకూలత. అంతిమంగా విజయం.

జూన్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / June 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు. ప్రయాణ సంబంధ లాభములు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం. శుభ వార్తలు వినుదురు. కందెన వ్యాపారములు చేయువారికి లాభములు. వివాహ ప్రయత్నములలో సంబంధములు ఖాయం అగును. తృతీయ వారంలో చిన్న అనారోగ్య సూచన లేదా వాహన ప్రమాదం నుండి తప్పించుకొను సంఘటనలు. 24 నుండి మాసాంతం వరకూ గృహ సంబంధమైన వ్యయం కొరకు ధనం కొరకు ప్రయత్నములు.

జూలై 2017 వృశ్చిక రాశి ఫలితాలు / July 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో అకారణంగా మిత్రులతో కలహములు. ఆత్మీయులతో ఎడబాటు. ప్రయత్నములలో ఆటంకములు. ధనాదాయం సామాన్యం. గృహంలో పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు. 19, 20, 22 తేదీలు భూ సంబంధమైన లేదా నూతన గృహ సంబంధమైన ప్రయత్నములలో కదలిక ఏర్పడును. సంతాన సంబంధ ప్రయత్నములు చేయువారికి శుభం. వ్యాపార రంగంలోని వారికి మద్యం ఫలితాలు.

ఆగస్ట్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / August 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో వ్యపారాదులలో , ఉద్యోగ జీవనంలో ఉత్సాహం. పదోన్నతి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ప్రభుత్వ సంబంధ కార్యములలో మాత్రం ఆటంకములు. పోటీదారుల వలన పరాభవం. తొందరపాటు ప్రయాణముల వలన అలసట. 10,11,12,13,14 తేదీలలో ధన వ్యయం అధికం. మాసాంతంలో ఉద్యోగంలో చికాకులు. 29, 30 తేదీలలో ధనం ఇతరులకు ఇవ్వరాదు.

సెప్టెంబర్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / September 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో భూ లేదా గృహ సంబంధమైన ధన ప్రాప్తి. సువర్ణ సంబధమైన లాభములు. కుటుంబ జీవనంలో సంతోషం. ద్రవ్య లాభములు. ఆశించిన రంగంలో విద్యార్ధులకు విజయం , గుర్తింపు. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన వ్యయం. ఇష్ట దైవ సందర్శన . మిత్రుల సహకారంతో పనులు పూర్తి. నూతన పెట్టుబడులు పెట్టుటకు మంచి సమయం. అవివాహితులకు వివాహ సంబంధమైన శుభ ఫలితాలు.

అక్టోబర్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / October 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో నూతన పదవులు ప్రాప్తించును. గౌరవ జీవనం. అధికారుల మన్ననలు. వినోద సంబంధమైన వ్యయం. ద్వితియ వారంలో సోదరీ వర్గం వారికి నష్టం. ఆందోళన. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు. ధనాదాయం సామాన్యం. వ్యాపారములలో ప్రోత్సాహం ఉండదు. సామాన్య ఉద్యోగ జీవనం. ఈ మాసంలో 2,6,15, 26 తేదీలు మంచివి కావు.

నవంబర్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / November 2017 Vruchika Rasi Phalitalu:

ఈ నెలలో స్థానచలనముకు అవకాశం. మాస ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు. సేవకుల వలన ద్రోహం. స్త్రీ మరియు బంధు సంబంధమైన వ్యయం. ఈ నెల 19 వ తేదీ తదుపరి ఉద్యోగ జీవనంలో ఉన్నతి. ఆశించిన అభివృద్ధి. మాసాంతంలో జీవిత భాగస్వామితో అననుకూలత. కార్య విఘ్నములు. యంత్ర సంబంధ ధన వ్యయం.

డిసెంబర్ 2017 వృశ్చిక రాశి ఫలితాలు / December 2017 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో సంతాన సంబంధ వ్యయం. గృహంలో వేడుకలు. బంధువుల కలయికలు. సహా పంక్తి భోజనాలు. ఉద్యోగ సంబంధ ప్రయాణములు. ధనాదాయం సామాన్యం. దూర ప్రాంత విద్య కొరకు చేయు ప్రయత్నములు లాభించును. వంశ పెద్దల ఆశీస్సులు. ఈ నెలలో 4,5,6 తేదీలలో వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం.

జనవరి 2018 వృశ్చిక రాశి ఫలితాలు / January 2018 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. సామాన్య ఫలితాలు ఏర్పడును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో సఫలత. అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ నెలలో వృత్తి వ్యాపారాదులు సామాన్యం. ఈ మాసంలో 9,13,17,23 మరియు 29 తేదీలు మంచివి కావు.

ఫిబ్రవరి 2018 వృశ్చిక రాశి ఫలితాలు / February 2018 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో జీవిత భాగస్వామి సంబంధిత ధన లాభములు ఏర్పడును. వారసత్వ పరంగా , ఆర్ధికంగా వృద్ధి. మానసిక ఉల్లాసం. చివరి వారం నుండి సమయా భావం, ఉద్యోగంలో తోతివారిచే అవమానములు, కుటుంబంలో తగాదాలు వంటి అననుకూలమైన ఫలితాలు. కుటుంబ అశాంతి.

మార్చి 2018 వృశ్చిక రాశి ఫలితాలు / March 2018 Vruchika Rasi Phalitalu:

ఈ మాసంలో చక్కటి వాతావరణం. అన్ని విధములా లాభం. ఆశించిన స్థాయిలో అభివృద్దిని పొందుదురు. నూతన వ్యాపార ప్రయత్నాలు జయం. గౌరవ ప్రదమైన జీవనం. దగ్గరి బంధువులకు సంబంధించిన అశుభ వార్త. ఉద్యోగ జీవనం, ధనాదాయం సామాన్యం. శత్రు నాశనం.