2017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర సింహ రాశి ఫలితాలు

02017 – 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర సింహ రాశి ఫలితాలు

  • మఘ 1,2,3,4 పాదములు , పుబ్బ 1,2,3,4, పాదములు , ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహ రాశి వారి ఆదాయం – 02 వ్యయం – 14 రాజపూజ్యం – 02 అవమానం – 02

simha_rasiసింహ రాశి వారికి శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండును. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు లాభం కలిగించును. పుణ్యక్షేత్ర సందర్శన ఏర్పడును. ధర్మ గ్రంధాల లేదా సజ్జన సాంగత్యం లభించును. ఈ సంవత్సరంలో బంధు వియోగమునకు సూచన. మాతృ వర్గీయులకు మంచిది కాదు. కుటుంబ , కోర్టు సంబంధమైన సమస్యలు పరిష్కరమగును. అకారణంగా కలహములు, మనోవైకల్యం, వక్రబుద్ధి వలన గౌరవ హాని.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి గురువు వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగవు. ఒకప్పుడు ధనమును, ఒకప్పుడు ఋణములను కలుగచేయును. సోదర సంబంధమైన ఆర్ధిక నష్టములను , విద్యార్ధులకు ఆశించిన విజయాలను , ధార్మిక సంబంధమైన వ్యయములను కలిగించును. ఇబ్బందులను కలిగించినా యోగము చెడిపోదు. గురువుకి శాంతి అవసరం లేదు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శని ప్రభావం వలన సింహ రాశికి చెందిన గర్భిణిలు జాగ్రత్త వహించవలెను. శని ప్రభావం వలన సమస్యలు తలెత్తవచ్చును. నిత్యం శని గ్రహ కవచం చదువుకోనవలెను. మిగిలిన విషయాలలో శని సామాన్య ఫలితాలను కలిగించును. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహ రాశివారికి రాహువు అధిక శారీరక శ్రమను , పట్టుదలలో లోపమును, దురాలోచన వలన అవమానములను కలుగచేయును. వారసత్వంగా లభించిన పిత్రర్జితంలో కొద్దిపాటి వ్యయమును ఏర్పరచును. కేతువు వలన శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిక్కిలి చికాకులు ఏర్పడు సూచన. అనారొగ్యమూలక కష్టములు, ప్రమాదములు, కళత్ర జీవనంలో అపసవ్యతలను కలుగచేయును. ఈ సంవత్సరం ఒక పర్యాయం కేతు శాంతి జరిపించిన మంచిది.

ఏప్రిల్ 2017 సింహ రాశి ఫలితాలు / April 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో గృహంలోనూ , వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనంలో అనుకూలమైన పరిస్థితి. చక్కటి లాభకరమైన వాతావరణం. సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. గత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నా పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. 16 నుండి 21 వ తేదీ మధ్య ఆహార సంబంధ అనారోగ్యం. మాసాంతంలో అందరి మన్ననలు. సంతోషకర రోజులు.

మే 2017 సింహ రాశి ఫలితాలు / May 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో ద్రవ్య లాభం. బంధు వర్గం కలయిక వలన సహకారం. వృత్తి జీవనంలోని వారికి గౌరవం, చక్కటి అభివృధ్హి. గృహంలో శుభ కార్యములు. విదేశీ జీవనం చేయువార్కి స్థిరాస్తి నష్టములు. సంతానంలో విరోధములు. స్త్రీలకు అపవాదులు. మనశ్శాంతి లోపించును. మాసాంతమునకు ప్రతీ వ్యవహారం శ్రమకరంగా ఉండును. ముఖ్యంగా 26, 27, 28 తేదీలు మంచివి కావు.

జూన్ 2017 సింహ రాశి ఫలితాలు / June 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం. ఆరోగ్య సమస్యలు తొలగును. నూతన నిర్మాణ సంబంధమైన కార్యములకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని ఆశించవచ్చు. ఉదార స్వభావం వలన పేరు ప్రఖ్యాతలు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో అనుకూలత. మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్నా శుభవార్త వినుదురు. గర్భిణి స్త్రీలు జాగ్రత్త వహించవలెను.

జూలై 2017 సింహ రాశి ఫలితాలు / July 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో కొద్దిపాటి అననుకూల పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో స్థాన భ్రంశం, విద్యావిఘ్నత, శరీరమునకు హాని. వ్యాపార రంగం వార్కి ఆదాయంలో తగ్గుదల. వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి. అనవసర ఖర్చులు. ద్వితియ మరియు తృతీయ వారములలో ఉద్యోగ జీవులకు శ్రమకరంగా ఉండును. అనారోగ్య సమస్యల వలన చికాకులు. ఈ నెలలో 4, 7 9, 12 , 13, 18, 21, 27 తేదీలు మంచివి కావు.

ఆగష్టు 2017 సింహ రాశి ఫలితాలు / August 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసం కూడా అంత అనుకూలంగా ఉండదు. ఆదాయం తగ్గును. నిల్వ ధనం వ్యయమగును. ఆశించిన ఫలితాలు లభించవు. పెట్టుబడులు, శ్రమ వృధా అగును. ఒంటరితనం బాధించును. పరిస్థితులు అనుకూలించక నిరాశ ఆవహించును. పితృ వర్గం వారి వలన ఖర్చులు. ఒక పర్యాయం రాహు గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. ఈ నెలలో 2,3,16,17,25,26 తేదీలు మంచివి కావు.

సెప్టెంబర్ 2017 సింహ రాశి ఫలితాలు / September 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కుటుంబ చికాకులు కొనసాగును.సొంత మనుష్యుల నిరాదరణ బాధించును. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. 12, 13 తేదీలలో శరీరమునకు అలసట. 20 నుండి 25 వ తేదీ మధ్య ఉద్యోగ జీవనలో ఒత్తిడి. కార్య విఘ్నతలు. ఆలోచనలు రాణించవు.

అక్టోబర్ 2017 సింహ రాశి ఫలితాలు / October 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు మాత్రం లాభించవు. తోదరపడి పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. మాస మధ్యమంలో దైవ దర్శనం. పారమార్ధిక చింతన. ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరం. బంధు మిత్రులతో జరుపు మాటలందు జాగ్రత్త అవసరం. వివాహ , సంతాన ప్రయత్నములు లాభించును. పుత్ర సంతానమునకు అనుకూలమైన కాలం.

నవంబర్ 2017 సింహ రాశి ఫలితాలు / November 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసం అనుకూలమైన మాసం. నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. అవసరమైన ధనం చేతికి లభించును. మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఆలోచనలు సక్రమంగా ఉండును. పనుల భారం వలన అలసట ఏర్పడును. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు బాధించును. క్రయవిక్రయాలలో లాభం. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగును. కలత్రమునకు కొద్దిపాటి అనారోగ్య సమస్య.

డిసెంబర్ 2017 సింహ రాశి ఫలితాలు / December 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. మానసిక ఉల్లాసం. బంధు మిత్రుల కలయిక. అతిధి సత్కారములకు ధన వ్యయం. స్థాన చలన ప్రయత్నములకు అనుకూలత. పనులలో ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు. ధనాదాయం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు విఫలం. ఆశించిన ప్రమోషన్లు లభించుట కష్టం. పెద్దల సలహాలు పాటించుట మంచిది. ఈ మాసంలో 11, 15, 22, 29 తేదీలు మంచివి కావు.

జనవరి 2018 సింహ రాశి ఫలితాలు / January 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో గృహంలో చికాకులు. ధనాదాయం బాగుండును. వృత్తి వ్యాపారములలో చక్కటి వాతావరణం. శుభకరమైన ఫలితాలు. కార్య సిద్ధి. బహుమతులు ప్రాప్తించును. ప్రయాణ సౌఖ్యం. తృతీయ వారంలో అపకీర్తి, శరీరక రుగ్మతలు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి. ధనానికి లోటు రాదు. చివరి వారం సామాన్యం.

ఫిబ్రవరి 2018 సింహ రాశి ఫలితాలు / February 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసంలో మానసిక ఒత్తిడి అధికం. కానీ ఆదాయం బాగుండును. రావలసిన ధనం చేతికి వచ్చును. ద్వితియ వారంలో వాహన ప్రమాద సూచన. తృతీయ వారం ధన వ్యయం, ఆరోగ్య విషయాలలో అననుకూలత. ఆశాభంగములు. 24, 25, 26 తేదీలలో ఉద్రేకం వలన నష్టం, భాత్రు వర్గీయులతో శత్రుత్వములు.

మార్చి 2018 సింహ రాశి ఫలితాలు / March 2017 Simha Rasi Phalitalu:

ఈ మాసం బాగుండును. ధనాదాయం పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో ప్రోత్సాహం. పై అధికారుల వలన కొద్దిగా అశాంతి. కీళ్ళ సంబంధమైన అనారోగ్యం. కానీ ప్రమాదం ఉండదు. వ్యాపార విస్తరణకు మంచి సమయం. వ్యవహారములు సానుకూలంగా పూర్తి అగును. గృహంలో ఆకస్మిక శుభకార్యములు. ఆధిపత్య పోరు కొంత బాధించును.