2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కన్యారాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కన్యారాశి ఫలితాలు

  • ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యా రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయం – 05 వ్యయం – 05 రాజపూజ్యం – 05 అవమానం – 02.

kanya_rasiశ్రీ హేమలంబ నామ సంవత్సర కన్యారాసి వారికి అంత అనుకూలంగా లేదు. ఆకస్మిక ధన నష్టములు , ప్రయాణ క్లేశములు , అదృష్ట రాహిత్యత ,అగ్ని లేదా చోరుల వలన నష్టము, ప్రభుత్వ కోపము, అధికారుల దండన వంటి అనేక అననుకూల వాతావరణం కల్గు సూచన. మనోధైర్యం అవసరం. నిరుత్సాయ పడవలదు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరం కన్యా రాశి వారికి గురువు కావేరీ నది పుష్కరాలు ప్రారంభమగు వరకూ సంపుర్ణమైన శుభ ఫలితాలను ఇచ్చును. ఆయుర్భాగ్యములు కలిగించును. పుష్కరాల ప్రారంభం నుండి మిశ్రమ ఫలితాలను కలిగించును. సంవత్సరం చివరి 3 నెలలు అనగా పుష్యమాసం నుండి చేడుఫలితాలు, ఆరోగ్య భంగములను కలిగించును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శని కూడా కన్యారాసి వారికి మంచిఫలితాలను కలిగించడు. పుత్ర సంతానం వలన నష్టం, కళత్ర నష్టం, పిత్రర్జిత వ్యయం, సామాన్య ఉద్యోగ జీవనం ఏర్పరుచును. ఈ సంవత్సరం శనికి శాంతి జపములు అవసరం. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో రాహువు ఎల్లపుడూ అపరిమితమైన ఖర్చును కలిగించును. స్వార్జితం కూడా వ్యయమగును. తీర్ధయాత్రా లేదా దూర ప్రయనములు ఏర్పరచును. కన్యా రాసివారికి కేతువు ఋణము వలన భూమి లేదా గృహమును ఏర్పరచును. సంతాన సంబంధ నష్టం వలన దుఃఖం ఏర్పరచు సూచన. సంతాన ప్రయత్రనములు చేయువారు కేతు శాంతి జరిపించిన మంచిది.

ఏప్రిల్ 2017 కన్యా రాశి ఫలితాలు / April 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో మానసిక ఆందోళన, అనారోగ్యం, అధికారుల వలన ఇబ్బందులు. సహచరుల వలన ఉద్యోగ సమస్యలు. కోర్టు తగాదాలు, తన్మూలక ధన నష్టం. వినరాని మాటలు వినుట , వ్రణ సంబంధమైన వ్యాధులు. వృత్తి జీవనంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి అసంతృప్తి. ఆశించిన పనులలో జాప్యం. కార్య హాని. ధన భారం మొదలగు ఫలితాలు కలుగును. ఈ మాసంలో గ్రహ శాంతులు అవసరం.

మే 2017 కన్యా రాశి ఫలితాలు / May 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో కుటుంబ వ్యక్తుల అనారోగ్యం. ఆదాయం సామాన్యం. వంశంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును. ద్వితియ వారంలో ముఖ్యమైన పనులలో అవాంతరములు. ఆస్తి వివాదములు. పరిష్కారం అవ్వడంలో జాప్యం. జీవన ఆదాయమునకు మాత్రం లోటు ఏర్పడదు. వ్యవహార జయం కొరకు మిక్కిలి శ్రమించవలెను. కొత్త బాధ్యతలు ఆందోళన కలిగించవచ్చును. ఈ నెలలో 1, 10,14,19,24,29 తేదీలు మంచివి కావు.

జూన్ 2017 కన్యా రాశి ఫలితాలు / June 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. ఆరోగ్య సమస్యలు శాంతిమ్చును. పనిచేయుచున్న స్థలంలో అవమానుపడు సంఘటనలు, గౌరవ హాని, సహకార లేమి. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. ఆదాయం సామాన్యం. కొన్ని విపరీత అనుభవాలు ఎదుర్కొనుటకు సూచనలు కలవు.

జూలై 2017 కన్యా రాశి ఫలితాలు / July 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. కుటుంబ సహకారం వలన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుదురు. గతకాలపు వాయిదా పడిన పనులు పూర్తిఅగును. జీవిత భాగస్వామి సంబంధిత విషయాలలో చక్కటి సౌఖ్యత ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో పౌరాహిత్యం నిర్వహించువారికి అంత మంచిది కాదు. దానములు స్వీకరించునపుడు ఆలోచించుట మంచిది.

ఆగస్ట్ 2017 కన్యా రాశి ఫలితాలు / August 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ నెల ప్రారంభం నుండి ధన సంబంధ ఒత్తిడి తగ్గును. సంతానం వలన చక్కటి సౌఖ్యత. శుభకార్య సంబంధ వ్యవహారములు బంధు మిత్రుల ఆదరణ వలన పూర్తి చేయుదురు. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ఆదాయం పెరుగును. తృతీయ వారం నుండి నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంలో అనేక అవాంతరములు ఎదురగును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం. మాసాంతంలో విదేశాలలో ఉన్నవారి సహకారం, ఆదరణ. మాతృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలు.

సెప్టెంబర్ 2017 కన్యా రాశి ఫలితాలు / September 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారముల వారికి స్థానమార్పు ఏర్పడు సూచన. స్త్రీ సంబంధమైన ధన వ్యయం. భూసంబంధ విషయాలలో క్రయవిక్రయాల వలన నష్టం. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. ఆదాయం మెరుగ్గా ఉండును. ద్వితియ వారంలో విలువైన సమాచారం లభించును. ఆదాయం మెరుగ్గా ఉండును. నలుగురిలో గుర్తింపు. కుటుంబ వాతావరణంలో ఆనందములు. ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్త వహించవలెను. ప్రయాణములు సఫలమగును. కొత్త ప్రణాళికలు రచించుటకు సరైన సమయం.

అక్టోబర్ 2017 కన్యా రాశి ఫలితాలు / October 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసం మొదటి వారంలో ఒక ముఖ్య వ్యవహారం ఆటంకములను పొందును. పోలీసుల వలన లేదా కోర్టుల వలన వేధింపులు ఉండగలవు. మానసిక ఆందోళన. ధనాదాయం సామాన్యం. 12 వ తేదీ తదుపరి వృత్తి వ్యాపారదులు అభివృద్దిలో ఉండును.19, 20 వ తేదీలలో యంత్ర సంబంధమైన సమస్యలు. 22 వ తేదీ తదుపరి సమస్యల తీవ్రత తగ్గును. ఉద్యోగ జీవనంలో సంతోషం.

నవంబర్ 2017 కన్యా రాశి ఫలితాలు / November 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో ప్రయత్నములు నెమ్మదిగా విజయం పొందును.కోర్టు తీర్పులు ప్రతికూలం. నిత్య జీవనంలో శ్రమ అధికమగును. పలుమార్లు ప్రయత్నించిన మీదట కార్య జయం ఏర్పడును.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గోనేదురు. ఉన్నత వర్గముల వారితో పరిచయం. తన్మూలక గౌరవం. మాసాంతంలో గృహ మార్పిడి ప్రయత్నాలలో విజయం, స్థానచలనముకు అవకాశం. ఈ మాసంలో 8,13, 21,22, 28 తేదీలు మంచివి కావు.

డిసెంబర్ 2017 కన్యా రాశి ఫలితాలు / December 2017 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో నూతన వ్యాపారాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. కళత్ర మూలక సంతోషాలు. ధనం అవసరములకు సర్దుబాటు. పదోన్నతి. పేరు ప్రఖ్యాతలు. సంతాన ప్రయత్నములకు మంచి కాలం. ద్వితియ వారంలో ఒక ముఖ్యమైన వస్తువు పోగట్టుకొనే సూచన. ట్రేడింగ్ వ్యాపారం చేయువారికి మంచి కాలం. స్వ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయంగా పలుకుబడి పెరుగును. శత్రుబాధలు కొంతవరకూ తగ్గును.

జనవరి 2018 కన్యా రాశి ఫలితాలు / January 2018 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో ఆభరణములు కొనుగోలుచేయుదురు . శుభం జరుగును. మొదట ప్రయత్న విఘ్నములు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం పొందుదురు. వాహన, భూ, వస్త్ర సౌఖ్యం ఏర్పడును. వ్యాపారములు లాభించును. వంశ పెద్దల సహకారం వలన కుటుంబ కలహాలు తొలగును. గృహంలో వేడుకలు జరుగును. అన్నివిధములా ఈ మాసం అనుకూలమైన కాలం.

ఫిబ్రవరి 2018 కన్యా రాశి ఫలితాలు / February 2018 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో ఆదాయంలో తగ్గుదల. చేపట్టిన కార్యములందు అవకాశములు చేజారిపోవును. ఆదాయ మార్గంలో ఆకస్మిక నష్టములు. శ్రమించవలెను. సంతానం వలన సమస్యలు. వృత్తి నైపుణ్యాలు పెరుగవలెను. తగాదాల వలన అశాంతి. ఇచ్చిపుచ్చుకొను వ్యవహారములలో జాగ్రత్త వహించవలెను. స్త్రీలకూ ఆరోగ్య సమస్యలు.

మార్చి 2018 కన్యా రాశి ఫలితాలు / March 2018 Kanya Rasi (Virgo) Phalitalu:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. ధనాదాయం పెరుగును. కుటుంబ స్త్రీల అనారోగ్యం కొనసాగును. స్థిరాస్తి ఋణములు కొంతవరకూ తీరును. సోదర వర్గం వారికి ఖ్యాతి. ప్రయాణ మూలక ఆరోగ్య భంగములు. ఆహార విషయంగా సమస్యలు. ఈ మాసంలో ఆశించిన ఉద్యోగ అవకాశములు లభించును. అన్య స్త్రీ సంబధాలు ఇబ్బందులను కలిగించును. గౌరవ హాని. 26, 27 తేదీలలో అవాంచిత తగాదాలు.